మే నెలలో చంద్రబాబు అమెరికా పర్యటనలో, గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని సందర్శించి రాష్ట్రంలో పెట్టుబడులు, రాష్ట్రానికి సహకారం అందించాలి అని కోరారు... ఆ లీడ్ ఫాలో అప్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి లోకేష్ అమరికా పర్యటనలో గూగుల్ ఎక్స్ కార్యాలయానికి వెళ్లి వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించారు... శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో డెవలప్‌మెంట్ సెంటర్‌ను గూగుల్ ఎక్స్.ప్రారంభించనుంది.

lokesh 15122017 2

అమెరికాలో మినహా గూగుల్ ఎక్స్ ఎక్కడా కార్యకలాపాలు ప్రారంభించలేదు. గూగుల్ ఎక్స్ మొదటిసారి ఇండియాలో అడుగుపెడుతోంది. త్వరలో విశాఖలో గూగుల్ ఎక్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఫైబర్‌గ్రిడ్‌తో ఒప్పందంలో భాగంగా ఏపీ 13 జిల్లాలో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్, (ఎఫ్సాక్) లింక్స్ గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనుంది. ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్‌తో అతి తక్కువ ధరకే గ్రామీణ ప్రాంతాలకు అత్యంత వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ రానున్నాయి.

lokesh 15122017 3

గూగుల్ ఎక్స్ రాకతో కమ్యూనికేషన్ రంగంలో భారీ మార్పులు సంభవిస్తాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందిస్తామన్నారు. సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు లోకేశ్ తెలిపారు. చంద్రబాబు అమెరికా పర్యటనలో ఏమి సాధించారు అని కూసిన వారికి, దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... గూగుల్ ఎక్స్ డెవలప్‌మెంట్ సెంటర్ రాకతో విశాఖ రూపు రేఖలు మారిపోనున్నాయి... అప్పట్లో చంద్రబాబు హైదరాబాద్ కు మైక్రో సాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకువచ్చి హైదరాబాద్ గతినే మార్చేసారు... ఇప్పుడు గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ రాకతో, విశాఖ కూడా మంచి అవకాశాలు రావాలి అని ఆశిద్దాం...

పరిటాల రవి... ఈ పేరు వింటే, నిద్రలో కూడా లెగిసి వనికిపోయే జీవులు ఇప్పటికీ ఉన్నారు.. వారిలో మొదటి వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పరిటాల ఉండగా ఆయన వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడే జగన్, ఇప్పుడు పెద్ద పోటుగాడిలా పరిటాల రవి సతీమణి పరిటాల సునీత మీద ఛాలెంజ్ చేస్తున్నాడు... అక్కడకు వెళ్లి రెచ్చగొడుతున్నాడు... పరిటాల రవి ఉంటే తన ఆటలు సాగవు అని, పరిటాల రవిని చంపటానికి ముందు 140 మంది రవి అనుచరులని చంపి, చివరకి పరిటాల రవిని కూడా చంపిన రాక్షస జాతి, ఇవాళ ఆడవాళ్ళ మీద ఛాలెంజ్ చేస్తున్నాడు... అనంతకు పరిటాల కుటుంబం ఏమి చేస్తాడు అని అడుగుతున్నారు... ఫాక్షన్ ప్రోత్సహిస్తుంది అని అంటున్నాడు.... ఇక్కడ జగన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ కుటుంబం ఫాక్షన్ ప్రోత్సహిస్తే, మొదట లేగిసే తలకాయి ఎవరిదో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు...

paritala ravi 14122017 2

అప్పుడు పరిటాల పోరాడింది ఇలాంటి వారి మీదే.. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగపోతే అక్కడ సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది... అలాంటి వ్యవస్థలో నుంచి పుట్టిన శక్తే మన పరిటాల రవి... అతని చుట్టూ ఉన్నవారు, అతని చేత రక్షింపబడ్డవారు ఆయన కులం కాదు, ఆయన మతం కాదు... ఆయనకి కనిపించిందల్లా ఒక్కటే అన్యాయనికి ఎదురు నిలపడటం, ఎదురించటం, అణచటం... అందుకే రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళతో పోరాడాడు... పులివెందుల నుంచి వచ్చిన కరుడగట్టిన ఫాక్షన్ నాయకులను ఎదిరించాడు. పరిటాలని చూస్తే పారిపోయే పిల్లగాడు జగన్.... కాని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అరాచకం చేశాడు...

paritala ravi 14122017 3

పరిటాల రవి సహా, ఆయన అనుచరులని 70 మంది కిరాతకంగా చంపింది ఈ రాక్షస జాతి... ఆ మనిషిని చంపితేనే నేను బ్రతకగలను అనే పిరికి వాడు, ఇప్పుడు విర్రవీగుతున్నాడు... "పరిటాల రవి" అనేది ఒక వ్యక్తి కాదు ..అది ఒక "ఆలోచన"... ఒక "సిద్ధాంతం"... దాని ఆశయం "సామాజిక సమానత్వం"... ఆ ఆలోచనకున్న " ధృడత్వం", దాని వెనుకున్న "సంకల్పం" , సమానత్వం కోసం తపించే ప్రతి మదిని కదిలిస్తూనే వుంటుంది.... ఆ "ఆలోచన"కు ఎందరు ఎన్ని వక్రభాష్యాలు ప్రచారం చేసినా, ప్రజల మది నుండి మాత్రం చెరపలేకున్నారు.. నేటికీ ఎల్లలు లేని అభిమానమే చాటుతుంది, ఆ " నాయకత్వ " బలమేంటో... ఆ కుటుంబం ఫాక్షన్ వదిలేసే అనంత బంగారు భవిష్యత్తు కోసం పని చేస్తుంది... నీకు ప్రజా క్షేత్రంలోనే సమాధనం దొరుకుతుంది జగన్...

హైదరాబాద్ అంటే ఐటి ... ఐటి అంటే చంద్రబాబు... ఇది ప్రపంచం మొత్తం చెప్పే మాట... బిల్ గేట్స్ దగ్గర నుంచి, ప్రతి కార్పొరేట్ సర్కిల్ లో చంద్రబాబుకి ఉన్న క్రేజ్ అది... కాని, హైదరాబాద్ లో ఉండే చాలా మంది రాజకీయ ప్రయోజనాల కోసం, ఎప్పుడూ ఆ క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వలేదు... కెసిఆర్, కేటీఆర్ అందరూ ఎగతాళి చేస్తూ మాట్లాడే వారు... కేటీఆర్ అయితే ఏ నాడు చంద్రబాబుకి ఆ క్రెడిట్ ఇవ్వలేదు... హైదరాబాద్ మీద చంద్రబాబు వేసిన ఐటి అడుగులు చెరిపేయటానికి చెయ్యని ప్రయత్నం లేదు... అయితే ఏమైందో ఏమో కాని, కేటీఆర్ మొత్తానికి ఇవాళ హైదరాబాద్ కు ఐటి వచ్చింది అంటే అది చంద్రబాబు చలవే అని ఒప్పుకున్నారు... సైబరాబాద్‌ సృష్టికర్త చంద్రబాబే అని కితాబు ఇచ్చారు..

ktr 14122017 1

ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తేల్చి చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. హైటెక్స్‌ సిటీలో జరిగిన టెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్‌ మూర్తి, నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ డేబ్జానీ ఘోష్‌ తదితరులు పాల్గొన్నారు.

ktr 14122017 1

ఈ సందర్భంగా టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ‘ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను నిలపడంలో చంద్రబాబు కృషి అమోఘం. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంతో నా కృషి ఏమీ లేదు. ఆ క్రెడిట్‌ అంతా చంద్రబాబుకే దక్కుతుంది’ అని కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకి విలువ ఇవ్వండి... ఆంధ్రప్రదేశ్ లో ఉండే పిల్లకాయలు కొంచెం చరిత్ర తెలుసుకోండి...

కుట్రలు, మోసాలు, కుతంత్రాలు, నేరపూరిత ఆలోచనలతో నిత్యం పయనించే జగన్ బ్యాచ్ ఇప్పుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పడింది... పవన్ ఉంటే తనకు కనీసం ప్రతిపక్ష కూడా హోదా కూడా దక్కదు అని తెలిసిన జగన్, చివరకు పవన్ మీద కుట్రలు పన్నారు... జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో లీజుకు తీసుకున్న స్థలం న్యాయపరమైన చిక్కుల్లో ఉంది అంటూ పొద్దున్న నుంచి హడావిడి జరుగుతుంది.. జనసేన పార్టీ కార్యాలయం కోసం మంగళగిరి మండలం చినకాకానిలో 3.42 ఎకరాల స్థలాన్ని మూడేళ్లపాటు పవన్ లీజుకు తీసుకున్నారు. ఈ మేరకు నెలకు రూ.1.50 లక్షలు అద్దె చెల్లించేందుకు యార్లగడ్డ సుబ్బారావు, సాంబశివరావు, అంకినీడు ప్రసాద్‌‌తో లీజు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.

jagansena 14122017 2

అయితే, ఆ స్థ‌లం త‌మ‌దంటూ షేక్ ష‌ఫి అనే వ్యక్తి తాజాగా మీడియా ముందుకు వ‌చ్చారు. త‌మ‌దైన ఆ భూమి వివాదంలో ఉంద‌ని వివ‌రించారు. అటువంటి భూమిని లీజుకు ఎలా తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు. ఆ స్థలంలో జ‌న‌సేన పార్టీ కార్యాల‌య నిర్మాణం చేప‌ట్ట‌కూడ‌ద‌ని షేక్ ష‌ఫి డిమాండ్ చేస్తున్నారు. షేక్ ష‌ఫి అనే వ్యక్తి తరుపున ముస్లిం ఐక్యవేదిక అనే ఒక వేదిక ముందుకు వచ్చి హడావిడి చేసేంది... అయితే ఈ ఆరోపణలు జనసేన అధికారికంగా ఖండించింది... అసలు దీంట్లో ఇలాంటి కోర్ట్ కేసులు ఏమి లేవు అని, ఇదంతా జగన్ పార్టీ కుట్ర అని చెప్పెంది...

jagansena 14122017 3

జనసేన చెప్పినట్టే, ఇది జగన్ పార్టీ కుట్ర అని నిరూపణ అయ్యింది... ముస్లిం ఐక్యవేదిక తరుపున హడావిడి చేస్తున్న జలీల్ అనే వ్యక్తి, వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తి అని తేలింది... ఇది కేవలం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అప్రతిష్ట పాలు చెయ్యటానికి జగన్ పన్నిన పన్నాగం అని తేలింది... 1997లో కోర్ట్ కేసు కొట్టేసింది అంటే, అప్పటి నుంచి ఈ ముస్లిం ఐక్యవేదిక పెద్దలు ఎక్కడ ఉన్నారో మరి ? అసలు వారి పేరు మీద ఇనాళ్లు ఒక్క పన్ను రసీదు లేదు, ఒక్క చోటు కూడా పేరు లేదు... మరో ట్విస్ట్ ఏంటి అంటే, వీళ్ళు చెప్తున్న కేసు నెంబర్ లో A.సుబ్బారావు అనే పేరు ఉంది... ఈ స్థలం యజమాని మాత్రం Y.సుబ్బారావు... లాయర్లు ఇవన్నీ చూసి, ఇది కేవలం అల్లరి చెయ్యటానికి మాత్రమే అని, అసలు పేర్లు వేరు అని, యార్లగడ్డ సుబ్బారావు గారు, పరువు నష్టం దావా కూడా వెయ్యవచ్చు అని సూచించారు...

Advertisements

Latest Articles

Most Read