నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ భవనం డిజైన్ దాదాపు ఖరారైంది. భవనంపై సైక్‌ టవర్‌తో సిద్ధం చేసిన డిజైన్ ఎక్కువ మందిని ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీనిని ఇవాళ సాయంత్రం ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయ్యనుంది.. ఈ స్పైక్ డిజైన్ వెనుక చాలా హోం వర్క్ చేశారు... చంద్రబాబు చెప్పినట్టు వన్ అఫ్ ది బెస్ట్ కాకుండా, ది బెస్ట్ కావలి అన్నట్టుగానే డిజైన్ లు ఇచ్చారు...నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ..

amaravati 14122017 2

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన నిర్మాణాల్లో అమరావతి శాసనసభ భవనం మూడోది కానుంది. ప్రఖ్యాత నిర్మాణాలను పరిశీలించిన నిపుణులు అదే స్థాయిలో ఏపీ అసెంబ్లీ భవన ఆకృతిని రూపొందించారు. లండన్‌లో ది షార్డ్‌ టవర్‌ను 308 మీటర్ల ఎత్తులో 95 అంతస్థులతో...ప్యారిస్‌లోని సీన్‌ నది పక్కన ఉన్న చాంప్‌ డి మార్స్‌పై 301 మీటర్ల ఎత్తులో ఈఫిల్‌ టవర్‌ను నిర్మించారు. ఇప్పుడు భారత్‌లోని అమరావతిలో 250 మీటర్ల ఎత్తులో శాసనసభ భవనం టవర్‌ నిర్మాణ డిజైన్ ని రూపొందించారు.

amaravati 14122017 3

విశేష మద్దతు పొందుతున్న టవర్‌ డిజైన్‌లో అసెంబ్లీ భవంతి 750 చదరపు అడుగుల వెడల్పు కలిగి ఉండాలని ప్రతిపాదించారు. సుమారు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది.చుట్టూ ఉన్న తటాకంలో దీని ప్రతిబింబం కనపడుతుంది. ఈ టవర్‌లో 70 మీటర్ల ఎత్తు వరకు (70 అంతస్తులు) సందర్శకులు వెళ్లవచ్చు. అక్కడొక వ్యూయింగ్‌ ప్లేస్‌ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. శాసనసభ భవనం సెంట్రల్‌హాల్‌లో రాజమౌళి సూచన మేరకు తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. సూర్యకిరణాల వెలుగులో ఆ విగ్రహం మెరిసిపోయేలా తీర్చిదిద్దుతారు. తెలుగువారి సంస్కృతి, భాష, వారసత్వం, ఘన చరిత్ర ఇత్యాది అంశాలకు అద్దం పట్టే మ్యూజియంను ఈ టవర్‌లో ఏర్పాటు చేస్తారు. ఇలాంటి ప్రత్యేకతలతో కూడిన నిర్మాణం ప్రపంచంలో ఇదేనని ఫోస్టర్‌ ప్రతినిధులు తమ ప్రజెంటేషన్‌ సందర్భంగా పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన సమావేశం అది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గడ్కరినీ కలిశారు... నిజానికి ఈ సమావేశం ఒక్క పోలవరం భవిష్యత్తు మాత్రమే కాదు, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య మైత్రి బంధం కొనసాగింపు కూడా దీని మీదే ఆధారపడి ఉంది... చంద్రబాబు కూడా డిసైడ్ అయ్యి వెళ్లారు... ఏ మాత్రం తేడా వచ్చినా, కేంద్రానికి రాం రాం చెప్పటానికి రెడీ అయ్యి వెళ్లారు... కాని, సమావేశం మాత్రం మంచి వాతావరణంలో జరిగింది... రాష్ట్రం అడిగిన అనేక విషయాల్లో కేంద్రం క్లారిటీ ఇచ్చింది...

gadkari 14122017 2

పోలవరం కాంక్రీటు పనులను లక్ష్యం ప్రకారం పూర్తి చేయడానికి ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌కి ‘చివరి అవకాశం’ లభించింది. నెల రోజుల్లోపు పనులు నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోలేకపోతే... మరొకరికి అప్పగించేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయించాయి. అంతేకాదు... పోలవరం ప్రాజెక్టు అంచనాలో పెరిగిన వ్యయాన్ని భరించడంపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కేంద్రం సానుకూలంగా ఆలకించింది. పెరిగిన వ్యయంతో 8 రోజుల్లో సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌ ) పంపిస్తే కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. అంతేకాదు... పోలవరం అథారిటీకి రెండు రోజుల్లో సీఈవోను నియమిస్తామని తెలిపింది.

gadkari 14122017 3

ప్రస్తుత కాంట్రాక్టరుకు ఒక్క అవకాశం ఇచ్చాం. గడువులోపు పనులు చేయలేకపోతే... ఆ పనిని మరొకరికి అప్పగిస్తాం’’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు ఈ విషయంలో ఎంత ఆందోళనతో ఉన్నారో... తాను కూడా అంతే ఆందోళనతో ఉన్నానని గడ్కరీ తెలిపారు. ఒక రాజకీయ నాయకుడుగా కాకుండా ఒక శ్రేయోభిలాషిగా, సోదరుడిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను చేపట్టానని చెప్పారు. తమ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులున్నా తానే స్వయంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పోలవరం పై గడ్కరీ అత్యంత స్పష్టంగా చెప్పిన మాటలతో అనుభవశాలి అయిన చంద్రబాబు పరిస్థితి ఆసాంతం అర్థం చేసుకున్నారు. అందుకే గడ్కరీతో సమావేశం ముగిసాక ఒకే మాట చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గడ్కరీతో కాకపోతే ఇంకెవ్వరితోకాదు అని,ఆయన జలవనరుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం పనుల వేగం పెరిగినట్లు చెప్పారు. ఆ తరువాత గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

గుజ‌రాత్ లో పీఎం మోదీ శ‌బ‌ర్మ‌తీ న‌దిలో సీప్లేన్ ప్రారంభించ‌గా, కృష్ణా న‌దిలో ఏపీ సీఎం చంద్ర‌బాబు సీప్లేన్ ప్ర‌ద‌ర్శ‌న‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. అటు గాలిలోనూ, ఇటు నీటిపైనా ప్ర‌యాణించ‌గ‌ల ఉభ‌య చ‌ర విమానాన్ని స్పైస్ జెట్ కృష్ణా న‌దిలో ప్ర‌వేశ‌పెట్టింది. ప్రపంచమంతా అందుబాటులో ఉండే సీప్లేన్ లను ప్రకాశం బ్యారేజీ కృష్ణానదిలో నడిపిలే కొత్తదనానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పున్నమిఘాట్ లో ఏర్పాటు చేసిన సీప్లేన్ విన్యాసాలను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్లేన్‌లో మొత్తం 10 నుంచి 12 సీట్లు ఉంటాయి. ఈ ప్లేన్‌కు 300 మీటర్ల రన్‌వే చాలు. 2,3 అడుగుల నీరున్నా సీప్లేన్ ల్యాండ్ అవుతుంది. రయ్ మంటూ గాల్లోకి ఎగిరిపోతాయి. దేశంలోని ప్రధాన రిజర్వాయర్లు, నదులు, సరస్సుల్లో ఈ సీ ప్లేనులు అనుకూలంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్లేన్‌లతో నీటిలో ఈజీగా ల్యాండ్ అవ్వచ్చు.

cbn sea plane 13122017 2

సీ ప్లాన్ ని ప్రారంభించిన అనంత‌రం సీఎం మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధిలో ప‌ర్యాట‌కానిదే కీల‌క పాత్ర అన్నారు. పాపికొండ‌లు, పోల‌వ‌రం, భ‌ద్రాచ‌లం, విశాఖ వ‌ర‌కు ఇన్ ల్యాండ్ వాట‌ర్ వేస్ అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. ఇక విమానాశ్ర‌యాల‌తోనే 16 శాతం అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని, రాష్ట్రంలో విమానాలు ఎక్కేవారు ఎక్కువ‌య్యార‌ని చెప్పారు. కృష్ణా న‌దిలో పున్న‌మి ఐలాండ్ లో దేశంలోనే అతి పెద్ద‌ద‌యిన ఫ్లోటింగ్ వాట‌ర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేసిన టూరిజం శాఖ‌ను తాను అభినందిస్తున్నాన‌ని సీఎం చెప్పారు. టూరిజం పెర‌గాలంటే మీడియా కూడా పాజిటివ్ వార్త‌ల‌ను అందించాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు. ఏపీలో విమాన‌యాన అభివృద్దికి కేంద్రం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హ ఇస్తుంద‌ని కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు హామీ ఇచ్చారు. స్పైస్ జెట్ 100 వ‌ర‌కు సీ ప్లేన్ ల‌ను దేశ‌వ్యాప్తంగా ప్ర‌వేశ‌పెడుతోంద‌ని పేర్కొన్నారు.

cbn sea plane 13122017 3

ప‌ర్యాట‌కుల‌కు క‌నువిందు చేసేందుకు, స‌రికొత్త అనుభూతిని అందించేందుకు టూరిజం శాఖ సీ ప్లేన్ ను త్వ‌ర‌లో అందుబాటులోకి తెస్తుంద‌ని రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పారు. రాష్ట్ర ప‌ర్యాట‌కం లోకి సీ ప్లేన్ రావ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని, న‌దీ తీరం, స‌ముద్ర తీరం ఎక్కువ‌గా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వాట‌ర్ వేస్ అభివృద్ధికి కృషి చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టూరిజం కార్య‌ద‌ర్శి ముకేష్ కుమార్ మీనా, ఏపీ టూరిజం ఛైర్మ‌న్ జ‌య‌రామిరెడ్డి, ఎండి హిమ‌న్షు శుక్లా, జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం, సీపీ గౌతం స‌వాంగ్ , స్పైస్ జెట్ సిబ్బంది పాల్గొన్నారు.

జగన్ వల్ల నష్టపోయిన కుటుంబం అది... పరిటాల రవి పేరు వింటే ఫాంట్ తడుపుకునే చరిత్ర జగన్ ది.... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, అనంతపురంలో జగన్ చేసిన అరచకాలు అన్నీ ఇన్ని కావు... తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత పరిటాల కుటుంబం చేతిలో జగన్ కు సరైన ట్రీట్మెంట్ ఉంటుంది అనుకున్నారు అందరూ... కాని వారు ఆ ఫాక్షన్ జోలికి పోలేదు... వాటికి దూరంగా ప్రజల జీవితాలు బాగు కోసం బ్రతుకుతున్నారు... అనంతపురం జిల్లాకు చరిత్రలో రానన్ని నీళ్ళు తీసుకువెళ్ళి, చక్కగా వ్యవసాయం చేసుకుంటుంది ఆ జిల్లా... కియా లాంటి పెద్ద పరిశ్రమ రాకతో, జిల్లా రూపు రేఖలు మారిపోయాయి... ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ఉన్న అనంతపురం జిల్లలో, జగన్ అడుగు పెట్టగానే అరాచకపు మాటలు మొదలుపెట్టాడు...

paritala 13122017 2

రాప్తాడులో, పరిటాల సునీత సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్, పదే పదే ఆ కుటుంబాన్ని రేచ్చగోడుతున్నాడు... రౌడీ పలాన, ఫ్యాక్షన్ పాలన నడుస్తుంది అంటూ అక్కడ వారిని రేచ్చగోడుతున్నాడు... అనంతపురం జిల్లాకు పరిటాల కుటుంబం చేసిందేమీ లేదు అంటూ ఎగతాళిగా పరిటాల సునీతను తక్కువ చేసి మాట్లాడుతున్నారు... ఫ్యాక్షన్‌ మరకలు అంటించిన ఘనత మాత్రం పరిటాల కుటుంబానికి దక్కుతుందని అన్నాడు జగన్... అనంతపురాన్ని భ్రష్టుపట్టించారని, అసలు పట్టించుకోవడం మానేశారని జగన్ అంటున్నాడు...

paritala 13122017 3

దీంతో పరిటాల సునీత రంగంలోకి దిగారు... నీ స్థాయి ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్లి సంతాకాలు పెట్టించే స్థాయి.. నువ్వు ఒక నాయకుడివా అన్నారు... నీకు సియం సియం సియం తప్ప వేరే పిచ్చ ఉందా అంటూ ప్రశ్నించారు... ప్రశాంతమైన జీవితం గడుపుతున్నామని, ఇక్కడ పిల్లలు అందరూ చక్కగా చదువుకుంటున్నారు అని, పేదలు వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉన్నామని, అనవసరంగా మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టవద్దు అని సునీత జగన్ కు వార్నింగ్ ఇచ్చారు... జగన్‌ ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు. అయినా జగన్, పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ ప్రోత్సహించేదే అయితే, నువ్వు కోరుకున్నట్టు, మీ నాన్న ఫోటో పక్కన నీ ఫోటో చేరి, ఇప్పటికి మూడున్నర ఏళ్ళు అయ్యేది... ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనం చెయ్యమాక...

Advertisements

Latest Articles

Most Read