రాష్ట్ర వ్యాప్తంగా సినిమా దియేటర్ల పై అధికారులు చేస్తున్న దాడులు ప్రదాన చర్చనీయాసంగా మారింది. ముఖ్యంగా సినిమా టికెట్ల రేటు విషయానికి సంభందించి ఇప్పటికే జివో నెంబర్ 35 విడుదల చేసిన ప్రభుత్వం, దానికి వ్యతిరేఖంగా డిస్ట్రిబుటర్స్ మరియు సినిమా పెద్దలు కోర్టుకు వెళ్ళారనే కక్ష్య తోనే ఈ దాడులు చేస్తునారని అని సినిమా వర్గాలు ప్రదానంగా అభిప్రాయ పడుతున్నాయి. నిన్న మొన్న చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సైతం స్యయంగా దియేటర్లలోకి వెళ్లి అన్ని కోణాలలో పరిశిలించటమే కాక, జరిమానాలు కూడా విధించడం జరిగింది. అలాగే చాలా చోట్ల సినిమా హాల్స్ కూడా సీజ్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో సినిమా పెద్దలతో పాటు ఎక్జిబిటర్స్ సంఘం కుడా ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని కుడా నిర్ణయించింది. దీనికి సంభందించి ఈ రోజు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం అయితే బి మరియు సి సెంటర్లలో అంటే పట్టణాలు, పల్లెలో అటువంటి ప్రాంతాల్లో 20 రూపాయలకి 30 రూపాయలకి సినిమా చూపించే పరిస్టితి ఉండదని, అలా కనుక చూపించ గలిగితే ఎదురు పెట్టుబడితో ప్రజలకి సినమా చుపించాల్సి వస్తుందని ఎక్జిబిటర్స్ అభిప్రాయ పడుతున్నారు.

cinema 23122021 2

దీనికి సంభందించి ఇప్పటికే చాలా మంది సినిమా పెద్దులు కూడా వివిధ రూపాల్లో తమ విజ్ఞప్తి కూడా తెలియ చేసారు. పేర్ని నాని కూడా కలిసి స్పందిచాలని కూడా వేడుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వాటి పైన స్పందిచక పోగా దా-డు-లు మరింత విస్తృతం చేయడంతో ప్రస్తుతం సినిమా వర్గాలు కూడా హడలెత్తి పోతున్నాయి. అయితే ప్రస్తుత చర్యలు చూస్తే కేవలం ఉద్దేసపుర్వకంగానే, క క్ష్య పూరిత చర్యే నని అందరికి అర్థం అయిపోతావుంది. సినిమా పరిశ్రమ పై ఇంత కక్ష్య గట్టి ఎందుకు చేస్తునరనే కోణంలో కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఎవరో కొంతమంది హీరోలు కావచ్చు లేక పోతే వ్యతిరేఖ వర్గం కావచ్చు, వారిని దె-బ్బ కొట్టేతందుకే వేల మంది కుటుంబాలకు తిండి లేకుండా చేస్తున్నారనే చర్చ కూడా ప్రజల్లో నడుస్తా ఉంది. దీనికి సంభందించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా కోరతున్నారు. అదే విధంగా త్వరలోనే సినిమా పెద్దలు కొంత మంది బృందంగా ఏర్పడి జగన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సినీ పెద్దలు అందరూ జగన్ కు జై అనే అంటున్నా, జగన్ ఎందుకు ఇలా వ్యవరిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి.

విజయవాడ పోలీసులు తీసుకున్న ఒక నిర్ణయం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంసం అయ్యింది. విజయవాడ పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్ట్ పరిధిలో ఆంక్షలు విధించారు. అయితే ఈ ఆంక్షలు ఏదో విఐపి వస్తున్నారనో, లేక ఏదో ఒక రోజో, రెండు రోజులో కాదు. ఏకంగా వచ్చే ఫిబ్రవరి 15 వ తరీఖు వరకు ఈ అంక్షలు పెట్టారు. దీంతో ఈ అంక్షలు ఎందుకు పెట్టారో అంతుబట్టటం లేదు. గన్నవరం ఎయిర్ పోర్ట్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు, ఈ నిషేధాజ్ఞలు ఉంటాయని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదు అనే ఉద్దేశంతోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి 250 మీటర్ల పరిధిలో, ఎవరూ గుంపులుగా ఉండటానికి వీలు లేదని పోలీసులు తెలిపారు. అలాగే ఆ పరిధిలో  కర్రలు, ఇతర మారణాయుధాలతో ఎవరూ తిరగకూడదని వార్నింగ్ ఇచ్చారు. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కనుక చర్యలు తీసుకుంటాం అని పోలీసులు తెలిపారు. దీంతో అసలు ఈ అంక్షలు ఎందుకు పెట్టారు అనే చర్చ జరుగుతుంది. చూద్దాం ముందు ముందు ఏమి జరుగుతుందో.

వైఎస్ వివేక కేసుకు సంబంధించి మరోసారి కడపలో హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన సూత్రధారి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డే అంటూ సిబిఐ సంచలన విషయాలు బయట పెట్టింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కోసం నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని కోర్టులో వేసిన పిటీషన్ లో, ఈ కీలక అంశాన్ని సిబిఐ బయట పెట్టింది. పులివెందుల కోర్టులో ఈ కేసు నేడు విచారణకు రానుంది. అలాగే రెండు రోజుల క్రిందట కడప జిల్లా కోర్టులో బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. వివేక కేసు జరిగిన రోజు మొత్తం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నడిపించాడని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఆ రోజు గుండె నొప్పి అంటూ మీడియాకు చెప్పించింది కూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని సిబిఐ తెల్చేసింది. రక్తపు వాంతులతో గుండె పోటు వచ్చి వివేక చనిపోయారని చెప్పించినట్టు సిబిఐ పేర్కొంది. అలాగే పులివెందుల సిఐని కూడా మోటివేట్ చేసే బాద్యత కూడా శివశంకర్ రెడ్డి తీసుకున్నాడని తేల్చింది. సిబిఐ విచారణ సమయంలో కూడా, అతను సహకరించటం లేదు కాబట్టి, అతనికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని సిబిఐ భావించింది. ఆ రోజు ఏమి జరిగింది, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు ఏమిటి అనే విషయాల పై, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ కోర్టుకు వివరించటం జరిగింది.

viveka 23122021 2

ఇతను కీలక వ్యక్తి కాబట్టి, దర్యాప్తులో సహకారం ఇవ్వటం లేదు కాబట్టి, నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోర్టుని కోరింది సిబిఐ. దేవిరెడ్డి శివసంకర్ రెడ్డి వెనుక ఎవరు ఉన్నారు ? ఆ సూత్రధారులు ఎవరు ? ఎవరు చేపించారు అనే విషయం తెలుసుకోవాలని సిబిఐ కోరింది. మొత్తం వివరాలు రాబాట్టాలి అంటే దేవిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సిబిఐ చెప్తుంది. కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయో చూడాలి. మరో పక్క దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడు అనే విషయం తెలిసిందే. అయితే నిన్న కొన్ని మీడియా చానల్స్ లో, ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ విచారణకు పిలవటానికి సిద్ధం అయినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే కేంద్ర హోం శాఖకు కూడా సమాచారం అందించారని, అందుకే విచారణ ఆపి ఢిల్లీకి వెళ్లి, మళ్ళీ తిరిగి వచ్చారనే ప్రచారం జరుగుతుంది. క్రిస్మస్ తరువాత, ఏ క్షణమైనా ఒక పెద్ద వ్యక్తిని సిబిఐ అరెస్ట్ చేయబోతుంది అంటూ, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

హైదరాబాద్‍లో సినీ నటుడు నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు సెహ్సారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని నాని అన్నారు. థియేటర్లలో టికెట్ రేట్ల కంటే పక్కనున్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువగా వస్తుందని అన్నారు. ఇప్పుడున్న టికెట్ ధరతో, సామాన్యులు టికెట్ కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని నని అన్నారు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుందని అంటూనే, నాని పై వ్యాఖ్యలు చేసారు. అసలు నాని ఏమి అన్నారు అంటే, "సినిమా టిక్కెట్ల విషయంలో ఇప్పుడు ఏది జరుగుతుందో అది కరెక్ట్ కాదు. ఇది అందరికి తెలుసిన విషయమే కాని నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సినిమా విషయాలు,రాజికీయాలు పక్కన పెట్టేస్తే మీరు చేస్తున్న తప్పు ఏంటి అంటే మీరు ఆడియన్స్ ని అవమానిస్తున్నారు. ఒక పదిమందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కన ఉన్న కిరానా స్టోర్ ఎక్కువ ఉండటం కరెక్ట్ కాదు, లాజిక్ కూడా కాదు. మీరు ప్రేక్షకులను ఇన్సుల్ట్ చేస్తున్నారు. వీళ్ళు చేస్తుంది ఎలా ఉందంటే, పిక్నిక్ కి అందర్నీ డబ్బులు కట్టమని చెప్పి, నేను కట్టలేనని వదిలేసినట్టు ఉంది. అది నన్ను ఇన్సుల్త్ చేయడం కాదా. ఈ సినిమా టికెట్లకు కూడా లాంటిదే" అని నాని అన్నారు.

nani 23122021 21

అయితే హీరో నాని మాటలకు వెంటనే వైసీపీ అనుకూలంగా మాట్లాడే నిర్మాత నట్టికుమార్ కౌంటర్ ఇచ్చారు. హీరో నాని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారని కోరారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అవమాన పరిచే విధంగా నని మాట్లాడారని, ఇది సరి కాదని నట్టి కుమార్ అన్నారు. టికెట్ ధరల పైన ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, వాళ్లకు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడ వద్దని అన్నారు. ఇప్పటికే సినిమా టికెట్ల అంశం హైకోర్టులో ఉందని, అప్పటి వరకు కొంత ఆగాలని అన్నారు. సినిమాలకు వచ్చే కలక్షన్ల గురించి హీరో నానికి సరిగ్గా తెలియదని, ఆయనకు అవగాహన లేదని అన్నారు. ఇప్పటికే టికెట్ పెంపు పైన, సినిమా పెద్దలు , జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని అన్నారు. జనవరి నాటికి టికెట్ ధరల పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ కచ్చితంగా వస్తుందని, అప్పటి వరకు ఆగాలని అన్నారు. ఇక నాని ఈ రోజు టికెట్ ధరల పై మాట్లాడిన విషయం ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/UFFNQ3yojr0

Advertisements

Latest Articles

Most Read