నిన్న మద్రాస్ హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క-రో-నా ఉదృతికి కారణం మీరే అని, మీ పై హ-త్య కేసు ఎందుకు పెట్టకూడదు అంటూ ప్రశ్నించింది. అయితే దీన్ని పట్టుకున్న వైసీపీతో పాటు, దాని అనుబంధ మీడియా, దీన్ని నిమ్మగడ్డ, చంద్రబాబుకు లింక్ చేస్తూ కధనాలు అల్లింది. వారి పైన కూడా ఇలాగే ఆక్షన్ తీసుకోవాలని ప్రచారం మొదలు పెట్టింది. అయితే గణాంకాలు చూస్తే మాత్రం, వేరేగా ఉన్నాయి. పరిషత్ ఎన్నికలు అంటే, నీలం సాహనీ వచ్చిన తరువాత పెట్టిన ఎన్నికల తరువాతే వైరస్ ఎక్కువ అయ్యింది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రోజు 1271 కేసులు... పోలింగ్ రోజు 2331 కేసులు... నేడు 12600కి పైగా కేసులు ఉన్నాయి. అన్ని పార్టీలు వద్దన్నా, కోర్టుకెళ్లినా వినకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. నీలం సాహనీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే, ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఏప్రిల్ 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఎలక్షన్ కోడ్ అమలుకు 2 వారాలు గడువు ఉంచాల్సిన కనీసం వారం కూడా లేకుండా చేశారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మున్సిపల్ ఎన్నికలు జరిపిన మార్చి 10వ తేదీన నమోదైన కోవిడ్ కేసులు 120.
ఇవి ఏప్రిల్ 1వ తేదీకి పదింతలై 1271 కేసులు నమోదయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కోరిక మేరకు నీలం సహానీ ఎన్నికలు జరిపిన ఏప్రిల్ 8 వతేదీన 2331 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఎన్నికలు నిర్వహించొద్దని టిడిపి కోర్టుకెళ్లింది.. చివరికి ఎన్నికలను టిడిపి బహిష్కరించింది. ఎన్నికల రోజు 2 వేలకు పైగా నమోదైన కేసులు ఎన్నికలు పూర్తి అయిన వారం రోజుల్లో 10 వేలకు చేరాయి. 26వ తేదీన ఉదయం 9 గంటలకు ఒక్కసారిగా 12600కి పైగా నమోదయ్యాయి. అంటే ఐదింతలు పెరిగాయి. ఇవి ఏపీ కో-వి-డ్ కేసులన్నీ ప్రభుత్వం ప్రకటించిన అధికారిక లెక్కలు.. తేదీలన్నీ ఎన్నికలు జరిగినవి. వాస్తవాలు ఇలా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం, నిమ్మగడ్డని, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ప్రచారం చేయటమే కాకుండా, తమ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ వాస్తవాలు చూసిన తరువాత, ఎవరు తప్పు , ఎవరు ఒప్పు అనేది తెలిసిపోతుంది. ఏది ఏమైనా, ఈ పరిస్థితి రావటానికి ప్రభుత్వం, సమాజం అందరూ కారణమే.