రాష్ట్ర పోలీస్ శాఖ సవాంగ్ నాయకత్వంలో వింతపోకడలు పోతూ, పరిధిదాటి వ్యవహరిస్తోందని, ఐపీసీ సెక్షన్ 307ను పోలీస్ శాఖ, ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తూ, దాన్ని మిస్ య్యూజ్ చేస్తోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆక్షేపించారు. గురువారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "అచ్చెన్నాయుడిని ఐపీసీ 307 కింద అరెస్ట్ చేశారు. ఆయనకు హత్యాయత్నం సెక్షన్ ఎలా వర్తిస్తుంది? ఆ సెక్షన్ వర్తించాలంటే, హ-త్యచేయడానికిఉపక్రమించిన వ్యక్తిచేతిలో ఒక ఆయుధం, కనీసం హ-త్యా-య-త్నా-ని-కి గురైనవ్యక్తికి ఒక గాయం ఉండాలి. తన బంధు వుని ఆయన వారిస్తూ, ఫోన్ లోమాట్లాడితే , 307సెక్షన్ ఎలా వర్తి స్తుంది. అచ్చెన్నాయుడిని జైల్లో ఉంచాలి కాబట్టి, డీజీపీకి ఆ రకంగా దిశానిర్దేశంచేశారు గనుక, ఆయనపై 307కేసుపెట్టి రిమాండ్ కు పంపారు. రిమాండ్ రిపోర్ట్ రాసి, దానిపై తయారుచేసిన సీడీని నేడుపోలీస్ శాఖ ఎందుకు కోర్టుకి పంపలే దు? అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ కోర్టులో విచారణకు వస్తే, పోలీసులు ఎందుకుసీడీ ఫైల్ ని కోర్టులో ప్రవేశపెట్టలేదు? అచ్చెన్నాయుడు గారిని ఇంకా నాలుగైదు రోజులు జైల్లో ఉంచాలనే, పోలీసులు సీడీ ఫైల్ తయారుచేయలేదని నేను అంటాను. దీనిపై డీజీపీ ఏంచెబుతారు? పోలీస్ శాఖ వైసీపీనేతలు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఎందుకు నడుచుకుంటోంది. ఇటువంటి పనులు చేస్తున్నందుకు డీజీపీ ప్రజా క్షేత్రంలో ప్రజలకు సమాధానం చెప్పుకునే రోజు వస్తుంది. ఇదివరకే డీజీపీ వ్యవహారశైలి సరిగా లేదని హైకోర్టు అనేకసార్లు మందలించింది. అయినా ఆయన తన ప్రవర్తన మార్చుకోవడం లేదు. ఐపీసీ 307ను డీజీపీ నాయకత్వం లో పోలీసులు తప్పుడు విధానాలకు వినియోగిస్తున్నారు. ఇటు వంటి పద్ధతి మంచిదికాదని పోలీసులను హెచ్చరిస్తున్నాను. అచ్చెన్నాయుడిపై పెట్టిన కేసులో మరోసారి డీజీపీ తెల్లమొహం వేసుకొని కోర్టులో నిలబడబోతున్నారని చెబుతున్నా. "
"ఏం తప్పచేశారని అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం ఇంతలా కక్షకట్టింది ...? జగన్ 16నెలలు జైల్లోఉండి చిప్పకూడు తినడానికి ఎర్రన్నా యుడు కారణమనే కదా, ఈ ప్రభుత్వం అచ్చెన్నాయుడిపై, ఆయన కుటుంబంపై కక్ష పూనింది. సవాంగ్ ఈ రాష్ట్రానికి డీజీపీ లా వ్యవహరించాలిగానీ, వైసీపీవారి ఆదేశాలప్రకారంకాదు. ఎవరి కళ్లల్లో ఆనందంకోసం, ఎవరిని సంతృప్తిపరచడం కోసం డీజీపీ ఇలా వ్యవహరిస్తున్నాడు? టీడీపీనేతలపై, కార్యకర్తల పైకి ఎందుకు ఒంటికాలితో పరిగెత్తుకొస్తున్నారు. 307 సెక్షన్ వర్తించని ఘటనలకు కూడా దాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు? ముఖ్యమంత్రిని తృప్తిపరచడానికే డీజీపీ ఇలాచేస్తున్నారా? గొప్ప గొప్ప వ్యక్తులు ఈరాష్ట్రానికి డీజీలుగా పనిచేశారు. వారందరికీ భిన్నంగా ఎందుక ఇంతలా దిగజారి డీజీపీ వ్యవహరిస్తున్నాడు? ముద్దాయిలపట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ, నెమ్మది మసులుకుంటున్న పోలీసులు, బాధితులు, టీడీపీవారి పట్ల కఠినంగా, దారుణంగా ప్రవర్తించడం ఎటువంటి న్యాయమో డీజీపీ చెప్పాలి. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నందుకు గానీ, డీజీపీ మరలా కోర్టులో నిలబడక తప్పదు. డీజీపీని చూసి అనేకమంది పోలీస్ అధికారులు చట్టాలకు అతీతంగా, తప్పుడు విధానాలు అవలంభిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అభిమానించే వ్యక్తిగా, పోలీస్ శాఖ పనితీరుని చూసి నిజంగా చాలా బాధపడతున్నాను." అని వర్ల అన్నారు.