ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఓక ముక్క వైజాగ్, ఒక ముక్క అమరావతి, ఒక ముక్క కర్నూల్ అంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇది ఇలా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం వైజాగ్ మీదే ప్రేమా చూపిస్తుంది కానీ, కర్నూల్, అమరావతి గురించి మర్చిపోయింది. ఈ సమయంలో కేంద్రం నుంచి ఇప్పుడు ఒక ఆసక్తికర సమాధానం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మార్పుకు సంబంధించి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు, కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖిత పుర్విక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ను, అమరావతి నుంచి కర్నూల్ కు మార్చటం వంటి అంశం పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏమైనా ప్రతిపాదన వచ్చిందా, దాని పైన కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం ఏమిటి ? అలాగే, దేశంలోనే ఇతర నగరాల్లో ఎక్కడైనా, ఏపిలో ఎక్కడైనా వేరే నగరాల్లో కానీ,హైకోర్టు కొత్త బెంచ్ లు పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందా అని జీవీఎల్ అడిగిన ప్రశ్నకు, కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు. ఇందులో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖ వచ్చింది. అందులో, ఏపి హైకోర్ట్ ,కర్నూల్ కు మార్చాలి అంటూ ప్రతిపాదన చేసారు.
అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు అనే ప్రక్రియ, ఏపి ప్రభుత్వం, అలాగే హైకోర్టు పరిధిలోనే ఉంది, హైకోర్టుని సంప్రదించి, హైకోర్టు మరియి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, ఈ మార్పులో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు నిర్వహణకు అయ్యే ఖర్చులు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ కు సంబదించిన విషయాలు మాత్రం, ఆంధ్రపదేశ్ చిఫే జస్టిస్ పరిగణలోకి వస్తుంది. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆధారంగానే, దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అయితే హైకోర్టు మార్పు అనే అంశం, కేంద్ర పరిధిలో లేదు అనే విధంగా, పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గతంలో ఏపి హైకోర్టు కర్నూల్ కి మార్చాలని, అదే విధంగా మూడు రాజధానుల వ్యవహారం, ఇవన్నీ ఇప్పటికీ కోర్టు విచారణలో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి కోర్టు పరిధిలో ఉన్నాయని కూడా కేంద్ర మంత్రి చెప్పారు. అయితే ఈ జవాబు ద్వారా అర్ధమైంది ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వం, హైకోర్టు మార్పు అంశంలో జోక్యం చేసుకోదు. అది రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి నిర్ణయం తీసుకోవాలని తేల్చేసారు.