తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం విప్లవాత్మక మార్పుతోపూర్తయిందని, గతంలో ఎంపీటీసీ నామినేషన్లలలో 16 నియోజకవర్గాల్లో 85 శాతం కంటే ఎక్కువ ఏకగ్రీవాలు అయ్యాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. కానీనేడు అవే ప్రాంతాల్లో టీడీపీకి చెందిన సానుభూతిపరులు, మద్ధతుదారులు ఒక్కో పంచాయతీకి ఆరుగురువరకు నామినేషన్లు వేశారన్నారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలు చేయాలని, ఏకగ్రీవాల పేరుతోఇచ్చే సొమ్ముతో ప్రతిపక్షపార్టీలకు చెందిన మద్ధతుదారులను ప్రలోభపెట్టాలని చూస్తున్నారన్నారు. ఏకగ్రీవం అనేది పంచాయతీలోని పెద్దలంతా కలిసి తీసుకునే నిర్ణయమని, అందుకు విరుద్ధంగా ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడినప్పుడు, ప్రభుత్వం ఏఏప్రాంతాల్లోనైతే, బలవంతపు ఏకగ్రీవాలుచేసిందో, నేడు ఆయాప్రాంతాల్లో పంచాయతీఎన్నికలు జరగబోతున్నాయన్నారు. 3,251 పంచాయతీల్లో 20వేలు, 32వేలవార్డులకు 80వేల నామినేషన్లు పడటం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి శుభపరిణామమన్న అశోక్ బాబు, రాజకీయంగా, కక్షపూరి తంగా పంచాయతీ ప్రెసిడెంట్ పదవిని వాడుకోవాలని చూడటం వల్ల గ్రామాల్లో విద్వేషాలు, కక్షలు పెరుగుతాయన్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల ఆరంభంతో నూతనశకం మొదలైందని, గతంలో ఎన్నికలువాయిదాపడటం, ఆనాడు ప్రభుత్వం వ్యవహ రించిన తీరుతో ప్రజల్లో చాలావరకు చైతన్యం వచ్చిందన్నారు.

ఇప్ప టికీ ప్రభుత్వం అనేకప్రాంతాల్లో సర్చంచ్ అభ్యర్థులుగా పోటీచేస్తున్న వారిని బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయన్నారు. రాష్ట్రప్రభుత్వ నిర్వాకం కారణంగా పంచాయతీలకు చెందాల్సిన దాదాపు రూ.5 వేలకోట్లు సొమ్ము రంగులపాలైందన్నారు. సర్పంచ్ ల పాలన పల్లెల్లో మొద లైతే, ప్రభుత్వం రంగులకు ఖర్చుచేసిన నిధులపై వారు ఎక్కడ తమను నిలదీస్తారోననే భయం ప్రభుత్వానికి ఉందన్నారు. పంచాయతీల్లో సర్పంచ్ ల పాలన ప్రారంభమైతే, 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వాడుకోవడం కుదర దు కాబట్టే, నేడు పాలకులు ఏకగ్రీవాలను తెరపైకి తీసుకొచ్చారని అశోక్ బాబు స్పష్టంచేశారు. నామినేషన్లు చించేయడం వంటి ఘటనల దృష్ట్యా, ఆన్ లైన్లో నామినేషన్లుసమర్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా తాము ఎస్ఈసీకి విజ్ఞప్తిచేశామన్నారు. కేంద్రప్రభుత్వ బలగాలు, రాష్ట్రంలోని ఆర్మ్ డ్ రిజర్వ్ బలగాల సాయంతో గుంటూరులోని పల్నాడు, రాయలసీమప్రాంతాల్లో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరామన్నారు. గతంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎక్కడైతే ప్రభుత్వం ఏకగ్రీవాలకు పాల్పడిందో, ఆయాప్రాంతాల్లో నేడు టీడీపీ తరుపున, నామినేషన్లువేసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా మన్నారు. ఎవరైతే పంచాయతీ కోసం పాటుపడతారో, వారంతా గెలిచి వారి గ్రామాలను అభివృద్ధిచేసు కోవాలని టీడీపీ తరుపున విజ్ఞప్తిచేస్తున్నామన్నారు. పల్లెల్లో ప్రజలు నిజాయితీగా పనిచేసేవారికే ఓటువేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ తో తాడో పేడో తేల్చుకుంటానికి మరో దారి వెతుక్కునట్టు కనిపిస్తుంది. ఇదే పంతంతో ఇప్పటికే కోర్టుల్లో, మొట్టికాయలు తిన్నా, ప్రభుత్వ పెద్దల తీరులో మార్పు వచ్చినట్టు లేదు. రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన ఆదేశాలు ఇచ్చిన లెక్క చేయటం లేదు. దీంతో చివరకు కోర్టు ధిక్కరణ పిటీషన్ కూడా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ దాఖలు చేసారు. అయితే వైసీపీ, ఎన్నికల కమీషనర్ దూకుడుకు షాక్ అవుతుంది. ఏ నిమిషాన ఏమి వస్తుందో,అనే టెన్షన్ అయితే ఉంది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావటంతో, ఎస్ఈసి దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రభుత్వంలో మంత్రులు ,నిమ్మగడ్డను పర్సనల్ గా టార్గెట్ చేసారు. పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా, నిమ్మగడ్డ మా దొడ్లో కట్టేసే ఎద్దులతో సమానం అని, విజయాయి రెడ్డి నిమ్మగడ్డకు మెంటల్ అని, ఇలా కించపరుస్తూ మాట్లాడారు. దీంతో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సా, విజయసాయి, సజ్జల పై, నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. మీరు ఆక్షన్ తీసుకోవాలని, ఆక్షన్ తీసుకోక పొతే, తాను కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుందని తెలిపారు.

ministers 01022021 2

అయితే నిమ్మగడ్డ మా హక్కులకు భంగం కలిగించారు అంటూ, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సా, స్పీకర్ కు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. తమ హక్కులకు నిమ్మగడ్డ భంగం కలిగించారని తెలిపారు. అయితే స్పీకర్ తమ్మినేని ఈ నోటీస్ ని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే దీని పై రియాక్ట్ అయ్యారు. చర్యల కోసం ప్రివిలైజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సిఫార్సు చేసారు. అయితే ఇంత వేగంగా స్పందించటం వెనుక ప్రభుత్వం, వేరే ప్లాన్ లో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2008లో మహరాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను, ఇలాగే సభా హక్కుల నోటీస్ ఇచ్చి, రెండు రోజులు జైల్లో పెట్టిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఇలాగే, మా హాక్కులకు భంగం కలిగింది అంటూ, ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటం, ప్రివిలేజ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వమని నోటీసులు ఇచ్చారు. అయితే హాజరు అవ్వాల్సిన అవసరం లేదు అని ఎన్నికల కమిషనర్ సమాధానమిచ్చాడు. దీంతో 2008లో ఎన్నికల కమిషనర్ ని రెండు రోజులు జైలుకు పంపాలని ప్రివిలేజ్ కమిటీ లో తీర్మానించారు. అలా ఏమైనా నిమ్మగడ్డ పై చర్యలు తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు కాకపోయినా, ఆయన రిటైర్డ్ అయిన తరువాత అయినా, ఏదైనా చర్యలు తీసుకుంటారా అనే చర్చ నడుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరో షాక్ తగిలింది. గత వారం స్థానిక ఎన్నికల విషయంలో, సుప్రీం కోర్టులో భారీ దెబ్బ తగిలిన ఏపి ప్రభుత్వానికి, ఈ సారి మరో కేసు విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ వేయగా, సోమవారం విచారణ చేసిన సుప్రీం కోర్టు, పిటీషన్ ను కొట్టేసింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తరువాతే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ రోయింగ్ టన్ నారీమన్, జస్టిస్ అనిరుధ్ బోస్‌ల ధర్మాసనం ఈ రోజు ప్రభుత్వం పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం పై వేసిన పిటీషన్ మీద విచారణ జరిపి, ఈ తీర్పు ఇచ్చింది. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకంకు సంబంధించి, ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఆ ప్రాజెక్ట్ కు లేవని, వెంటనే ప్రాజెక్ట్ నిర్మాణం ఆపేయాలని, పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాతే నిర్మాణం చేపట్టాలని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టులో అపీల్ చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు కొట్టేయాలని, ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరింది.

sc 01022021 2

దీని పై ఈ రోజు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరుపున న్యాయవాది వెంకట రమణి వాదనలు వినిపించారు. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదని కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నం కు నీరు అందిస్తామని, దీని కోసం పోలవరం ఆయకట్టు ద్వారా నీరు అందిస్తామని వాదించారు. దీనికి కొత్త ఆయుకట్టు లేదని, కొత్త ఆయుకట్టు లేని ప్రాజెక్ట్ కోసం, మళ్ళీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. ఇక రైతుల తరుపున న్యాయవాది శ్రవణ్ వాదనలు వినిపిస్తూ, ప్రాజెక్ట్ కోసం తీసుకున్న భూమికి ఇంకా పరిహారం ఇవ్వలేదని వాపోయారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కోసం ఎప్పుడో పర్యావరణ అనుమతులు వచ్చాయని, 2006లో వాటికి అనుమతి వచ్చిందని, పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ఇప్పుడు చేపట్టారని, అందుకే దీని పై పర్యావరణ, సామాజిక ప్రభావాలు అధ్యయనం చేయాలని కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుని సమర్ధిస్తూ, ప్రభుత్వ పిటీషన్ కొట్టేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనకు సహకరించటం లేదని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. మొన్న శుక్రవారం జరిగిన విచారణలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆదిత్యనాద్ దాస్ పేరు, చేర్చేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ రోజు ఈ కేసు పై విచారణకు వచ్చింది. దాదాపుగా రెండు నెలలుగా, రాష్ట్ర ప్రభుత్వం తనకు సహకారం అందించటం లేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ హైకోర్ట్ లో, కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. గతంలో ఇదే బెంచ్ ముందు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు సహకరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా, తనకు సహకరించటం లేదని, ఎన్నికల సంఘం పిటీషన్ దాఖలు చేసింది. ఇటీవల కాలంలో జరిగిన బదిలీలు, తరువాత తాను ఎన్నికల కమిషన్ లో సిబ్బందిని నియమించటం, సెక్రటరీ నియామకం, కలెక్టర్ ల నియామకం, ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు, ఈ మొత్తం అంశాలు కోర్టు దృష్టికి తెచ్చారు.

hc 01022021 2

అదే విధంగా, ఎన్నికల కమిషన్ కు నిధులు విషయంలో కూడా ఈ కోర్టు ధిక్కరణ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై అటు రాష్ట్ర ప్రభుత్వం తరుపున, ఇటు ఎన్నికల కమిషన్ తరుపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే అప్పటి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, ఇప్పటి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేదికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు పై తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇదే సందర్భంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం, డిసెంబర్ 18న ఈ పిటీషన్ వేసారని, తరువాత ఈ పిటీషన్ విచారణకు రాకపోతే ఎందుకు మళ్ళీ కోర్టుకు రాలేదని, రిజిస్ట్రీని ఎందుకు అడగలేదు అంటూ ప్రశ్నించింది. మొత్తానికి ఈ కేసు 15 రోజులకు వాయిదా పడింది. దీని పై కోర్టు ఇప్పటి వరకు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదు. మరో పక్క, నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉండటం, కొన్ని అంశాల్లో ప్రభుత్వం, ఎస్ఈకీ సహకరించకపోవటం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read