ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపును అడ్డుకోవాలని గవర్నర్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేస్తూ, ఈ మేరకు గవర్నర్ కు చంద్రబాబు మెయిల్ చేసారు. రమేష్ కుమార్ ను అక్రమంగా తొలగించారని గవర్నర్ దృష్టికి తెచ్చారు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదిరించడం.. అర్హతలను మారుస్తూ దొడ్డిదారిన ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది చంద్రబాబు రాసిన ఈమెయిల్... "Dear Sri Biswabhusan Harichandan Ji, Sub.: AP State Election Commissioner - Ceased with effect from Issuance of Ordinance - Appointment of New State Election Commissioner - Amendment to Section 200 of APPR Act, 1994 - Reg. The YSRCP-led Government has brought in amendment to Section 200 of APPR Act, 1994 with vicious design to remove the present State Election Commissioner (SEC) of Andhra Pradesh."

"Currently, elections to local bodies have been postponed mid-way due to the threat of COVID. Thus, local body elections are in the process. In such circumstances, what is the necessity to bring in amendment through backdoor in the form of ordinance to change the term and eligibility of the SEC. Dr. N. Ramesh Kumar, the present AP State Election Commissioner has been appointed by HE Governor of Andhra Pradesh in exercise of the powers conferred under Article 243 K of the Constitution of India read with Sub-Section (2) of Section 200 of the Andhra Pradesh Panchayat Raj Act, 1994. Accordingly, he was appointed on 30th January 2016 for a period of five years.

"In this backdrop, to make amendments to the term and eligibility is illegal. Further, to apply the said amendment now when the Commissioner is in position is unethical and against the law. If any, the amendment is applicable after this present Commissioner's term of office is completed. Therefore, we strongly urge Your Excellency's intervention to uphold the rule of law and democratic values. Thank you, With warm regards, Nara Chandrababu Naidu " అంటూ చంద్రబాబు నాయుడు ఈమెయిలు చేసారు. న్యాయ విరుద్ధంగా జారీ అయిన ఆర్డినెన్స్‌ను నిలుపుదల చేసేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలి అని చంద్రబాబు, తన ఈమెయిల్ లో కోరారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వేటుకు రంగం సిద్ధం అయ్యింది. ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలను మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జి హోదా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించాలని నిర్ణయం తీసుకుంది. కమిషనర్ పదవీకాలం మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ ఫైలు రెడీ చేసింది. గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ ఫైలును పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్డినెన్స్ అమలులోకి వస్తే రమేష్ కుమార్ ని తొలగించే అధికారం ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమంటున్న న్యాయనిపుణులు అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అవకతవకల పై రమేష్ కుమార్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రానికి రమేష్ లేఖ రాసారు. తన వ్యక్తిగత భద్రతకు భరోసా లేదని లేఖలో రమేష్ కుమార్ ఆందోళనవ్యక్తం చేసారు. రమేష్ కుమార్ ముక్కు సూటితనం పై ఇటీవలే జగన్ భగ్గుమన్నారు. రమేష్ పై రాజకీయ, కుల విమర్శలకు దిగిన మంత్రులు, వైసీపీ నేతలు.

కరోన సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సరికాదని నిర్ణయాత్మకంగా వ్యవహరించిన రమేష్ కుమార్ పై ఇప్పుడు వేటు వేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. నిష్పాక్షికంగా వ్యవహరించే అధికారులను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని మరోసారి రుజువైందంటూ విపక్ష నేతల విమర్శలు చేస్తున్నారు. శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఈ విషయం పై మండి పడ్డారు. "రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి(ఎస్ ఈసి) పదవీకాలం 5ఏళ్లనుంచి 3ఏళ్లకు తగ్గిస్తూ ప్రతిపాదించిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం. రాజ్యాంగ విరుద్దమైన ఈ ఆర్డినెన్స్ ను రాష్ట్ర గవర్నర్ ఆమోదించరాదు. అధికారులను బెదిరించి, వ్యవస్థలను ధ్వంసం చేసి రాజ్యం చేయాలన్న దుష్టతలంపుతోనే వైసిపి ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ లో టెర్రరిస్ట్ పాలన సాగుతోంది. అందుకు తాజా ఉదాహరణే ఈ ఆర్డినెన్స్ ఎన్నికల కమిషనర్ నే తీసేస్తామని బెదిరించే పరిస్థితి వస్తే ఇక స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు ఎలా జరుగుతాయి..? పారదర్శక స్వేచ్చాయుత ఎన్నికలే జరగకపోతే, ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏం ఉంటుంది..? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైసిపి ప్రభుత్వం ఖూనీ చేస్తోంది. గవర్నమెంట్ టెర్రరిజానికి ఈ ఆర్డినెన్స్ తాజా రుజువు."

"రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కె) ప్రకారం ఎస్ ఈసిని గవర్నర్ నియమిస్తారు. ఒకసారి నియమించాక, పదవీకాలం 5ఏళ్లని నిర్ణయించాక, ఆయనను తొలగించే అధికారం పార్లమెంటుకు తప్ప ఎవరికీ లేదు. హైకోర్టు జడ్జిని తొలగించే విధానమే ఎస్ ఈసి తొలగింపునకు వర్తిస్తుంది. వీళ్లకు లేని అధికారాన్ని చలాయించి ఎస్ ఈసి పదవీకాలం తగ్గించాలని చూడటం హేయం. 3ఏళ్లకు పదవీకాలం కుదించడం అంటే ఎలక్షన్ కమిషనర్ ను తొలగించడమే. వీళ్లకు అధికారం లేని అంశంపై ఆర్డినెన్స్ ఎలా ఇస్తారు..? ఆ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఎలా ఆమోదిస్తారు..? స్థానిక సంస్థల ఎన్నికలు, వాటి అధికారాలు, నిధుల గురించి 73,74వ రాజ్యాంగ సవరణల్లో స్పష్టంగా చెప్పారు. వైసిపి ప్రభుత్వ చర్యలు 73,74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకం. ఎన్నికల స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోయేలా వైసిపి ప్రభుత్వం చేస్తోంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 243(కె), ఏపి పంచాయితీరాజ్ చట్టం 1994 సెక్షన్ 200 రెండింటి సారాంశం ఒక్కటే. 73,74 రాజ్యాంగ సవరణల అనుగుణంగానే ఎవరైనా వ్యవహరించాలి. ఈసి నియామకం, పదవీకాలం గురించి రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. పంచాయితీరాజ్ చట్టానికి ఏ సవరణలు చేసినా రాజ్యాంగ పరిధిలోనే జరగాలి. వైసిపి ప్రభుత్వ ప్రతిపాదిత ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం. 73,74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకం. కాబట్టి ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించకూడదు." అని అన్నారు.

రాష్ట్రంలో ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో ప్రకాశం లో 11, గుంటూరు లో 2 , తూర్పు గోదావరి మరియు కడప జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 15 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 363 కి పెరిగింది. చిత్తూరు జిల్లా లో ఈ రోజు ఒక కోవిడ్ పాజిటివ్ పేషెంట్ డిశ్చార్జ్ చేయబడ్డాడు. దీనితో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 10 కి పెరిగింది. రాష్ట్రం లో ఈ రోజు కోవిడ్ వల్ల అనంతపూర్ మరియు గుంటూరు జిల్లాలో ఒక్కో మరణం నమోదైనట్లు ధృవీకరించబడింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో మరణించారు. అత్యధికంగా, 75 కేసులతో, కర్నూల్ జిల్లాలో అధిక కేసులు ఉన్నాయి. అనంతపురంలో 13 కేసులు, చిత్తూరు జిల్లాలో 20 కేసులు, తూర్పు గోదావరిలో 12 కేసులు, గుంటూరు జిల్లాలో 51 కేసులు, కడపలో 29 కేసులు, నెల్లూరులో 48 కేసులు, ప్రకాశంలో 38 కేసులు, విశాఖలో 20 కేసులు, పశ్చిమ గోదావరిలో 22 కేసులు రాగా, శ్రీకాకుళం, విజయనగరంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా రాలేదు.

ఇక మరో పక్క, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో ఉదయం 6 నుంచి ఉదయం 9 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నట్లు.. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పదేపదే పోలీసులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు ఏదో కారణంతో రోడ్లపైకి వస్తున్నారన్న ఆయన... ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకుని తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే చాలామంది గుంపులుగా తిరుగుతున్నారన్న ఆయన... చాలామంది భౌతికదూరం పాటించడం లేదని తమ దృష్టికి వస్తోందని తెలిపారు. మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ నేతలు కూడా నిబంధనలు పాటించాలని కోరారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

ఇది ఇలా ఉంటే, రాష్ట్రంలో వాతావరణ మార్పుల కారణంగా అనేకచోట్ల వర్షాలు కురిశాయి. కృష్ణాజిల్లాలో అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆరు బయట ఆరబెట్టిన పసుపు కొమ్ములు, మొక్కజొన్న గింజలు నీటిపాలవ్వడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మోపిదేవి మండలం చిరువోలులో పిడుగుపాటుకు ఓ గడ్డివాము దగ్ధమైంది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగిడిపాలేనికి చెందిన ఓ రైతు పిడుగుపాటుకు మృతి చెందాడు. పంట తడవకుండా పట్టాలు వేస్తుండగా పిడుగుపడటంతో.. రైతు అక్కడికక్కడే మరణించాడు. చేబ్రోలు మండలంలోని పలు గ్రామాల్లో.... పొలాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మాస్కులు లేవు అంటే సస్పెండ్ అయిపోతున్నారు. నిన్నటికి నిన్న నర్సీపట్నం డాక్టర్, తమకు మాస్కులు లేవు, తమ ప్రాణాలతో ఆడుకుంటారా అని ఒక డాక్టర్ అడగటం, ఆయన వీడియో బయటకు రావటంతో, ఆ డాక్టర్ ను సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పై, అందరూ ఆశ్చర్య పోయారు. ఈ సమయంలో డాక్టర్లకు అండగా ఉంటూ, వారికి సహాయం చెయ్యాల్సిన ప్రభుత్వం, వారి ఇబ్బందులు తీర్చకుండా, మాకు ఇబ్బంది ఉంది అంటే, సస్పెండ్ చేసేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే మరొకటి జరిగింది. నిన్న తమ ఇబ్బందులు వివరిస్తూ, నగరి మున్సిపల్ కనిషనర్, ఒక సేల్ఫీ వీడియో పోస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్‌ కమిషనర్‌ వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ, నగిరిలో నాలుగు కేసులు వచ్చాయని, అయినా ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు అంటూ, ఆవేదన వ్యక్తం చేసారు. తమ అకౌంట్లన్నీ ఫ్రీజ్‌ చేసేశారని, తమకు ఎంతో ఇబ్బందిగా ఉందని వాపోయారు.

అంతే కాదు, కనీసం మాస్కులు, పీపీఈ డ్రెస్సులు కూడా లేవని వాపోయారు. గ్లౌజులు లేవు, బూట్లూ లేవు, మాస్కులు లేవు, పీపీఈ డ్రెస్సులు లేవు, అయినా మేము ప్రాణాలకు తెగించి పని చేస్తున్నామని అన్నారు. ఒక్క ప్రజా ప్రతినిధి కూడా తమకు సహాయం చెయ్యటం లేదని, బయట మాత్రం, నాలుగు మాస్కులు పంచి షో చేస్తున్నారని అన్నారు. ఇక ఈ నాయకుల అండ చూసుకుని, కొంత మంది వ్యాపారస్తులు కూడా తమని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. నాలుగు కేసులు రావటంతో, చికెన్ మటన్ షాపులు తాము తెరవద్దు అని చెప్తే, ఆ వ్యాపారస్తులు రాజకీయ అండతో, మళ్ళీ షాపులు ఓపెన్ చేసారని, వీళ్ళకు ప్రజల ప్రాణాలకంటే, వ్యాపారాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. ఇలా అనేక విధాలుగా తాము పడుతున్న ఇబ్బంది చెప్పుకున్నారు.

అయితే సమస్య ఏమిటో చూసి, గుర్తించి, దానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, మళ్ళీ ఈ అధికారిని కూడా సస్పెండ్ చేసి పడేసారు. నగరి మున్సిపల్ కనిషనర్‍పై సస్పెన్షన్ వేటు వేసారు. కరోనా విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఈ నిర్ణయం తెసుకుంది. మాస్కులకు కూడా నిధులు లేవని సెల్ఫీవీడియో ద్వారా వ్యాఖ్యలు చేసారని, నగరి కమిషనర్ కామెంట్లను సీరియస్‍గా తీసుకున్న ఏపీ సర్కార్, సివిల్ సర్వీసెస్ నిబంధనలకు విరుద్దంగా కమిషనర్ వ్యవహరించారన్న ప్రభుత్వం, ఆయన్ను సస్పెండ్ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా నగరి దాటి వెళ్లొద్దని చెప్పింది. నగరి మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్‍గా సీహెచ్ వెంకటేశ్వరరావు నియామకం చేసింది.

Advertisements

Latest Articles

Most Read