కులాల మధ్య, ప్రాంతాల మధ్య కుంపట్లు పెట్టటంలో వైసిపీ పార్టీది మాస్టర్ గేం. ఇప్పుడు కుటుంబాలు మధ్య కూడా పెడుతున్నారు. గతంలోనే ఇలా పెట్టిన చరిత్ర ఉన్నా, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టింది. ఇందు కోసం వైసీపీ సోషల్ మీడియా పేటీయం బ్యాచ్ ని రంగంలోకి దింపారు. ఈ పేటీయం బ్యాచ్, పై నుంచి వచ్చిన ఆదేశాలు ప్రకారం, రంగంలోకి దిగారు. కొత్త జిల్లాల విభజనలో, విజయవాడ ప్రాంతాన్ని, ఎన్టీఆర్ జిల్లాగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ వింత ఏమిటి అంటే, ఎన్టీఆర్ జిల్లాలో, ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు లేకపోవటం. సరే ఇది పక్కన పెడితే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ కొత్త హడావిడి మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో, జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసింది వైసీపీ. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు, జగన్ మోహన్ రెడ్డికి థాంక్స్ ఎందుకు చెప్పరు అంటూ, గోల గోల చేయటం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ పేరు వాడుకుని సినిమాల్లో పైకి వచ్చావ్, అలాంటి ఎన్టీఆర్ కి జగన్ ఇంత గౌరవం ఇస్తే, ఎందుకు థాంక్స్ చెప్పటం లేదు అంటూ వైసీపీ సోషల్ మీడియా ఊదర గొడుతుంది. ఇందంతా ఒక ప్లాన్ ప్రకారం, organized గా జరుగుతున్న క్యంపైన్ అని చూసిన వారికి అర్ధం అవుతుంది. దీని వెనుక వైసీపీ వ్యూహం కూడా ఉంది.

jagan 27012022 2

ఇలా ఎన్టీఆర్ పేరు వాడుకుని, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, ఎన్టీఆర్ ని ట్రాప్ లోకి లాగాలని వైసీపీ చూస్తుంది. ఇలా చేస్తే, ఒక వేళ ఎన్టీఆర్ రియాక్ట్ అయి, జగన్ కు ధన్యవాదాలు చెప్తే, ఎన్టీఆర్ ఫాన్స్ కి, తెలుగుదేశం పార్టీకి, మధ్య గ్యాప్ తీసుకుని రావచ్చని, ప్లాన్ వేసినట్టు అర్ధం అవుతుంది. అయితే ఎన్టీఆర్ ఏమి తెలివి తక్కువ వాడు కాదు కదా, ఆయన ఎందుకు రియాక్ట్ అవుతారు ? అయితే వైసీపీ సోషల్ మీడియా, ఎన్టీఆర్ ని టార్గెట్ చేయటంతో, తెలుగుదేశం పార్టీ ఫాన్స్ కూడా రంగంలోకి దిగారు. ముందు వైఎస్ఆర్ ని నాలుగు తిట్టి, అప్పుడు జగన్ ని పొగుడుతాం అని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో, డొమెస్టిక్ టెర్మినల్ కు నాడు వైఎస్ఆర్ సియంగా ఉండగా, ఎన్టీఆర్ పేరుని తీసి వేసి, ఎన్టీఆర్ పేరు పెట్టం అని తెగేసి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మీకు ఏమి ఎన్టీఆర్ మీద ప్రేమ లేదులే, గతంలో వైఎస్ఆర్ , ఎన్టీఆర్ ని ఎలా టార్గెట్ చేసే వారో తెలియదా, ముందు దానికి ఏమి చెప్తారు అంటూ, కౌంటర్ లు వేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన కంపెనీ అమరరాజా కంపెనీ. ఇక్కడ దాదాపుగా పది వేల మంది వరకు పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ కంపెనీతో అనేక మందికి రిలేషన్ ఉంటుంది. అయితే ఈ కంపెనీ తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ది కావటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ కంపెనీ పైన కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగ్గట్టే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో, ఏకంగా అమరరాజా కంపెనీ మూసి వేయించాలని ప్రభుత్వం, ఆదేశాలు జారీ చేసింది. ముఖ్య కారణంగా, అక్కడ గ్రామస్తులు, అలాగే ఉద్యోగుల రక్తంలో లెడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందనే ఆరోపణలు చేసారు. దీని పైన అమరరాజా కంపెనీ కోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వ నోటీసులు పైన స్టే ఇచ్చిన హైకోర్టు, ప్రభుత్వాన్ని బ్లడ్ సంపుల్స్ ఇవ్వమని అడిగింది. అయితే నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం ఆ నివేదిక ఇవ్వటానికి ఎందుకో సాకులు వెతుక్కుంటుంది. హైకోర్టు వార్నింగ్ ఇచ్చినా, నిన్న జరిగిన వాయిదాలో, రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్పారు. దీంతో అమరరాజా తరుపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తుందని, కావాలనే తమను ఇరికించే ప్రయత్నంలో భాగంగానే తప్పుడు రిపోర్ట్ లు సృష్టించే పనిలో పడింది అంటూ, కోర్టు ముందు వదానలు వినిపించారు.

hc 26012022 2

ప్రభుత్వ తరుపు న్యాయవాది, ఈ రిపోర్ట్ లను ఐఐటి మద్రాస్ వారు ఇవ్వాల్సి ఉందని, అయితే కోవిడ్ కారణంగా, ఇప్పటి వరకు కుదరలేదని, అందుకే ప్రైవేటు సంస్థలతో టెస్ట్ రిపోర్ట్ లు చేపిస్తున్నాం అని చెప్పగా, అమరరాజా తరుపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు. రాష్ట్రం బయట ఉన్న సంస్థలతోనే రిపోర్ట్ తయారు చేపించాలని, ప్రభుత్వం తమ పైన కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని తెలిపారు. అయినా దాదాపుగా ఏడాది కావస్తున్నా, ఇప్పటి వరకు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వక పోవటం వెనుక, అక్కడ ఏమి లేదని తేలటంతోనే, ప్రభుత్వం తప్పుడు నివేదకలు కోసమే, జాప్యం చేస్తుందని కోర్టు ముందు వాదించారు. దీంతో హైకోర్టు, వచ్చే వాయిదాకి తమ ముందు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని, లేని పక్షంలో కేసు మెరిట్స్ ఆధారంగా తాము నిర్ణయం ప్రకటిస్తాం అంటూ, కేసుని వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఇరుకున పడిందా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అమరరాజాకి వ్యతిరేకంగా ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవటంతోనే, ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిత్ర విచిత్రాలు బహుసా ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండవు. ఒక పక్క జీతాలకు డబ్బులు లేవు అంటారు, ఆదాయం లేదు అంటారు, మరో పక్క మూడు రాజధానులు, 26 జిల్లాలు, 26 ఎయిర్ పోర్ట్ లు, 26 మెడికల్ కాలేజీలు, ఇలా రకరకాలుగా, వింత వింతగా నిర్ణయాలు తీసుకుంటారు. అన్నీ కూడా హడావిడి నిర్ణయాలు. ఏదో రాత్రి కలలో గుర్తుకు వచ్చి, ఉదయం చేసేసినట్టు ఉంటుంది. మూడు రాజధానుల విషయంలో కూడా అలాగే అయ్యింది. వాళ్ళ కోటరీ మాత్రమే డిస్కస్ చేసుకుని, ఎవరికీ చెప్పకుండా, ప్రజలలో చర్చ లేకుండా, ఉన్నట్టు ఉండి మూడు రాజధానులు అన్నారు. అది ఎంత కామెడీ అయ్యి కూర్చుందో, చివరకు ఆ బిల్లు వెనక్కు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలను చేసేసారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు. ఏంటి ఇలా జరిగింది అని ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. నిద్ర లెగిసి చుసేసరికి, మా జిల్లా మారిపోయింది అని గోల చేస్తున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి, కొత్త జిల్లాల ఏర్పాటు పై చర్చ నడుస్తుంది. అయితే ఇది మొత్తం పద్దతి ప్రకారం చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం వార్తలు చూసి షాక్ అయ్యారు.

cabinet26012022 2

నిన్న అర్జెంట్ గా ఆన్లైన్ లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది అట. అందులో రెవిన్యూ మంత్రి ధర్మాన, ఈ ప్రతిపాదన పెట్టటం, క్యాబినెట్ మొత్తం ఒకే చెప్పటం, వెంటనే గెజిట్ వచ్చేయటం జరిగిపోయాయి అంట. ఎందుకు ఇంత అర్జెంట్ గా రాత్రికి రాత్రికి చేసారో, వాళ్ళకే తెలియాలి. ఇక ఇప్పుడు ప్రజలు తేరుకుని చూసే సరికి చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో కృష్ణమ్మ లేదు. ఎన్టీఆర్ జిల్లాలో, ఎన్టీఆర్ సొంత ఊరు లేదు. డెల్టా ప్రాంతంలో కాలువలు లేవు. హిందూపురం జిల్లా, మదనపల్లె జిల్లా లేవు. ఇలా మొత్తం గందరగోళంగా మారిపోయాయి. నూజివీడు తీసుకుని వెళ్లి ఏలూరులో కలిపారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు. అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, గెజిట్ విడుదల చేసి అభ్యంతరాలు ఉంటే చెప్పాలి అని చెప్పటం. అసలు ఒక పక్క కొత్త జనాభా లెక్కలు అయ్యే దాకా, ఇది వద్దు అని కేంద్రం అంటుంటే, ఇది చెల్లదు అని తెలిసినా, ఎందుకు హడావిడిగా ఇది చేసారో, జగన్ గారికే తెలియాలి మరి.

ఆంధ్రప్రదేశ్ లో, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడిన సంగతి తెలిసిందే. రెండు చేతులు, రెండు కాళ్ళతో, జగన్ కు ఓటు వేశామని, ఉద్యోగులు చెప్తూ ఉంటారు. అలాగే జగన్ మొదటి సారి సచివాలయం వచ్చిన సందర్భంలో, జై జగన్ అంటూ నినాదాలతో, ఉద్యోగులు హోరెత్తించిన సంగతి ఇప్పటికీ అందరికీ గుర్తుంది. అయితే రెండేళ్ళకే బొమ్మ తిరగబడింది. పీఆర్సి అద్భుతంగా ఇస్తారని అనుకుంటే, గతం కంటే తక్కువ జీతాలు ఇచ్చారు. ఇంకా రకరకాల లెక్కలు చూపించి, కొంత మంది ఉద్యోగులు ఎదురు తమకే కట్టాలని ప్రభుత్వం చెప్పినట్టు చెప్తున్నారు. దీంతో, ఇప్పుడు ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. అంత కంటే ముందు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఉద్యోగుల పై ఎదురు దా-డి మొదలు పెట్టింది. మరీ ముఖ్యంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఉద్యోగులను టార్గెట్ చేస్తూ, మేము ప్రజా ప్రతినిధులగా జీతం తీసుకోమని, మీరు మా లాగా జీతం తీసుకోకుండా పని చేస్తారా అని చాలెంజ్ చేసారు. దీనికి ఉద్యోగులు వైపు నుంచి గట్టిగా కౌంటర్ పడింది. మా ఆస్తులు మీకిస్తాం, మీ ఆస్తులు మాకు ఇవ్వండి, ఈ ఆందోళన కూడా ఆపేసి, మీరు చెప్పినట్టే ఉచితంగా పని చేస్తాం అని కౌంటర్ ఇచ్చారు. మరి దీనికి శ్రీకాంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read