ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్, అత్యధికంగా పాదయాత్ర చేసింది మాత్రం, తూర్పు గోదావరి జిల్లాలో. 63 రోజులు పాదయత్ర తూర్పు గోదావరి జిల్లాలోనే సాగింది. దీనికి ప్రధాన కారణం, ఇక్కడ తెలుగుదేశం చాలా బలంగా ఉందని, అందుకే అక్కడ వారిని కట్టడి చేస్తే, దీని ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందని జగన్ అభిప్రాయం. వ్యూహాత్మకంగా పట్టు సాధించాలన్న ఆయన ఎత్తుగడ అంతగా పారినట్టు కనిపించలేదు. తమ అధినేత పాదయాత్రతో తూర్పు రాజకీయాలు మలుపు తిరుగుతాయని ఆశపడిన ఆ పార్టీ నాయకులకూ ఇప్పుడు అర్థంకాని గందరగోళ పరిస్థితి. జగన్‌ వ్యూహాత్మకంగానో, ఆవేశపూరితంగానో చేసిన వ్యాఖ్యానాలు పార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టించాయి.

jagan 18082018 2

సామర్లకోటలో పవన్‌కల్యాణ్‌పై చేసిన కామెంట్లు పెను దుమారాన్నే రేపాయి. జగ్గంపేటలో కాపు రిజర్వేషన్లపై చేతులెత్తేసిన వైనం ఇప్పటికీ ఆ పార్టీలో వణుకు పుట్టిస్తోంది. తుని ఘటనలో సీఎం చంద్రబాబే రైలు తగుల బెట్టించారన్న ఆరోపణ సైతం పేలలేదు. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి నుంచీ స్పందన కరువు. అప్పటి నుంచి, జగన్ కు ఈ జిల్లాలో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా, తూర్పు గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి, గుడ్ బై చెప్పనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ జిల్లాలో చేపట్టిన పాదయాత్రతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ.. ఆయన చేసిన వ్యాఖ్యలతో మాత్రం ఆ పార్టీ నేతలు నిష్క్రమిస్తున్నారు.

jagan 18082018 3

ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఇప్పుడు దుర్గేశ్‌ వంటి పెద్ద నేత కూడా అదే బాట పట్టడం వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆయన వైసీపీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి టికెట్‌ ఆశించారు. అయితే గతంలో పోటీచేసిన ఆకుల వీర్రాజుకే టికెట్‌ ఇస్తామని జగన్‌ చెప్పినట్లు సమాచారం. ఈలోగా జిల్లాలో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో దుర్గేశ్‌ వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై శనివారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరపున రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి పోటీ చేయడానికి కూడా నిర్ణయం జరిగినట్లు సమాచారం.

 

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బిజెపి కార్యాలయం వద్ద కొందరు బిజెపి గూండాలు సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై దాడి చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన అగ్నివేష్‌ (79)పై బిజెపి గూండాలు సామూహికంగా దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై అగ్నివేష్‌ మాట్లాడుతూ వాజ్‌పేయి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు అక్కడికి వెళ్లానని, పోలీస్‌ బందోబస్తు ఉండడంతో నడుచుకుంటూ వెళ్తున్నట్లు తెలిపారు. అకస్మాత్తుగా కొందరు యువకులు తన మీద దాడి చేశారని, తన తలపాగాను పడేసి దేశద్రోహి అంటూ కొట్టడం ప్రారంభించారని ఆయన తెలిపారు.

agnivesh 18082018 2

ఈ ఘటన అధికార పార్టీ కార్యాలయం వద్ద చోటుచేసుకోవడంతో అక్కడి సిసికెమెరాల్లో రికార్డయింది. కొందరు బిజెపి కార్యకర్తలు అగ్నివేష్‌ను వెంబడిస్తూ, ఆయనను తోసేస్తుండటం, 'దేశద్రోహి' అని తిడుతూ, కొట్టండి అంటూ మరికొంత మందిని పురిగొల్పినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపి స్తోంది. ఆయన తలపాగాను ఒక వ్యక్తి లాగిపడేయగా, మరో మహిళ ఆయనను చెప్పుతో కొట్టేందుకు యత్నిస్తు న్నట్లు వీడియోలో ఉంది. దీంతో పోలీసులు అగ్నివేష్‌ను ఒక వ్యాన్‌లో ఎక్కించుకుని భద్రతా వలయంలోకి తీసుకెళ్లినా ఆయనపై దాడి చేసేందుకు వారు ప్రయత్నించారని పోలీస్‌ అధికారులు తెలిపారు. అగ్నివేష్‌ పై దాడి జరగడం ఇది రెండవ సారి.

agnivesh 18082018 3

గతంలో జులై 17న జార్ఖండ్‌లోని పాకూర్‌లో బిజెపి యువ మోర్చా కార్యకర్తలు ఆయనపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి దాడి ఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజిలో అగ్నివేష్‌ నేలపై పడివున్నారు. ఒక గుంపు ఆయనపై దాడి చేస్తుండగా వారి నుండి రక్షించుకునేందుకు తన చేతులను అడ్డుపెట్టుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. కాగా, ఆయన దుస్తులు కూడా చిరిగిపోయాయి. అయితే సాక్ష్యాధారాలు ఉన్నప్పటికి ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. నివాళి అర్పించటానికి వచ్చిన అగ్నివేశ్ మీద దాడి చేసిన ఈ రౌడీమూకలా భారతీయ సంస్కృతి గురించి మాట్లాడేది !! శత్రువుకి కూడా గౌరవంగా అంత్యక్రియలు జరిపించే సంస్కృతి నా ఈ భారతీయ సంస్కృతి. పగవాడైనా మరణించాక మనవాడే అనుకొని ఉత్కృష్టమైన సాంప్రదాయం మనది. అలాంటిది మరణించిన వ్యక్తి కి నివాళి అర్పించటానికి వచ్చిన వ్యక్తి మీద దాడి చేసిన, మోదీ షాల బిజెపి అంటే అసహ్యం రోజు రోజుకి పెరుగుతుంది ఇందుకే.

మాజీ ఎంపీ చెన్నువాటి విద్య కన్ను మూశారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. చెన్నుపాటి విద్య ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె. భారత జాతీయ కాంగ్రెస్‌ తరఫున విజయవాడ పార్లమెంట్‌ నుంచి విద్య రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎదురు లేని మహిళా నాయకురాలిగా, విజయవాడ ఎంపీగా ఎదగడం ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఈస్థాయి గుర్తింపు పొందిన మహిళా నేత చెన్నుపాటి విద్యనే.

chennupati 18082018 2

వాసవ్య మహిళా మండలి స్థాపన సమయంలో అష్టకష్టాలూ పడాల్సి వచ్చినా, ఆ తరువాత ఆమె ఎక్కిన ప్రతి మెట్టూ విజయం వైపే పడింది. వాసవ్య మహిళా మండలి ద్వారా మహిళా సంక్షేమం, అభ్యుదయానికి ఎంతో కృషి చేశారు. తన తండ్రి నుంచి అభ్యుదయ భావాలను, క్రమశిక్షణను అలవర్చుకున్నట్టు విద్య పలుసార్లు చెప్పారు. నాన్న గారి సలహా మేరకే మహిళా మండలిని ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పేవారు. విద్య సేవలను గుర్తించిన ఇందిరాగాంధీ 1979లో తొలిసారి పార్లమెంట్‌ ఎన్నికల కోసం విజయవాడ టిక్కెట్‌ను విద్యకు కేటాయించారు. 1980 నుంచి 1984 వరకు మొదటిసారి, 1989 నుంచి 1991 వరకు రెండోసారి లోక్‌సభ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తించారు.

chennupati 18082018 3

విద్య అంత్యక్రియలు సోమవారం విజయవాడలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు. మాజీ ఎంపి చెన్నుపాటి విద్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు. చెన్నుపాటి విద్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా ఆమె సేవలు ప్రశంసనీయమని సీఎం కొనియాడారు. మహిళాభ్యుదయం కోసం చెన్నుపాటి ఎనలేని కృషి చేశారని, చెన్నుపాటి విద్య మృతి విజయవాడకే కాదు..ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటన్నారు.

గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నీటి రాకను ఎప్పటికప్పుడు అంచనా వేసి, దానికనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ ఏర్పాట్లు చేయాలని, విపత్తుల నివారణ, అగ్నిమాపక దళాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఇప్పటికే విశాఖ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు, మంగళగిరి నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు విపత్తు నివారణ బృందాలు బయల్దేరినట్టు అధికారులు వివరించారు. వరద సమయంలో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ధవళేశ్వరం దగ్గర రెండో హెచ్చరిక జారీ చేసే అవకాశమున్నందున అన్ని వేళలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

godavari 18082018 2

పోలవరం నిర్మాణ ప్రాంతంలోను తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై ఆయన శుక్రవారం సాయంత్రం రియల్‌ టైం గవర్నెన్స్‌ కేంద్రం నుంచి అధికారులతో సమీక్షించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. రాష్ట్రంలో కృష్ణా నదిపై ఉన్న జలాశయాల్లోకి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిలో ఒక్క చుక్క కూడా వృథాగా సముద్రంలోకి పోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల్ని సాధ్యమైనంత వరకు నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

godavari 18082018 3

కృష్ణానదిలో వరద ప్రవాహంపైనా సీఎం ఆరాతీశారు. కృష్ణాకు వస్తున్న వరద నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, రాయలసీమలోని ప్రాజెక్టులకు మళ్లించి సద్వినియోగమయ్యేలా చూడాలని సూచించారు. ఈ నెలాఖరులోపు కృష్ణాలో 200 టీఎంసీల నీరు వచ్చే అవకాశాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేశామని, మచ్చుమర్రికి కూడా మళ్లిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 9.3% లోటు వర్షపాతం నమోదైందని, అన్ని ప్రాజెక్టుల ద్వారా 968టీఎంసీలు నిల్వ చేయాల్సి ఉండగా, 441.71టీఎంసీలు నిల్వ చేసుకున్నామని చెప్పారు. కర్నూలులో 41.5%, అనంతపురంలో 39.9%, కడపలో 54.8%, నెల్లూరులో 51.9%, ప్రకాశంలో 33.2% తక్కువగా వర్షపాతం నమోదైందని వివరించారు.

Advertisements

Latest Articles

Most Read