నేరాల అదుపులో సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్న ఏపీ పోలీసు శాఖకు కేంద్ర హోంశాఖ ఏకంగా 7.69 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది. ఈ మొత్తంతో అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ప్రణాళిక రచిస్తోంది. నేర నియంత్రణలో అభివృద్ధి చెందిన దేశాలను తలపించేలా టెక్నాలజీని వినియోగిస్తూ మన పోలీసు శాఖ ముందడుగు వేస్తోంది. ఇంటికి తాళం వేసి కుటుంబం ఊరెళితే ఆ ఇంట్లో ఆస్తిని కాపాడటం నుంచి బయటికెళ్లిన మహిళల్ని లైంగికంగా వేధిస్తే బాధ్యులను జైలుకు పంపడం వరకూ టెక్నాలజీని వినియోగిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తోంది.

andhrapolice 12052019

సైబర్‌ దొంగలకు ఫైర్‌వాల్‌తో అడ్డుకట్ట వేస్తున్నారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు పాల్పడే ముఠాలకు సంకెళ్లు వేసి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఇవేగాక ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులు, సీసీటీఎన్‌ఎ్‌సలో వంద శాతం పురోగతి, కేసు నమోదు చేయగానే బాధితుల మొబైల్‌ నెంబర్‌కు సమాచారం లాంటి సేవలు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా సీసీ కెమెరాలను అనుసంధానించి మొత్తం ఏపీని మంగళగిరిలోని టెక్‌టవర్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతల విధుల్లో ఉన్న పోలీసులకు బాడీవార్న్‌ కెమెరాలు, గుంపులో ఉండి అల్లర్లకు పాల్పడేవారిని కనిపెట్టేందుకు డ్రోన్లు, ఇతర రాష్ట్రాల దొంగలు ఏపీలోకి ప్రవేశిస్తే పసిగట్టేందుకు వేలిముద్ర ల టాబ్‌లు పోలీసులు అందిపుచ్చుకున్నారు. గ్రామా ల్లో ఇంటి భద్రత నుంచి ప్రవాసాంధ్రులకు అండగా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా ప్రజలకు సేవలందిస్తోన్న ఏపీ పోలీసు శాఖ పనితీరును ఏడాది కాలంగా కేంద్ర హోంశాఖ పర్యవేక్షించింది.

andhrapolice 12052019

ఏపీ పోలీసు శాఖ సిబ్బంది నియామకం, సంక్షేమానికి కూడా పెద్దపీట వేసింది. గడిచిన మూడేళ్లలో సుమారు 9 వేల పోలీసు సిబ్బంది నియామకం, పదోన్నతులు, మహిళా పోలీసులకు ప్రత్యేక వసతుల కల్పన, ఆరోగ్య పరీక్షలు తదితర సంక్షేమ కార్యక్రమాలపై డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపారు. దేశంలోని 29 రాష్ట్రాల పోలీసులు అమలు చేస్తున్న విధానాలను ఏడాదిపాటు క్షుణ్నంగా పరిశీలించిన కేంద్ర హోంశాఖ పది రాష్ట్రాలకు భారీ రివార్డులు ప్రకటించింది. ఒక్కో రాష్ట్రానికి 7.69 కోట్ల రూపాయలు ఇస్తోంది. ఆ డబ్బుతో మరిన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించింది.

 

 

భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు నరేంద్ర మోదీనే. అలాంటి మోదీ ప్రచారాస్త్రం కాంగ్రెస్‌ను కవ్వించడం.. వివిధ వర్గాలను రెచ్చగొట్టడం. మొదటి విడత నుంచి చివరి వరకూ అదే జరుగుతుంది. కాంగ్రెస్ సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను అవమానించింది.. ఇది గుజరాత్‌లో నరేంద్ర మోదీ ప్రచారాస్త్రం. రాజీవ్ గాంధీ దళితుడైన అంజయ్యను అవమానించారు.. ఇది తెలంగాణలో మోదీ డైలాగ్. పీవీ నరసింహారావును కాంగ్రెస్ అగౌరవపరిచింది.. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా మోదీ చెప్పే మాట. ఇలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ రాష్ట్రానికి చెందిన పాత తరం ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి కాంగ్రెస్ అవమానించిందంటారు. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ లేకపోతే.. అక్కడ ఉండే ప్రాంతీయ పార్టీలను కలిపి విమర్శలు చేస్తున్నారు. ఇలా చేసే విమర్శల కోణంలోనూ ఓ లెక్క ఉంటుంది. ప్రభావవంతమైన వర్గం ఓటర్లను మోదీ టార్గెట్ చేసుకుంటారు. అందరినీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేసేందుకు ఆ ఆరోపణలు చేస్తారు.

modispeach 12052019

నిజానికి కాంగ్రెస్ పార్టీ ఆ నేతలను అవమానించిందా? అంటే వారంతా కాంగ్రెస్ పార్టీలో దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన నేతలు. చివరికి వల్లభాయ్ పటేల్‌ను మహాత్ముని కన్నా ఎక్కువగా అభిమానిస్తున్న బీజేపీ.. ఆ నాయకుడు తమ సిద్ధాంత సంస్థ ఆర్ఎస్ఎస్‌ను నిషేధించారన్న సంగతిని ఎవరికీ చెప్పలేదు. పటేల్ అంటే బీజేపీ నేత అన్నట్లుగా చెప్పుకొస్తారు. ఇక అంజయ్య ముఖ్యమంత్రి అయినా.. పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి అయినా.. కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్లే అయ్యారు. వారికి అంతటి గౌరవం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని ఎలా అవమానించిందో మాత్రం విపులంగా చెప్పలేదు. చిన్న చిన్న ఘటనలను చిలువలు పలువలుగా చెప్పి మోదీ రాజకీయ ప్రసంగాలు చేసేస్తారు. అది ఆయన శైలి. ఈ తరహా వ్యతిరేక ప్రచారం గతంలో ఎవరూ చేయలేదు. కానీ మోదీ మాత్రం దాన్నే నమ్ముకున్నారు. అది ఎంత వరకు వెళ్లిందంటే.. దాదాపు మూడు దశాబ్దాల కిందట చనిపోయిన రాజీవ్ గాంధీని సైతం విమర్శించేంతగా మారారు. నలభైలో ఉన్నవారికి కూడా రాజీవ్ గాంధీ గురించి అంతో ఇంతో తెలుసు. భోఫోర్స్ అనే స్కామ్ రాజకీయంగా ఎలా అస్త్రంగా మారిందో అందరికీ తెలుసు.

modispeach 12052019

దశాబ్దాలు గడుస్తున్నా ఆ స్కామ్ ఇంత వరకూ నిరూపితం కాలేదని అందరికీ తెలుసు. కానీ స్కామ్ విచారణలో రాజీవ్ గాంధీ దోషిగా తేలినట్లు మోదీ ప్రకటించేశారు. ఎల్.టి.టి.ఈ తీవ్రవాద సంస్థ చేతుల్లో దారుణంగా హతమైన రాజీవ్ గాంధీని అవినీతి కేసుల కారణంగా చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అసలు చనిపోయిన రాజకీయ నేతల గురించి ఎవరూ చెడుగా చెప్పరు. చాలా దిగువస్థాయి రాజకీయ నేతలైనా ఈ విషయంలో సంయమనం పాటిస్తారు. కానీ మోదీ మాత్రం అలాంటి పట్టింపులేమీ పెట్టుకోలేదు. చౌకీదార్ చోర్ హై అంటున్న రాహుల్ గాంధీకి కౌంటర్ ఇవ్వాలంటే.. మీ నాన్నే దొంగ అనాలనుకున్నారు.. అనేశారు కూడా. తాను రాజీవ్ గాంధీతోనే పోటీ పడుతున్నట్లుగా విమర్శలకు పదును పెట్టారు. మోదీనే అలా ఉంటే.. ఆయన పార్టీ నేతలు ఎందుకు సైలెంట్‌గా ఉంటారు. అందరూ మోదీ స్థాయికి ఎదిగిపోయి ప్రచారం చేస్తారు.

కౌంటింగ్‌ గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు కంటిమీద కునుకు కరువైంది. ఓటరు దేవుడు తమపై ఏ మాత్రం కరుణించాడో ఇప్పటికీ తేలకపోవడంతో అభ్యర్థులు, పార్టీలు అంతర్మథనంలో పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డారు. అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం, వైకాపాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతుంటే జనసేన తాము కూడా కీలకమేనని భావిస్తోంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో ఈ నెల 23న తేలిపోనుంది. అంటే మరో 11 రోజుల పాటు ఈ ఉత్కంఠత కొనసా గనుంది. ఇప్పటికే వివిధ సర్వేలు సోషల్‌ మీడియాలో హల్‌ చెల్‌ చేస్తున్నాయి. కొన్ని సర్వేలు అధికార పార్టీ అయిన తెలుగు దేశానికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని వైకాపాకు అనుకూలం గా వస్తున్నాయి. వివిధ సంస్థల పేరిట షికారు చేస్తున్న ఈ సర్వేలు అభ్యర్థుల్లో ఆందోళన రేక్కెత్తిస్తున్నాయి.

counting 12052019

ఇదిలా ఉంటే మరోవైపు ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో నివేదికలతో గెలుపు, ఓటముల అంచ నాలపై ఒక అవగాహనకు వస్తున్నాయి. మార్చి 10న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహిం చేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఐదు దశల్లో పోలింగ్‌ పూర్తికాగా, ఆదివారం ఆరవ విడత పోలింగ్‌ జరగ నుండగా, ఈ నెల 19న చివరి విడతతో పోలింగ్‌ ముగియ నుంది. ఆదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు ఎవరికి అధికారం దక్కునున్నదో అనే అంశంపై కొంత మేర స్పష్టత వచ్చే అవకాశాలు న్నాయి. ఈ నెల 23న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అయితే ఓటరు తీర్పు ఏవిధం గా ఉంటుందోనన్న వాస్తవ రూపం తెలియాలంటే మరో 11 రోజలు ఓపిక పట్టాల్సిందే. ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అన్న అంచనాలను రూపొందించే పనిలో ప్రధాన పార్టీలు వున్నాయి. మరోవైపు అభ్యర్థు లు ఎవరి లెక్కల్లో వారున్నారు. పార్టీలు, అభ్యర్థులు తమకు తోచిన విధంగా, తమకున్న విశ్లేషణా పరిజ్ఞానం ద్వారా క్షేత్రస్థాయి లెక్కలు వేస్తూ గెలుపు, అధిక్యతపై అంచనాలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

counting 12052019

రెండు ప్రధాన పార్టీలు పూర్తి స్థాయిలో లెక్కలు కడుతున్నాయి. తెలుగుదేశం ఒక నమూనాలో లెక్కలు వేస్తుండగా, ప్రధాన ప్రత్యర్థి వైకాపా ఇప్పటికే బూత్‌ల వారీగా నాయకులతో సమీక్షలు నిర్వహించి ఒక అంచనాకు వచ్చింది. ఈ నెల 4 నుంచి తెలు గుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో బూత్‌లవారీగా పనిచేసిన నాయ కులు జాబితా, ఎవరెవరు ఎలా పనిచేశారు? ఏజెంట్ల బాధ్యత లు ఏలా ఉన్నాయి, బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలతో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తు న్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తుండటంతో ద్వితీయ శ్రేణి నేతల్లో కొంత ఉత్సా హాన్ని కలిగించింది. తమ నియోజకవర్గాల్లో జరిగిన వాస్తవ పరిస్థితులను అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చే అవకాశం లభించడంతో వారి ఆనందం అంత ఇంతాకాదు. అదేవిధంగా వారు చెబుతున్న ప్రతి విషయాన్ని అధినేత కూడా సమగ్రంగా విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ ముఖ్యనేతలు, అభ్యర్థులు చేసిన తప్పిదాలు, పొరపాట్లను ఈ సమీక్షల్లో చంద్రబాబు విశ్లేషిస్తునే భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కౌటింగ్‌కు సంబంధించి ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ప్రతి రోజు అధినేత చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి కౌంటింగ్‌కు సమాయత్తం చేస్తున్నారు. ప్రతి రోజు కౌంటింగ్‌ సమయంలోఎలా వ్యవహరించాలో దిశానిర్థేశం చేస్తున్నారు. ఫలితాలు వెల్లడి అయ్యేంత వరకు ఏజెంట్లు కౌంటింగ్‌ కేంద్రంలోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కౌంటింగ్‌ ఏజెంట్లలో అనుభవజ్ఞులతో పాటు, న్యాయవాది, సాంకేతిక సలహాదారులను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

మోహన్ బాబు తర్వాత విద్యా రంగంలోకి మరో సినీ కుటుంబం అడుగు పెడుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రారంభిస్తున్నారు. అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నామని సీఈవో జె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇచ్చేందుకు ప్రప్రథమంగా శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ను అన్ని సదుపాయాలతో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

chiru 12052019 1

ఏసీ క్లాస్ రూమ్ లు, ఆడియో విజువల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ, పేరెంట్-టీచర్ ముఖాముఖి, ఇంగ్లిష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలని వివరించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా తరగతులను నిర్వహించనున్నట్టు చెప్పారు. వర్తమాన పోటీ ప్రపంచంలో చిన్నతనం నుంచే విద్యార్థులకు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాంకేతిక అంశాలతో పాటు తార్కిక ఆలోచన, విశ్లేషణా సామర్థ్యం, నైపుణ్యాలలో శిక్షణ, సమస్యల పరిష్కారం, కంప్యూటర్స్ లోని ప్రాథమిక, ఆధునిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా స్టూడెంట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఎస్టీఈపీ) ద్వారా అత్యాధునిక శిక్షణ ఇవ్వనున్నారు.

chiru 12052019 1

ఈ స్కూల్స్ కి మెగాస్టార్ చిరంజీవి గౌరవ వ్యవస్థాపకులుగా, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబు గౌరవ చైర్మన్ గా ఉంటారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గౌరవ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఈ స్కూల్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్లలకి ప్రత్యేక ఫీజు రాయితీలు ఉంటాయని సీఈవో జె శ్రీనివాసరావు తెలిపారు. చిరంజీవి అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి లాంటి పెద్ద స్టార్ స్కూల్ పెట్టటం, లేదా ఒక వ్యాపారం చెయ్యటం హర్షణీయం. అయితే ఇదే సందర్భంలో హైదరాబాద్ నుంచి వచ్చి, మోహన్ బాబు లాగా, ఇక్కడే వ్యాపారాలు చేసుకుని, ఇక్కడ ప్రభుత్వాన్ని అకారణంగా టార్గెట్ చెయ్యటం లాంటివి చూసిన ప్రజలు మాత్రం, చిరంజీవి ఇలా చెయ్యకుండా, ఏపి రాష్ట్ర పేరు నిలబెట్టేలా స్కూల్ నడిపితే మంచిదని ప్రజలు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read