టెన్త్ ఫలితాలు తెలుసుకునేందుకు విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆర్టీజీఎస్ వెబ్‌సైట్, దాని అనుబంధ పీపుల్స్ ఫస్ట్, కైజాలా యాప్ ఉపయోగించుకునేందుకు పోటీ పడ్డారు. టెన్త్ ఫలితాలులను ఆర్టీజీఎస్ సహా వివిధ యాప్‌ల ద్వారా తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్ వీలు కల్పించింది. ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దీంతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే వేలాదిమంది విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆర్టీజీఎస్, దాని అనుబంధ యాప్‌లను సెర్చ్ చేశారు. టెన్త్ ఫలితాల కోసం దాదాపు 8.5 లక్షల హిట్లు నమోదు కావడం గమనార్హం. ఇందులో 4.14 లక్షల మంది తమ ఫలితాలను ఆర్టీజీఎస్ వేదికను ఉపయోగించుకుని డౌన్ లోడ్ చేసుకోవడం గమనార్హం.

game 27032019

ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌లో 5 లక్షల మంది ఫలితాల కోసం శోధించారు. దాని తరువాతి స్థానంలో 1.76 లక్షల హిట్స్‌తో పీపుల్స్ ఫస్ట్ యాప్ నిలచింది. ఖైజాలా యాప్ ద్వారా 44,541 మంది శోధించగా, 33,200 మంది ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఏపీఫైబర్ నెట్ టీసీ స్క్రీన్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే వీలు ఆర్టీజీఎస్ కల్పించింది. ఇంట్లో టీవీ తెరపై హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయగానే, తమ ఫలితాలు ప్రత్యక్షమవడం విద్యార్థులకు వింత అనుభూతిని ఇచ్చింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఐఏఎస్‌ అధికారులపై ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చివర కు సీఎం-సీఎస్‌ల వరకూ గత కొంతకాలంగా ఉప్పు-నిప్పులా ఉన్న పరిస్థితులు సద్దుమణిగా యన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈనెల 5వ తేదీ ఆదివారం విజయవాడ కేంద్రంగా సుమారు 40 మందికిపైగా ఐఏఎస్‌ అధికారులు రహస్య భేటీ కావడం, అర్థరాత్రి వరకూ కొనసాగిన ఆ సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మొదలుకొని, ఐఏఎస్‌ అధికారుల వరకూ ఉన్న లోపాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ నేతల పక్షాన కాకుండా ఐఏఎస్‌ అధికారుల్లో ఐకమత్యం పెరగాలన్న సీనియర్‌ ఐఏఎస్‌ల వాదనలతో ఏకీభవించిన పలవురు అధికారులు తమ నిర్ణయాలకు ఇకపై కఠినంగానే అమలు చేస్తామని స్పష్టం చేయడం గమనార్హం.

game 27032019

విజయవాడలో ఐఏఎస్‌ అధికారుల రహస్య భేటీపై నిఘా వర్గాలు కూపీ లాగి ఎలాంటి సమాచారం తెలియక పోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధితశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణంలో ఏపార్టీకి మెజార్టీ వస్తుందో అన్న అంశంలోనూ చంద్రబాబు నాయుడు ఆచితూచి అంచనాలు వేయడం, కొన్ని సర్వే సంస్థలు టీడీపీకి వ్యతికేకంగా, కొన్ని టీడీపీకి అనుకూలంగా సర్వే నివేదికలు వెల్లడించడంతో ఆయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీయే అధికారాన్ని చేపట్టనున్నదన్న విషయం స్పష్టం కావడంతో చంద్రబాబు నాయుడు మళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఐఏఎస్‌ అధికారుల్లో తిరుగుబాటు లేదా వ్యతిరేకత ఎక్కువ శాతం ఉన్నట్లయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతోనే కాస్తంత మెత్తబడినట్లు ప్రచారం జరుగుతోంది.

game 27032019

కేబినెట్‌ సమావేశానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించేందుకు సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించడంతోపాటు ఆయనతో సుదీర్ఘంగా మంతనాలు జరపడంతో రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. అలాగే ఇదే ఒరవడిని ముఖ్యమంత్రి కొనసాగించినట్లయితే భవిష్యత్తులో ఐఏఎస్‌లకు, రాజకీయపార్టీల నేతలకు ఎలాంటి ఇబ్బందులు, పొరపొచ్చాలు వచ్చే అవకాశాలు లేవని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం నాటి కేబినెట్‌లో సీఎం చంద్రబాబు, సీఎస్‌ ఎల్వీలు ఎంతో ఉత్సాహంగా కనిపించడంతో సీఎం-సీఎస్‌ల వ్యవహారం ఇక సమసిపోయినట్లే అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వ్యాఖ్యానించారు.

విద్యుత్‌ రంగంలో గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రం గణనీయమైన పురోభి వృద్ధిని సాధించింది. మండు వేసవిలో సైతం విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 24/7 విద్యుత్‌ సరఫరాతో ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. రాష్ట్ర విభ జన సమయంలో (జూన్‌, 2014లో) రోజుకు సగటున 22.5 మిలియన్‌ యూనిట్ల లోటుతో ఉన్న విద్యుత్‌ రంగం నేడు సున్నా విద్యుత్‌ లోటుకు చేరుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న చర్యలతోనే సాధ్యమైంది. అంతేకాకుండా విద్యుత్‌ లోటుతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారిపోయింది. గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో వ్యవస్థాపక సామర్ధ్యం నూరు శాతం పెరిగింది. గతంలో 9,529 మెగావాట్లుగా ఉన్న వ్యవస్థాపక ఉత్పత్తి సామర్ధ్యం ఇప్పుడు 19,080 మెగావాట్లకు చేరుకుంది.

game 27032019

ఏపీజెన్‌కో 2,250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని అందించింది. ఇందులో కృష్ణపట్నం సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నుండి రెండు 800 మెగావాట్లు అంటే 1600 మెగావాట్లు, రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఆర్‌టీపీపీ) స్టేజ్‌ 4 నుండి 600 మెగావాట్లు, నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ వద్ద నున్న హైడల్‌ స్టేషన్‌ నుండి రెండు 25 మెగావాట్ల చొప్పున 50 మెగావాట్లను ఉత్పత్తి చేసింది. అలాగే పునరుత్పాదక ఇంధనం ద్వారా మరికొంత విద్యుత్‌ను నిల్వచేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఏపీజెన్‌కో పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మితమవుతున్న 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుతో పాటు మరో రెండు 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ యూనిట్లను విజయవాడ, కృష్ణపట్నం పోర్టుల వద్ద ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కష్టాలను తీసుకొచ్చింది. అప్పట్లో 2006-07లోని విద్యుత్‌ వినియోగాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రానికి విద్యుత్‌ కేటాయింపులు చేశారు. దీంతో విభజన జరిగిన జూన్‌ 2014 నుండి నూతన రాష్ట్రానికి విద్యుత్‌ కష్టాలు తప్పలేదు.

game 27032019

వాస్తవానికి రాష్ట్ర భౌగోళిక స్వరూపం, జనాభా ప్రాతిపదికన కేటాయింపుల చేసినట్లయితే కొత్త రాష్ట్రలో కొంతమేరైనా విద్యుత్‌ కష్టాలు తప్పి ఉండేవి. చంద్రబాబు వచ్చిన తరువాత రాష్ట్ర విద్యుత్‌ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. విద్యుత్‌ వినియోగాన్ని వీలైనంతమేర తగ్గించుకునేలా ఐఎస్‌ఐ ఉత్పత్తులను వాడేలా ప్రజల్లో చైతన్యం కల్పించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ, సోలార్‌ పంపుసెట్ల పంపిణీ వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేశారు. అలాగే విద్యుత్‌ పొదుపు, ఇంధన సామర్ధ్యం వంటి ప్రమాణాలను ప్రోత్సహించారు. దీంతో లోటు విద్యుత్‌తో కొట్టుమిట్టాడిన రాష్ట్రం కాస్తా మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారిపోయింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి 7,464 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో 4,059 మెగావాట్ల పవన విద్యుత్‌, 2,591 మెగావాట్ల మేర సౌర విద్యుత్తు ఉంది.

ఏడు విడతల్లో సాగుతున్న భారత ఎన్నికల ప్రక్రియ ముగిం పు దశకొచ్చింది. ఇప్పటికే ప్రపంచమంతా లెక్కింపు మీద దృష్టిపెట్టింది. ఈసారి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. కేవలం దేశీయంగానే కాదు.. అంతర్జా తీయంగా కూడా దీనిపై తర్జన భర్జన పడుతున్నారు. ఇందు క్కార ణం ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భారత్‌ అగ్రదేశాలతో సరిసమా నంగా దూసుకుపోతుండడమే. ఇక్కడ ఏర్పడే ప్రభుత్వాన్ని బట్టి భారత్‌తో వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు ఆధార పడుంటాయి. సహజంగా కౌం టింగ్‌ ప్రక్రియకు ముందు వెలువడే ఎగ్జిట్‌పోల్స్‌ను ఫలితాలకు ప్రామాణికంగా తీసుకుంటారు. గతంలో పలు సందర్భాల్లో ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ వాస్తవానికి దగ్గరగా ప్రతిబింబించాయి. 19న జరిగే చివరిదశ పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే గతంలోలా ఇప్పుడు ఈ ఎగ్జిట్‌ పోల్స్‌పై ఎవర్లోనూ ఆసక్తి వెల్లడి కావడం లేదు. ఇందుక్కారణం ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు విశ్వసనీ యతను కోల్పోవడమే.

game 27032019

ఇప్పటికే దేశవ్యాప్తంగా మీడియా సంస్థలన్నీ ఏదొక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా ప్రతికూలంగా మారిపోయాయి. ఇవన్నీ తాను మద్దతిస్తున్న పార్టీల రాజకీయ ప్రయోజనాలకు నుగుణంగానే పుంఖాను పుంకాలుగా వార్తలు వెలువరించాయి. వాటికి ఓట్ల శాతాన్ని పెంచే రీతిలోనే కథనాల్ని వండివార్చాయి. వీలు దొరికిన ప్రతి సందర్భంలోనూ ఆ పార్టీని వెనకేసుకొచ్చాయి. ఆ పార్టీల అభ్యర్థుల్ని తమ పాఠకుల మీద బలవంతంగా రుద్దాయి. సదరు పార్టీకే విజయావకాశాలు అధికమంటూ ఊదరగొట్టాయి. అటువైపు ఓటర్ల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశాయి. పోలింగ్‌ ప్రక్రియ అనంతరం కూడా తాము మద్దతిచ్చిన పార్టీయే అధి కారంలోకి రాబోతుందంటూ ముందస్తు సర్వేల పేరిట కథనాలు వెలువరిస్తున్నాయి. ఓటర్లు కూడా గతంతో పోలిస్తే రాటుదేలారు.

game 27032019

మీడియా నైజాన్ని వారూ ఒంటబట్టించుకున్నారు. ఏ పత్రిక లేదా చానల్‌ ఎవరి తరపున పని చేస్తున్నాయో గుర్తించేశారు. దీంతో మీడియా సంస్థలు వెలువరించనున్న ఎగ్జిట్‌ పోల్స్‌కు విశ్వసనీయత కొరవడింది. ఇవి ఏమాత్రం ప్రామాణికాల్ని పాటించడం లేదని ప్రజలు అవగాహనకొచ్చేశారు. దీంతో వీటి విశ్లేషణలు వెల్లడించే ఫలితాలెలా ఉన్నా 23వ తేదీన ఈవీఎంలు తెరిచి కౌంటింగ్‌ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యే వరకు విజేతలు ఎవరన్న దానిపై అవగాహనకు రాకూడదని నిర్ణయించుకున్నారు. జాతీయ స్థాయిలో వెలువడే ఛానల్స్‌, పత్రికలు, కొన్ని అంతర్జాతీయ సర్వే సంస్థలతో కలిపి నిర్వహించి ఎన్నికలకు ముందే విడుదల చేసిన కొన్ని అంచనాల మధ్య తీవ్ర వ్యత్యాసాలుండడం కూడా వీటిపై విశ్వసనీయత కొరవడ్డానికో కారణమైంది. ఒకే సంస్థ వెలువరించిన పలు అంచనాల్లో భారీ తేడాలుండడం ప్రజల్లో ఆలోచన రేకెత్తించింది. ఇలాంటి వ్యత్యాసాలే ఇప్పుడు ముందస్తు సర్వే ఫలితాలపై జనంలో విశ్వాసాన్ని కోల్పోయేట్టుగా చేశాయి. దీంతో ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వెలువడ్డా ఆఖరి ఈవీఎం తెరిచి ఫలితాలు ప్రకటించే వరకు కూడా ప్రజలు గెలుపోటముల్ని నిర్ధారించేందుకు సిద్దంగా కనిపించడం లేదు.

Advertisements

Latest Articles

Most Read