రాష్ట్ర జీవనాడి, 70 ఏళ్ళ ప్రజల కల అయిన పోలవరం ప్రాజెక్ట్ పై కూడా, జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పంచాయతీ చేస్తున్నారని, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. నవయుగ కంపెనీని పోలవరం ప్రాజెక్ట్ నుంచి తప్పించటం పై, ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి, చివరకు పోలవరం ప్రాజెక్ట్ పై కూడా పోలవరం పంచాయతీ చేస్తున్నారని మండి పడ్డారు. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాలు విషయంలో ఇలాగే కాంట్రాక్టర్ లను బెదిరించారని, వారికి డబ్బులు ఇవ్వకుండా, కరెంట్ తీసుకోకుండా భయపెట్టి, వారిని లొంగదీసుకోవాలని చూసారని, చివరకు వారు హైకోర్ట్ కు వెళ్ళాల్సిన పని వచ్చిందని అన్నారు. అమరావతి విషయంలో కూడా ఇలాగే కాంట్రాక్టర్ లను భయపెట్టి వెళ్ళగోట్టారని దేవినేని ఉమా అన్నారు.

polavaram 03082019 2

ఇప్పుడు పోలవరం పై కూడా ఇలాగే చేస్తున్నారని, నవయుగ కంపెనీకి, ప్రభుత్వం రాసిన లేఖ బయట పెట్టి, ఇది పులివెందుల పంచాయతీ కాదా అని ప్రశ్నించారు. తమకు ఇష్టం లేకపోతె ఆ కంపనీని వేధించటం, బెదిరించటం, లొంగదీసుకోవటం, కుదరకపోతే బయట తోసేయటం చేసి, ప్రతి విషయంలో పులివెందుల పంచాయతీ చేస్తున్నారని, దేవినేని ఉమా అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన మనుషులకు కట్టబెట్టేందుకే ఉన్నట్టు ఉంది, జగన్ ప్రభుత్వం మట్టి పనులను ఆపేసిందని ఆరోపించారు. నవయుగకి రాసిన లెటర్ చూపిస్తూ, 15 రోజుల్లో అకౌంట్ సెటిల్‌ చేసుకోవాలని, లేకపోతె వెళ్లిపోవాలి అంటూ బెదిరిస్తూ జగన్ పంచాయితీ చేశారన్నారు. ఇది రాష్ట్రం అనుకున్నారా, పులివెందుల పంచాయతీ అనుకున్నారా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెట్టారు.

polavaram 03082019 3

పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిపోయింది అంటూ జగన్ ప్రభుత్వంలోని పెద్దలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ అంతా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేతిలో, కేంద్రం పర్యవేక్షణలో ఉంది అనే విషయం మర్చిపోయారని అన్నారు. అప్పట్లో పనులు ఆలస్యం అవుతున్నాయని, చంద్రబాబు గడ్కరీ దగ్గరకు వెళ్లి అన్నీ చెప్తే, అదే రేట్ కు పనులు చేస్తే, ఎవరైతే ఏంటి అని గడ్కరీ అన్నారని, తరువాతే ట్రాన్స్ ట్రాయ్ నుంచి నిబంధనలకు అనుగుణంగా నవయుగకు పనులు అప్పగించామని దేవినేని ఉమా అన్నారు. పోలవరం పవర్ ప్లాంట్ పై జగన మోహన్ రెడ్డికి, 10 ఏళ్ళ నుంచి కన్ను ఉందని, ఇప్పుడు దాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగానే, ఇవన్నీ చేస్తున్నారని, కాని ఇప్పుడు పోలవరం కేంద్రం చేతిలో ఉండనే విషయం మర్చిపోయారని దేవినేని ఉమా అన్నారు.

నవ్యాంధ్ర ప్రజల ఏడు దశాబ్దాల కల, జీవనాడి పోలవరం ప్రాజెక్టు మొన్నటి వరకు పరుగులు పెట్టింది. అటు చంద్రబాబు పర్యవేక్షణ, మరో పక్క నవయుగ స్పీడ్ చూసి, పోలవరం కల సాకారం అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ప్రభుత్వం మారటం, జగన్ ప్రభుత్వం రావటంతో, పోలవరం పై మళ్ళీ ఆందోళన మొదలైంది. నిన్న అనూహ్యంగా, నవయుగను పోలవరం ప్రాజెక్ట్ నుంచి తప్పుకోమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది. ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రాజెక్ట్ కావటంతో, ఈ విషయం పై కేంద్రం ఎలా స్పందిస్తుందా అని అందరూ అనుకున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం, పోలవరం ప్రాజెక్ట్ నుంచి నవయుగను తప్పించే విషయం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారని, కేంద్రం ఒప్పుకుంది అంటూ ప్రచారం చేసారు.

center 02082019 2

ఈ నేపధ్యంలో పోలవరం టెండర్లు రద్దు చెయ్యటం పై కేంద్రం స్పందించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ పోలవరం టెండర్లను, ఏపి ప్రభుత్వం రద్దు చెయ్యటం పై ఎంతో ఆవేదనతో స్పందించారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఏపి ప్రభుత్వం రద్దు చెయ్యటం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. ఈ రోజు పార్లమెంట్ లో, గుంటూరు ఎంపీ, తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు, సమాధానం చెప్పారు కేంద్రం మంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న ఈ చర్యలో, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, పోలవరం ప్రాజెక్ట్ కి మరో కొత్త అవరోధం వచ్చినట్టు అయ్యిందని కేంద్ర మంత్రి అన్నారు.

center 02082019 3

ఉన్న టెండర్ ను రద్దు చేసి, మళ్ళీ కొత్త టెండర్ పిలిచి, ప్రాజెక్ట్ పనులు మొదలు పెడితే, ఇక ఇది ఎప్పటికి అవుతుందో చెప్పలేమని అన్నారు. మళ్ళీ టెండర్లు పిలవటం వల్ల, ఖర్చు బాగా పెరుగుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడూ పూర్తవుతుంది అని అందరూ కేంద్రాన్ని అడుగుతున్నారని, కాని పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర పరిధిలోనిది అని చెప్పారు. లోక్‌సభలో డ్యామ్‌ సేఫ్టీపై చర్చ సందర్భంగా షెకావత్‌ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే కేంద్ర మంత్రి ప్రకటన పై ఇప్పుడు చర్చ జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ ఇలాగే సాగదీస్తే కేంద్రానికి కూడా కలిసి వచ్చే అంశం అని, కేంద్రానికి కూడా డబ్బులు ఇచ్చే బాధ తప్పుతుందని అంటున్నారు. అలాగే, మరో ఆలోచన ప్రకారం, ఏపిలో బలపడాలి అనుకుంటున్న కేంద్రం, పోలవరం ప్రాజెక్ట్ ని తానే తీసుకుని, పనులు వేగవంతం చేస్తుందా అనే వాదన కూడా వస్తుంది. అయితే ఏది జరిగినా, ముందు ప్రాజెక్ట్ అయితే చాలు అని ఏపి ప్రజలు కోరుకుంటున్నారు.

కొరియాకు చెందిన కార్ల కంపెనీ కియా, మన దేశంలో పెట్టుబడి పెడుతుంది అనగానే, ఎన్నో పెద్ద రాష్ట్రాలు, కియాని తమ రాష్ట్రానికి తీసుకు రావటానికి విశ్వ ప్రయత్నాలు చేసాయి. అందులో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా కియాని తమ రాష్ట్రానికి తీసుకు రావటానికి పోటీ పడ్డాయి. అయితే, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించిన చొరవ, ఇచ్చిన ఇన్సెంటివ్స్ తో, కియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఇది దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి. కియాతో పాటు, ఎన్నో అనుభంద సంస్థలు కూడా అనంతపురం వచ్చాయి. అయితే మొన్న అసెంబ్లీలో బుగ్గన గారు ఒక లెటర్ చూపించి, హైలీ respected రెడ్డి సర్ నేమ్, జగన్ గారికి అంటూ, కియా ప్రెసిడెంట్ ఉత్తరం రాసారని, 2007లో అప్పట్లో వైఎస్ఆర్ పెట్టుబడి పెట్టమని అడిగారని, అందుకే ఏపిలో పెట్టుబడి పెట్టారని చెప్పిన సంగతి తెలిసిందే.

kia 02082019 2

అయితే ఇంత గొప్పగా వైసీపీ నాయకులు, కియా మా వైఎస్ఆర్ వల్లే వచ్చింది, అని చెప్పుకుంటుంటే, అక్కడ ఉన్న వైసీపీ నాయకులు మాత్రం, కియాలో పని చేస్తున్న వారిని బెదిరిస్తున్నారు. మూడు రోజుల క్రితం చెన్నేకొత్తపల్లిలో జరిగిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సదాశివం అనే వ్యక్తి, కియ మోటార్స్‌లో జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సదాశివం చెన్నేకొత్తపల్లిలోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ, కియాలో నరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఒక రోజు, వైసీపీ మండల కన్వీనర్‌ మైలారపు గోవిందరెడ్డి, బసంపల్లి మాజీ సర్పంచు డోలా రామచంద్రరెడ్డి, సదాశివం ఇంటికి వచ్చారు. మేము అడిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, అంటూ సదాశివంని బెదిరించారు.

kia 02082019 3

మీరు లక్షలు లక్షలు సంపాదిస్తుంటే, మేము ఇక్కడ చూస్తూ కూర్చుంటామా, మేము చెప్పినట్టు మీరు వినాలి, మా వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే, మేము వేరే విధంగా మాట్లాడాల్సి ఉంటుంది అంటూ, బెదిరించారు. అయితే, ఏమి చెయ్యాలో అర్ధం కాని సదాశివం, భయం వేసి, వారిని సముదాయించి తన ఇంటి నుంచి పంపించివేసారు. తరువాత, వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ సత్యఏసుబాబుకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఆయనకు, గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మరొక నాయకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిద్దరి పై సీకేపల్లి పోలీసు స్టేషన్‌లో 506 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేసారు. అయితే, ఇంత పెద్ద పరిశ్రమ వస్తే, ఇలా రాజకీయ బెదిరింపులకు పాల్పడటం ఏంటని జిల్లా వాసులు అంటున్నారు.

అధికార పార్టీలో ఉంటే, ఎక్కడ లేని హోదా వచ్చేసింది. ఎక్కడి లేని పవర్స్ అన్నీ మాకే ఉన్నాయని అనుకుంటున్నారు. తాము సామాన్య ప్రజలం కాదని, అతీత శక్తులం అనుకుంటున్నారు. అందుకే అధికార దర్పం చూపిస్తూ, అధికారుల పై కూడా జులం చూపిస్తారు. ఆ అధికారి ఎంతో ఉన్నతమైన పోస్ట్ అయిన ఐఏఎస్ అయినా లెక్క చెయ్యని, రాజకీయ నాయకులను మనం చూస్తూనే ఉంటాం. అయితే అధికారులు మాత్రం, చాలా వరకు తమాయించుకుంటారు. అవతల నాయకుడు ఎలాంటి వాడు అయినా, వీళ్ళు ఐఏఎస్ లు అయినా, ఆ నాయకుడుకి గౌరవం ఇవ్వాల్సిందే. ఎంత తిట్టినా పడే వాళ్ళు ఉంటారు. కాని కొంత మంది అధికారులు మాత్రం ఆత్మాభిమానం చంపుకోరు. తమ పదవి కంటే, విధులు పర్ఫెక్ట్ గా నిర్వహించటం వారికి ముఖ్యం.

vinukonda 02082019 2

ఇలాంటి సంఘటనే, గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో జరిగింది. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బొల్లాపల్లి మండల తహసీల్దార్ అదిరిపోయే షాక్ ఇచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించారు. ఎమ్మెల్యే, త‌హ‌సీల్దార్ మధ్య గొడవ పెరగటంతో, జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని, సమస్యని పరిష్కరించాల్సి వచ్చింది. శుక్రవారం బొల్లాపల్లి మండలంలో ఎమ్మెల్యే అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల సర్వే నెంబర్లు ఆన్‌లైన్‌లో ఎందుకు నమోదు చెయ్యలేదు, ఎందుకు ఆలస్యం అయ్యింది అంటూ, అక్కడే ఉన్న రెవెన్యూ అధికారుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

vinukonda 02082019 3

రైతులకు న్యాయం చేయలేని ఉద్యోగాలు ఎందుకు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. అధికారులు సరిగ్గా పని చేయకపోతే ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ సమస్య ఎందుకు ఆలస్యం అయ్యిందో చెప్పాలి అంటూ, తహసీల్దార్‌ బాలకృష్ణను నిలదీసారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే మాటలకు అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు తహసీల్దార్‌ బాలకృష్ణ. నేను ఇక్కడకు బదిలీ పై వచ్చి 10 రోజులే అయింది, ఇప్పటివరకు తన వద్ద ఏది పెండింగ్‌లో లేదు అంటూ సమాధానం ఇచ్చారు. నా నిబద్ధత, నిజాయతీ చూసి కలెక్టర్‌ ఏరికోరి బొల్లాపల్లికి బదిలీ చేశారని, మీకు నేను ఇక్క‌డ ప‌ని చేయ‌టం ఇష్టం లేక‌పోతే వెళ్ళిపోతానని చెప్పారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మిమ్మల్ని వెళ్లమని చెప్పడం లేదు, సమస్య పరిష్కరిం చెయ్యండి అంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో తహసీల్దార్‌, ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగటంతో, జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ జోక్యం చేసుకొని వివాదం పెద్దది అవకుండా చూసారు. అయితే ఎమ్మెల్యే మాత్రం, ఈ విషయాన్ని, ప్రభుత్వ పెద్దల దగ్గరే తేల్చుకుంటా అని చెప్పినట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read