తెలుగుదేశం పార్టీ నేత, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. మండు వేసవిలో ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన ఆయన వడదెబ్బకు గురయ్యారు. తన నియోజకవర్గంలో చేనేత కుటుంబాలను కలిసి మాట్లాడుతున్న పయ్యావుల ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. ఇది గమనించిన స్థానికులు పయ్యావులను సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిన కేశవ్ ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి విప్ గా ఎదిగారు. ప్రస్తుతం మరోసారి అసెంబ్లీ బరిలో దిగిన ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి నుంచి పయ్యావులకు గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు.

keshav 26032019 3

1994 నుండీ ఉరవకొండలో పయ్యావుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అప్పటి నుండి జరిగిన ఐదు ఎన్నికలలో ఆయన మూడు సార్లు గెలుపొందారు. 1994, 2004, 2009 ఎన్నికలలో కేశవ్ గెలిచారు. కేశవ్ గెలిచిన మూడు సార్లు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే ఉండటం విశేషం. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014లో ఆయన గెలవలేదు. దీనితో ఆయన పెద్దగా అధికారం అనుభవించింది లేదు. 2004 నుండి వై. విశ్వేశ్వరరావు పైనే పోటీ చేస్తున్నారు.

keshav 26032019 3

వై. విశ్వేశ్వరరావు 2004 లో వామపక్ష పార్టీ తరపున, 2009లో కాంగ్రెస్ తరపున, 2014లో వైకాపా తరపున పోటీ చేసారు. వై. విశ్వేశ్వరరావు పై నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నా కేశవ్ పై పెద్ద అనుకూలమైన పరిస్థితిలు కూడా లేవని అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వివిధ సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తాయని కేశవ్ భావిస్తున్నారు. డబ్బు కీలక పాత్ర పోషించే ఈ ఎన్నికలలో కేశవ్ వద్ద దానికి లోటు లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఈ సారి ఆశాజనకంగానే ఉన్నారు.

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండగా అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతూ రాజకీయ వేడెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి ఆస్పత్రిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. ఉగ్రనరసింహారెడ్డికి చెందిన అమరావతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గుంటూరులోని ఉగ్రనరసింహారెడ్డి ఆస్పత్రిలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తున్నారని ఇఫ్పటికే ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ దాడులు జరపడంలో అధికారులు రెండు ప్లాన్లను అనుసరించారని తెలుస్తోంది.

guntur 26032019

టీడీపీ నేతలపై పగ పట్టినట్టుగా ఒకేసారి అనేక మంది పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. అది రాజకీయంగా టీడీపీ ని బలహీన పరచడానికే ఇలాంటి సమయంలో అస్త్రం అవుతుందని చెప్పవచ్చు. రెండు రోజుల క్రితం కూడా మంత్రి నారయణ పై దాడులు జరిగాయి. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో ఇబ్బంది పడకుండా టీడీపీ… ఇలాంటి దాడుల విషయాన్ని ముందుగానే ఊహించింది. కర్ణాటక, తెలంగాణా ఎన్నికల సందర్భంగా ప్రత్యర్ధి వర్గాలపై జరిగిన ఐటీ దాడులను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్దులందరినీ ఈ సందర్భంగా అప్రమత్తం చేసింది. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే ఐటీ దాడులు జరుగుతాయని తెలిసిపోయింది. అప్పట్లో కొంత మంది టీడీపీ ముఖ్య నేతలపై దాడులు చేశారు.

guntur 26032019

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, నువ్వా నేనా అనే రీతిలో పోరాడుతున్న నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్దులను గుర్తించి వారిపై దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల నైతిక స్థైర్యం దెబ్బతీయవచ్చని, అత్యంత విలువైన ప్రచార సమయంలో రెండు, మూడు రోజుల పాటు అభ్యర్ది దాడుల కారణంగా ఐటీ అధికారుల ఎదుట కూర్చోవాల్సి వస్తుందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల ఆర్ధికపరమైన చికాకులతో పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా నైతికంగా దెబ్బ తింటుందని, ఇటువంటి లక్ష్యాలను సాధించడం కోసమే ఐటీ దాడులను చేయించేందుకు తెకగబడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి రామమందిరం గుర్తొస్తుందని, ఐదేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా మంగళవారం కడప ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు మనకు బుర్ర లేదనుకుంటున్నారా? వాళ్లు ఏం చెబితే అది నమ్ముతాం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆఖరికి తీవ్రవాదాన్ని, దేశభద్రతనూ రాజకీయం చేస్తున్నారని ఫరూక్‌ అబ్దుల్లా మండిపడ్డారు. తమది సరిహద్దు రాష్ట్రమని, పాకిస్తానేంటో..తీవ్రవాదమేంటో..తమకు తెలుసునని అన్నారు. రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకోవడం చాలా దుర్మార్గమని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు.

farook 26032019

తనను ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్‌‌కు రూ.1500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చెప్పారని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. ఆనాడు జగన్‌ తనకు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందని ఆయన అన్నారు. డబ్బులతో ఏదైనా జరుగుతుందని జగన్‌ అనుకుంటారని, జగన్‌కు అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్‌ గురించి, రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడని ఆయన కొనియాడారు. ఈ ఇద్దరికి ఉన్న తేడా తనకు స్పష్టంగా తెలుస్తోందని, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అద్బుతమైన కార్యక్రమాలు తీసుకువచ్చారని, అన్ని వర్గాలవారికి, మహిళల కోసం, యువత కోసం, వ్యవసాయదారుల కోసం అనేక కార్యక్రమాలు చేశారని కొనియాడారు.

farook 26032019

నదుల అనుసంధానం వంటి విధానాలు చాలా అద్భుతమని ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. మనం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఏం తింటున్నా.. మనం భారతీయులమని అన్నారు. దేశమంతా ఒక్కటేనని.. కానీ ప్రాంతాల వారీగా..మతాలవారీగా.. రాజకీయాలు చేయాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు. అలాంటి వారిని తిప్పికొట్టాలని ఫరూక్‌ అబ్దుల్లా పిలుపు ఇచ్చారు. స్వతంత్ర పోరాటంలో హిందువులు, ముస్లింలు, సిక్కులంతా ఏకమై నడిచారని, కులం, మతం ప్రస్తావన అప్పుడు రాలేదని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. ఇప్పుడూ అంతేనని దేశం కోసం అందరూ ఏకమై.. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పుడు రోజులు మారిపోయాయని, ఎవరు ముస్లింలు, ఎవరు దళితులంటూ.. మతాల వారీగా రాజకీయాలు నడుపుతున్నారని ఫరూక్‌ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత ఎండలో కూడా ఇంతమంది జనం వచ్చారంటే... ఎన్నికల్లోతీర్పు ఎలా ఉండబోతోందో తనకు అర్థమవుతోందన్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు, అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. ఇంత ఎండలో కూడా ఇంతమంది జనం వచ్చారంటే... ఎన్నికల్లోతీర్పు ఎలా ఉండబోతోందో తనకు అర్థమవుతోందన్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు, అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు.

ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో దాఖలు చేసిన నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నారా లోకేశ్ నామినేషన్‌పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేశ్ గుంటూరు జిల్లా పరిధిలో నివాసం ఉంటూ కృష్ణా జిల్లా నోటరీ చేత నోటరీ చేయించారని ఆయన ఆరోపించారు. నోటరీ రూల్స్ 1956, 8,8ఏ మరియు 9 ప్రకారం నామినేషన్ ఫారమ్ 26 చెల్లదని ఆళ్ల పేర్కొన్నారు. అయితే, సరైన పత్రాలు సమర్పించేందుకు నారా లోకేశ్ కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి 24 గంటలు గడువు ఇచ్చారు. లోకేశ్‌ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైకాపా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ స్థానంలో బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

lokesh 26032019

ఇక, చిత్తూరు జిల్లా పీలేరు వైసీపీ వర్గీయుల్లో టెన్షన్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ ఇంకా పెండింగ్ లో ఉండటమే దానికి కారణం. నామినేషన్ పత్రాలతో పాట నో డ్యూస్ సర్టిఫికెట్లను ఇవ్వని కారణంగా నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి పెండింగ్ లో ఉంచారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నో డ్యూస్ సర్టిఫికెట్స్ పై ప్రత్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్నికల అధికారికి తాను వివరణ ఇచ్చానని... తన సమాధానంపై ఎన్నికల అధికారి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.

lokesh 26032019

మరో పక్క, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. టీడీపీ నేత జలీల్ ఖాన్ కుమార్తె, టీడీపీ అభ్యర్థి షబానా ఖాతూన్ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. షబానాకు అమెరికా పౌరసత్వం ఉన్న కారణంగా ఆమె నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే షబానాకు ఎలాంటి విదేశీ పౌరసత్వం లేదని... రిటర్నింగ్ అధికారి రాజేశ్వరి తెలిపారు. షబానా నామినేషన్ ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా, ఇప్పుడు ఎన్నికల కంటే ముందే, ఎవరి నామినేషన్ చెల్లుతుంది, ఎవరిది చెల్లదు అనేది సస్పెన్స్ గా మారింది.

Advertisements

Latest Articles

Most Read