తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వైద్యపథకాల పేర్లు తొలగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ వైద్యసేవ పేరును వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీగా సాక్ష్యాత్తు సీఎం జగన్మోహన్‌రెడ్డే ప్రకటించారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరుమీద నడుస్తున్న వైద్యపథకాల పేర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రన్న సంచార చికిత్స, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ తదితర పథకాల పేర్ల మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. ఆ పథకాలకు ఎక్కడా ఆ పేర్లు ఉండకూడదని, తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. ఇదిలా ఉండగా రక్తపరీక్షల నిర్వహణ బాధ్యతలను మెడాల్‌ సంస్థకు గత టీడీపీ ప్రభుత్వం అప్పగించింది. ఈ సంస్థ 2016 నుంచి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీల నుంచి రక్తనమూనాలు స్వీకరించి పరీక్షలు నిర్వహించేవారు.

health 07062019

ఇందుకోసం ఒక్కో పరీక్షకు ఇంతమేర ధర నిర్ణయించి ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లించేది. ఈ రక్తపరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని బోగస్‌ నమూనాలు, పరీక్షలు చూపించి దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారముండడంతో మెడాల్‌ సంస్థ యధాతథంగా కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో మెడాల్‌ను రద్దుచే యడానికి అడుగులు వేస్తోంది. మెడాల్‌ పేరుకూడా ఎక్కడా కనిపించకూడదని జిల్లా వైద్యశాఖకు రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వైద్యపథకాల పేర్లను తొలగించే పనిలో జిల్లా వైద్యశాఖ నిమగ్నమైంది.

 

గవర్నర్ నరసింహన్‌తో జగన్ శుక్రవారం సమావేశమయ్యారు. శనివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి పేర్లను గవర్నర్‌కు ముఖ్యమంత్రి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో 20 మంది మంత్రులు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. శుక్రవారం జరిగిన వైసీపీఎల్పీ సమావేశంలో వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. కాగా ఇప్పటికీ ఆ 25 మంది మంత్రులు ఎవరు..? మంత్రులుగా అవకాశం ఎవరికి దక్కింది..? అనే విషయంలో వైసీపీ అధిష్టానం ఎక్కడా లీకులు కాకుండా చూసుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ మంత్రులుగా ఖరారైన వారికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కొక్కరికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు.

gavarnar 07062019

శనివారం ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా చెబుతున్నారు. రేపు ఉదయం 11.49 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ ఏర్పాట్లను పోలీస్‌ ఉన్నతాధికారులు పరిశీలించారు. కాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. సెక్రటేరియట్‌ మొదటి బ్లాక్‌లో జగన్‌ కార్యాలయం ఉంది. శనివారం రోజు ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సచివాలయం ఆవరణలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కాసేపట్లో మంత్రుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.

gavarnar 07062019

రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కనుందో దాదాపు ఖాయమైంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సీఎం జగన్‌.. ఏ అంశాల ప్రాతిపదికన మంత్రులను నియమిస్తున్నది పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఒకే సారి 25 మందితో పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. మంత్రివర్గంలోకి తీసుకునే వారికి ఇప్పటికే వైకాపా అధిష్ఠానం నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం అందుతోంది. దాదాపు ఖరారైన మంత్రుల పేర్లు ఇవే.. ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం), బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు), బొత్స సత్యనారాయణ (విజయనగరం), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు), మేకతోటి సుచరిత (గుంటూరు), మేకపాటి గౌతంరెడ్డి (నెల్లూరు), కొడాలి నాని (కృష్ణా జిల్లా), కొలుసు పార్థసారధి ( కృష్ణా జిల్లా)

వైసీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సుమారు రెండు గంటలపాటు జరిగిన వైసీపీఎల్పీ సమావేశం ముగిసింది. శుక్రవారం ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రారంభమై 12 గంటలకు సమావేశం ముగిసింది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి 151 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక ప్రకటనలు.. ముఖ్యంగా ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా ఒకరిద్దరు కాదు ఏకంగా.. ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు జగన్ తేల్చిచెప్పారు. అంతేకాదు పార్టీలో తమకు మంత్రి పదవులు దక్కలేదని ఎవరూ అసంతృప్తికి లోనుకాకుండా ఉండేందుకు గాను.. రెండున్నరేళ్ల తర్వాత 90శాతం మంత్రులను మారుస్తామని జగన్‌ సంచలన ప్రకటన చేశారు.

deputy 07062019

ఇప్పుడు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారికి అప్పుడు కేటాయిస్తామని జగన్ చెప్పకనే చెప్పేశారన్న మాట. అయితే వీరిలో కొత్తవారు కూడా ఉంటారని జగన్ ప్రకటించేశారు. కాగా.. శనివారం ఈ 20 మంది మంత్రులతో పాటు.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్మోహన్‌రెడ్డి మంత్రి వర్గ ఏర్పాటు విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించనున్నట్లు జగన్ స్పష్టం చేశారు. ఈ ఐదుగురు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉంటారని కూడా జగన్ ప్రకటించడంతో వాళ్లెవరనే చర్చ జోరందుకుంది. అయితే.. ప్రస్తుతం మీడియా వర్గాల్లో ఐదుగురి పేర్లు తెరపైకొచ్చాయి.

deputy 07062019

కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి అవకాశం కల్పించి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక మైనార్టీ కోటాలో కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఎస్సీ కేటగిరిలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు, ఎస్టీ నుంచి విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకు, బీసీ సామాజిక వర్గం నుంచి కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి గెలుపొందిన కొలుసు పార్థసారధికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం దక్కి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరో పక్క, సియం కార్యాలయం నుంచి మొదటి ఫోన్ వెళ్ళింది. సీఎం పేషీ నుంచి కొరముట్ల శ్రీనివాసులుకు విజ యవాడ రావాలని ఆహ్వానం అందడంతో రైల్వేకోడూరు వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున బాణా సంచాకాల్చి స్వీట్లు పంచుకున్న నేతలు, కార్యకర్తలు.

 

ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రిగా మహిళా ఎమ్మెల్యేను నియమించాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన వైఎస్ జగన్.. తాజాగా హోం మంత్రిగా మహిళను నియమించారని తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు..? హోం శాఖ బాధ్యతలు స్వీకరించే అదృష్టవంతురాలు ఎవరు..? అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మొత్తం 09 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో చాలా వరకు సీనియర్లు ఉండగా.. జూనియర్లు మాత్రం తక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే రోజా పేరు దాదాపు ఖరారు అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడనుందని సమాచారం.

phone 07062019

ఇదిలా ఉంటే.. ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడిన రోజా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేయడంతో కచ్చితంగా హోంశాఖ ఆమెనే వరించిందని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటున్నారు. మరో పక్క, జగన్ ఆదేశాల మేరకు మంత్రులుగా ఖరారైన వారికి వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినట్లు తెలిసింది. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, మేకతోటి సుచరితలకు ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ నలుగురికీ శనివారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావాలని విజయసాయి చెప్పినట్లు తెలిసింది. వీరితో పాటు ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్‌, బుగ్గన, కొడాలి నాని, పార్థసారధికి ఫోన్లు చేసి రేపు (శనివారం) మంత్రులుగా ప్రమాణం చేయడానికి రవాల్సిందిగా చెప్పారు.

phone 07062019

ఇంకా 17 మందికి విజయసాయిరెడ్డి ఫోన్ చేయనున్నారు. మొత్తం 25 మందితో జగన్ కేబినెట్ ఏర్పాటు కానుంది. వీరిలో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. అయితే. వారు ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మంత్రుల శాఖలపై కూడా శుక్రవారం రాత్రికి గానీ, శనివారం ఉదయానికి గానీ స్పష్టత వచ్చే అవకాశముంది. మొత్తం 25 మందితో జగన్ కేబినెట్ ఏర్పాటు కానుంది. వీరిలో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. అయితే.. వీరు ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మంత్రుల శాఖలపై కూడా శుక్రవారం రాత్రికి గానీ, శనివారం ఉదయానికి గానీ స్పష్టత వచ్చే అవకాశముంది. జగన్ ఎవరెవరికి ఏ శాఖ అప్పగించాలనే అంశంపై కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisements

Latest Articles

Most Read