నారాలోకేశ్ పర్యటనను అడ్డుకోవడానకి, ఆయనపై దాడికి యత్నించడానికి పిచ్చి,పిచ్చి కారణాలుచెప్పిన జగన్ ప్రభుత్వం, అందుకు పురుషోత్తమపట్నం రైతులను సాకుగా చూపిందని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ మండిపడ్డారు. బుధవారం ఆయన టీడీపీనేత వరుపులరాజాతో కలిసి మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతప్రభుత్వం ఎక్కడాకూడా బలవంతపు భూసేకరణ జరపలేదని, నిజంగా అలాచేసుంటే, 330మంది రైతులుంటే, 255మందికి, ఒక్కొక్కరికీ రూ.28లక్షలచొప్పున చెల్లించడం జరిగిందని, మిగిలినవారంతా కోర్టుకు వెళ్లారని వెంకటేశ్ స్పష్టంచేశారు. ఆనాడు కోర్టుకివెళ్లినవారికి రూ.35లక్షలచొప్పున చెల్లిస్తామని వైసీపీనేతలు హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పటికీ అమలుచేయలేదన్నారు. లోకేశ్ పై దాడికి యత్నించినవారెవరూ రైతులుకారని, వారి ముసుగులో ఉన్న వైసీపీకార్యకర్తలే ఆపని చేశారన్నారు. లోకేశ్ యాత్రకు ముందు వైసీపీ మండల అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ, తాము యాత్రను అడ్డుకుంటామని కూడా చెప్పాడన్నారు. టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకోకుండా చూడాలని పోలీస్ వారిని కోరామని, అయినాకూడా వైసీపీ మూకలు టీడీపీ శ్రేణులపై, ఆపార్టీ జాతీయప్రధాన కార్యదర్శిపై దాడికి యత్నించారని వెంకటేశ్ చెప్పారు.
జగన్మోహన్ రెడ్డికి ధీటైన ప్రత్యర్థిగా లోకేశ్ ఎదుగుతున్నాడన్న భావన వైసీపీలో నానాటికీ పెరిగిపోతోందని, అందులోభాగంగానే లోకేశ్ లక్ష్యంగా ప్రభుత్వం దాడులు చేయిస్తోందన్నారు. లోకేశ్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించి తీరుతుందన్నభయాందోళనకూడా వైసీపీవారిలో ఉందని, ఆ భయంతోనే టీడీపీ యువనేతను వారు లక్ష్యంగా ఎంచుకున్నారని పెందుర్తి స్పష్టంచేశారు. స్థానిక (రాజానగరం) శాసనసభ్యుడికి, ఆయన కుటుంబానికి ఉన్న నేరచరిత్ర కూడా లోకేశ్ పై దాడికి ఒక కారణమన్నారు. లోకేశ్ యాత్రను ముగించుకొని తిరిగొచ్చే సమయంలో దారికి అడ్డంగా లారీలుపెట్టి, పోలీసులే ఆయన వాహనాలను దారి మళ్లించారు తప్ప, తమకు తాముగా వేరేదారిలో వెళ్లలేదన్నారు. ప్రభుత్వం తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే, దాడులకు పాల్పడుతోందన్నారు. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పురావృతమైతే, టీడీపీనేతలు, కార్యకర్తలుచూస్తూ ఊరుకోరని వెంకటేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజానగరం నియోజకవర్గం గతచరిత్ర చూస్తే, ఏనాడు అటువంటి దాడులు జరగలేదని, ఇప్పుడొచ్చిన కబ్జాకోరు, రౌడీ ఎమ్మెల్యే కారణంగానే అవన్నీ జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గం ప్రజలు లోకేశ్ పర్యటనను ప్రేమాభిమానాలతో ఆదరించారని, అదిచూసి ఓర్వలేని వైసీపీమూకలు ఆయన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి యత్నించాయని టీడీపీనేత రాజా స్పష్టంచేశారు. పురుషోత్తమపట్నం భూముల విషయంలో గత ప్రభుత్వం ఒక్కరైతుకి కూడా అన్యాయం చేయలేదన్నారు. వైసీపీకార్యకర్తలే రైతుల అవతారమెత్తి, లోకేశ్ పర్యటనను అడ్డగించారని, అంతజరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు.
మాకున్న ప్రజాబలం చూసి చివరకు వైసీపీకార్యకర్తలే వెనక్కు తగ్గారని, లోకేశ్ పర్యటన తూర్పుగోదావరి జిల్లా టీడీపీశ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందన్నారు. లోకేశ్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని, పోలీసులు ఎవరూకూడా సక్రమంగా తమ విధులు నిర్వర్తించలేదన్నారు. దాడులద్వారా లబ్దిపొందాలన్న ప్రయత్నాలను వైసీపీప్రభుత్వం మానుకోవాలని, లేకపోతే ప్రజలే వారిని ప్రతిఘటిస్తారని రాజా హెచ్చరించారు. త్వరలోనే ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబునాయుడి పర్యటన ఉంటుందని, ఆ సమయంలో వైసీపీకార్యకర్తలు, కిరాయిమూకలు తోకజాడించాలనిచూస్తే, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు ఆతోకలు కత్తిరిస్తారన్నారు. లోకేశ్ పర్యటనలో విలేకరులను కూడా కొట్టారని, వైసీపీమూకల దౌర్జన్యకాండను చిత్రీకరిస్తున్నారన్నఅక్కసుతోనే వారిపై కూడా దాడిచేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో, ఆయన ఆదేశాలప్రకారమే సీతానగరంలో లోకేశ్ పై దాడికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే కుటుంబానికి ఎప్పటినుంచో రౌడీ కుటుంబమని పేరుందని, ఆపేరు ఇప్పుడు మరింత ఎక్కువైందన్నారు.
భవిష్యత్ లో నారాలోకేశ్ మరోమారు తూర్పుగోదావరిలో పర్యటిస్తారని, అప్పుడు కూడా ఇదేవిధంగా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తే, టీడీపీ కార్యకర్తలు తగినవిధంగా శాస్తి చేస్తారన్నారు. టీడీపీ ప్రభుత్వం పురుషోత్తమపట్నం రైతులకు సంపూర్ణ న్యాయం చేసిందని, వైసీపీ కార్యకర్తలైన రైతులకు కూడా రూ.28లక్షల చొప్పునపరిహారాన్ని అందచేసిందని రాజా వివరించారు. చంద్రబాబుకు, లోకేశ్ కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు వారిపై దాడికి పాల్పడుతున్నారన్నారు. లోకేశ్ పై జరిగిన దాడికి సంబంధించి, స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశామని, వారేం చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే మీడియాపై కూడా దాడులు చేస్తున్నారని, జగన్ ప్రభుత్వ దుశ్చర్యలను, దుర్మార్గాలను సమర్థించడం మీడియా కూడా మానుకోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి తమను ఆదరిస్తాడు.. బాగా చూసుకుంటాడన్న దురాలోచనతోనే వైసీపీ నేతలు ప్రతిపక్షనేతపై, ఆయన కుమారుడిపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.