మొన్నటి వరకు ఒక పధ్ధతి ప్రకారం, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, తెలుగుదేశం పార్టీకి దూరం చెయ్యటంలో వైసీపీ పార్టీ, సోషల్ ఇంజనీరింగ్ లో పర్ఫెక్ట్ గా పని చేసింది. ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం, కార్పొరేషన్ పెట్టి బ్రాహ్మణులను ఆదుకున్నా, ఓట్లు పడలేదు. అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు, మీ పార్టీ వాళ్ళు నా స్థలం ఆక్రమించారని రోడ్డు ఎక్కారు. మరి ఈ పేద బ్రాహ్మణుడుకి జగన్ న్యాయం చేస్తారా ? వివరాలు ఇలా ఉన్నాయి. ‘జగన్ గారూ మా స్థలాన్ని మీ పార్టీ నేత కబ్జా చేశారు’ అని ఒక ఫ్లెక్సీ పెట్టుకుని, ఒక పేద బ్రాహ్మణుడు, ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ పై పోరాడుతూ, జగన్ ని ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఎవరూ స్పందించలేదు. అదే నియోజక్వరంలో ఉండే తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మల్యే బొండా ఉమా ఈ విషయం పై ప్రభుత్వాన్ని నిలదీసినా, ఎవరూ పట్టించుకోలేదు.
ఆ ఫ్లెక్సీలో ఉన్న మాటలు ఇవి "మాతృదేవోభవ.. గౌరవనీయులైన జగన్ గారు, సీనియర్ సిటిజన్ అయిన మా అమ్మగారికి స్థలం తప్పుడు పత్రాలతో 43 క్రిమినల్ కేసులు ఉన్న మీ పార్టీ నాయకుడు, శ్రీ పూనూరు గౌతమ్‌రెడ్డి కబ్జా చేసి, అక్రమ కట్టడం (VMC Declared)నిర్మించి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ను నడుపుతూ, గత ఐదేళ్లగా మా కుటుంబమును భయబ్రాంతులకు గురిచేయుచున్నారు. మేము సాంప్రదాయ మరియు ఉన్నత విద్యను అభ్యసించిన బ్రాహ్మణ కుటుంబమునకు చెందినవారము. మేము ఏ రాజకీయ పార్టీకి చెందనివారము. స్థలముతో పాటూ మీ అపాయింట్మెంట్ ఇప్పించ ప్రార్థన. మీక సహస్ర వందనములతో.. ఉమా మహేశ్వర శాస్త్రి గండూరి’అంటూ ఆ ఫ్లెక్సీలో వేడుకున్నారు. అయితే ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఎవరూ దీని పై స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం, ఇది బాగా వైరల్ అవ్వటంతో, ప్రతి ఒక్కరు ఇది చూసి, మొన్నటి వరకు బ్రాహ్మణులకు మేమే న్యాయం చేస్తాం అన్న జగన్, ఇప్పుడు ఈ విషయం పై స్పందించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరుతున్నారు.