తాడేపల్లి జగన్ నివాసం దగ్గర, రోజు రోజుకీ ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అది ఒక ధర్నా చౌక్ లాగా మారిపోయింది. అన్ని వర్గాల ప్రజలు, వివిధ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జగన్ మీద ఆశ పెట్టుకుని, ఎదో చేస్తారని ఆశించి, ఏమి చెయ్యకపోవటంతో, జగన్ నివాసం దగ్గరకు వచ్చి, న్యాయం చెయ్యాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఒక రోజు కాదు, ప్రతి రోజు ఇదే తంతు కొనసాగుతుంది. ఈ రోజు మాత్రం మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో జగన్ నివాసం వద్ద పోలీసులను భారీగా మొహరించారు. రేషన్ డీలర్లు, జగన్ నివాసాన్ని ముట్టడిస్తాం అని చెప్పటంతో, పోలీసులు సెక్షన్ 30 అమలు చేసి, భద్రత కలిపిస్తున్నారు. ఒక పక్క రేషన్ డీలర్ల టెన్షన్ ఉంటూ ఉండగానే, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపధ్యంలో, గతంలో ఎప్పుడూ లేనంత టెన్షన్ జగన్ నివాసం వద్ద ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో దాదపుగా 29 వేల మంది రేషన్ డీలర్లు, తమ బ్రతుకు ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ రావటంతో, రేషన్ డీలర్ల పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వటం లేదు. దీంతో రేషన్ డీలర్లును తీసేస్తారు అనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే మా గురించి క్లారిటీ ఇవ్వండి అని రేషన్ డీలర్లు ఎన్ని సార్లు అడిగినా, ఎవరూ స్పందించటం లేదు. దీంతో వారు ఆందోళన బాట పట్టారు. వారధి వైపు నుంచి పెద్ద ఎత్తున రేషన్ డీలర్లు వస్తూ ఉండటంతో, పోలీసులు వారిని అక్కడే అడ్డుకుంటున్నారు. అక్కడ నుంచి వారిని వెనక్కు పంపిస్తున్నారు. మరో పక్క డ్వాక్రా మహిళలు, మాకు పసుపు కుంకుమ చెక్కులు రాలేదని , మా మోర ఆలకించాలని వస్తే, వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. మరో పక్క, కంప్యూటర్ ఆపరేట్ ఉద్యోగులు కూడా జగన్ నివాసం వద్ద ఆందోళన చేసారు. అయితే పోలీసులు ఎవరినీ లోపలకి పంపించటం లేదు.

నిన్న చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. తాడిపత్రిలో వైసీపీ నేతల చేతులో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా, ధర్మవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో మాట్లాడుతూ, ధర్మవరం నియోజకవర్గం పై కీలక ప్రకటన చేసారు. కొద్ది రోజుల క్రితం, ధర్మవరం నియోజకవర్గం టిడిపి బాధ్యతలు చూసే వరదాపురం సూరి, పార్టీ మారి, బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త ఇంచార్జ్ కోసం, కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతుంది. ఈ నేపధ్యంలో ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు, ధర్మవరం నియోజకవర్గం బాధ్యతలు, పరిటాల కుటుంబానికి అప్పచేప్తున్నాం అని, వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ప్రకటించారు. చంద్రబాబు అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ, రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల బాధ్యతలు పరిటాల కుటుంబానికే ఇస్తున్నట్టు ప్రకటించారు.

ఈ నియోజకవర్గ బాధ్యతలు పరిటాల సునీత చుసుకుంటుందో, పరిటాల శ్రీరామ్‌ తీసుకుంటారో, వారి నిర్ణయానికే వదిలేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. పరిటాల కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా, చంద్రబాబు సమక్షంలోనే, పరిటాల సునీత బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. మొన్నటి దాక ఇక్కడ ఉన్న ఒక నాయకుడు, ఇదే ధర్మవరంలో తమను రావటానికి, మాట్లాడటానికి కూడా అవకాశమివ్వలేదని, ఇప్పుడే అదే మనిషి పార్టీని విడిచిపెట్టి వెళ్లాడన్నారు. ఎవరూ ఉన్నా లేకపోయినా, పరవాలేదని, కొందరు వస్తుంటారు, పోతుంటారని, వారి గురించి పట్టించుకోనవసరం లేదని, పార్టీ ముఖ్యమని అన్నారు. చంద్రబాబు గారి మాటే మాకు వేదం అని, చంద్రబాబు గారు చెప్పినట్టు, మేము చర్చించుకుని, ధర్మవరంలో ఎవరు ఇంచార్జ్ గా ఉండాలో, అధినేత ద్రుష్టికి తీసుకువచ్చి, ఆయన నిర్ణయం ప్రకారం, ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉన్నట్టు ఉండి, విజయవాడ రావటం, జగన్ ను పిలిపించుకుని, దాదపుగా గంట సేపు మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గవర్నర్ నరసింహన్ ఏదన్నా అధికారిక కార్యక్రమం ఉంటే తప్ప విజయవాడ రారు. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి కాని, ప్రతిపక్షానికి కాని, అధికారులకు కాని ఏదన్నా పని ఉన్నా, హైదరాబాద్ వెళ్లి గవర్నర్ ను కలవాల్సిందే. మరి అలాంటిది గవర్నర్ పని గట్టుకుని, ఏ అధికారిక కార్యక్రమం లేకపోయినా, విజయవాడ వచ్చి, జగన్ ను పిలిపించుకుని గంటన్నర పైగా మాట్లాడటం చూస్తుంటే, ఎదో సీరియస్ విషయమే నడుస్తుందని, రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే బయటకు మాత్రం, ఈ నెల 11 నుంచి జరిగే బడ్జెట్ శాసనసభా సమావేశాల పై మాట్లాడటానికి గవర్నర్ వచ్చారని చెప్తున్నారు. బడ్జెట్ లో కేటాయింపులు, అధిక ప్రాధాన్యత ఇచ్చే విషయాల పై చర్చలు జరిగినట్టు చెప్తున్నారు.

అయితే గతంలో గవర్నర్ ఇలా చేసింది ఎప్పుడూ లేదని, అయినా ఇప్పటికే గవర్నర్ ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా ప్రత్యేకంగా బడ్జెట్ సమావేశాల పై చర్చించేందుకు గవర్నర్ వచ్చారు అని చెప్పటం, నమ్మసక్యంగా లేదని విశ్లేషకులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వస్తున్నారనే ప్రచారం నేపధ్యంలో గవర్నర్ ఎమన్నా ముందే జగన్ ను కలిసారా ? లేక తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం పై బీజేపీ చేస్తున్న రాజకీయ దాడి, కేసీఆర్ కోటరీ పై ఐటి దాడుల నేపధ్యంలో, జగన్ కు కూడా ముందస్తుగా ఏదన్నా జాగ్రత్తలు చెప్పటానికి కలిసారా అనే వాదన వినిపిస్తుంది. లేకపోతే కేంద్రం నుంచి ఏదయినా సందేశం వచ్చిందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. నిజానికి నరసింహన్ వ్యక్తిగత పని మీద చెన్నై వెళ్లారు. అయితే ఆదివారం రాత్రికి రాత్రి హైదరాబాద్ వచ్చి, సోమవారం ఉదయమే విజయవాడ వచ్చారు. కేవలం జగన్ తో చర్చలు జరిపి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు.

వైసీపీ నేతల ఆగడాలు ఆగటం లేదు. రోజు రోజుకీ తగ్గాల్సింది పోయి , రెచ్చిపోతున్నారు. ఈ రోజు, చీరాల వైసీపీ నేత, ఆమంచి ఫ్యామిలీ వంతు. ఆమంచి కృష్ణమోహన్ సోదరుడి కుమారుడు ఆమంచి రాజేంద్ర, ఏకంగా పోలీసులనే బెదిరిస్తున్నాడు. ప్రకాశం జిల్లా, ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న రవికుమార్ పై బూతుల వర్షం కురిపించాడు. నువ్వు పోలీస్ అయితే నాకేంటి అంటూ, పచ్చి బూతులతో, రెచ్చిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియోను తెలుగుదేశం పార్టీ ఈ రోజు రిలీజ్ చేసింది. వారం క్రిందట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా, ఇలాగే ఓ జర్నలిస్టు పై తిట్ల వర్షం కురిపించిన ఆడియో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తప్పులు సరిదిద్దుకోవల్సింది పోయి, మళ్ళీ మళ్ళీ ఇవే తప్పులు చేస్తున్నారు. ఈ రోజు ఆమంచి వాడిన భాష వింటుంటే, పోలీసు వ్యవస్థను ఎంత నీచాతినీచంగా అవమానిస్తున్నాడో అర్ధమవుతుంది. ఆ బెదిరింపులో వాడిన అసభ్యకరమైన, అత్యంత జుగుప్సాకరమైన భాష వినే పరిస్థితి కూడా లేదు.

అయితే ఈ బెదిరింపులు, బూతులు తిట్టటం పై, హోంగార్డ్ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమంచి కృష్ణమోహన్ అన్న స్వాములు కుమారుడు ఆమంచి రాజేంద్ర తనకు ఫోన్ చేసి కాళ్లు, చేతులు నరికేస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదు చేసాడు. . తనను, తన కుటుంబాన్ని రక్షించాలాని పోలీసులను కోరాడు. రాజేంద్ర బెదిరించిన ఫోన్ కాల్ రికార్డును పోలీసులకు అందజేశాడు. "రాజేంద్ర అసభ్యకరమైన పదజాలంతో నన్ను, నాపై అధికారులను, పోలీస్‌ వ్యవస్థను అత్యంత నీచాతి నీచంగా, అవమానకరంగా బూతులు తిడుతూ నన్ను కాళ్లు చేతులు నరికేస్తా అంటూ మరియు మరికొంత మంది పోలీసు అధికారులను మాట్లాడడానికి అలవిగాని మాటలు మాట్లాడాడు." అంటూ కంప్లైంట్ లో పేర్కొన్నారు. మరి పోలీసులు ఈ కంప్లైంట్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read