రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి, జగన్ ను గెలిపించుకున్నారు. చంద్రబాబు ఆర్ధిక పరిస్థితి బాగోక పోయినా, ఉద్యోగస్తులకు తెలంగాణాకు సమానంగా జీతాలు పెంచారు. కాకపొతే ఆయన అడిగింది, రాష్ట్ర పరిస్థితి బాగోలేదు, అందరూ బాగా పని చెయ్యండి, అవినీతి చెయ్యకండి అని. అదే చంద్రబాబు పాలిట శాపం అయ్యి, ఉద్యోగస్తులను జగన్ కు దగ్గర చేసింది. అందుకే గెలిచిన తరువాత మొదటి సారి జగన్ సచివాలయానికి వచ్చినప్పుడు, వైసీపీ కార్యకర్తలు లాగా, జై జగన్, జై జగన్ అంటూ నినాదాలు చేసారు ఉద్యోగులు. ఇంత చేసిన ఉద్యోగులకు జగన్ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారని అందరూ అనుకున్నారు. అందుకు అనుగుణంగానే నిన్న, ఉద్యోగులు అందరికీ 27 శాతం ఐఆర్ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకేముందు మా జగనన్న మాకు జీతాలు పెంచేసాడు అంటూ, ఉద్యోగులు సంబర పడే లోపే, వారికి మరో పిడుగు లాంటి వార్తా వినిపించారు. దీంతో ఉద్యోగులు ఖంగు తిన్నారు. అలా కుదరుదు అంటూ ఆందోళన మొదలు పెడుతున్నారు. ఇంతకీ విషయం ఏమి అంటే, జగన్ పెంచిన 27 శాతం ఐఆర్ జూలై నెల నుంచి వస్తుంది.
అయితే ఇప్పటికే చంద్రబాబు కూడా ఐఆర్ పెంచి ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఫిబ్రవరి 18 , 2019 న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 01.04.2019 నుంచి 20 శాతం జీతాలు పెంచుతూ జీవో నెంబర్ 21 విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి అందరికీ 20 % ఐఆర్ ప్రకటించారు. జూలై నెలలో, ఏప్రిల్, మే, జూన్ నెలల పెరిగిన ఐఆర్ తీసుకోవచ్చు అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు పెంచిన 20 శాతం, ఏప్రిల్, మే, జూన్ నెలకు ఇవ్వలేమని, జూలై నుంచి పెంచిన 27 శాతం ఇస్తామని అంటుంది. దీని పై యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయసంఘాలు అభ్యంతరం చెప్తున్నాయి. చంద్రబాబు పెంచిన ఆ మూడు నెలలు 20 శాతం ఇవ్వకపోతే, జగన్ ఇస్తాను అంటున్న 27 శాతం జూలై నుంచి ఇచ్చినా, ఈ ఏడాది వచ్చేది 9 నెలలకే అని, అంటే ఆ మూడు నెలలు కోల్పోతే, యావేరేజ్ న ఈ ఏడాది మాకు వచ్చేది 20 శాతమే అని అంటున్నారు. అంతే కాకుండా, చంద్రబాబు ఇచ్చిన 20 శాతం ఐఆర్ రద్దు చెయ్యటం వల్ల, ఏప్రిల్, మే, జూన్ నెలలో పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు పింఛను, సర్వీసులో ఉన్నవారికి వేతనంపై ప్రభావం చూపుతుందని, దయ చేస్ చంద్రబాబు నిర్ణయం అమలు చేసి, ఉద్యోగస్తులకు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వాలని చేపినవి ఇవ్వాలని, జగన్ ను కోరుతున్నారు.