గత 45 రోజులుగా రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఇవన్నీ రాజకీయ దాడులు అని కొట్టిపడేస్తున్నారు. ప్రభుత్వం మారింది కాబట్టి, ఇవన్నీ సహజం అంటున్నారు. కాని ఎదో వారం పది రోజులు ఇలాంటి టెన్షన్ ఉంటుంది కాని, ఏకంగా రెండు నెలలు కావుస్తున్నా, ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న, ఇవాళ ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తున్నారు. హోం మంత్రి గారు, ఇవన్నీ రాజకీయ దాడులు, తెలుగుదేశం వారే కొడుతున్నారు అంటున్నారు. సరే ఇవన్నీ రాజకీయ దాడులు అని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వార్త వింటే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా జడ్జి పైనే దాడి జరిగింది. అది కూడా రాజధాని ప్రాంతం అయిన, మంగళగిరిలో. మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తలు దాడి చేసారు. వివరాల ప్రకారం, శనివారం రాత్రి 10 గంటల సమయంలో తడేపల్లి బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ కోర్ట్ వద్ద మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్ స్నాక్స్ కోసం ఆగారు.
అక్కడ స్నాక్స్ తీసుకుని, కుంచనపల్లి గ్రామా పరిధిలో ఉన్న ఫుట్ బాల్ కోర్ట్ కు వెళ్లి కొద్ది సేపు ఆడుకున్నారు. అదే సమయంలో కొంత మంది యువకులు వచ్చి ఆయన పై దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో న్యాయమూర్తి చేతి వేళ్ళకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే దగ్గర లోని మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసారు. అక్కడే ఉన్న సిఐ అంకమ్మ రావు వెంటనే రంగంలోకి దిగి, దాడి చేసిన వారిని పట్టుకునట్టు సమాచారం. మొత్తం ఏడుగురుని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నారు. అయితే, ఈ దాడి ఎందుకు చేసారు అనేది తెలియాల్సి ఉంది. మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్ పై జరిగిన దాడికి నిరసనగా ఈ రోజు మంగళగిరిలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.