కర్ణాటకలో రెండో విడత జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 19న రాయచూరుకు రానున్నారు. మార్గమధ్యంలో కర్నూలు జిల్లాలో ఆయన ఆగనున్నారు. ఓర్వకల్లులోని రాక్ గార్డెన్స్ లో జిల్లా టీడీపీ నేతలతో ఆయన భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కర్నూలులో పార్టీ పరిస్థితి గురించి, గెలుపు అవకాశాలపై మాట్లాడనున్న్టట్లు పార్టీ వర్గాల సమాచారం. అనంతరం, రాయచూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చంద్రబాబు వెళతారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రె్‌స-జేడీఎస్‌ సంయుక్త అభ్యర్థి బీవీ నాయక్‌ తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. రాయచూరు, కొప్పళ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో వేలాదిమంది తెలుగువారు నివసిస్తున్నారు.

kurnool 18042019

కాంగ్రె్‌స-జేడీఎస్‌ అభ్యర్థికి ఓటు వేయాలని వారందరికీ చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు. ఈ సందర్భంగా రాయచూరు అభ్యర్థి తరఫున రాహుల్‌గాంధీ, చంద్రబాబు ఒకే వేదికపై నుంచి ప్రచారం చేయనున్నారు. తొలివిడతలో జేడీఎ్‌స-కాంగ్రెస్‌ సంయుక్త అభ్యర్థి నిఖిల్‌కుమారస్వామి తరఫున మండ్యలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, కర్ణాటకలో రాహుల్‌తో కలసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే ప్రథమం. బీజేపీ వ్యతిరేక పక్షాల నేతలను పనిగట్టుకుని వేధిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘‘నేను మొన్న కర్ణాటక వెళ్లాను. ఆ వెంటనే జేడీఎస్‌ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. నిన్న చెన్నై వెళ్ళాను. తిరిగి రాగానే డీఎంకే నేత కనిమొళి ఇంటిపై దాడి చేశారు. బీజేపీ నేతలు, ప్రధాని మోదీ సన్నిహితులపై ఎందుకు ఈ దాడులు జరగవు?

kurnool 18042019

ఒడిసా, బెంగాల్‌ ముఖ్యమంత్రులు నవీన్‌, మమతలను రకరకాలుగా వేధిస్తున్నారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రుల హెలికాప్టర్లను ఐటీ శాఖ అధికారులు ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైనా బీజేపీ ముఖ్యమంత్రుల హెలికాప్టర్లు తనిఖీ చేశారా’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. విపక్ష నేతల ప్రచారానికి ఒక్క హెలికాప్టర్‌, విమానం కూడా దొరక్కుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ‘‘ఎక్కడైనా ఒకటీ అరా సంపాదిస్తే ఏవియేషన్‌ డైరెక్టర్‌కు చెప్పి వాటిని వెంటనే దింపివేసి మళ్లీ ఎగరకుండా చూస్తున్నారు. బీజేపీకే అన్ని వసతులూ ఉండాలా? ప్రతిపక్షాలకు ఉండకూడదా?’’ అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటువంటి సమీక్షలు కానీ వీడియో కాన్ఫిరెన్స్ లు కానీ చేయడానికి వీలులేదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. గత రెండు రోజులుగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు, హోంశాఖల మీద సమీక్షలు చేయగా వాటి కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయగా ఈసీ ఈ ఆదేశాలు జారీచేసింది. రెండు రోజులుగా చేసిన సమీక్షలు కూడా ఎన్నికల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. అయన చేసిన సమీక్షలను కూడా ఈసీ రద్దు చేసింది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల మీద నిర్వహించాల్సిన హోం శాఖ సమీక్షను చంద్రబాబునాయుడు రద్దు చేశారు. రాష్ట్రంలో ఉన్న అధికారులకు మరోసారి ఎన్నికల నియమావళిని ఈసీ పంపించింది. వైసీపీ ముఖ్యనేతలు ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని మరోసారి కలిశారు.

cbn ec 18042019

చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించరాదని, కానీ చంద్రబాబు ప్రతి రోజూ సమీక్షలు నిర్వహించడం ద్వారా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అధికారిక భవనాల్లో సమావేశాలు పెట్టకూడదని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని కోడ్ చెబుతోందని, కానీ చంద్రబాబు అన్నింటికీ తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ద్వివేదీకి వివరించారు. తన చర్యల ద్వారా అధికారులను చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. వాళ్ళు కలిసిన వెంటనే, ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

cbn ec 18042019

ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. శాంతిభద్రతలపై గవర్నర్‌ నరసింహన్‌కు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఫిర్యాదు చేసిన మేరకు సీఈసీ నివేదిక కోరింది. రాష్ట్ర డీజీపీ ఇచ్చిన నివేదికను గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ద్వివేది పేర్కొన్నారు. ఈనెల 10న చంద్రబాబు-ద్వివేది మధ్య జరిగిన సంభాషణ వీడియోను... ఇంగ్లిష్‌లోకి అనువదించి సీఈసీకి ద్వివేది పంపారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికలే తమకు ఆధారమని, కృష్ణా జిల్లాలో ఈవీఎంల తరలింపులో ఆలస్యంపై... మరోసారి కలెక్టర్‌ను నివేదిక కోరతామని ద్వివేది స్పష్టం చేశారు.

టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులు ఈ నెల 22న అమరావతిలోని పార్టీ కార్యాలయంలో హాజరుకావాలని చంద్రబాబు అదేశాలు జారీ చేశారు. ఈ రోజు అభ్యర్ధులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద్భంగా పోలింగ్ తీరుపై అనేక మంది సభ్యులు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ఏం చెబితే ఈసీ ఆ పనిచేసిందని కొందరు అభ్యర్ధులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న లోపు నివేదిక తయారు చేసి... అమరావతిలో జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలంటూ ప్రత్యేకంగా కోరారు.

cbn 22 18042019

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ పోరాటం వ్యక్తులపై కాదని..ఎన్నికల్లో జరిగిన అవకతవకలపైననని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ తీరును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్ధుల నుంచి సమచారం తీసుకొని ఈ మేరకు పోరాటాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు. కాగా ఈనెల 23 నుంచి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్లు చంద్రబాబు తెలిపారు. పీలేరులో ఎన్నికల కమిషన్‌... ఇష్టారాజ్యంగా వ్యవహరించిందన్న టీడీపీ అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డి సీఎంకు చెప్పారు. ప్రతిపక్షం ఏం చెబితే ఈసీ ఆ పనిచేసిందని ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. అందుకే ఎన్నికల కమిషన్‌పై పోరాడుతున్నానన్నారు. ఫామ్‌-17 గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.

cbn 22 18042019

అంతకుముందు అభ్యర్థులతో మాట్లాడుతూ వాళ్లకు ఉత్సాహం కలిగించే విషయాలు చెప్పారు. తాను అన్ని రకాల సర్వేలు, క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకుని భేరీజు వేసుకున్న తర్వాత టీడీపీకి 120కి పైన సీట్లు రావడం ఖాయమని తెలుస్తోందని అన్నారు. పక్కా సమాచారంతోనే ఈ మాట చెబుతున్నానని చంద్రబాబు అనడంతో టీడీపీ అభ్యర్థుల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికినట్టు సమాచారం! ఇక, చంద్రబాబునాయుడు ఈనెల 23 నుంచి మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మిత్రపార్టీల తరఫున ఎన్నికల సభలకు హాజరయ్యారు. ఈసారి ఉత్తరాది రాష్ట్రాల్లో చంద్రబాబు పర్యటన సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ లోనూ బాబు ప్రచారం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సుమారు 45రోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయానికి వచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణంపై ఆయన సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణ పనులు పురోగతిపై చర్చలు జరిపారు. పరిపాలన నగరంలో చేపట్టిన శాసనసభ్యుల నివాస భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కొత్త శాసనసభ కొలువుదీరిన వెంటనే నూతన సభ్యులు రాజధానిలో ఉండేందుకు వీలుగా వారికి నివాస భవనాలను సిద్దంచేయాలని చెప్పారు. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో రాజధాని పనుల పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలను ప్రాధాన్య క్రమంలో గుర్తించి వాటిని వర్షాకాలం నాటికి పూర్తిస్థాయిలో సిద్దం చేయాలని సూచించారు. రాజధాని నగరం నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీని అందించే రహదారులలో తొలుత న్యాయ వివాదాలు లేని రహదారులను గుర్తించి వాటిని శరవేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ రహదారులు సిద్ధమైతే రాజధానికి ఒక సమగ్రమైన ఆకృతి వస్తుందని, ముఖ్యంగా అమరావతికి రాకపోకలు పెరుగుతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పచ్చదనం, విద్యుత్ దీపాలతో సహా ముఖ్య రహదారులను యుద్ధ ప్రాతిపదికపై సిద్దం చేయాలని నిర్దేశించారు. ఎంత వీలయితే అంత త్వరగా రాజధానికి ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సమకూర్చాలని చెప్పారు. రాజధానిలో రూ.51,687 కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయని, అందులో మొత్తం 19,769 కోట్ల ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులకు గాను, రూ.15,414 కోట్ల పనులు (78 శాతం) కొనసాగుతున్నాయని సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. రూ.17,910 కోట్ల విలువైన ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులకు గాను రూ.15,721 కోట్ల పనులు (88శాతం) పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ భవన సముదాయాలకు సంబంధించి మొత్తం రూ.14,008 కోట్ల విలువైన పనులలో రూ.8,786 కోట్ల పనులు (66 శాతం) జరుగుతున్నాయని తెలిపారు. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులలో రహదారులు, వంతెనలు, యుటిలిటీస్ వంటి పనులు చేపట్టామన్నారు.

ఈ పనులన్నీ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని చెప్పారు. ఎల్‌పీఎస్ పనులు 2022 ఏప్రిల్ నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రభుత్వ భవన సముదాయాల పనులను 6 జోన్లుగా విభజించి లక్ష్యాలు నిర్దేశించుకున్నామని తెలిపారు. వీటిలో మొదటి మూడు జోన్లలో పనులు దాదాపు చివరి దశకు చేరాయని చెప్పారు. మరో 5 జోన్లు ప్లానింగ్ దశలో ఉన్నాయని అన్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల నివాస భవనాలు ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి పూర్తవుతాయని తెలిపారు. మంత్రులు, న్యాయమూర్తులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు విల్లాలు ఆగస్టు 16 కల్లా సిద్ధం అవుతాయని చెప్పారు. సచివాలయం, విభాగాధిపతుల టవర్లు వచ్చే ఏడాది జులై 18 నాటికి పూర్తవుతాయని వివరించారు. హైకోర్టు ఐకానిక్ భవన నిర్మాణం తొలిదశ నిర్మాణం వచ్చే ఏడాది సెప్టెంబరు 28 నాటికి పూర్తవుతుందన్నారు. మరో ఐకానిక్ నిర్మాణంగా చేపట్టిన శాసనసభ భవంతి టెండర్ దశకు చేరుకుందని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read