ఆలూ లేదు, చూలూ లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తయారైంది వైసీపీ వ్యవహారం. వచ్చే నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, అప్పుడే గెలుపు తమదేనంటూ ఊహల్లో తేలియాడుతున్నారు. ‘పైనా...కిందా.. మనదే గెలుపు. టీడీపీ వారి డీలర్‌షిప్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితర పోస్టుల మనకే’నంటూ అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే డీలర్‌షిప్‌ నాది, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టు నీదంటూ అప్పుడే పంపకాలు కూడా పూర్తి చేసుకుంటున్నారు. వీరి పరిస్థితి చూస్తున్న కొందరు గ్రామీణులైతే లోలోపలే నవ్వుకుంటూ అప్పుడే పదవుల కోసం ఆరాటపడుతున్నారే.. ఇక అధికారంలోకి వస్తే పరిస్థితేమిటంటూ చర్చించుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే కులాల వారీగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే వివిధ పథకాలను చేజిక్కించుకోవడానికి ఇప్పటికే తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారంటే వైసీపీలో అధికార దాహం ఏస్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

ycp 18042019

రెండు రోజుల కిత్రం అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని ఓ గ్రామంలో వీటిపై ప్రత్యేక సమావేశం నిర్వహించి స్టోర్‌ డీలర్‌షిప్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పదవులు కూడా కేటాయింపులు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరికొందరైతే బాగా ఆదాయం వచ్చే పథకాలు మీకెలా ఇస్తామంటూ కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని గ్రామాల్లో అయితే ప్రభుత్వ పథకాలన్నీ మీరే తీసుకుని తనకు హోంశాఖ బాధ్యతలు అప్పగించాలంటూ ఓ నాయకుడు అడుగుతూండడం ఆసక్తి కలిగిస్తోంది. మరికొందరు మాత్రం తమకు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగిస్తే చాలంటూ తమ మనస్సులోని మాటను పలువురు సన్నిహితుల వద్ద పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. వీటిని బట్టి చూస్తే ప్రజా సంక్షేమం పక్కన పెట్టి తమ స్వార్థ చింతన కోసం ఎలా ప్రాకులాడుతున్నారో స్పష్టంగా తెలుస్తోంది.

ycp 18042019

రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపడుతుందా లేదా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఈసారి అధికారం తమదేనంటూ సోషల్‌ మీడియాలో వైసీపీ హల్‌చల్‌ చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం రాష్ట్ర ప్రజలు, మేధావులు, విద్యావంతులు, ముఖ్యంగా మహిళలు తమవైపే ఉన్నారంటూ.. అభివృద్ధికే పట్టం కడతారనే అపార నమ్మకం, అచంచల విశ్వాసంతో ఉన్నారు. గెలుపోటములపై పందేలకు ఎంతకైనా రెడీ అంటూ వైసీపీ నాయకులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా కార్యరూపంలోకి వచ్చే సరికి వెనుకడగు వేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. టీడీపీ వారు మాత్రం తమదే గెలుపని వైసీపీ సిద్ధపడితే వారు ఒక వంతు ఇస్తే తాము రెండు వంతుల డబ్బు ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంటున్నారు. అయితే వైసీపీ ఊహలు ఫలిస్తాయా? టీడీపీ నమ్మకం, విశ్వాసం గెలుస్తుందా? అనేది తేలాలంటే మే 23వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.

అధికారంలోకి అప్పుడే వచ్చేశామని ధీమా వ్యక్తం చేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తాజాగా అనుసరిస్తోన్న వ్యూహం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది. కొంతమంది అధికారులకు ఫోన్ చేసి రాబోతుంది మేమే.. చెప్పింది చేయ్యండంటూ జారీ చేస్తోన్న హుకుంలతోపాటు కేబినెట్ కూర్పు పై కూడా జరుగుతున్న ఊహాగానాలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు కూడా ఫోన్ చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని చేస్తోన్న హెచ్చరికలు, చేబుతున్నసూచనలు ఇప్పుడు ఆసక్తిగా మారింది. హోరాహోరీగా జరిగిన ప్రచారం, పోలింగ్ రోజు ఈవీఎంల్లో సాంకేతిక లోపాలు, అయినా లెక్కచేయని ఓటర్లు. అర్థరాత్రి దాటేవరకు పోలింగ్ బూత్ లలో ఉండి ఓటు హక్కు వినియోగించుకోవటం వంటి అంశాలు ఒకవైపు కళ్ల ముందు కనిపించాయి. ఈ దృశ్యాలను ఓటు వేసిన వారెవరూ, టీవీల్లో వీక్షించిన ప్రజానీకం కూడా మర్చిపోలేరు.

game 27032019

ప్రజలను గంటల తరబడి పోలింగ్ బూత్ ల వద్ద క్యూ లైన్లలో నిలబెట్టడమే కాకుండా సాంకేతిక సమస్యలు వచ్చిన ఈవీఎంలను సరిదిద్దకుండా మరుసటిరోజు ఉదయం వరకు పోలింగ్ నిర్వహించిన ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషన్ వైఫల్యాలను ఎండగట్టారు. దీంతో చంద్రబాబు ఓడిపోతున్నారని, ఆ నెపాన్ని ఈవీఎంలపై నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ కొత్త పల్లవి అందుకుంది. నంద్యాలలో తెలుగుదేశం గెలుపు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ గెలుపు, ఈవీఎంల ద్వారానే జరిగిందని ప్రతిపక్షం చెబుతోంది. ఈలోపు వైసీపీ నేతలు రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు ఫోన్ చేయటం ప్రారంభించారు.

game 27032019

ముఖ్యంగా పోలీస్ అధికారులకు, జిల్లాస్థాయిలో ఉన్న ఎస్పీలకు ఫోన్ చేసి ఇటీవల జరిగిన గొడవలు, అందులో వైసీపీ నేతలను అరెస్ట్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాబోతుంది తామేనంటూ సాక్షాత్తు కొంతమంది జిల్లా ఎస్పీలకు ఫోన్ చేసి బెదిరించినట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. పోలీస్ అధికారులు మాత్రం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నామని, నిష్పక్షపాతంగా వ్యవహారిస్తామని స్పష్టం చేస్తున్నారు. సెక్రటేరియట్‌లోని కొంతమంది అధికారులకు ఫోన్ చేసి తమకు తెలియకుండా జీవోలు ఎలా ఇస్తారని ప్రశ్నించటంతోపాటు ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు చెపితే ఫైళ్లు తీసుకెళ్తారా అంటూ నిలదీయటం ప్రారంభించారు. ఈ వింత పోకడతో అధికారులు సైతం బెంబేలెత్తుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీఎంకే అధినేత స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. నిన్న చెన్నై వెళ్లిన చంద్రబాబు... డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, చెన్నైకి వచ్చి డీఎంకేకు మద్దతు ప్రకటించిన చంద్రబాబుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నియంతృత్వ మోదీ ప్రభుత్వాన్ని, అవినీతిలో కూరుకుపోయిన తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాం. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో డీఎంకే ముందు వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నా అని తెలిపారు.

game 27032019

అయితే తమిళనాడులో ఎన్నికల్లో త్రిముఖపోటీ నెలకొంది. అదికార, ప్రతిపక్షం మద్య పోటీ కాకుండా అదికార పార్ట కంటిలో నలుసులా పరిణమించాడు టీటీవి దినకరన్. తమిళనాడులో దినకరన్ తో పాటు కమలహాసన్ కూడా అదికారపార్టీకి శరాఘాతంగా మారిపోయారు. ఐతే ఉప ఎన్నికల్లో పోటీ లో ఉన్న 18 మంది అభ్మర్థుల్లో ఎవరు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటే వారు అదికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది కాబట్టి లోక్ సభ ఎన్నికల కన్నా శాసన సభ ఎన్నికలమీద నాయకులు ఎక్కువ ద్రుష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రదచారం తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తుందనే చర్చ జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘డేటా చోరీ’ కేసులో ఆధార్‌ (యూఐడీఏఐ) సంస్థ కీలక ప్రకటన చేసింది. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ తమ సర్వర్ల నుంచి అక్రమంగా, చట్టవిరుద్ధంగా డేటాను చోరీ చేయలేదని స్పష్టం చేసింది. తమకు సంబంధించిన కేంద్రీకృత సమాచార నిల్వ కేంద్రం (సీఐడీఆర్‌)తోపాటు సర్వర్లు అత్యంత భద్రంగా ఉన్నాయని తెలిపింది. బుధవారం దీనిపై యూఐడీఏఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆధార్‌ చట్టానికి విరుద్ధంగా ఐటీ గ్రిడ్స్‌ సంస్థ పెద్ద సంఖ్యలో పౌరుల ఆధార్‌ వివరాలను సేకరించినట్లు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా మేం కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాం.

aadhar 18042019

అయితే... పౌరుల ఆధార్‌ సంఖ్య, పేరు, చిరునామా తదితర వివరాలను యూఐడీఏఐ సర్వర్ల నుంచి చోరీ చేసినట్లుగా ఆధారాలు లభించినట్లు సిట్‌ నివేదికలో ఎక్కడా లేదు. పలు సర్వీస్‌ ప్రొవైడర్లు వ్యక్తుల నుంచి నేరుగా వారి ఆధార్‌, ఇతర వివరాలు సేకరించడం సాధారణంగా జరిగేదే. అయితే... ఈ సమాచారాన్ని నిర్దిష్టంగా ఏ అవసరం కోసం సేకరించారో, దానికోసమే ఉపయోగించాలి. సదరు వ్యక్తి సమ్మతం లేకుండా ఈ సమాచారాన్ని ఇతరులకు అందించకూడదు. ఆధార్‌ చట్టానికి వ్యతిరేకంగా ఆ సమాచారాన్ని సేకరించినా, నిల్వ చేసినా, ఉపయోగించినా, అందుకు బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్‌ చేయవచ్చు’’ అని యూఐడీఏఐ ప్రకటించింది.

aadhar 18042019

అదేసమయంలో... కేవలం ఆధార్‌ సంఖ్య, పేరు, వివరాలు తెలుసుకున్నంత మాత్రాన పౌరులకు ఎలాంటి నష్టం జరగదని... బయోమెట్రిక్‌ లేదా వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వంటి రెండో అంచె భద్రత ఉంటుందని తెలిపింది. ఐటీ గ్రిడ్స్‌ కేసుకు సంబంధించి తమ సర్వర్లతో, సమాచారంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. అయితే... ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఆధార్‌ సమాచారాన్ని ఏ అవసరం కోసం సేకరించింది, చట్ట ఉల్లంఘన జరిగిందా అనే విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించింది.

Advertisements

Latest Articles

Most Read