ఓవైపు ఓటమెరుగని జేసీ కుటుంబం.. మరోవైపు రాజకీయానుభవమే లేని మాజీ అధికారి.. అనంతపురం లోక్‌సభ స్థానంలో ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. 40 ఏళ్ల అనుభవజ్ఞుడు.. జిల్లాలో రాజకీయ చాణక్యుడిగా పేరొందిన టీడీపీ సిటింగ్‌ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. విశ్రాంతి తీసుకుని ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలిగారు. సీఎం చంద్రబాబు అనుమతితో తన వారసుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఈ దఫా ఆయన్ను ఎలాగైనా ఓడించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పట్టుదలతో ఉన్నారు. టీడీపీకి అండగా ఉన్న బీసీ ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతో బోయ వర్గానికి చెందిన డీఆర్‌డీఏ మాజీ ప్రాజెక్టు డైరెక్టర్‌ తలారి రంగయ్యను అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ నేపథ్యంలో జేసీ రాజకీయ నైపుణ్యానికి ఈ పోరు పరీక్షగా మారిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

game 27032019

కంచుకోటే అయినా.. తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా కంచుకోట. అయినప్పటికీ అనంతపురం పార్లమెంటు బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థులు గతంలో చాలాసార్లు ఓటమి చవిచూశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984 నుంచి తొమ్మిదిసార్లు ఈ సీటుకు ఎన్నికలు జరిగాయి. కేవలం మూడు సార్లు మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 1984లో డి.నారాయణస్వామి, 1999లో కాల్వ శ్రీనివాసులు, 2014లో జేసీ దివాకర్‌రెడ్డి టీడీపీ తరఫున గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో జేసీ తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ఇక్కడ బరిలోకి దించారు. గత ఎన్నికల్లో జేసీ ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు.

game 27032019

కానీ వైసీపీ అభ్యర్థి, నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనంత వెంకట్రామిరెడ్డిని 61 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తలారి రంగయ్య స్థానికేతరుడు. కర్నూలు జిల్లా వాసి. కానీ అనంతపురం జిల్లాలో సుదీర్ఘ కాలం పనిచేశారు. అనంతపురం, హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌గా.. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు. జగన్‌పై ప్రజాదరణే తనను గట్టెక్కిస్తుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. జనసేన కూటమిలో భాగంగా సీపీఐ నుంచి జిల్లా కార్యదర్శి జగదీశ్‌ పోటీపడుతున్నారు. బీజేపీ నుంచి దేవినేని హంస, కాంగ్రెస్‌ తరఫున రాజీవ్‌రెడ్డి బరిలో ఉన్నా.. వీరి ప్రభావం అంతంత మాత్రమేనని భావిస్తున్నారు.

 

 

పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేసిన వారు విజయం సాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో అనేక పర్యాయాలు ఇలా జరిగింది. తొలుత మద్దుకూరి నారాయణ, తర్వాత గాదె వెంకటరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారు వరుసగా రెండుసార్లు విజయం సాధించటంతో ఈసెంటిమెంట్‌కు బలం చేకూరింది. 1972లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మద్దుకూరి నారాయణ 1978లో పార్టీ మారి పోటీచేసినా విజయం దక్కించుకున్నారు. 1984లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రెండోసారి 1989లో పోటీచేసి విజేతగానే నిలిచారు.

game 27032019

1991 ఉప ఎన్నికల్లో గెలిచిన గాదె వెంకటరెడ్డి ఆతర్వాత 1994 ఎన్నికల్లో కూడా గెలిచి సెంటిమెంట్‌ను నిజం చేశారు. 2004లో పర్చూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించి నమ్మకాన్ని కొనసాగించారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఏలూరి సాంబశివరావుకు ప్రస్తుతం ఎన్నికల్లోనూ టీడీపీ టికెట్టు లభించింది. ఈసారి ఆనవాయితీ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ ప్రజల్లో కొనసాగుతోంది. ఇదే సెంటిమెంట్ రిపీట్ ఐతే టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారనీ, దగ్గుబాటికి కష్టమేనని పర్చూరు వాసులు చెప్పుకుంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో..? గెలుపు ఎవరిని వరిస్తుందో.. తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే..

 

రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం.. పవిత్ర నదీజలాల సంరక్షణ కోసం.. ఆంధ్రప్రదేశ్‌ ఉజ్వల భవిష్యత్తు కోసం.. నవ్యాంధ్ర రథసారధి, అపరభగీరథుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో గెలుపొంది మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సుమారు 40 మంది రుత్వికులు శ్రీ యాగం నిర్వహిస్తున్నారు. కాపు ఉద్యమ నేత, దివంగత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ స్టార్‌ క్యాంపెయినర్‌ వంగవీటి రాధ ఈ యాగం జరిపిస్తున్నారు. విజయవాడలోని పిన్నమనేని పాలీక్లినిక్‌ ఎదురు రోడ్డులో ఉన్న మున్సిపల్‌ ఎంప్లాయుస్‌ కాలనీలోని కె.జె.గుప్తా కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 8.12 గంటలకు రుత్వికులు యాగాన్ని ప్రారంభించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలతో యాగం మూడురోజుల పాటు కొనసాగనుంది.

game 27032019

వంగవీటి రాధా సోదరి ఆషా దంపతులు తొలిరోజు ఆదివారం పీటలపై కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోపూజ, వాస్తు హోమం జరిపించారు. అనంతరం దుర్గామాత పూజతో శ్రీ యాగం ప్రారంభమైంది. ఇది మూడు రోజులపాటు వేదమంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా కొనసాగి ఏప్రిల్‌ 3వ తేదీ ఉదయం 9.45 గంటలకు పూర్ణాహుతితో పరిసమాప్తమవుతుందని ఈ యాగం నిర్వహిస్తున్న రుత్వికులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో వంగవీటి రాధా ఆధ్వర్యంలో శ్రీయాగం నిర్వహిస్తున్నాం. శ్రీయాగం అంటే వనదుర్గా మహావిద్యా యాగం. ఇది చాలా విశేషమైనది. చతుర్వేదాలలో ఉన్న మంత్రాలను క్రోడీకరించి దుర్గాదేవతను ఆరాధించే మహా కార్యం. శ్రీయాగం నిర్వహిస్తే శత్రుపీడ తొలగిపోయి అనుకున్న సంకల్పం నెరవేరుతుంది.

game 27032019

ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. ప్రకృతి అనుకూలిస్తుంది. మనమేమైతే కోరుకుంటున్నామో దానిని పొంది ఈ భూమి మీద సుఖసంతోషాలతో వర్థిల్లేలా మహావిద్య అనే కల్పాన్ని దుర్గాదేవి అనుగ్రహిస్తారు. మూడు రోజులు యాగం జరుగుతుంది. నాలుగో రోజు పూర్ణాహుతితో పరిసమాప్త మవుతుంది. చంద్రబాబునాయుడే ఈ రాష్ట్రానికి దశ, దిశ చూపించగల నాయకుడు, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలతో ఉండాలనే ఆయనే మళ్లీ అధికారంలోకి రావాలి. నవ్యాంధ్రప్రదేశ్‌కు దశ, దిశ చూపించిన చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై రాష్ట్రాన్ని మరింత ముందుకు నడిపించాలని కోరుకుంటూ శ్రీయాగం చేయిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో జోరుగా బెట్టింగ్‌ సాగుతోంది. తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సన్నిహితుల ద్వారా, సర్వేల ద్వారా తెలుసుకుంటూ ‘కాయ్‌ రాజా కాయ్‌’ అంటున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ బెట్టింగ్‌ మాఫియా నడుస్తోంది. రూ.3 లక్షల నుంచి బెట్టింగ్‌ ప్రారంభమవుతోంది. ఇక వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ లాంటి నగరాల్లో లక్ష నుంచి మొదలవుతోంది. సీటును బట్టి రేటు కూడా మారుతోంది. కొన్ని స్థానాల్లో ఫలానా అభ్యర్థి గెలిస్తే రూ.లక్ష ఇస్తామని, ఓడితే రూ.3 లక్షలు తమకు ఇవ్వాలని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. మరికొన్ని స్థానాల్లో పందెం కాసిన సొమ్ముకు పది రెట్లు ఎక్కువగా ఇస్తామని ఆఫర్‌ ప్రకటిస్తోంది. ఏపీలోని హాట్‌సీట్లపైనే తెలంగాణ బుకీలు ఎక్కువగా పందేలు కాస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ఏపీలోని తమ స్నేహితుల ద్వారా తెలుసుకుంటున్నారు. తద్వారా రేటును నిర్ణయిస్తున్నారు.

game 27032019

ముఖ్యంగా మంగళగిరి, గుడివాడ, నగరి, గాజువాక, భీమవరం, సత్తెనపల్లి, హిందుపురం, పులివెందుల, కుప్పం, భీమిలి అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, నర్సాపురం, కడప పార్లమెంట్‌ స్థానాల గెలుపోటముపైనా తెలంగాణలో జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. అంతేకాక, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌, బాలకృష్ణ మెజారిటీలపైనా పందెంకాస్తున్నారు. హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గెలుపుపై ఎక్కువగా పందేలు కడుతున్నారు. పవన్‌.. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగారు. పవన్‌ గాజువాకలో ఎంత మెజారిటీతో గెలుస్తారు? భీమవరంలో ఎన్ని ఓట్లు పడతాయనే దానిపై పందేలు జోరుగా కాస్తున్నారు. గాజువాకలో పవన్‌కు అనుకూలంగా, భీమవరంలో ఆయనకు వ్యతిరేకంగా ఎక్కువగా పందేలు కాస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

game 27032019

అదేస్థానంలో వైసీపీ నుంచి వ్యాపారవేత్త రఘురామకృషంరాజు, టీడీపీ నుంచి వెంకటశివరామరాజు బరిలోకి దిగారు. దీంతొ ఇక్కడ పోటీ ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా ఉండటంతో ఈ స్థానంపై పందెం రాయుళ్లు గురిపెట్టారు. ఇక విశాఖ ఎంపీ స్థానంపైనా పోటీ ఆసక్తికరంగా ఉంది. జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. టీడీపీ నుంచి సినీనటుడు బాలకృష్ణ అల్లుడు భరత్‌, వైసీపీ నుంచి సత్యనారాయణ, బీజేపీ నుంచి పురందేశ్వరీ పోటీ చేస్తుండటంతో.. విశాఖపట్నంలో ఎవరు గెలుస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయవాడ స్థానంపైనా ఎక్కువగా పందెం కాస్తున్నారు. ఏపీలో గెలుపోటములపై బెట్టింగ్‌ రాయుళ్లు రహస్యంగా సర్వేలు చేయించారని తెలుస్తోంది. దీనిని బట్టి ఏపీలో ఏ పార్టీకి విజయకాశాలు న్నాయో ప్రాథమిక అంచనాకు వచ్చారు. టీడీపీకి 90-100, వైసీపీకి 60-70 సీట్లు రావొచ్చని, జనసేన 5 స్థానాలకు మించి రావని.. పోలింగ్‌ సమయానికి పరిస్థితులు మారితే తప్ప ఈ అంచనాలో ఎలాంటి మార్పులుండవని హైదరాబాద్‌కు చెందిన ఓ బుకీ చెప్పారు.

 

Advertisements

Latest Articles

Most Read