దాడిలో గాయపడ్డ జగన్‌ను విమానంలో ప్రయాణించేందుకు ఎలా అనుమతించారు? అలా అనుమతించే ముందు మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నారా? దానిని ఎవరు జారీ చేశారు? రక్తపు మరకలు అంటిన జగన్ చొక్కాను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అసలు... సీఐఎ్‌సఎఫ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? వీవీఐపీ లాంజ్‌లో దాడి జరిగితే సీఐఎ్‌సఎఫ్ ఏం చేస్తోంది?... అంటూ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కె.లక్ష్మణ్‌పై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని... సీఐఎ్‌సఎఫ్ నివేదిక, ఎయిర్‌పోర్టు అథార్టీ నిబంధనలు వివరించాలని ఆదేశించింది. అలాగే... సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఏపీ పోలీసులకు జగన్ వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవరులో అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో జగన్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. ఏకంగా కోర్ట్ జోక్యం చేసుకుని, వాంగ్మూలం ఇవ్వమని కోరటంతో, ఏం చెయ్యాలని అనే దాని పై లోటస్ పాండ్ లో తన లాయర్లతో మంతనాలు జరుపుతున్నారు. నాకు ఇష్టం లేకపోతే, కోర్ట్ కు ఏమి సంబంధం, మనం ఈ విషయంలో పై కోర్ట్ కి వెళ్దాం అని జగన్ చెప్తున్నట్టు తెలుస్తుంది. విశాఖ విమానాశ్రయంలో గతనెల 25న తనపై జరిగిన దాడిపై ఏపీ ప్రభుత్వ అధీనంలో లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, బి.అనిల్ కుమార్ కూడా ఇదే తరహా వ్యాజ్యాలు వేశారు. ఇవి శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చాయి. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు.
అత్యంత రక్షణ ప్రాంతమైన వీఐపీ లాంజ్‌లో దాడి జరిగాక గాయపడ్డ వ్యక్తిని విమానంలో ప్రయాణించడానికి అధికారులు ఎలా అనుమతిచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. వైద్యుల అనుమతి పొందాక ప్రయాణానికి ఎయిర్‌పోర్టు అథార్టీ అధికారులు అనుమతిచ్చారా, ఇలాంటి సందర్భాల్లో నిబంధనలు ఏమి చెబుతున్నాయో చెప్పాలని ఏఎస్‌జీకి స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ దాడి ఘటనను సానుభూతి పొందడం కోసం జరిగిందని జగన్ తరఫు న్యాయవాది చేసిన వాదనలపై స్పందిస్తూ.. ‘ముఖ్యమంత్రికి వాక్కు స్వాతంత్య్రం హక్కు ఉంది కదా.. ఆయన అభిప్రాయాన్ని తెలిపి ఉంటారు...’ అని వ్యాఖ్యానించింది. దర్యాప్తు విషయంలో పోలీసులు తమ పని తాము చేసుకుపోతుంటే తప్పేమి ఉందని పేర్కొంది. పోలీసులకు వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.