గత సంవత్సర కాలంగా, జగన్ ను ఎన్నో జాకీలు వేసి మరీ లేపుతున్న ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ కవర్ చెయ్యటానికే, ప్రశాంత్ కిషోర్ టీం ప్రయత్నాలు అన్నీ సరిపోతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, ఎలా అయినా జగన్ మోహన్ రెడ్డిని లేపటానికి, ప్రశాంత్ కిషోర్ టీం కొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. అయితే, ఈ ప్లాన్ ఎంతో క్రూరామైనది అని, ఇది ఫాలో అవుతున్న వారు చెప్తున్నారు. యువతని రెచ్చకొట్టి, హింస, ఉద్యమాల వైపు మళ్ళించి, కేసులు, కోర్ట్ లలో యువతని ముంచేసి, రాజకీయంగా లబ్ది చేకూర్చే వికృత క్రీడ.

ipac 08082018 2

ఇంతకీ ఈ ప్లాన్ ఏంటి అంటే, ‘నేషనల్ ఎజెండా ఫోరం’ అనే కొత్త ప్రోగ్రాంతో, మున్డుకు వసున్నాడు ప్రశాంత్ కిషోర్. ముందుగా కొంత మందిని ఎంపిక చేసుకుని, వారికి ట్రైనింగ్ ఇచ్చి, నెల జీతం ఇచ్చి, వారిని రాష్ట్రంలోని వివిధ కాలేజీలకు పంపుతారు. కాలేజీలకు వెళ్లిన వీరు, దేశ భక్తి పేరిట వివిధ రకాలుగా చెప్పి, యువతని ప్రభావితం చేస్తారు. దేశ భక్తి ముసుగులో, అందమైన మాటలు చెప్పి రెచ్చగొడతారు వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కల్మషం లేని యువతని చెడగొట్టడతారు. ఇలా వారిని రెచ్చగొట్టి వారిని రోడ్డు మీదకు తీసుకొచ్చి, రెచ్చగొట్టి, ఉద్యమాలు చేస్తారు, అల్లర్లు చేస్తారు. ఈ విధంగా రాష్ట్రంలో అల్లకల్లోలం సృస్టిస్తారు.

ipac 08082018 3

ఈ ప్లాన్ ఇంప్లెమెంత్ చెయ్యటానికి, ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన కార్యకలాపాలు మొదలు పెట్టింది. ఇప్పటికే టీంలు రెడీ చేసి, కాలేజీలకు పంపించిది. ఇలాంటి స్ట్రాటజీనే, బీజేపీ కూడా ఇంప్లెమెంత్ చేసి సక్సెస్ అయ్యింది. అప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ టీం పని చేసింది. ప్రస్తుతం, రాష్ట్రంలో వీళ్ళు చేసే అన్ని ఎత్తుగడలు, ఫెయిల్ అవుతూ ఉండటంతో, రాష్ట్ర సమస్యలకు, దేశ భక్తి జోడించి, యువతను రెచ్చగొట్టే పన్నాగం పన్నింది. ఇలాంటి వారిని, కాలేజీలకు రాకుండా, అడ్డుకోవాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలకు, తల్లి దండ్రులకు ఉంది. యువత కూడా, ఇలాంటి వాటి పై ఆచి తూచి, అన్నీ తెలుసుకుని స్పందించాలి.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పయనమెటు అనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికలలో ఆయన ఎవరికి మద్దతు ఇస్తారనే విషయం పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్‌ తూర్పు పర్యటనతో కాపు రిజర్వేషన్ల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. కాపులకు రిజర్వేషన్లు తాను ఇవ్వలేనని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని జగన్‌ తేల్చిచెప్పడం, ఆ తర్వాత వచ్చిన విమర్శలతో జగన్‌ యూ టర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే. జగన్‌ వ్యాఖ్యలను ముద్రగడ పద్మనాభం, కాపు జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

mudragada 08082018 2

ఉద్యమం పుట్టిన తూర్పు గడ్డపైనే జగన్‌ కాపు ఉద్యమానికి తూట్లు పొడిచేలా వ్యవహరించారంటూ, మరో నాయకుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా కాపు నేతలు స్పందిస్తున్నారు. కాపు ఉద్యమ సమయంలో మద్దతు ఇచ్చి ఇప్పుడు ఎందుకు మాట తప్పారని జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. కాపు రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిన వారికే కాపులు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. 2016 ఫిబ్రవరి నుండి కాపు ఉద్యమానికి జగన్‌ మద్దతు ఇవ్వడంతో వైసీపీకి ముద్రగడ మద్దతు ఉందని భావించిన అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆ పరిస్థితి లేదని భావించి ముద్రగడ వైపు దృష్టి మళ్ళించారు. ముద్రగడ పద్మనాభంను తమ వైపు తిప్పుకుంటే, కొంత అయినా కాపు ఓట్లను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని అన్ని పార్టీలు ప్రయ త్నాలు చేస్తున్నాయి.

mudragada 08082018 3

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నేతలు కూడా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని, కాపులకు రిజర్వేషన్లు కాంగ్రెస్‌ పార్టీ ఇస్తుందని చెప్పి ముద్రగడను కలిసి వివరిస్తూ ఏఐసీసీ ఇచ్చిన హామీ లేఖను కూడా ముద్రగడకు ఇచ్చారు. ఇదిలాఉంటే వైసీపీ అధినేత జగన్‌ కాపు రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీలో ఉంటూ కాపు ఉద్యమంలో పనిచేస్తున్న కొంతమంది కాపు నేతలు కూడా ముద్రగడను కలిసి వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

mudragada 08082018 4

ఇక జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కాపు రిజర్వేషన్లపై ఎటూ తేల్చడం లేదు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే వద్దన బోమని చెబుతూనే కులం పరంగా తాను ఏ నిర్ణయం తీసుకోనని తేల్చిచెప్పారు. ఇలా అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించడంతో ఏ పార్టీకి ముద్రగడ మద్దతు ఇస్తారోననే మీమాంస కొనసాగుతోంది. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కాపులకు రిజర్వేషన్లు మేమే ఇస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేది టీడీపీయేనని, ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌లో కూడా పంపించింది. కాపు కార్పొరేషన్ పెట్టి, ఆడుకుంటుంది. వైసీపీ నాయకులు రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పడం, పవన్ ఎటూ తెల్చకపోతంతో, ఇప్పటి వరకు, ఈ అంశంలో టీడీపీ మాత్రమే స్పష్టత ఇచ్చింది.

mudragada 08082018 5

అయితే ముద్రగడ ప్రస్తుత పరిస్థితుల్లో కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా అడుగులు వేసున్న అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారా? లేక ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారా? అనేది తేలాల్సిఉంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి న్యాయం చేకూర్చేందుకు చంద్రబాబు ప్రయత్నించాలని ముద్రగడ కోరుతున్నారు. చంద్రబాబు ఈ అంశంపై సానుకూల వైఖరితో ఉన్నందున ముద్రగడ ఇప్పటివరకూ దుయ్యబట్టిన చంద్రబాబుకు మద్దతు ఇస్తారా? లేక యథావిధిగా తన పోరాటాన్ని కొనసాగిస్తారా? అనేది తేలాల్సిఉంది. అయితే టీడీపీ పట్ల ముద్రగడ వైఖరిలో కొంత మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. నిన్నటివరకూ సీఎం చంద్రబాబుకు ముద్రగడ రాసే ప్రతి లేఖ కొంత వ్యంగ్యంగా కనిపించేది. కానీ తాజాగా రాసిన లేఖలో మర్యాదపూర్వకంగానే సంబోధిస్తూ కాపు జాతికి న్యాయం చేయాలని కోరడం విశేషం. ఏదిఏమైనా ముద్రగడ కాపు రిజర్వేషన్ల సాధనకు చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తూనే తమకు మద్దతు ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని చెప్పడం టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా చెప్పడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ధర్మవరం పట్టణానికి చెందిన జుజూరి నాగరాజు గ్రాఫ్‌ డిజైనర్‌గా పనిచేస్తూ తన అద్భుత డిజైన్‌ ద్వారా అనునిత్యం నూతన వైవిధ్యాన్ని సృష్టిస్తూ, పట్టుచీరల ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారు. దీంతో చేనేత, జౌళి శాఖ అధికారులు నాగరాజుకు మరింత చేయూతనివ్వడంతో ప్రభుత్వం తరపున చేనేత, జౌళి శాఖకు సంబంధించిన స్టాల్స్‌ను ఎక్కడ ఏర్పాటు చేసినా అక్కడ నాగరాజు తాను రూపొం దించిన పట్టుచీరలు, పట్టు వస్త్రాలతో తన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీంతో చేనేత జౌళి శాఖ అధికారులు ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న 12 పథకాలను, తయారు చెయ్యమని చెప్పారు.

cheneta 08082018 2

దీంతో 12 పథకాలైన రుణమాఫీ, వృద్ధా ప్య పింఛన్లు, 50శాతం విద్యుత్‌ రాయితీ, నూలు, రంగులపై 20శాతం సబ్సిడీ, చేనేత కార్మి కుల పొదుపు పథకం, చేనేత క్లస్టర్లు, చంద్రన్న బీమా, ఆదరణ పథకం వంటి పథకా లను పట్టువస్త్రంలో రూపొందించి సీఎం చంద్రబాబునాయుడుకు అందజేయాలని నాగరాజు కు సూచించారు. దీంతో నాగరాజు గత 5రోజులుగా 5మంది కార్మికులతో రేయింబ వళ్ళు కష్టపడి రూ.20వేలు వ్యయంతో పట్టువస్త్రాన్ని రూపొందించి అందులో ప్రభుత్వం చేనేత కార్మికులకు అందజేస్తున్న 12 పథకాలను రూపొందించి బార్డర్‌లో మన రాష్ట్ర చిహ్నాలైన రామచిలుక, వేపచెట్టు, కృష్ణ జింకలను రూపొందించి ముఖ్యమంత్రి చిత్రపటాన్ని కూడా అందులో పొందుపరిచి జాతీయ చేనేత దినోత్సవ సందర్బంగా మంగళవారం సీఎంకు స్వయంగా అందజేసి ధర్మవరం చేనేత ఖ్యాతిని మరింత ఇనుమడింపచేశారు.

cheneta 08082018 3

సంక్షో భంలో కూరుకుపోయిన చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకు వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జాతీయ చేనేత దినోత్స వం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండల పరిధిలోని సెయింట్‌ ఆన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మంగళవారం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. చేనేత రంగం కనుమరుగు కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంద న్నారు. వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగంపై ఆధారపడి ఎక్కువ మంది జీవిస్తున్నారని, వారి సంక్షేమా నికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు.

cheneta 08082018 4

తాను హామీ ఇచ్చిన మేరకు చేనేతలకు రూ.111 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో చేనేతలకు రూ.12కోట్లు రుణ మాఫీ జరిగిందని, వీటిలో చీరాలకు రూ.11.50 కోట్లు వచ్చిందన్నారు. చేనేతలకు 50 సంవత్సరాలకే పింఛన్‌ మంజూరు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 96,900 మంది లబ్ధిపొందుతున్నారని, మర మగ్గాలను 50 శాతం రాయితీపై ఇచ్చినట్లు తెలిపారు. మరో 50 లక్షల మందికి ముద్ర రుణాలు ఇచ్చామన్నారు. చేనేత బజార్లు ఏర్పాటు చేశామని, అంతేగాక చేనేత అభివృద్ధికి పలు సంస్థలతో రూ.10వేల కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు చెప్పారు.

cheneta 08082018 5

మంగళగిరిలో హ్యాండ్‌ లూమ్‌ పార్కు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ చేనేతలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చేనేతలు టీడీపీని ఆదరించారని పేర్కొన్నారు. గ్రామ దర్శిని కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లుతెలిపారు. స్పెషల్‌ రిబేట్‌ క్రింద రూ.30 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆప్కోకు రూ.150 కోట్లు రుణం మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చేనేతలకు హోస్‌ కం వర్క్‌షెడ్‌ నిర్మాణం చేస్తామని తెలిపారు. చేనేత వృత్తిలో ప్రావీణ్యం కలిగిన ఐదుగురిని సీఎం సత్కరించారు. సభలో మంత్రు లు అచ్చెన్నాయుడు, శిద్దా, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

రైల్వే జోన్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో టీడీపీ నేతల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో అనూహ్యంగా బీజేపీ ఎంపీలు జీవీఎల్‌ నరసింహరావు, హరిబాబు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి స్పందించాల్సిన అంశాలపై జీవీఎల్‌ మాట్లాడటం, టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని చెప్పడంతో వివాదం ఏర్పడింది. మంగళవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతృత్వంలో ఎంపీలు, ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఉత్తరాంధ్ర జిల్లాల కు చెందిన 25 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు ఢిల్లీ రైల్‌ భవన్‌లో పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు.

lokesh 08082018 2

పీయూష్‌ ఆర్థిక శాఖను కూడా చూస్తున్న నేపథ్యంలో.. వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ జోక్యం చేసుకొని టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించా రు. దాంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆగ్రహించారు. సీట్లలో నుంచి లేచి జీవీఎల్‌పై మండిపడ్డారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడడానికి మీరెవరు? అసలు ఏపీ గురించి ఏం తెలుసునని మాట్లాడుతున్నారు? మేం కేంద్రమంత్రిని అడుగుతుంటే మీరెందుకు స్పందిస్తున్నారు? అసలు మీరెందుకు వచ్చారు?’’ అని జీవీఎల్‌ను నిలదీశారు. సమావేశంలో ఎవరు పాల్గొనాలో మీరెలా నిర్ణయిస్తారని జీవీఎల్‌ ఎదురుదాడికి దిగారు.

lokesh 08082018 3

సుజనా చౌదరి కల్పించుకుని.. ‘‘మేం కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఆయనే మాకు దీనిపై వివరణ ఇస్తారు. మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు. ఏ హోదాతో మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు’’ అని జీవీఎల్‌కు సూటిగా చెప్పారు. ‘‘ఆంధ్రకు ద్రోహం చేయాలని చూస్తే మిమ్మల్ని రాష్ట్రంలో తిరగనివ్వరు’’ అని కళా వెంకట్రావు పేర్కొనగా... ‘ను వ్వేం చేస్తావ్‌’ అని జీవీఎల్‌ ప్రశ్నించారు. తాను మాట్లాడి తీరతానని తేల్చిచెప్పారు. దీంతో టీడీపీ నేతలు మరింత మండిపడ్డారు. ‘యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు... ఏపీతో ఏం సంబంధం?’ అని ప్రశ్నించారు.

lokesh 08082018 4

అయితే, ఇదే విషయం పై ఐటి శాఖా మంత్రి లోకేష్ ట్వీట్ చేసారు. "మన ఎంపీలు జోన్ ఆవశ్యకత గురించి రైల్వే మంత్రికి చెప్తుంటే, జీవీఎల్ వెనకేసుకుని వచ్చారని, రాష్ట్రానికి అన్యాయం చెయ్యాలని చూస్తున్నారని అన్నారు. నేను కచ్చితంగా చెప్తున్నా, మన రాష్ట్రానికి అన్యాయం చేసిన వారి పేర్లు, ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతాయి" అని ట్వీట్ చేసారు. "When TDP MPs demanded Railways Minister @PiyushGoyal for a Zone in Vizag, @GVLNRAO argued on his behalf and did not let him answer the questions posed by us. Mark my words: the names of these BJP Leaders who betrayed the State will be written in history books as traitors!"

Advertisements

Latest Articles

Most Read