తమిళనాడు రాష్ట్రంలో, ఏమన్నా సమస్య వస్తే, అందరూ కలిసి ఎలా పోరాడుతారో చూస్తూ ఉంటాం. మన రాష్ట్రంలో మాత్రం, మోడీతో డీ కొడుతుంటే, ఆ డీ కొట్టే వాడిని బలహీన పరుస్తూ ఉంటారు. ఎందుకంటే, వీళ్ళు ఉండేది తెలంగాణాలో కాబట్టి, వీరికి ఏపిలో పార్ట్ టైం రాజకీయాలు కావలి కాబట్టి. జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఫార్మ్ హౌస్ ల్లో ఉండే వీళ్ళకి, ఆంధ్రప్రదేశ్ సమస్యల పై ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది. వీరికి కావలసింది రాజకీయం, డబ్బు. దీని కోసం, ఢిల్లీ ముందు బానిసత్వం చేస్తారు. నిన్న పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు ఎలా మోడీ పై విరుచుకుపడ్డారో చూసాం. ఇలా, కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడూ మోడీని టచ్ చేసే సాహసం చెయ్యలేదు. అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉన్న గల్లా జయదేవ్, ఏ మాత్రం భయం లేకుండా, రాష్ట్రమే ముఖ్యమని, 5 కోట్ల మంది గొంతు నిర్భయంగా మోడీ ముందు వినిపించి, మోడీని దోషిగా నిలబెట్టగలిగారు.
ఈ పరిణామంతో, మా బాసునే ఇలా మాట్లాడతారా అంటూ హర్ట్ అయిన, పవన్, జగన్, పురంధేశ్వరి, ఇతర బీజేపీ నాయకులు, ఈ రోజు ఉదయం నుంచి చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు. మా అమిత్ షా, మోడీని అంటే, మేము ఎందుకు ఊరుకుంటాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంగతి, ప్రజలు చేసే పోరాటం సంగతి మాకెందుకు, మా టార్గెట్ చంద్రబాబు అంటూ, చంద్రబాబు పై ఉదయం నుంచి ఒకరి తరువాత ఒకరు విరచుకుపడుతున్నారు. అదే సమయంలో, మోడీని , అమిత్ షా ఒక్క మాట కూడా అనే సాహసం చెయ్యలేక పోతున్నారు. జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు వైఖరికి నిరసనగా, ఈ నెల 24న రాష్ట్ర బంద్కుపిలుపునిచ్చారు. చంద్రబాబు వేస్ట్ అంటూ, ఒక గంట సేపు ప్రెస్ మీట్ లో, 100 సార్లు చంద్రబాబు భజన చేసారు.
ఇక పవన్ కళ్యాణ్ అయితే, అందరికంటే పాపం ఈయనే ఎక్కువ కష్టపడుతున్నారు. నిన్నంతా జగన్ కోర్ట్ లో ఉండటంతో, జగన్ డ్యూటీ కూడా పవనే తీసుకుని, నిన్నటి నుంచే చంద్రబాబు పై ట్వీట్లు పెట్టారు. గల్లా జయదేవ్ స్పీచ్ చాలా వీక్ గా ఉంది, ఇదేమీ స్పీచ్ అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో యు టర్న్ తీసుకున్నారని, నేను ఒక్కడినే ముందు నుంచి మోడీతో పోరాడుతున్నా అని, నిన్న తెలుగుదేశం వృధా ప్రసంగాలు చేసింది అన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే, పురందేశ్వరి స్పందించారు. నిన్న లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పై చర్చ సందర్భంగా బీజేపీ పై టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలేని అన్నారు. మోడీ అన్నీ నిజాలే చెప్పారని అన్నారు. ఈ విధంగా, నిన్నటి నుంచి, ఈ ముగ్గురు కలిసి, నానా తిప్పలు పడి, చంద్రబాబుని మాత్రమే టార్గెట్ చేస్తూ, మోడీ అనే మాట పలకటానికి కూడా వణికిపోతున్నారు.