"అశోక్ గజపతిరాజుని నేనే గెలిపించా" ఓ పెద్దమనిషి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూసి నవ్వుకున్నా.. పూసపాటి మహారాజుల వంశీయుల్లో శ్రీ అశోక్ గజపతి రాజుగారు నేను స్వయంగా చూసిన ఓకే ఒక్క మహారాజుగారు.. నరనరాన సామాజిక స్పృహ ఉన్న రాచబిడ్డ.. రాజకీయాల్లో కంటే సొంత ఆస్థులతోనే ఎక్కువ మంచిపన్లు చేసిన మనసున్న మారాజు గారు.. వాళ్ళ కోట చుట్టుపక్కనున్న చాలావరకు స్థలాల్ని పబ్లిక్కి నివాసాల కోసం, ఉపాధి కోసం దానధర్మాలుగా ఇచ్చేశారని అక్కడున్న ఎవర్నడిగినా పైకి తలెత్తి, దణ్ణం పెట్టుకుని మరీ చెప్తారు.. అందంగా అలరారే కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్, త్రాగునీటి పథకానికి రాజుగారు చేసిన కృషి, మహారాజ హాస్పిటల్స్.. ఇవన్నీ చూస్తే చాలు.. కడుపు నిండిపోయి ఆయనతో మాట్లాడకుండానే ప్రేమ కలుగుతుంది.. వాళ్ళు నివాసం ఉండే పాలస్ తప్ప మిగతా రాజభవనాలన్నిటినీ విద్యాకేంద్రాలుగానో, ఇన్స్టిట్యూట్స్గానో మార్చేసిన విద్యా దాత.. చైర్మన్ ఆఫ్ మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆర్ట్స్ & సైన్స్ (MANSAS) అనేది ఒకటి స్థాపించారని దాని కింద 12 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయని అక్కడ చదువుకుని ఎక్కడెక్కడో స్థిరపడ్డ తెలుగుతేజాలు చెప్తాయి..

pk 02062018 2

విజయనగరంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారని, అక్కడ కోచింగ్ తీసుకున్న నలభైమందిలో ఇద్దరు కుర్రాళ్లు IPL లో కూడా ఆడారన్న మేటర్ ఎవరికి మాత్రం తెలుస్తుందిలే.. ఇలాంటి స్పోర్ట్స్ సెంటర్లు లాంటివే ఇంకా హైదరాబాద్, వైజాగుల్లో కూడా చేయడంలో ఈ రాజుగారి హస్తం ఉందని జనాలకి తెలిస్తే ఇంకేమైనా ఉందా?? భ్రమలు బుడగల్లా పేలిపోవూ..?? విశాఖలో ఒకప్పుడు అంతర్భాగంగా ఉండే విజయనగరాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంలో రాజుగారి పాత్రేంటో బట్టలకి ఫేమస్ అయిన విజయనగరం MG రోడ్ నించి పాటలకు ఫేమస్ అయిన గరివిడి దాకా అందరికీ తెల్సు.. బయటవాళ్ళకి ఎలా తెలుస్తుంది..? ఆయన తండ్రిగారు విజయనగరానికి పట్టాభిషిక్తులైన చిట్టచివరి మహారాజాగారు.. కానీ ఈయన దగ్గర ఆ భుజకీర్తులేమీ కనిపించవు.. అంతటి మహారాజు బిడ్డ కూడా రాజకీయాల్లోకి వచ్చేసరికి సాధారణ మంత్రిలాగే కనబడ్డాడంటే అది ఆయన తప్పు కాదు.. ఆయన స్థానానికే ఆ మంత్రి పదవి చిన్నదని అర్ధం.. ఒక ఊరి కరణం ఇంకో ఊరికి జుట్టుపోలిగాడని రాజకీయాల్లో ఉన్న పనికిమాలిన సూత్రం కదా..

pk 02062018 3

ఎవ్వరి చేతా వేలెత్తి చూపించుకోని వ్యక్తిత్వం.. నీతి, నిజాయితీలకి నిలువుటద్దం.. పంక్చువాల్టీ అంటే ప్రాణం.. శత్రువులు సైతం లేచి చేతులు జోడిస్తారట.. 1989లో అప్పటి ప్రభుత్వం చేత ఉత్తమ ఎమ్మెల్యేగా సత్కారం.. ఇప్పుడు కొత్తగా సంపాదించేది ఏమి లేదు.. అంతకంటే ఏం కావాలి? 1978 నించి మొదలుకుని 1983, 1985, 1989, 1994, 1999, 2009.. ఇలా ఒక్క 2004లో తప్ప మిగతా అన్నిసార్లు వరుసగా MLAగా గెలిచారు.. సారీ.. ఆయన గెలవలేదు.. జనాలు గెలిపించుకున్నారంటే బాగుంటుంది.. ఆయన మీద ఇక్కడి ప్రజల అభిమానం అలాంటిది.. విజయనగరం వెళ్తే అక్కడి జనాలు ఆయన్ని మినిష్టర్గానో, రాజకీయ నాయకుడిగానో చూడరు.. వాళ్ళని పరిపాలించిన "రాజుగారు".. అంతే.!! ఈ రాజకీయాలు అవి వాళ్ళ స్థాయికి తగ్గవి కావు.. ఇంకో విషయం గుళ్ల ఉద్ధరణ.. ప్రతి ఏటా ఘనంగా జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ వేడుకలు గుర్తున్నాయా..? ఆ అమ్మవారు పూసపాటి వంశీకుల ఆడపడుచంట.. అలాగే సింహాచలం శ్రీ వరహనరసింహస్వామి వారి దివ్యక్షేత్రానికి అనువంశిక ధర్మకర్తలు కూడా.. రాజుగారి వైభోగం ఆ చందనోత్సవం రోజునే చూసి తీరాలి.. ఏం గౌరవం అసలు?

అనాలంటే ఎప్పుడో బొబ్బిలి యుద్ధం సినిమాలో "బుస్సిదొరతో చేతులు కలిపి బొబ్బిలి రాజుల్ని ఓడించిన విజయరామరాజు" ని గుర్తు తెచ్చుకుని వీళ్ళ వంశాన్ని నిందించాలి తప్ప దేవుడులాంటి ఈ రాజుగార్ని అనడానికి ఇప్పుడునోళ్లు ఎవ్వరూ సరిపోరు.. ఎంతవరకు నిజమో తెలీదు.. అరవై ఏళ్ల క్రితమే అశోక్ రాజు గారి తాతగారు లైసెన్స్డ్ పైలట్ అని, వాళ్ళ పాత కోటకి వెళ్ళడానికి వాళ్ళ సొంతభూముల్లోనే రన్ వే కూడా ఉండేదని అతి కొద్దిమందికే తెల్సు. అప్పటికి వాళ్ళ తాతగారు కూడా ఊహించి ఉండరు.. భవిషత్తులో ఇండియాకి స్వాతంత్రం కూడా వచ్చి, తన మనవడు కేంద్ర విమానశాఖకే ఏకైక తెలుగు మంత్రి అవుతారని.. అలాంటి రాజుగార్ని ఒకరు గెలిపించడమేంటి?? వాళ్ళ అజ్ఞానం కాకపోతే.. నేను బొబ్బిల్లో చదివేటప్పుడు "మా అశోక్ రాజుగారు లేచినెంటనే పాన్పు మీద నించి కాలు కింద పెట్టేలోపు చెప్పులు తొడగటానికి కూడా పనోళ్లు ఉంటారు" అని కళ్ళు మూసుకుని తన్మయత్వంగా చెప్పే పేరుగుర్తులేని మా విజయనగరం జూనియర్ గాడి మాటలు గుర్తొచ్చాయి.. "ఎందుకురా అలా" అనడిగాను.. "ఆయన రాజుగారు అన్నయ్యా" వాడి సమాధానం.. ????????

నవ్యాంధ్రప్రదేశ్ వడివడి అడుగులేస్తూ… ఉన్నత శిఖరాలను ఎక్కుతోంది. ఏ సంస్థ, ఏ రంగంలో సర్వే చేసినా, అందులో ఆంధ్రప్రదేశ్ టాప్ లో నిలుస్తుంది. నేడు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో మొదటి స్థానం… ఇలా శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటే నవ్యాంధ్ర ప్రదేశ్ కు గమ్యస్థానాలుగా నిర్ధేర్శించుకున్న 2022 నాటికి దేశంలో మూడో అగ్రగ్రామి రాష్ట్రం, 2029 నాటికి అగ్రగామి రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మరెంతో కాలం పట్టదు. ఉపాధి హామీ పథకాన్ని అమలు పరచడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. కూలీలకు పనిదినాల కల్పన, ఆస్తులు నిర్మించడం, ఎక్కువమందికి పని కల్పనలో ఏపీ తొలిస్థానంలో ఉంది. గురువారం నాటికి ఉపాధి హామీ పథకం డ్యాష్‌బోర్డులో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న వివరాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

upadihami 02062018 2

2018-19లో ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో 53,41,970 ఆస్తులను నిర్మించారు. ఈ విభాగంలో రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్‌, తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు వరుసగా ఉన్నాయి. పనిదినాల కల్పనలోనూ 3,76,66,634 పనిదినాలతో ఏపీ తొలిస్థానంలో నిలిచింది. ఛత్తీస్ గఢ్‌, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే, లబ్ధిదారుల సంఖ్యలోనూ 23,75,397 కుటుంబాలకు లబ్ధి చేకూర్చి ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. వ్యక్తిగత కేటగిరి వర్కర్లలో ఏపీ మొదటి స్థానంలో ఉంది.

upadihami 02062018 3

అయితే, క్రియాశీలక కూలీల విభాగంలో మాత్రం ఏపీ కాస్త వెనుకబడి 16వ స్థానంలోకి వెళ్లింది. ఏపీలో మొత్తం 1,75,23,477 మంది ఉపాధి హామీ కూలీలు ఉండగా, అందులో 45 శాతం... అంటే 8,58,265 మంది క్రియాశీలంగా పనిచేస్తున్నారు. 6 కేటగిరీలకు సంబంధించిన గణాంకాలను డ్యాష్‌బోర్డులో పేర్కొనగా అందులో నాలుగు కేటగిరీల్లో ఏపీ తొలి స్థానం ఉంది. అలాగే, ఏపీలో ఉపాధి హామీ పనులు బాగా జరుగుతున్నాయని కేంద్ర బృందం కితాబిచ్చింది. పనుల తనిఖీ నిమిత్తం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారుల బృందం ఈ నెల 28 నుంచి 30 వరకు విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో పర్యటించింది. దేశంలోని మిగతా రాష్ర్టాల కంటే ఏపీలో పనుల తీరు మెరుగ్గా ఉందని కొనియాడారు. ఉపాధి నిధులతో వివిధ శాఖల అనుసంధానం ద్వారా చేస్తున్న అభివృద్ధి ప్రశంసనీయమన్నారు. గ్రామాలను పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దారని అభినంచారు.

ఏపి అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం కూడా.. అలాంటి ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తి చెయ్యటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే, మిగిలిన వారు ఇబ్బంది పెడుతున్నారు..... పోలవరం విషయంలో, కేంద్రం ఇబ్బంది పెట్టిన సంగతి చూశాం... అమరావతి విషయంలో, కొంత మంది అదృశ్య శక్తులు ఆపటానికి చూస్తున్నారు... అమరావతిని అడ్డుకోవటమే ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్న కొంత మంది, రాజధాని నిర్మాణం కోసం లోన్ ఇస్తున్న ప్రపంచ బ్యాంకుకి, లోన్ ఇవ్వద్దు అంటూ, లేఖలు రాసిన సంగతి తెలిసిందే.. వీరికి తోడు, మేధా పాట్కర్, ప్రపుల్ల సమంత్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఈఏఎస్ శర్మ తోపాటు 46 మంది సామాజిక కార్యకర్తలు "నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్" పేరిట ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణం ఇవ్వద్దు అంటూ, లెటర్ రాసారు..

amaravati 01062018 2

ఈ విషయం పై క్షేత్ర స్థాయి పరిశీలనకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతి వచ్చారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు అమరావతి ప్రాంత రైతులు కొన్ని విషయాలు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి నిధులను త్వరితగతిన మంజూరు చేస్తే రాజధానితో పాటుగా భూములిచ్చిన తాము అభివృద్ధి పథంలో పయనిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో రాజధానిలో బాగానే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. రాజధాని గ్రామాల్లో గురువారం 9 మందితో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటించింది. వెంకటపాలెం, మందడం, రాయపూడి, తుళ్ళూరు గ్రామాల్లో ప్రతినిధులు పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. తుళ్ళూరు సీఆర్డీఏ యూనిట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధి అన్న డిజార్డ్ మాట్లాడారు.

amaravati 01062018 3

ఏదేని ప్రాజెక్టుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు సహాయం చేయాలంటే వివిధ అంశాలతో కూడిన పర్యటనలు తరచూ చేయాల్సి ఉంటుందని చెప్పారు. బహుశా ఇది చివరి పర్యటన కావచ్చేమోనని తెలిపారు. మందడం గ్రామంలో పేదలకు నిర్మిస్తున్న గృహ నిర్మాణ సముదాయాన్ని, రాయపూడిలో రోడ్డు నిర్మాణంలో గృహాలు కోల్పోయిన వారికి కేటాయించిన స్థలాల్లో నిర్మిస్తున్న గృహాలను, తుళ్ళూరులోని వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థ కేంద్రాన్ని పరిశీలించారు. ఒక పక్క కేంద్రం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే, రాష్ట్రం లోన్ కోసం వెళ్తుంటే, ఆ లోన్ కూడా రాకుండా, రాష్ట్రంలోని అదృశ్య శక్తులు, ఆ లోన్ రాకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు...

అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ , ఈ విషయమై స్పష్టత వున్నప్పటికీ ఉత్తర్వులు రాబ ట్టడంలో నిర్లిప్తత వహిస్తే ఎలా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయశాఖ అధికారులపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు నుంచి స్పష్టత వచ్చేలా ఎందుకు వాదనలు వినిపించడం లేదని ప్రశ్నించారు. అధికారుల వల్ల కాకుంటే ఢిల్లి నుంచి మంచి లాయర్లను నియమించుకోవాలన్నారు. అదీ కాకపోతే తానే కోర్టుకెళ్ళి వాదనలు వినిపిస్తానని ప్రకటించారని తెలిసింది. బాబ్లి ప్రాజెక్టు ఉద్యమం సమయంలో మహారాష్ట్ర కోర్టులో తామే వాదనులు వినిపించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

cbn 01062018 2

రానున్నది ప్రభుత్వానికి కీలక సమయమని, చేసిన పనులపై ప్రజలలో విస్తృత ప్రచారం క ల్పించాల్సి వుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలలో వున్న సంతృప్తి శాతాన్ని పెంచే క్రమంలో మంత్రులంతా బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగానే వచ్చే సాధారణ ఎన్నికలు అత్యంత కీలకం అని పేర్కొన్న ముఖ్యమంత్రి మంత్రుల కు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. శాఖ లపరంగా మంత్రులు సరిగా పనిచేయడం లేదంటూ సి.ఎం. మండిపడ్డారని తెలిసింది. తిడితే ఇమేజి దెబ్బ తింటుందనే కారణంతో హెచ్చరించడం లేదని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలం వేసే బాధ్యతను కోర్టు తీసుకుంటుందా లేదా ప్రభుత్వం తీసుకోవాలా అనే అంశాలపై త్వరగా తేల్చాలంటూ న్యాయశాఖను ఆదేశించారు.

cbn 01062018 3

తాము చిత్తశుద్దితో పనిచేస్తున్నా అధికారులు ఆ మేరకు పనిచేయడం లేదంటూ మండిపడ్డారు. విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. త్వరలోనే కోర్టు అనుమతితో ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలని చంద్రబాబు పేర్కొంటూ తాజా గా గుంటూరులో ప్రజలు, అగ్రిగోల్డ్‌ బాధితులు చేస్తున్న ఆందొళనను ప్రస్తావించారు. కోర్టు అనుమతితో త దుపరి చర్యలకు దిగాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారని తెలిసింది. హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలుకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించి మరో నివేదికను ఇవ్వాలంటూ కోరారు.అగ్రిగోల్డ్‌ సమస్యపరిష్కారానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం 200 నుంచి 250 కోట్ల రూపాయలను కార్పస్‌ ఫండ్‌గా పెట్టాలనే నిర్ణయాన్ని కేబినెట్‌ తీసుకుంది.

Advertisements

Latest Articles

Most Read