మన దేశ ప్రధానిలాగే 4 వేల కోట్లు ప్రచారానికి ఖర్చు పెట్టే స్థోమత లేదు... మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా, దేశంలో అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల పేపర్లలో, టీవీల్లో యాడ్ లు ఇచ్చేన్ని డబ్బులు రాష్ట్రానికి లేవు.. మా ఆంధ్ర రాష్ట్రానికి ప్రచారం చేసేది ఇలాంటి ప్రపంచ మేధావులే... చరిత్రలో ఎప్పుడు జరగని పనులు చేస్తున్నా, విప్లవాత్మకమైన పనులు, దేశానికే కాక, ప్రపంచానికే ఆదర్శమైన పనులు చేస్తున్నా, అది చెప్పుకోలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి అనుకోండి. గుంటూరులో వ్యవసాయానికి సంబంధించి అతి ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుందని ఎంత మందికి తెలుసు ? నిన్న సోషల్ మీడియాలో కొంత మంది ప్రముఖులు ట్వీట్ చేసే దాకా, ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో, మన గుంటూరులో జరుగుతుందని చాలా మందికి తెలియదు. అందుకే అంటుంది, మన రాష్ట్రానికి ఇలాంటి వారే ప్రచారకర్తలు అని.
రెండు రోజులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ మహాసభల ప్రాంగణంలో ప్రకృతి సేద్యం శిక్షణ తరగతులు పెద్ద ఎత్తున జరిగాయి. రెండేళ్లలో 1.63 లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తున్నారని, 2024 నాటికి 60 లక్షల మంది ప్రకృతి సేద్యం చేసేలా చూడాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. ఇందుకోసం, ఇప్పుడు కాదు, మొన్న దావోస్ వెళ్ళినప్పుడే బీజం పడింది. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/dn1YPwgA-IU . ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో)తో పాటు, అనేక దేశాలతో అప్పుడు చర్చించారు.. నెలల వ్యవధిలోనే, అది ఆచరణలోకి తీసుకువచ్చే కార్యరక్రమం చేసారు చంద్రబాబు. ఇప్పుడు వీరంతా గుంటూరు వచ్చారు. చంద్రబాబు చేస్తున్న కృషికి అభినందన తెలుపుతూ, అక్కడ ప్రసంగించటమే కాదు, ట్వీట్ల రూపంలో, ప్రపంచానికి ఇక్కడ జరుగుతున్న అద్భుతాన్ని తెలియచేసారు..
ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో) ఇండియా సమన్వయకర్త యూరి మాట్లాడుతూ ప్రకృతి సేద్యం అమలు చేయటంలో సీఎం, అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అభినందించారు. అజీమ్ ప్రేమ్‌జీ పిలాంతరి సంస్థ సీఈవో అనంత పద్మనాభన్ మాట్లాడుతూ రాష్ట్రంలో చేస్తున్న ప్రకృతి సేద్యం మనకు గర్వకారణమన్నారు. నైరోబీ ఈడీ రవిప్రభు మాట్లాడుతూ పెట్టుబడి లేని వ్యవసాయ సేద్యంకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎఫ్‌ఏవో అధినేత శ్యామ్‌ఖడ్గే మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినా రైతులకు లాభాలు రాకపోవటానికి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటమే కారణమని పేర్కొన్నారు.
ఎఫ్‌ఏవో, ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకృతి సేద్యానికి సహకరిస్తాయన్నారు. అడయాన్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ తమ బ్యాంకు పీఎన్‌బీ 158 సంవత్సరాలుగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఇతర సంస్థలతో కలసి పని చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధి పవన్ సుఖదేవ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 420 మిలియన్ల మంది డయాబెటీస్, 670 మిలియన్ల మంది ఒబిసిటీ వ్యాధులతో బాధపడుతున్నట్లు ప్రపంచ పోషకాహార సంస్థ నివేదికలు ఇచ్చిందన్నారు. మరో ప్రతినిధి సన్నీవర్గీస్ మాట్లాడుతూ రసాయనిక మందులతో నీరు కలుషితమై వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఇండోనేషియా మాజీ మంత్రి డాక్టర్ పుంటోరా మాట్లాడుతూ తమ దేశంలో ఇపుడిప్పుడే ప్రకృతి సేద్యాన్ని అమలు చేస్తున్నారని, రాష్ట్రం ముందంజలో ఉందని అభినందించారు.