అరేయ్ రోడ్డున పడేసారు రా, సహాయం చెయ్యండి రా అంటే, ఒకడికి మించిన, దగా ఇంకొకడు చేస్తాడు... కట్టు బట్టలతో రోడ్డున పడేసి, కనీసం రాజధాని కూడా లేకుండా, ఈ దేశం అత్యున్నత చట్ట సభలో, తలుపు మూసి, లైవ్ ఆపేసి, ఒక రాష్ట్రాన్ని విడగోట్టాయి, ఈ దేశపు రాజకీయ పార్టీలు... తిరుపతి వెంకన్న సాక్షిగా, ప్రధాని అభ్యర్ధి హోదాలో, ఢిల్లీకి మించిన రాజధాని కట్టిస్తాం అన్నారు... ప్రపంచంలో అద్భుతమైన సిటీలు చూసి రండి, అలాంటి రాజాధాని కట్టుకుందాం అని చెప్పారు మోడీ... దగా పడ్డ ఆంధ్రుడు, మన దమ్ము ఏంటో ఈ దేశానికి చూపించటానికి, అమరావతి నిర్మాణం పూనుకున్నాం... 5 కోట్ల ఆంధ్రుల కోసం, 33 వేల ఎకరాలు త్యాగం చేసారు అమరావతి రైతులు...
మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమి చేసింది ? నిధులు ఇవ్వటం లేదు... అందుకే రాష్ట్రం పోరాడుతుంది... బీజేపీ ఎందుకు నిధులు ఇవ్వతంలేదో చెప్పాలి.. రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఎమన్నా ఉందేమో చెప్పాలి.. కాని, బీజేపీ మదం చూసారా... మొన్న, బీ జె పీ అధికార ప్రతినిధి జీ వీ ఎల్ నరసింహారావు అమరావతి లో మయసభ కడ్తున్నారా , 43 వేల కోట్లు రాజధాని కి అవసరమా అని అవహేళన గా మాట్లాడు.. ఈ రోజు ఏకంగా, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ ఎకౌంటు లో కూడా, ఇవే కూతలు... అంటే, ఇదేనా బీజేపీ విధానం ? మేము మంచి రాజధాని కట్టుకోవద్దా ? ప్రధాని మోడీ చెప్పినట్టు, ఢిల్లీకి తలదన్నే రాజధాని మాకు అవసరం లేదా ? అహ్మదాబాద్లో ఒక కన్వెన్షన్ సెంటర్ కు 1500 కోట్లు, పటేల్ విగ్రహానికి 2500 కోట్లు, శివాజీ విగ్రహానికి 4 వేల కోట్లు, అవసరమైన మీకు ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎంత అవసరమో తెలియదా ?. మరి ప్రధానమంత్రి అభ్యర్థి గా తిరుపతి లో మోడీగారు ఢిల్లీ కి మించిన రాజధాని కి సహకరిస్తామన్న విషయాన్నీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ని ఆస్తానా కు వెళ్లి చూసి అమరావతి డిజైన్స్ ఖరారు చేయమ్మాన మోడీ గారు స్ఫూర్తి అనుకొన్నాం...
అమరావతి నిర్మాణానికి 43 వేల కోట్ల రూపాయలకు డీ పీ ఆర్ లు పంపితే, అందులో పొందుపరచిన అంశాలను చూడకుండా మయసభ నిర్మాణానికా అనడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానపరచడమే.. నవంబర్ 2017 లో పంపిన డీ పీ ఆర్ ల ప్రకారం : 11 వేల 602 కోట్లు రూపాయిలు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్ కు సంబందించినది , అందులో అసెంబ్లీ , సెక్రెటేరియట్ , రాజభవన్ , హెచ్ ఓ డీ తదితర నిర్మాణాలు , మినిస్టర్లు - ఏం ఎల్ ఏ లు , ఏం ఎల్ సి లు , రాజధానిలో పనిచేసే అధికారుల నివాసాలు కు సంబందించిన నిర్మాణాలు వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబందించిన అంశాలు... 32 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు : కృష్ణ నది పై ఐకానిక్ వంతెన , రాజధానికి అవసరమైన రహదారులు , సీనరేజ్, డ్రైనేజీ , ఎలెక్ట్రిఫికేషన్ తదితర సామాజిక మౌలిక సదుపాయాలకు సంబందించినవి కేంద్రానికి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం... దీన్ని మయసభ అంటారా ? మీ ఢిల్లీ మదం దించుతాం... ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇలాగే విర్రవీగి పాతాళంలో ఉంది, ఇప్పుడు మీ వంతు... చివరగా, అమరావతి మయసభ కాదురా, దగా పడ్డ ప్రతి తెలుగోడి ఆత్మగౌరపు ఇంద్రసభ.. ఖబద్దార్ ఢిల్లీ పాలకులారా...