ఉండవల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక అంశాలలో స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో భావోద్వేగాలు అధికం.వారి మనోభావాలను గుర్తించాలి,గౌరవించాలి.విభజన సమయంలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఒక్క సారిగా రోడ్ల పైకి వచ్చారు. తరువాత మౌనంగా ఉన్నా ఎన్నికల్లో చేయాల్సింది చేశారు,కాంగ్రెస్ పార్టీని ఘోరంగా శిక్షించారు...125ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కకపోవటమే ఇందుకు ఉదాహరణ. విభజన హామీలపై ఒక్కోపార్టీ ఒక్కో అజెండాతో ముందుకు వెళ్తున్నాయి.వ్యక్తిగత అజెండాలు,పార్టీగత అజెండాలు అమలుచేస్తున్నారు.
ఏ పార్టీల అజెండా ఎలా ఉన్నా.... మనం మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్దాం. రాష్ట్ర ప్రయోజనాలే మన ప్రధాన అజెండా...ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దు.ప్రతి వేదికపై మనం చేస్తున్న పోరాటం,మూడేళ్లుగా మనం చేసిన కృషిని గురించి వివరించండి. విభజన సమయంలో 8రోజులు ఏపి భవన్ లో దీక్షచేశాను.ఇరు ప్రాంతాలకు సమాన న్యాయం చేయమంటే ఎగతాళి చేశారు. అందరినీ కూర్చోబెట్టి నచ్చజెప్పి ఇరుప్రాంతాలకు ఆమోదయోగ్య పరిష్కారం చేయమంటే పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.ఫలితం అనుభవించింది.ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు.
ఇక్కడ మనలను విమర్శించే పార్టీలు వాళ్ల జాతీయ కార్యవర్గాల మీద ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నాయి.వాళ్ల ఎంపిలతో ఏపికి మద్ధతుగా పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడించలేక పోతున్నాయి? జాతీయ స్థాయిలో ఆయా పార్టీలు ఎందుకని ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి గొంతెత్తడంలేదు..? 29 రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై అవిశ్వాసం పెడతామని రాహుల్ అంటున్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ కు ఏవిధంగా ప్రయోజనం..? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు అంత గొడవ చేస్తుంటే సోనియా గాని, రాహుల్ గాని కనీసం నోరువిప్పి మాట్లాడలేదు. రాజ్యసభలో కేవిపి ప్లకార్డులు పట్టుకుంటే మాకు సంబంధం లేదు సస్పెండ్ చేసుకోండని ఆజాద్ అనడం ఆపార్టీ చిత్తశుద్దికి నిదర్శనం. వైకాపా చివరలో రాజీనామాలు చేస్తామనటం వల్ల ఉపయోగం లేదు...., చివరి ఏడాది కాబట్టి ఉపఎన్నికలు రావనే దుర్బుద్దితో వైకాపా రాజకీయాలు చేస్తోంది.