జగన్ మోహన్ రెడ్డి అవిశ్వాసం డ్రామా వెనుక ఎంత క్రిమినల్ మైండ్ దాగుందో తెలుసా ? ప్రజలని జగన్ బ్యాచ్ ఎలా పిచ్చోల్లని చెయ్యాలని భావించిందో తెలుసా ? వేసే డ్రామాలు వెయ్యక, పెద్ద పోటుగాడిలా పవన్ ని కెలిక, ఇప్పుడు మెడకు చుట్టుకునేలా చేసుకున్నాడు జగన్... అసలు జగన్, మోడీ మీద అవిశ్వాసం పెట్టే దమ్ము ఉందా అని అందరూ అనుకున్నారు... నోటి మాట వేరు, ఒక సంతకం పెట్టి, మోడీ మీద నాకు విశ్వాసం లేదు అని చెప్పటం వేరు... జగన్ అంత సాహసం చెయ్యగలడా ? మరి అవిశ్వాసం డ్రామా ఏంటి ? బీజేపీతో ఒప్పందం చేసుకున్నాడా ? అసలు జగన్ ప్లాన్ ఏంటి ? ఇది తెలిస్తే, జగన్ ప్రజలని ఎలా పిచ్చోల్లని చేద్దామనుకున్నాడో అర్ధమవుతుంది...

jagan 20022018 2

అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలంటే కనీసం రెండు వారల ముందు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలి... ఇది లీగల్ ఎక్స్పర్ట్స్ కాని, పార్లమెంటరీ ప్రొసీజర్ తెలిసిన ఎవరికైనా తెలేసే మొదటి విషయం.... కానీ జగన్ సభ చివరి వారం లో నోటీసు ఇస్తాను అనడంలో లెక్క ఉంది... అంటే జగన్ నోటీసు చెల్లదు , కారణం సభ కంటిన్యుయస్ గా రెండు వారాలు నోటీసు ఇచ్చాక జరగాలి... కానీ సభ ముగిసే వారం ముందు నోటీసు ఇస్తే ఎలా , దాని వల్ల ఈ తీర్మానం రాదు, ఇది జగన్ పొలిటికల్ క్విడ్ ప్రో క్రో... గతం లో కూడా ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని చెప్పి , విభజన తథ్యం అని తెలిశాక సమైక్య ఉద్యమం వేడిని వాడుకోవాలని ప్రయత్నించి చివరన సమైక్యం అన్న వైస్సార్సీపీ ని ప్రజలు తిరస్కరించారు... ఇప్పుడు వైస్సార్సీపీ చెప్పే అవిశ్వాసం తీర్మానం కూడా అంతే.

jagan 20022018 3

డ్రామాలతో నిబంధనలు తెల్సి కూడా అవిశ్వాస తీర్మానాలు ఉపయోగపడవు.. చర్చ కోసమే అవిశ్వాసమైతే , సుజనా చౌదరి 15 రోజులలో విభజన హామీలన్నిటిన్నీ కాలపరిమితితో పూర్తీ చేయడానికి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయలేక పొతే చర్చకు అవకాశం ఇవ్వాలని మంత్రిగా ఉండి పోరాడితే, మీరు ఎలా ప్రశ్నిస్తారు , ఎలా చర్చకు కోరుతారు అని అడ్డుపడి స్పీకర్ గారి తో చివాట్లు తినలేదా. సంఖ్య బలం చూసుకొని ఇతరుల సహకారంతో అవసరమైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి చంద్రబాబు వెనుకాడాను అని ఇప్పటికే చెప్పారు... అయితే సామ భేద దండోపాయాలు విధానంతో చంద్రబాబు వెళ్తున్నారు... కేంద్రం స్పందన బట్టి చంద్రబాబు విధానం ఉంటుంది...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం బెంగుళూరులో జరిగిన హడిల్ 2018 కార్యక్రమంలో పాల్గున్నారు... ది హిందూ అధ్వర్యంలో జరిగిన ఈ కాంక్లావ్ లో ముఖ్యమంత్రిని, NDTV మ్యనిజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ జైన్ ఇంటర్వ్యూ చేసారు... అక్కడ జగన్ గురించి ప్రస్తావన వచ్చింది... వైఎస్ఆర్ లాగా, జగన్ మీకు ఛాలెంజ్ అవుతాడు అనుకుంటున్నారా ? జగన్ మీకు త్రెట్ అవుతాడు అనుకుంటున్నారా అని యాంకర్ అడగగా, చంద్రబాబు చెప్పిన సమాధానం వింటే, ఆశ్చర్యపోతారు... జగన్ అయితే, ఈ సమాధానం వింటే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాడు... జగన్ ని సపోర్ట్ చేసే వారు అయితే, సిగ్గుతో ఇబ్బంది పడతారు... ఏది లేనోడు అయితే, తుడుచుకుని, ఆహా ఒహా జగన్ అని, ఎప్పటిలాగే వాళ్ళ ఫ్లో లో, వాళ్ళు ఉంటారు... ఇంతకీ జగన్ గురించి చంద్రబాబు అభిప్రాయం ఏంటో తెలుసా...

cbn on jagan 19022018 2

ఆ యాంకర్ కి సమాధానం ఇస్తూ, అసలు జగన్ లాంటి వాడిని నా లాంటి నాయకులతో కంపేర్ చేస్తారా ? ఇలాంటి ప్రశ్నలకు , నా లాంటి వాడు సమాధానం చెప్పగలరా, ముందు మీరు ఆలోచించుకోవాలి... ప్రతి శుక్రవారం కోర్ట్ కి పోతాడు... నిన్న ఓకే ఛార్జ్ షీట్ వేసారు, ఇవాళ మరో చార్జ్ షీట్ వేసారు... గత నలభై ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా, నాకు దేశంలో ఎంత గౌరవం ఉందో మీకు తెలుసు... అలాంటిది, ఇలాంటి వాడితో నన్ను కంపేర్ చేస్తూ, ప్రశ్నలు అడిగితే, నేనేమి చెప్పగలను... కొన్ని సార్లు, ఇలాంటి ప్రశ్నలు అడిగితే, నాకే గిల్టీగా ఉంది అంటూ చంద్రబాబు అన్నారు...

cbn on jagan 19022018 3

ఇండియన్ పాలిటిక్స్ లో ఉన్న బ్యూటీ ఇదే అని, అందరినీ ఒకే గాటిన కట్టి, చూస్తారని అన్నారు... ఇలాంటివి ఎదుర్కోవటం ఒక పెద్ద ఛాలెంజ్ అని అన్నారు... జగన్ అనే వాడు నాకు త్రెట్ ఏంటి ? ఆ విషయం తరువాత, ఇలాంటి ప్రశ్నలు సరి కాదు... మనం ఇప్పుడే దేశంలో ఉన్న అవినీతి గురించి మాట్లాడుకున్నాం... ఈ జగన్ అనే వాడు, దేశంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడు... అక్రమ ఆస్తులు అన్నీ జప్తులో ఉన్నాయి... ఇలాంటి వ్యక్తి గురించి, నాతో కంపేర్ చేస్తూ, నన్ను అతని గురించి మాట్లాడమంటారా అంటూ చంద్రబాబు అనటంతో, ఆ యాంకర్, జగన్ టాపిక్ ఆపేశారు...

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సవాళ్లు, ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి... నిన్న జగన్ మాట్లాడుతూ, హోదా కోసం రాజీనామా చేయండయ్యా అంటే.. చంద్రబాబు పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌ కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని అన్నాడు. కానీ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోవడానికి 54 మంది సభ్యుల సంతకాలు కావాలి. అంత బలం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు లేదు, పవన్‌ కళ్యాణ్‌ గారూ.. మిమ్మలి ఒక్కటే కోరుతున్నా.. మీ పార్టనర్ చేత ఆ మద్దతు ఇప్పించండి అని సవాలు విసిరారు...

jagan pawan 19022018 2

దానికి, ఈ రోజు పవన్ ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు... జగన్ మోహన్‌రెడ్డి సవాల్‌‌ను స్వీకరిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. అవిశ్వాస తీర్మానంపై జగన్‌‌ విసిరిన సవాల్‌‌కు స్పందించారు... ఒక్క ఎంపీతో నైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కావాలన్నారు.. మీకు కావాల్సిన మద్దతు నేనిస్తాను. మార్చి 4వ తేదీన నేను ఢిల్లీకి వస్తాను. అందరు ఎంపీల మద్దతు కూడగడతాను. ముందు జగన్‌ అవిశ్వాస తీర్మానం పెట్టాలి" అని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు...

jagan pawan 19022018 3

జగన్ అవిశ్వాసం పెడితే మీకు నేను అండగా ఉంటానని, సీపీఎం, సీపీఐలను తీసుకు వస్తానని, కావాలంటే కర్నాటక వెళ్తానని చెప్పారు... కాని మొదటి రోజే, అవిశ్వాస తీర్మానం పెట్టండి అంటూ, పవన్ ప్రతి సవాల్ విసిరారు... మీరు దేనికీ భయపడొద్దు, మీరు ధైర్యవంతుడు, దమ్ము ఉన్నవాడు అంటూ వెటకారంగా జగన్ ను అని, మీరు భయపడవద్దు, మీకు అండగా నేను ఉంటాను, అఖిలపక్షం అండగా ఉంటుంది, కాని మీరు మొదటి రోజే కేంద్రం పై అవిస్వాసం నోటీసు ఇవ్వమని ఛాలెంజ్ చేసారు...

రాష్ట్ర రాజకీయం మొత్తం, ఇప్పుడు కేంద్రం పై అవిశ్వాసం అనే అంశం పై జరుగుతుంది... తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, ఈ విషయం పై స్పందించారు... చంద్రబాబు మాట్లాడుతూ "విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేస్తారనే బీజేపీతో కలిసాం... మూడున్నర ఏళ్ల అయినా ఇంకా హామీలు నేర వేర్చ లేదు... 29 సార్లు ఢిల్లీ వెళ్లి ఆదుకోవాలని చెప్పా... బడ్జెట్లో మనకు ఏమీ ఇవ్వలేదు... మనకు అన్యాయం జరిగిందని చెప్పిన పార్టీ పోరాడిన నేతలు టీడీపీ వారే... కొందరు నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు" అని అన్నారు...

cbn aviswasam 19022018 2

లాలూచీ పడ్డారని కొందరు విమర్శలు చేస్తున్నారని, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చంద్రబాబు అన్నారు... ప్రజలకు అన్యాయం జరిగితే సీఎం గా ఉపేక్షించను అని, ప్రజల తరుపున పోరాడుతానని చంద్రబాబు అన్నారు.... ఎలాంటి త్యాగాలకు అయినా సిద్ధం అని చెప్పారు.... రాజీనామా లు చేస్తే పార్లిమెంట్ లో పోరాడే వారు ఎవరుంటారు, దాని వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.....

cbn aviswasam 19022018 3

అవిశ్వాసం పై మాట్లాడుతూ "గతంలో రాజీనామాలు చేస్తామన్న వైకాపా ఇప్పుడు డ్రామాలు ఆడుతోంది... అవిశ్వాసం అంటున్నారు... అది ఆఖరి ప్రయత్నం కావాలి... మనం అవిశ్వాస తీర్మానం పెట్టలేము... 50 మంది పైగా మద్దతు కావలి... అవసరమైతే ఇతర పార్టీల సాయం తీసుకుని అవిశ్వాసం దిశగా ముందుకు వెళతా... నేనేదో అవిశ్వాసం పెట్టడం ఇష్టం లేక మాట్లాడినట్టు కొందరు వక్రీకరించారు... అది ఆఖఃరి ప్రయత్నం మాత్రమే కావాలి... అప్పటి వరకు పోరాటమే మా పార్టీ మార్గం" అని చంద్రబాబు తేల్చి చెప్పారు....

Advertisements

Latest Articles

Most Read