వైసిపీ - బీజేపీ బంధం రోజు రొజుకీ బలపడుతుంది.. నిన్న మొన్నటి వరకు చాటుగా ఉన్న వ్యవహారం, నెమ్మదిగా బహిరంగం అయిపోతుంది... ఒక పక్క చంద్రబాబు ఉతుకుడు మొదలు పెట్టటంతో, బీజేపీ కూడా అన్నిటికీ తెగించి, జగన్ తో వెళ్ళటానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది... ఈ నేపధ్యంలో, బీజేపీ నేత మాణిక్యాలరావు కీలక వ్యాఖ్యలు చేశారు... ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... ఒకరు తమతో పొత్తు వదులుకుంటే, మరొకరు కలవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.... అంటే దీన్ని బట్టి, జగన్ ఎంతగా క్లోజ్ అయిపోయారో తెలిసిపోతుంది...

manikyalarao 19022018 2

టీడీపీ తెగదెంపులు చేసుకోక ముందే మనమే బయటకొద్దామని తమ నేతలతో ఇప్పటికే చెప్పానని మాణిక్యాలరావు అన్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి ఏమి చేశామో ప్రజలకు చెబుతామని అన్నారు.... కేంద్రం ఎంతో చేసింది అని, అదంతా ప్రజలకు చెప్తాం అన్నారు... మంత్రి పదవులకి రాజీనామాలు చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే నిమిషంలో చేస్తామని చెప్పుకొచ్చారు.... టీడీపీతో పొత్తు విడిపోతే బీజేపీకి పెద్దగా నష్టం ఉండదని తెలిపారు.

manikyalarao 19022018 3

బీజేపీతో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో మూడు పార్టీలు తెగతెంపులు చేసుకున్నాయని, ఏపీలో టీడీపీతో పొత్తు తెంచుకునే ఉద్దేశం తమకు లేదని, తప్పదు అనుకుంటే ఎంతో సేపు పట్టాదు అని మాణిక్యాలరావు చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని త్వరలోనే ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. బీజేపీతో టీడీపీ విడిపోయినా కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు. బీజేపీతో పంజాబ్‌లో అకాళీదల్, మహారాష్ట్రలో శివసేన, ఒడిశాలో బీజేడీ పార్టీలు తెగదెంపులు చేసుకున్న విషయం తెలుసుకోవాలంటూ, టిడిపి వెళ్ళిపోయినా, మా కొత్త స్నేహితుడు జగన్ రెడీగా ఉన్నాడనే సంకేతం ఇచ్చారు..

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ ఆంధ్రా వాడి ఆక్రోశాన్ని పార్లమెంట్ వేదికగా దేశానికి వినిపించి, మాకు ఇంత అన్యాయం చేస్తావా, సమాధానం చెప్పండి ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’అంటే, రాష్ట్ర బీజేపీ నాయకులకి బాగా కాలినట్టు ఉంది... మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని సంబోధించి ఘన కార్యం సాధించినట్టు భావిస్తున్నారు! జాగ్రత్తగా మాట్లాడండి అంటూ బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్‌రాజు గారు అంటున్నారు.. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అని మీరు సంబోధించినా 'మిస్టర్ చీఫ్ మినిస్టర్ 'అనే కుసంస్కారం మాకు లేదు అంటున్నారు రాజు గారు...

bjp 19022018 2

అయినా రాజు గారు, ‘మిస్టర్' అనేది గౌరవ వాచకం గౌరవ శాసనశాసన సభ్యుల వారికి ఇది తెలియదా... ప్రధానమంత్రిని ఆ రేంజ్ లో నిలదీయటం సహించలేక, జయదేవ్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం లేక, 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ' అని తప్పుగా సంబోధించాడు అనే పసలేని పాయింట్ లేవదీశారు ..'మిస్టర్ ప్రెసిడెంట్', 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్' అని అడ్రెస్ చేయటంలో ఏ మాత్రం తప్పులేదు. అది చాలా మర్యాదతో కూడిన సంబోధన.. అమెరికాలో మిస్టర్ ప్రెసిడెంట్ అంటారు... బ్రిటన్ పార్లమెంట్ లో 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్' అంటారు..

bjp 19022018 3

బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినప్పుడు రామలింగరాజు కూడా క్లింటన్ ని 'మిస్టర్ ప్రెసిడెంట్..' అనే సంబోధించాడు..రామలింగరాజు , జయదేవ్ ఇద్దరూ అమెరికాలో చదువుకున్నారు.. అక్కడ అలా అడ్రెస్ చేయటం చాలా సహజం , స్టాండర్డ్ వే అఫ్ అడ్రెసింగ్ అనమాట ...ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు, మాట ఎందుకు తప్పారు , మా ఆంధ్ర ప్రజల మొహాన మట్టి ఎందుకు కొట్టారు అని గట్టిగా నిలదీయటం వలన ఉక్రోషం పట్టలేక 'అలా పిలిచాడు' ఇలా పిలిచాడు' అంటన్నారు.. భావదారిద్ర్యం అనమాట...

12 ఓట్లతో గెలిచాను, ఇక నియోజకవర్గ సమస్యలు ఎందుకు అనుకున్నాడో ఏమో, పనీ పాట ఏమి లేనట్టు, ఎక్కడ లిటిగేషన్ ఉంటే, అది పట్టుకుని కేసులు వేసి, ఎప్పుడూ కోర్ట్ ల చేత మొట్టికాయలు తింటా ఉంటాడు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మల్యే, జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి... అమరావతి మీద ఎన్ని కేసులు వేసాడో చూసాం, పేదలకు ఇచ్చే ఫైబర్ నెట్ మీద కేసులు, సాధావర్తి భూముల పై కేసులు వేసి, ప్రభుత్వానికి రూపాయ్ ఆదాయం రాకుండా చేసాడు... ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక పై పడ్డాడు... మొన్నా మధ్య జగన్, ప్రధానిని కలిసినప్పుడు, ఈడీ అధికారుల మీద ఫిర్యాదు చేసాడు అని జ్యోతి రాసింది...

alla 19022018 2

బయటకు వచ్చి ప్రజల కోసం ఎదో ప్రధానితో మాట్లాడినట్టు బిల్డ్ అప్ ఇచ్చాడు జగన్... అయితే, ఆంధ్రజ్యోతి తన కేసుల కోసమే, జగన్ కలిసాడు అని, అప్పుడు ప్రాధానికి ఇచ్చిన లేఖ కూడా బయట పెట్టింది... దీని పై జగన్ తరుపున, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మా జగన్ అన్న పరువు పోయింది అని, ఆంధ్రజ్యోతి పై చర్యలు తీసుకోమని, సుప్రీం కోర్టుకు వెళ్ళితే, ఈ పిటిషన్, అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించలేదు. గతంలో ఇదే పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఆంధ్రజ్యోతి వార్తలో పరువునష్టం కలిగించే అంశాలేవీ కన్పించడంలేదని ఇలాంటి వార్తలు సహజమని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఆళ్ల రామృష్ణారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు.

alla 19022018 3

ఆళ్ల పిటిషన్‌పై సుప్రీంలో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు కల్వన్‌కర్, డీవై చంద్రచౌద్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఆళ్ల తరపున ప్రముఖ న్యాయవాది జయంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంలో తన పార్టీ అధినేతను తప్పుడుగా చూపించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విజ్ఞాపన పత్రం ఇస్తే... తప్పుడుగా ప్రచారం చేశారంటూ ఆళ్ల తరపున జయంత్ భూషణ్ వాదించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా ప్రస్తావించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ఆంధ్రజ్యోతి కథనంలో పరువునష్టానికి సంబంధించిన అంశాలేవి కనిపించలేదంటూ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించారు. అయినా, ప్రజలందరికీ తెలుసు కదా, జగన్, మోడీని ఎందుకు కలిసాడో... ఎంత మంది మీద పరువు నష్టం దావా వేస్తారు...

ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పని, ప్రజల మన్ననలు పొందింది... ఒక ముఖ్యమంత్రే, సామాన్యుడు దగ్గరకు వెళ్లి, విషయం కనుక్కుని సాయం చెయ్యటం చాలా అరుదు... పోగొండ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కామవరపుకోట మండల పార్టీ మాజీ సెక్రటరి టిడిపి విరాభిమాని షేక్ మహబూబ్ పడుతున్న ఇబ్బంది గురించి, స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు..

cbn help 19022018 2

కామవరపుకోట మండలనికి చెందిన, షేక్ మహబూబ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మహబూబ్ ఆరోగ్య పరిస్థితి గురించి మాగంటి బాబు గారు,కె.కోట జడ్పీటీసీ ఘంటా సుధీర్ బాబుగారు,కె.కోట ఉపసర్పంచ్ నెక్కలపు సూర్యనారాయణ గారు,కోనేరు సుబ్బారావు గారు చంద్రబాబు గారికి తెలిపారు... వెంటనే స్పందించి మాబు దగ్గరకు వచ్చి నీకు నేను అండగా వుంటాను అని చెప్పి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

cbn help 19022018 3

నాలుగు సంవత్సారాల క్రితం భయంకరమైన అరుదైన మోటార్ న్యూరో డిసిస్ గురవ్వగా, అతని వైద్యానికి అయ్యె ఖర్చు కుటుంబానికి అర్దికంగా భారమై కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా వుండటంతో, వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పటంతో, చంద్రబాబు స్వయంగా ఆ బాధితుడు దగ్గరకు వెళ్లి, కారులో ఉన్న అతన్ని పరామర్శించి, అన్ని విధాలుగా ఆదుకుంటాను అని, ఏమి ఇబ్బంది పడవద్దు అని, ఇప్పుడే 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రకటిస్తున్నా అని, అతనికి భరోసా ఇచ్చారు... మెరుగైన చికిత్సకు గల అవకాశాలను చూడమని, అక్కడ అధికారులకి చెప్పారు...

Advertisements

Latest Articles

Most Read