ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డ్రీం ప్రాజెక్ట్ ప్రారంభించటానికి, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 27వతేదీన ఆంధ్రపద్రేశ్ రాజధాని అమరావతికి వస్తున్నారు... చంద్రబాబు డ్రీం ప్రాజెక్ట్ అయిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రారంభించటానికి రాష్ట్రపతి వస్తున్నారు... ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారు... మంగళవారం ఆయా శాఖాధిపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఇంటికి తక్కువ ధరకే కేబుల్, ఇంటర్నెట్ సదుపాయం అందనుంది. చంద్రబాబు నాయుడు 150 రూపాయలకే ఫైబర్ గ్రిడ్‌ ద్వారా కేబుల్, ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా డిసెంబర్ 27 నుండి దీనికి సంబంధించిన పనులు మొదలుకానున్నాయి.

godavari 12122017 2

ఫైబర్‌ గ్రిడ్‌ కింద రెండు బాక్సులనూ సాఫ్ట్‌వేర్‌తో కలసి రూ.4వేలకే అందచేస్తారు. ఒకేసారి రూ.4 వేలు చెల్లించే వినియోగదారులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. అంత చెల్లించలేని వాళ్లు... తొలుత రూ.1700 చెల్లించి, మిగిలింది నెలకు రూ.99 చొప్పున మూడేళ్లపాటు విడతల వారీగా చెల్లించవచ్చు. అదేవిధంగా రూ.500 చెల్లించి... నెలకు రూ.99 చొప్పున నాలుగేళ్లపాటు సులభవాయిదాల్లోనూ చెల్లించే వీలుంది. దక్షిణ కొరియా, చైనా నుంచి ఈ బాక్సులు వచ్చేందుకు కనీసం 7 వారాలు పడుతుంది. అందువల్ల, రాష్ట్రంలో టీవీ ప్రసారాలు, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు జనవరి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందించాలని పైబర్‌ గ్రిడ్‌ అధికారులు భావిస్తున్నారు.

godavari 12122017 3

నెలకి రూ.149కి ఉచిత టెలిఫోన్‌, 10ఎంబీపీఎస్‌ వేగంతో కూడిన ఇంటర్‌నెట్‌, ఉచిత ఛానళ్లతో కూడిన కేబుల్‌ టీవీ ఇవ్వాలని ఏపీ ఫైబర్‌ తొలుత ప్రతిపాదించింది. తాజాగా ఇందులో మార్పు చేసి సాధారణ వినియోగదారునికి అవసరమయ్యే పే ఛానళ్లను సైతం నెలకి రూ.149 రుసుంతోనే ఇవ్వాలని నిర్ణయించింది. తెలుగులోని చాలా వరకు పే ఛానళ్లతోపాటు కొన్ని హిందీ, ఇంగ్లీష్‌ పే ఛానళ్లు, క్రీడలకు సంబంధించిన మరికొన్ని పే ఛానళ్లు ఇందులో ఉండనున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన ఛానళ్ల యాజమాన్యాలతో ఒప్పందాలు సైతం పూర్తయ్యాయి. ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల చేస్తున్న ప్రసారాల్లో 220 ఛానళ్ల వరకు వస్తున్నాయి. వీటిల్లో వివిధ భాషలు, విభాగాలకు చెందిన పే ఛానళ్లు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈనెల 22వతేదీన సందర్శించనున్నారని వార్తలు వస్తున్నా నేపధ్యంలో, రేపే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి గడ్కరీని కలవటం హాట్ టాపిక్ గా మారింది... కొద్దిసేపటి క్రితం టెలిఫోన్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు మాట్లడారు... అయితే అనూహ్యంగా, రేపే పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు....

delhi 12122017 2

ఒక పక్క రేపు అమరావతి డిజైన్లు ఫైనల్ చెయ్యటానికి నార్మన్ ఫాస్టర్ తో మీటింగ్ ఏర్పాటు చేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు... అయితే, ఆ మీటింగ్ కూడా కాన్సిల్ చేసుకుని, రేపు ఢిల్లీ వెళ్లనున్నారు... అనుకోని ఈ పరిణామంతో, ఒక్కసారిగా మళ్ళీ పోలవరం పై వేడి పెరిగింది... రొటీన్ ప్రాసెస్ లో భాగంగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారా ? లేక ఇంకా ఏమైనా విషయం ఉందా అనేది అధికారులకి కూడా అర్ధం కావట్లేదు... అయితే ఈనెల 22న పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వచ్చి సమీక్ష చెయ్యనున్న నేపధ్యంలో, ముఖ్యమంత్రి ముందుగానే వెళ్లి, అన్నీ వివరించి, మరిన్ని అనుమతులు, నిధుల కోసం గడ్కారీతో చర్చించి, 22న పోలవరంలోనే కొన్ని కీలక ప్రకటనలు చేపించటానికి ముఖ్యమంత్రి ముందుగానే వెళ్లి అన్ని విషయాల మీద క్లారిటీ ఇవ్వనున్నారు అని తెలుస్తుంది...

delhi 12122017 3

ఇప్పటికే నితిన్ గడ్కరీ అనుకున్న సమయంలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ఏపీ సర్కార్ కు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులన్నీ క్లియర్ చేస్తున్నామన్నారు. మరి రేపటి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పోలవరం విషయంలో మరింత స్పష్టత వస్తుందో లేదో చూడాలి...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల గాంధీని చూసి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి నేర్చుకునేది ఏమి ఉంటుంది అంటారా ? రాహుల్ మీద ఎలాంటి ఆరోపనులు ఉన్నా, అతనికి ఏమి తెలీదు అని హేళన చేసున్నా, ఒక్క విషయంలో మాత్రం జగన్ కంటే వంద రెట్లు నయం అనిపించుకున్నారు రాహుల్... ముత్తాత, నాయనమ్మ, తండ్రి ఈ దేశానికి ప్రధానులగా చేశారు, తల్లి 10 సంవత్సరాలు ప్రధాని లాంటి పవర్ ఉన్న వ్యక్తిగా చలామణి అయ్యారు... ఇంతటి ఘన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబానికి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రత్యర్ధి...

rahul jagan 12122017 2

రాజకీయంగా నరేంద్ర మోడీతో ఎన్నో పోరాటాలు చేస్తున్నా, రాహుల్ ఏ రోజు లైన్ దాటలేదు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ప్రధినిని అవమానిస్తూ మాట్లాడినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసారు రాహుల్.. ప్రధాని పదవి అంటే గౌరవం అని, ఆ పదవిని చిన్నబుచ్చేలా ప్రవర్తించను అని, పార్టీ వారు మాట్లాడినా సహించాను అనే సంకేతం ఇచ్చారు... ఇదే విషయం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాల్సింది... ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏకవచనంతో ఆడు ఈడు అనటం, కాల్చేస్తా, ఉరి వేస్తా, చెప్పుతో కొడతా, కాలర్ పట్టుకుంటా అంటూ సాక్షాత్తు జగనే అంటుంటే, ఇక ఆ పార్టీ నేతలు అయిన కొడాలి నాని, రోజా అయితే బూతులు కూడా మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని అవమానిస్తూ మాట్లాడుతున్నారు...

rahul jagan 12122017 3

ఇంత మాట్లాడినా వారిలో పశ్చాతాప్పం ఉండదు, మళ్ళీ మళ్ళీ అవే మాటలు మాట్లాడుతారు... సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న నేత, సుదీర్ఘ కలాం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తికి కనీసం, ఆయన వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా, నోటికి ఏ బూతు వస్తే అది మాట్లాడుతూ, ముఖ్యామంత్రి పదవిని అవమాసిస్తున్నాం అనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు... జగన్ గారు, కుటుంబ అహంభావ ధోరణి, ఫ్యాక్షన్ మెంటాలిటీ పక్కన పెట్టి, రాహుల్ గాంధీని చూసి గౌరవప్రదంగా వ్యవహరించటం, హుందా రాజకీయాలు చెయ్యటం నేర్చుకోండి...

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అక్రమ ఆస్థులు సంపాదించారని, సిబిఐ, ఈడీ జగన్ పై 11 కేసులు పెట్టిన సంగతి తెలిసిందే... అన్నిట్లో జగన్ A1గా ఉన్నారు... 16 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించి, ఇప్పుడు బెయిల్ పై బయట తిరుగుతూ, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్తూ, ఎక్కడకి వెళ్ళాలి అన్నా కోర్ట్ పర్మిషన్ తీసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే... ఈ 11 కేసుల్లో, 3 కేసులు విచారణ త్వరలో ముగియనుంది అనే సమాచారం కూడా వస్తున్న తరుణంలో, ఇవాళ సుప్రీమ్ కోర్ట్ చెప్పిన వ్యాఖ్యలతో జగన్ కు వణుకు మొదలైంది...

jagan 1212201 2

రాజకీయ నేతలపై కేసుల విచారణలో వేగాన్ని పెంచేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇదివరుకే కోరింది... ఇవాళ కేంద్రం దాని పై స్పందించింది... పార్లమెంటు, శాసనసభల సభ్యులపై కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు అంగీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది... రాజకీయ నేతలపై కేసుల్లో విచారణ ఒక ఏడాదిలో పూర్తయ్యేవిధంగా, తీర్పులు వెలువడే విధంగా ఈ కోర్టుల ఏర్పాటు జరగాలని సుప్రీం కేంద్రానికి తెలిపింది.

jagan 1212201 3

ప్రారంభంలో 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని కేంద్రం సుప్రీంకు తెలిపింది. వీటి కోసం రూ.7.80 కోట్లు కేటాయించినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్‌లో ఉన్న కేసుల సమాచారాన్ని తెలుసుకుని, అవసరమైన ప్రత్యేక కోర్టుల సంఖ్యను నిర్థారించేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. జగన్ కేసులు తీవ్రత తీసుకుంటే, మొదటి స్థానంలో ఉంటాడు... అంటే ఇప్పుడు సుప్రీం చెప్పిన ప్రకారం, మరో ఏడాదిలో జగన్ కేసుల విచారణ మొత్తం అవ్వాల్సిందే...

Advertisements

Latest Articles

Most Read