ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నేత జగన్ ను, అమరావతి రమ్మని ప్రభుత్వం కబురు పంపించింది... కాని జగన్ మాత్రం నేను రాను అని కబురు పంపించారు... "అమరావతి శంకుస్థాపనకే రాని వాడు, ఇలాంటి వాటి కోసం ఎందుకు వస్తాడులే అండి, పిలావాల్సిన బాధ్యత మనది, పిలిచాం... మొహమాటం లేకుండా, నేను రాను అని చెప్పాడు... అయినా ఇది ఎమన్నా మన ఇంట్లో వ్యవహారమా, రాష్ట్రానికి సంబంధించింది, ఆయన ఎప్పుడో ప్రతిపక్ష నేత బాధ్యత నుంచి తప్పుకున్నాడు, ఇప్పుడు ఆయన వస్తాడు అని ఎవరు అనుకోవట్లేదు అంటూ", ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు... అసలు జగన్ ను ఎందుకు అమరావతి రావలాని ప్రభుత్వం ఆహ్వానించింది అంటే ?

rti 13122017 2

సమాచార కమిషనర్ల ఎంపికపై ఇవాళ మధ్యాహ్నం త్రిసభ్య కమిటీ భేటీ కానుండి. కమిటీలో సభ్యులుగా సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌, మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఈ సమావేశానికి హాజరుకాలేనని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి సమాచారమిచ్చి, తన తరఫున ప్రతినిధి వస్తారని తెలిపారు. ఇందుకు నిబంధనల ప్రకారం వేరే వ్యక్తులకు అవకాశం లేదని ప్రభుత్వం వెల్లడించింది. సమయం లేకపోవడంతో సమాచార కమిషనర్ల ఎంపికను వాయిదా వేయలేమని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. దీంతో సమాచార కమిషనర్ల ఎంపికపై చంద్రబాబు, యనమల మధ్యాహ్నం భేటీ కానున్నారు.

rti 13122017 3

చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, భేషిజాలకు పోకుండా, రెండు సార్లు అప్పటి సచివాలయానికి వెళ్లి, ప్రక్రియలో పాల్గున్నారు... కాని, జగన్ మాత్రం, ఎప్పటి లాగే, ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నారు... ప్రతి శుక్రవారం కోర్ట్ కి ఎలా వెళ్తున్నాడో, అలాగే అమరావతి వచ్చి వెళ్ళటానికి జగన్ కు ఇబ్బంది ఏంటో మరి... అనంతపురంలో ఉంటున్నారు కాబట్టి, బెంగుళూరు ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు ఫ్లైట్ లు ఉంటానే ఉంటాయి.. కాని, జగన్ మాత్రం నాకు అది అనవసరం అన్నట్టు వ్యవహిరించటంతో, ప్రభుత్వం తాను ఇష్టం వచ్చిన వాళ్ళని సమాచార కమిషనర్లగా ఎంపిక చేసుకుంటుంది... అప్పుడు మాత్రం, విమర్శలు చెయ్యటానికి ముందు ఉంటారు...

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఇమిగ్రేషన్‌ హోదా ఎట్టకేలకు వచ్చింది... కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది... దీనికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ రావడం లాంఛనమే... ఇంటర్నేషనల్ సర్వీసులు నడపటానికి, ఇమ్మిగ్రేషన్ అతి ముఖ్యమైన ఘట్టం.. అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమ్మిగ్రేషన్‌ సేవలు ప్రారంభించడానికి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. కొన్ని రోజుల క్రిందట, ఇమ్మిగ్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ బోరాసింగ్‌తో కూడిన బృందం విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చింది.

gannavaram airport 13122017 3

ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనావుతో వీరు భేటీ అయ్యారు. ఆ తర్వాత అంతర్జాతీయ టెర్మినల్‌ భవనాన్ని పరిశీలించారు. ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్స్‌, కార్యాలయాలను పరిశీలించారు. ఎంతో చక్కగా తీర్చిదిద్దిన కార్యాలయాల పట్ల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. ఇమ్మిగ్రేషన్స్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, వర్కింగ్‌ స్టాఫ్‌ కావాలని, ఈ బృందం డీజీపీ సాంబశివరావుని కోరింది.. సానుకూలంగా స్పందించిన డీజీపీ మొత్తం 55 మందితో కూడిన డెడికేటెడ్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టాఫ్‌ను అందిస్తామని చెప్పారు...

gannavaram airport 13122017 2

ఇమిగ్రేషన్‌ హోదా రావటంతో ఇక కస్టమ్స్‌ హోదా కూడా లాంఛనమే. కాగా విజయవాడ నుంచి ముంబాయికి అక్కడి నుంచి దుబాయ్‌, షార్జాలకు విమాన సర్వీసు నడపటానకి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఇటీవలే ఆసక్తి చూపించింది. ఇమిగ్రేషన్‌ హోదా రాకపోతే ముంబాయి వరకు నడపాలని భావించింది. ఇప్పుడు తొలి అంతర్జాతీయ సర్వీసుగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ నుంచి దుబాయ్‌, షార్జాలకు విమానాన్ని నడపనుంది. ముంబై - విజయవాడ - దుబాయ్‌ - షార్జా సర్వీసు నడపటానికి ఎయిర్‌ ఇండియి ఎక్స్‌ప్రెస్‌ రెడీ గా ఉంది... జనవరి నెలాఖరు నుంచి, అంతర్జాతీయ సర్వీస్ నడపటానికి సిద్ధంగా ఉంది ఎయిర్‌ ఇండియి ఎక్స్‌ప్రెస్‌...

వైఎస్ఆర్ పార్టీ ఎమ్మల్యే రోజా, అదే విధంగా బండ్ల గణేష్ లైవ్ లో పచ్చి బూతులుతో తిట్టుకున్నారు... జగన్ పార్టీ ఎమ్మల్యే రోజా అయితే చెప్పెలేని మాటలతో మాట్లాడారు... అంతే జుబుక్సాకరంగా మాట్లాడారు బండ్ల గణేష్... దీనికి అంతటికీ వేదిక టీవీ9... వారసత్వ రాజకీయాల ఫై టీవీ9, రాత్రి 8 గంటల నుంచి చర్చ పెట్టింది... ఈ చర్చలో బండ్ల గణేష్ ని కూడా తీసుకువచ్చి కూర్చోబెట్టింది టీవీ9.. పవన్ కళ్యాణ్ తరుపున అప్పటి వరకు తనదైన శైలిలో బండ్ల విమర్శిస్తూ వచ్చారు...వారి మధ్య సాగిన సంభాషణ తీవ్ర స్థాయికి చేరడంతో ‘పళ్లు రాలగొడతా’ అని రోజా ఆగ్రహం వ్యక్తం చేయగా, ‘నీ పళ్లు రాలిపోతాయి’ అంటూ బండ్ల గణేష్ పరస్పరం దూషించుకోవడం జరిగింది. ఇలా వీరి మధ్య వ్యక్తిగత దూషణలు పెరగడంతో రోజా ఫోన్ లైన్ కట్ అయింది.

bandla 12122017 2

ఈ లోపు రోజాని, రజినీకాంత్ ఫోన్ లైన్ లో తీసుకున్నారు..ముందుగా మంచిగా సాగిన చర్చ, తరువాత పచ్చి బూతుల వైపు మళ్ళింది... ఇక్కడ రాయలేము కాబట్టి, డైరెక్ట్ వీడియో చూపిస్తున్నాం... కింద వీడియో చూడండి... రోజా, బండ్ల గణేష్ ఒకరికి ఒకరు, డైరెక్ట్ గా బూతులు తిట్టుకున్నారు, పర్సనల్ విషయాలకి వెళ్ళిపోయారు.. చాలా అంటే చాలా జుబుక్సాకరంగా టీవీ9 షో రన్ చేసింది... వెంటనే రజినీకాంత్ షో ఆపేశారు... అయినా అప్పటికే జరగాల్సిందే జరిగిపోయింది...

bandla 12122017 3

ఇంత నీచ్చంగా లైవ్ లో రోజా, ఒక పార్టీ ఎమ్మల్యేగా మాట్లాడటం చాలా దారుణం... ఆమె నోటికి హద్దు లేకుండా పోతుంది. రోజు రోజుకి దిగాజారిపోతుంది.. మరో పక్క బండ్ల గణేష్, అతని స్థాయి ఏంటో, అతనిని ఎందుకు తీసుకువచ్చు స్టూడియో లో పెట్టారో, టీవీ9 వారికే తెలియాలి... టీవీ9 విపరీత పోకడలు రోజు రొజుకీ పెరిగిపోతున్నాయి... దానికి ఉదాహరణ ఇవాల్టి చర్చ... టీవీ9 కూడా ఇలాంటి వాళ్ళని అసలు చర్చలుకి పిలవకూడదు...

నీటి పై తేలియాడుతూ... నింగిలోకి దూసుకెళ్లి చక్కెర్లు కొట్టే ఆంఫీబియస్ సీ ప్లేన్ విన్యాసాలు కృష్ణానదిలో బుధవారం జరగనున్నాయి. పన్నమి ఘాట్లో ఉదయం 10 గంటలకు సీ ప్లేన్ విమాన విన్యాసాలు చూసేందుకు జిల్లా యంత్రాంగం 'ఎయిర్ క్రాఫ్ట్ షో" పేరిట ప్రజలకు అవకాశం కల్పిస్తోంది. ఇటీవల ముంబైలో సీ ప్లేన్ టెస్టింగ్ జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సీ ప్లేన్ ఎక్కి విహరించారు. ముంబై తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలోని విజయవాడ పన్నమి ఘాట్లో జరుగుతున్న సీ ప్లేన్ టెస్ట్ డ్రైవ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత విమానమెక్కి ఎలా పని చేస్తుందో చూస్తారు.

sea plane 13122017 2

సీఎంను ఎక్కించుకున్న తర్వాత ముందుగా నదిలో విమానాన్ని నడుపుతారు. ఈ క్రమంలోనే సీఎంకు సీ ప్లేన్కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి వివరిస్తారు. ఒక్కసారిగా గగనతలంలోకి ఈ విమానం దూసుకు పోతుంది. ప్రజా ప్రతినిధులు, అధికారులను కూడా సీ ప్లేన్ నింగి లోకి తీసుకు వెళుతుంది. ఇక్కడికి వచ్చే ప్రజలలో కొందరికి కూడా అవకాశాలు కల్పి స్తుంది. అప్పటికప్పుడు ఎంపిక చేసిన వారిని సీ ప్లేన్లో ఎక్కించి చక్కెర్లు కొడతారు. సీ ప్లేన్కు జిల్లా యంత్రాంగం ఘాట్ దగ్గర జెట్టీని ఏర్పాటు చేయించింది. ముందుగా విమానాన్ని ఈ జెట్టీ మీదుగా తీసుకు వెళతారు. తర్వాత విమానంలోకి ఎక్కేవాళ్లు కూడా ఇదే జెట్టీ మీద నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

sea plane 13122017 3

విమానయాన దిగ్గజ సంస్థలలో ఒకటైన స్పైస్ జెట్ నూతన సంవత్సరం నుంచి వీటిని ప్రారంభించాలని భావిస్తోంది. దాదాపుగా 100 విమానాలను ఆ సంస్థ కొనుగోలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఆపరేషన్స్ ప్రారంభిం చాలని భావిస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణానది కేంద్రంగా సీ ప్లేన్స్ నడ పాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇక్కడ టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. టెస్ట్ డైవ్ విజయవంతం అయితే రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభి స్తుంది. సీ ప్లేన్ విమానం విన్యాసాల తర్వాత ఎన్ డీఆర్ఎఫ్ బృందాల డెమో ఉంటుంది. ప్రకృతి విపత్తుల సందర్భంగా ప్రమాదాలలో చిక్కుకున్న వారిని ఎలా రక్షిస్తారన్న దాని పై బృందాల ప్రదర్శన ఉంటుంది.

Advertisements

Latest Articles

Most Read