ఆంధ్రప్రదేశ్ లో మరోసారి నంద్యాల ఎన్నికల హీట్ లాంటి వాతావరణం రానుంది... ఈసారి శిల్పా కుటుంబానికే ఆ హీట్ గెట్టిగా తగలనుంది... శాసనమండలిలో వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో కాళీ అయిన స్థానానికి త్వరలో ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.. దీనికి సంభందించి 19 వ తేదీన అధికారిక నోటిఫికేషన్ ఉంటుంది ఈనెల 26 వరకు నామినేషన్ లు స్వీకరిస్తారు.. వచ్చే సంవత్సరం జనవరి 12 న ఓటింగ్, 16 న కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది..
అయితే నంద్యాల ఉప ఎన్నికలకు, జగన్ పెట్టిన టార్చర్ కి, కర్నూల్ జిల్లలో ఒక వెలుగు వెలిగిన శిల్పా సోదరులు, అటు డబ్బులు పోయి, ఇటు పదవులు పోయి, ఇటు జిల్లలో పట్టు పోయి, రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి దాకా వచ్చారు.. శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోఉండగా, భుమా నాగి రెడ్డి మరణించటం, శిల్పా మోహన్ రెడ్డి, ఆ టికెట్ అడగటం, సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి కుటుంబానికే టికెట్ ఇస్తాను అని చంద్రబాబు చెప్పటంతో, శిల్పా మోహన్ రెడ్డి తొందర పడి, జగన్ పార్టీలో చేరారు. తరువాత, శిల్పా చక్రపాణి కూడా 6 సంవత్సరాల MLC పదవి వదులుకుని, తానూ కూడా జగన్ పార్టీలో చేరారు. సరిగ్గా ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. నంద్యాల ప్రజల నాడి పట్టటంలో శిల్పా సోదరులు ఫెయిల్ అయ్యారు. జగన్ మాట విని, గెలిసేస్తున్నాం అని, ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెట్టారు. చివరకి ఘోరంగా పిల్లల చేతిలో ఓడిపోయారు.
అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో, శిల్పా కుటుంబం గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి... జగన్ ఎక్కడ పోటీ చేయ్యమంటాడో, ఈ సారి ఏ కాంప్లెక్స్ తాకట్టు పెట్టాలో అంటూ భాపడుతున్నారు... ఇప్పటికే నేను పోటీ చెయ్యలేను అని శిల్పా చెప్పినట్టు సమాచారం... మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి గెలవక పొతే పరిస్థితి ఏంటి ? ఇప్పటికే జగన్ మాటలు నమ్మి సగం గుండు అయ్యింది, ఈ సారి కూడా ఈయన మాటలు విని రంగంలోకి దిగితే, మిగతా సగం కూడా అవుతుంది, మా అన్నతో కలిసి రోడ్డున పడాలి అని శిల్పా అనుచరులు దగ్గర వాపోతున్నారు...