వైసీపీలో నెల్లూరు పెద్దారెడ్డి సునామీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముగ్గురు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీ దూరం పెట్టగా వారు డైరెక్టుగా జగన్ రెడ్డిపైనే ఎదురుదా-డికి దిగుతున్నారు. ఇంతలోనే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ వీడుతారని వార్తలు వచ్చాయి. ఇవి ఆయన ఖండించారు. అయితే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పక్కచూపులు చూస్తున్నారని సమాచారం. కావలి ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాపరెడ్డికి టికెట్ ఇవ్వరని వైసీపీలో బాగా టాక్ నడుస్తోంది. ఐప్యాక్ నివేదికల్లోనూ ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నాయట. దీంతోపాటు వందలకోట్లతో వైసీపీలో దిగిన బీద మస్తాన్ రావు తన వారసుడి కోసం కావలి టికెట్ అడుగుతున్నారు. ఇది తెలుసుకుని ఇక తనకి టికెట్ వచ్చే అవకాశంలేదని డిసైడైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టిడిపి నేతలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం బయటకు పొక్కింది. అయితే కావలిలో మరో ఎంపీ వైసీపీకి ఆర్థిక అండదండలు అందించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్య ప్రశాంతిరెడ్డికి టికెట్ అడుగుతున్నారని, ఆయనని కాదని ప్రతాప్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వరని ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఆర్థికంగా అనకొండల్లాంటి ఇద్దరు ఎంపీలు కావలి టికెట్టుపై దృష్టి పెట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కపార్టీల వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది.
news
జగన్ సర్కారుకి సుప్రీం ఝలక్.. ప్రభుత్వ లాయర్ పై కోర్ట్ ఆగ్రహం..
అమరావతి నుంచి రాజధానిని పీకేసి విశాఖలో దుకాణం తెరవాలని ఏపీ సీఎం జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఎంత తొందర పడుతోందో, సుప్రీంకోర్టులో అంత ఆలస్యం అవుతోంది. రేపు విశాఖ రాజధాని తరలింపు, ఎల్లుండి తరలిస్తామంటూ ప్రకటనలు ఇస్తోన్న వైసీపీ పెద్దలకు అమరావతి రాజధానిపై దాఖలైన కేసుల విచారణని జూలై 11న విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించడంతో ఏపీ సర్కారు షాక్ తగిలింది. త్వరగా అమరావతి రాజధాని కేసులను విచారించాలని సుప్రీంకోర్టులో మరోసారి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు లేవనెత్తారు. కేసు విచారణ జులై 11న చేపడతామని , అంతకు ముందు సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని మరోసారి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరగా స్టే ఇచ్చేందుకు న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం నిరాకరించింది. జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంతమంది రైతులు చనిపోయారని, వారి తరపున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు న్యాయవాదులు అనుమతి కోరగా ధర్మాసనం అంగీకరించింది. పట్టువదలని విక్రమార్కుడిలా జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అత్యున్నత న్యాయస్థానంలో అనూహ్యంగా బ్రేక్ పడింది. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఏర్పాట్లు చేసుకున్న ప్రతీసారి ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూనే ఉంది. తాజాగా త్వరితగతిన విచారణకి నో చెప్పిన ధర్మాసనం, హైకోర్టు తీర్పుపై స్టేకి నిరాకరించడం జగన్ రెడ్డికి పెద్ద దెబ్బే.
నెల్లూరు నుంచి మరో కీలక వైసీపీ ఎమ్మెల్యే జంప్ కొడుతున్నారా?
వైసీపీకి తిరుగులేని విజయాలు అందించిన నెల్లూరు నుంచి ఒక్కో వైసీపీ ఎమ్మెల్యే జారుకుంటున్నారు. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన, వైసీపీ సస్పెండ్ చేసిన వారంతా జగన్ రెడ్డి సామాజికవర్గం వారే. కోటంరెడ్డి, రాంనారాయణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిల బాటలోనే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారని, పార్టీని వీడనున్నారని టాక్ నడుస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ రెడ్డికి అండగా నిలిచిన సీనియర్ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది. వైసీపీ 2019లో అధికారంలోకి రావడంతో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని ఆశించిన ప్రసన్నకుమార్ రెడ్డికి నాలుగేళ్లయినా మంత్రి పదవి దక్కలేదు. దీనిపై చాలారోజులుగా వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. చివరికి తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా రావట్లేదు అని అనుచరుల దగ్గర ప్రసన్నకుమార్ రెడ్డి వాపోవడం చర్చనీయాంశం అవుతోంది. పార్టీలో కనీస గౌరవం లేదు అని అసంతృప్తితో రగిలిపోతున్న ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ మారడం తప్ప తనకు వేరే మార్గం లేదని అనుచరులకు స్పష్టం చేసినట్లు సమాచారం బయటకొచ్చింది. అయితే టిడిపిలో చేరే చాన్స్ లేదని, టిడిపిని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తిట్టినంతగా ఏ ఎమ్మెల్యే తిట్టలేదని..ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని టిడిపిలో చేరతారని విశ్లేషణలు వస్తున్నాయి. బీజేపీలో చేరే చాన్స్ ఉందని, ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన అనుచర గణం చెబుతోంది. గతంలో ఒకసారి పార్టీ మారుతున్నారని జరిగింది తప్పుడు ప్రచారం అని కోవూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వాపోయారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. వైసీపీలో వైఎస్ విజయమ్మ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని తానేనన్నారు. అంతటి సీనియర్ నాయకుడినైన తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ సారి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ మారుతారని ఆయన అనుచరులే ప్రచారం చేయడం కొసమెరుపు.
జగన్ ఆ మంత్రుల్ని పీకేసేందుకేనా గవర్నర్ భేటీ ?
కొందరు మంత్రుల్ని తప్పించాలంటే, కొత్త వారికి అవకాశం కల్పించాలి. మంత్రివర్గ విస్తరణ వార్తలు ఊపందుకున్న వేళ రాజ్‌భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను సీఎం జగన్ రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖలో జరగనున్న జీ-20 సమావేశ వివరాలు తెలియజేశారని బయటకు చెబుతున్నా..కొత్తగా కొందరు మంత్రుల్ని తీసుకునే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. మార్చి 14నే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముందుగా వార్తలొచ్చాయి. ప్రధానంగా ముగ్గరు మంత్రుల్ని తప్పిస్తారని జోరుగా ఊహాగానాలు సాగాయి. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి రాజశేఖర్, తోట త్రిమూర్తులు, పొన్నాడ సతీష్‌లను మంత్రివర్గంలోకి తీసుకుంటారని విశ్లేషణలు సాగాయి. మార్చి 14న మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో తప్పిస్తారని టాక్ వినిపించిన మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు. గుడివాడ అమర్ నాథ్, రోజా, జోగి రమేష్, విడదల రజిని, దాడిశెట్టి రాజా, సీదిరి అప్పలరాజులలో నలుగురిని తప్పిస్తారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలోనే సీఎం గవర్నర్ ని కలిశారని వార్తలు వెలువడటంతో ఆశావహులు ఆశగా చూస్తున్నారు. కేబినెట్ బెర్తు కోల్పోతారని బయటకొచ్చిన పేర్లవారు ఆందోళనలో ఉన్నారు.