జగన్ కేసుల్లో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ఏకంగా హైకోర్టు ఆయన కేసులు విషయంలో ఏకంగా సుమోటోగా తీసుకుని నిర్ణయం తీసుకుంది. రేపు దీని పై విచారణ జరగనుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, జగన్ మోహన్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్ వేసిన సందర్భంలో ఆయన పై 31 కేసులు చూపుతూ ఆయన అఫిడవిట్ వేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ పైన 11 సిబిఐ కేసులు 5 ఈడీ కేసులు మాత్రమే ఉన్నాయని అందరికీ తెలుసు. ఈ మిగతా కేసులు ఏమిటో ఎవరికీ తెలియవు. అయితే ఇవన్నీ వివిధ సందర్భాల్లో జగన్ మోహన్ రెడ్డి పై నమోదు అయిన కేసులు. ఉదాహరణకు నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు, అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు చేతిలో కాగితాలు లక్కోవటం, వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో గలాటా చేయటం, అలాగే జాతీయ గీతం సరిగ్గా పడలేదని, ఇలాగే కొన్ని క్రిమినల్ కేసులు, ఇలా ఆయన పై అనేక కేసులు ఉన్నాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, అనూహ్యంగా, ఈ కేసులు అన్నీ కొట్టివేస్తూ, ప్రభుత్వం, డీజీపీ నిర్ణయం తీసుకుంటూ వచ్చారు. ఆ కేసు క్లోజ్ చేసేసారు. పొరపాటు పడ్డారని, ఘటన జరగలేదని, ఇలా అనేక కారణాలు చూపించి, దాదాపుగా 11 కేసులు వరకు, జగన్ పై ఉన్న కేసులు క్లోజ్ చేస్టు, ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే దేశంలోనే ఎప్పుడు జరగని విధంగా, కోర్టులో తేలాల్సిన కేసులు, ప్రభుత్వమే క్లోజ్ చేయటం పై, పలువురు అప్పట్లో హైకోర్టుకు వెళ్ళారు. అప్పటి చీఫ్ జస్టిస్ మహేశ్వరీ, ఈ కేసులు విషయం పై, అంతర్గతంగా ఒక కమిటీ వేసారని, సమాచారం. అయితే తరువాత చీఫ్ జస్టిస్ మారిపోయారు. అయితే ఆ కమిటీ ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కానీ, మరేదైనా కారణం కానీ, హైకోర్టు ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ పై నమోదు అయిన కేసులు, ఉపసంహరణ పై, సుమోటోగా విచారణ చేయాలని హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా సహా, 11 కేసులను, ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పై హైకోర్టు దృష్టి పెట్టింది. అసలు కేసు పెట్టిన వారి అనుమతి లేకుండానే, చట్టానికి విరుద్ధంగా ఉపసంహరించుకున్నారు అంటూ, పలువురు హైకోర్టులో ఫిర్యాదు చేయటంతోనే, ఈ కేసులని పరిశీలించి, హైకోర్టు సుమోటోగా ఈ కేసుని తీసుకుందని సమాచారం. ఈ కేసు పై రేపు విచారణ జరిగే అవకాసం ఉంది.