ప్రభుత్వాలు మారగానే, ప్రత్యర్ధుల పై, ఇష్టం వచ్చినట్టు చెయ్యటానికి, వీలు ఉండకుండా, ఒప్పందాలు, చట్టాలు, న్యాయాలు ఉంటాయి. ఇవే కనుక లేకపోతే, రిలయన్స్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, లేక మరో పెద్ద పెద్ద పేరు ఉన్న సంస్థలు, ఎప్పుడో, ఎదో ఒక పార్టీకి బలి అయిపోయేవి. మన దేశం, ఎప్పుడో నాశనం అయ్యేది. సహజంగా అభివృద్ధి చెందే కంపెనీలు, నాలుగు ఉద్యోగులు వచ్చే కంపెనీలు ప్రభుత్వాలు వాడులుకోవు. ఈ కాలంలో ఒక కంపనీ పెట్టుబడి పెట్టాలంటే ఎంతో కష్టపడి, రాయతీలు ఇస్తే కానీ రాని పరిస్థితి. అలాంటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కంపనీలు రావటం చూసి ఏడాది అయ్యింది. అయితే ఇప్పటికే ఉన్న కంపెనీలను కూడా బయటకు పంపించే చర్యలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన, అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ కు గతంలో ఇచ్చిన కొంత భూమిని వెనక్కు తీసుకుంటూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో రాజశేఖర్ రెడ్డి హయంలో 483 ఎకరాలు ఇవ్వగా, అందులోని 253 ఎకరాలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది.

అయితే దీని పై అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌, హైకోర్టుకు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూములు వెనక్కు తీసుకునే అధికారం లేదని అన్నారు. ఆ భూములు తమకు, ఏపీఐఐసీకి మధ్య జరిగిన ఒప్పందం అని, దీంట్లో ఏపి ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. అలాగే ఇప్పటికే అక్కడ 2700 కోట్ల పనులు చేపట్టామని, 6 వేల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం భూములు వెనక్కు తీసుకుంటూ చెప్తున్న కారణంలో వాస్తవం లేదని అన్నారు. అందుకే జీవోని సస్పెండ్ చెయ్యాలని కోరారు. ఈ కేసు పై ఈ రోజు విచారణ చేసిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్​ 30న ఇచ్చిన 33వ జీవోని నిలుపుదల చేస్తూ, హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వానికి ప్రస్తుతానికి, ఆ భూములు వెనక్కు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక మాఫియాను అడ్డకున్న దళిత యువకుడిపై దాడి చేసి, శిరోముండనం చేసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదుపై కమిషన్ స్పందిస్తూ విచారణకు ఆదేశించింది. ఆ మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకు లేఖ రాస్తూ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ నివేదికలో సంఘటనకు కారణమైన మొత్తం నిందితుల పేర్లు తెలియజేయాలని స్పష్టంగా కోరింది. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ దళితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని అన్నారు. వర్ల రామయ్య రాసిన లేఖకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించడంపై ఆయన స్వాగతించారు. ఇకపై దళితులపై ఎటువంటి దాడులు జరిగినా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, తెలుగుదేశం పార్టీ తరుపున న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

వర్ల రామయ్య మాట్లాడుతూ, "దళిత యువకుని శిరో ముండనానికి కవల కృష్ణమూర్తి కారణం కాదా? శిరోముండనానికి కృష్ణమూర్తే కారణమని వరప్రసాద్ స్టేట్ మెంట్ ఇచ్చినా పట్టించుకోవడంలేదు. ఏ తప్పూ చేయని కొల్లు రవీంద్రను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆధారాలున్నా కవల కృష్ణమూర్తిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.? మీకో న్యాయం, విపక్షాలకు ఓ న్యాయమా...ఇదేనా మీ దళిత సిద్ధాంతం. కవల కృష్ణమూర్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. హోంమంత్రి ఎందుకు భేషజాలకు పోతున్నారు? వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేకి. ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటి. దళితులు ఓట్లు వేయకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారా? కానీ ఆయనకు కొంచెమైనా విశ్వాసం లేదు. పాదయత్ర సమయాన్ని జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలి. దళితులకు జగన్ శిరోముండనం చేయిస్తున్నారు. దళిత మహిళపై అత్యాచారం జరిగితే ఇదేమని అడిగే దిక్కులేదు రాష్ట్రంలో. మాస్కు పెట్టుకోలేదని ఓ దళిత యువకుడిని అన్యాయంగా చంపేశారు. ఇందుకా మీకు ఓట్లు వేసి గెలిపించింది? " అని వర్ల స్పందించారు.

నలంద కిషోర్. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి మద్దతు తెలుపుతున్న వ్యక్తే కాకుండా, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కు సన్నిహితుడు కూడా. గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర ఉన్న ఇసుకపల్లి గ్రామానికి చెందిన కిషోర్, 40 ఏళ్ళ క్రిందట, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేసేందుకు విశాఖ వచ్చారు. ఎమ్మెస్సీ చేసిన ఆయన, కొంత కాలం లెక్చరర్ గా కూడా పని చేసారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత, నలంద విద్యా సంస్థలకు డైరెక్టర్ గా పని చేసారు. ఉత్తరాంధ్రలో ఆయన నలంద బాధ్యతలు తీసుకోవటంతో, క్రమంగా ఆయన పేరు నలంద కిషోర్ గా మారింది. ఈ క్రమంలోనే, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పని చెయ్యటం, తరువాత గంటాకు దగ్గర కావటంతో, గత రెండు దశాబ్దాలుగా, గంటాకు తెర వెనుక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు అనే పేరు ఉంది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అడుగు పెట్టారు. అయితే పాయిన నెల, ఒక వాట్స్ అప్ మెసేజ్ షేర్ చెయ్యటం, అందులో ఎవరి పేర్లు లేకపోయినా, అది తమ గురించే అనుకుని, కొంత మంది పెద్దలు, నలంద కిషోర్ పై సిఐడి కేసు పెట్టి, వేధించారు.

విశాఖ నుంచి కర్నూల్ కు తీసుకువచ్చి, కరోనా పేషెంట్లు ఉన్న చోట, ఎక్కువ సేపు కూర్చోపెట్టారు అనేది ఆరోపణ. ఆయన గత రెండు మూడు రోజులుగా అస్వస్తతకు గురయ్యి చనిపోయారు. ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు వల్లే, ఆయన మనో వేదనకు గురయ్యారని, అలాగే కరోనా సోకేలా చేసారని, ఏకంగా, వైసీపీ ఎంపీ స్పందించిన తీరు, చర్చనీయంసం అయ్యింది. అయితే దీని పై స్పందించిన మంత్రి అవంతి, ఫైర్ అయ్యారు. చావులకు కూడా ఇలా చెయ్యటం హేయం అంటూ స్పందించారు. రఘురామ రాజుకి నోటి దురద ఎక్కువని అన్నారు. కరోనా ఎవరికైనా వస్తుందని, కర్నూల్ తీసుకు వెళ్ళటం వల్లే వచ్చిందని చెప్పటం హేయం అని అన్నారు. నలంద కిషోర్ తెలుగుదేశం కార్యకర్త అని, మేము కూడా ఆయన మరణానికి చింతిస్తున్నాం అని అన్నారు. చంద్రబాబుకు, లోకేష్ కు అంత ప్రేమ నలంద కిషోర్ పై ఉంటే, వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించలేదని వింతగా ప్రశ్నించారు. మొత్తానికి మంత్రి మాటలతో, ఈ వివాదం కూడా రాజకీయ టర్న్ తీసుకుంది.

ఒక రాష్ట్రం అప్పులు తీసుకోవటం అనేది కొత్త కాదు. మనం గత కొన్నేళ్ళుగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, అప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఆ తీసుకువచ్చిన అప్పులను అభివృద్ధి కార్యక్రమాలకు, లేక ఇతర ఆదాయం వచ్చే మార్గాలకు ఖర్చు పెడుతూ, మనకు ఉన్న అవకాశాన్ని బట్టి మాత్రమే, అప్పులు చేస్తూ, తక్కువ వడ్డీకు అప్పులు తెచ్చుకుంటూ ఉండేవారు. అయితే గత 14 నెలలుగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రాన్ని అప్పుల కుప్పుగా చేసిందని, చాలా రిపోర్ట్స్ ఇప్పటికే చెప్తూ వస్తున్నాయి. అయితే ఆ తెచ్చిన అప్పులు అన్నీ, పధకాలకు ఖర్చు పెట్టటం, మరో ప్రమాదకర అంశం. అంటే అభివృద్ధి శూన్యం. ఇక పొతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేస్తూ, ఎలాంటి ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిపోతుందో చెప్తూ, ప్రముఖ సంస్థ, క్రెడిట్ రేటింగ్స్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే మనకు అర్ధం అవుతుంది. మన రాష్ట్ర రుణ-జీఎస్డీపీ నిష్పత్తి, 34.6 శాతానికి చేరుకొని, కలవర పెడుతుంది. 14వ ఆర్ధిక సంఘం సూచన మేరకు, రుణ-జీఎస్డీపీ నిష్పత్తి 25 శాతం వరుకే ఉండాలి.

మన రాష్ట్రము కంటే పెద్ద రాష్ట్రాలు అయిన మహరాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు, మనకంటే ఎక్కువ అప్పులు తెచ్చినా, ఈ నిష్పత్తి మాత్రం లిమిట్ లోనే ఉంది. పక్కన ఉన్న తెలంగాణా రాష్ట్రం కేవలం 21.4 శాతం మాత్రమే ఉంది. అలాగే ప్రభుత్వ గ్యారంటీతో ఒకే ఏడాది 49 వేల కోట్లు అప్పు తీసుకుని, ఈ అంశంలో కూడా ఏపి ఫిస్ట్ ఉంది. తెలుగుదేశం సీనియర్ నేత యనమల కూడా ఈ విషయం పై ధ్వజమెత్తారు. గత 64 ఏళ్ళుగా, సగటున ఏడాదికి 5 వేలు కోట్లు అప్పు చేస్తే, రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం హయంలో ఏడాదికి రూ.26 వేల కోట్ల అప్పు చేస్తే, జగన్ ప్రభుత్వం, ఏకంగా రూ.70 వేల కోట్లు అప్పు, ఒక్క ఏడాదిలో చేసిందని అన్నారు. ఈ లెక్కన ఈ 5 ఏళ్ళలో, 3.5 లక్షల అప్పు చేస్తారని, 64 ఏళ్ళలో మన రాష్ట్ర చేసిన అప్పు, ఈ 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. రాష్ట్రము ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుందని, కొంత కాలానికి అప్పు కూడా ఎవరూ ఇచ్చే పరిస్థితి వస్తే, మన పరిస్థితి ఘోరంగా ఉంటుందని అన్నారు. సంపద సృష్టి పై దృష్టి ఏ మాత్రం, ఈ ప్రభుత్వానికి లేదని, ఇది రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతుందని అన్నారు. ఇప్పటికే ఆస్తులు అమ్ముకే స్థితికి వచ్చామని గుర్తు చేసారు.

Advertisements

Latest Articles

Most Read