ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై, సుప్రీం కోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు, ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్, హైకోర్టులో వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై స్టే ఇవ్వాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ వేసిన హైకోర్టు ధిక్కరణ కేసు ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలనే ఎపి ప్రభుత్వ వాదనతో, సుప్రీం ఏకీభావించ లేదు. ఆ పిటీషన్ ను కొట్టేసింది. అయితే, ఈ సందర్భంగా, సుప్రీం కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విషయంలో, ఏమి జరుగుతుందో ప్రతి విషయం మాకు తెలుసుని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మేము ఈ పిటీషన్ విషయంలో కావాలనే స్టే ఇవ్వటం లేదని, కోర్టు తెలిపింది. ఒక పక్క గవర్నర్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని నియమించాలని చెప్తూ, ప్రభుత్వానికి లేఖ పమించినా, ఆయన్ను నియమించక పోవటం దారుణం అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే ఈ వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది ? గవర్నర్ సలహాలు ఇచ్చేదాగా వచ్చిందా ? ఆయనతో చెప్పించుకోవాలా ? గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు ఎందుకని అమలు చెయ్యటం లేదు అంటూ, సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ఇది ఇలా ఉంటే, కోర్టు జడ్జిలను చంపేస్తాం, కరోనా పేషెంటులు ఉన్న రూమ్ లో పెడతాం, ఫుడ్ కోర్టులు అంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వైసీపీ నేతలు, పిల్ల కార్యకర్తలు చేసిన వ్యాఖ్యలు, న్యాయవాది హారీష్ సాల్వే, సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. దీని పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, పూర్తీ వివరాలు తమకు ఇవ్వాలని, ఆ ఆధారాలు అన్నీ చెప్తూ, ఒక అఫిడవిట్ దాఖలు చెయ్యాలని, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే ఆదేశాలు ఇచ్చారు. వాటి సంగతి కూడా తెల్చేద్దాం అంటూ, ఆయన వ్యాఖ్యలు చేసారు. స్టే ఇవ్వకపోవటం ఒక ఎత్తు అయితే, ఇదే సందర్భంగ్లో కోర్టులను, జడ్జిలను తిట్టటం లాంటివి, ఇప్పుడు వైసిపీకి సుప్రీంలో కూడా తగులుకోనుంది.