రోజూ వైసీపీ మంత్రులు విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తారని ముహూర్తాలు ప్రకటిస్తుంటారు. చాలా రోజులుగా ఇదే జరుగుతోంది. కానీ విశాఖలో అడుగు పెట్టలేదు. హైకోర్టులో కేసు ఉన్నా రుషికొండకి గుండు కొట్టడం ఆపడంలేదు. అది పర్యాటక ప్రాజెక్టు కాదు, సీఎం క్యాంప్ ఆఫీసు అని వైసీపీ నేతలే బరితెగించి మరీ ప్రకటిస్తున్నారు. పిల్లలకు పుస్తకాలు ఇవ్వడానికి ఖజానాలో డబ్బులేదు. ఆస్పత్రిలో దూదికీ దిక్కులేదు. కాంట్రాక్టర్లకి లక్ష రూపాయలు బిల్లు ఇవ్వలేక అధికారులు కోర్టు బోనులో నిలబడుతున్నారు. చివరికి సీఎం పర్యటనకి పరదాలు కట్టేవాళ్లకి పైసలు చెల్లించలేదు. బాండ్ల వేలం ద్వారా అప్పు దొరికితే తప్పించి ప్రతీ నెలా రెండో వారమైతే జీతాలు ఇవ్వలేని దుస్థితి. ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే అత్యవసరాల కోసం అత్యధిక వడ్డీకి అప్పుతెచ్చిన 19 కోట్లతో కొన్న కొత్త కార్ల కాన్వాయ్ విశాఖ కోసం అని వైసీపీ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. నేడో రేపో విశాఖలో బస చేయనున్న జగన్, కోర్టు కేసుకి ఇబ్బంది లేకుండా సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి పరిపాలన సాగిస్తారని సమాచారం. రుషికొండ గుండుకి కోర్టు అడ్డంకి ఏర్పడితే, ఆంధ్రా యూనివర్సిటీలో మూడు భవనాలు సిద్ధం చేస్తున్నారు. విశాఖకి వెళ్లేందుకు జగన్ బాగా తహతహలాడుతున్నారని మాత్రం అర్థం అవుతోంది.
news
ఇంకోడు అయితే ఉరి వేసుకుని చస్తాడు... జగన్ పై చంద్రబాబు సంచలన ట్వీట్...
పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో దొంగలయ్యారు. పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు చెల్లించకుండా పికెట్ పాకెటర్లని చేస్తారా అంటూ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించేలా ఏపీఈడబ్ల్యూఐడీసీని ఆదేశించాలని కోరుతూ కాంట్రాక్టర్ పీఎన్వీ రమణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి బట్టు దేవానంద్ అధికారుల తీరుని తప్పుబట్టారు. న్యాయస్థానం ముందు హాజరు అవ్వాలని ఆదేశాలు ఇస్తే తప్పా బిల్లులను చెల్లించే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ప్రకటనలు ఇస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడంలేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలేదని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఉద్యోగులకు నెలనెలా పింఛన్లు ఇవ్వకపోతే, వారి అవసరాలకు సొమ్ము ఎవరిస్తారని అధికారులను నిలదీశారు. పెన్షన్ చెల్లించకుండా వారిని పికెట్ పాకెటర్లగా మారుస్తారా అని ప్రశ్నించారు. అయితే దీని పై చంద్రబాబు స్పందించారు. కోర్టు కామెంట్ లు విన్న తరువాత, ఇంకోడు అయితే, ఉరి వేసుకుని చస్తారు అంటూ, ఘాటు వ్యాఖ్యలు చేసారు.
ఆమంచి మంచి తనానికి అధికారులు భయపడ్డారా ?
వైసీపీ నేత ఆమంచి క్రిష్ణమోహన్ అంటే బాగా ఫేమస్. దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. అధికారులని సైతం బెదిరించడంలో అధికారం కూడా అక్కర్లేని దౌర్జన్యకర నేత అని టిడిపి విమర్శలు. ఇటీవల కాలంలో ఆనం మౌనంగా ఉంటూ వచ్చారు. కోర్టుపై వ్యాఖ్యలు చేయడంపై ఓవైపు దర్యాప్తు, మరోవైపు తన అడ్డా చీరాలలో టిడిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యే కరణం బలరాం పెత్తనంతో డిస్ట్రబ్ అయ్యారు. అయితే పర్చూరు వైసీపీ సమన్వయకర్తగా బాద్యతలు అప్పగించడంతో మళ్లీ వార్తల్లోకెక్కారు ఆమంచి క్రిష్ణమోహన్. సాయంత్రం పర్చూరు వైసీపీ ఇన్చార్జిగా ప్రకటించిన సమాచారం తెలుసుకుని తెల్లారేసరికి నియోజకవర్గం మొత్తం శాఖల అధికారులు ఆమంచి ఇంట్లో వాలిపోయారు. బొకేలు తీసుకొచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు ఇంతగా బెదిరిపోయి మరీ లొంగి పోవడానికి కారణం ఆమంచి తీరేనని బాహాటంగా వినిపిస్తోంది. ఆమంచిది పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యేకాదు, ఇంకే అధికారిక పోస్టూ లేదు. కానీ అన్నిశాఖల అదికారులు ఆయన దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. అదీ ఆమంచి స్టైల్ పాలిటిక్స్.
తెలుగుదేశం ప్రభుత్వం వస్తోంది..పార్టీలో చేరేందుకు నేతల క్యూ..
తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోంది. టిడిపిలో చేరేందుకు నేతలు తహతహలాడుతున్నారు. 2019లో టిడిపి ఓటమి పాలైన వెంటనే కొందరు పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరించడం మొదలుపెట్టారు. మరికొందరు వైసీపీ గూటికి, ఇంకొందరు బీజేపీ పంచన చేరారు. దాదాపు నాలుగేళ్లు వైసీపీ పాలన పూర్తి కావస్తోంది. ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. వైసీపీ సర్కారుపై ప్రజావ్యతిరేకత తీవ్రం అవుతోంది. చంద్రబాబు వెంట జనం ప్రభంజనమై కదలి వస్తున్నారు. అన్నిమార్గాల్లో అడ్డుకోవాలని చూస్తున్న సర్కారు అభాసు పాలవుతోంది. ప్రజలు ప్రతిపక్షం వెంట నడుస్తున్నారు. పబ్లిక్ పల్స్ పట్టేసిన కొందరు జంపింగ్ స్పెషలిస్టులు మళ్లీ వచ్చేది తెలుగుదేశమే అని ఫిక్సయిపోయారు. చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. కొందరు చినబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు ఆరంభించారు. గత ఎన్నికల్లో టిడిపిని వీడి వెళ్లిపోయిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఓకే అంటే టిడిపిలో చేరాలని తహతహలాడుతున్నారు. టిడిపి నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి పాలేటి రామారావు టిడిపి నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టిడిపి చేర్చుకోకపోయినా టిడిపిలో చేరాలని తిరుగుతూనే ఉన్నారు. కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు తాను టిడిపి గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అన్ని జిల్లాల నుంచి టిడిపిలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు.