మనం చేసేది సరైనది... మనం వెళ్లే మార్గం సక్రమమైనది, ఎదుటివాడు చేసేది మాత్రం తప్పు, అని నిత్యం భావించే వాళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైకాపా నాయకులు ఎక్కువగా ఉంటారు... వారు వెళ్లే మార్గం సరైనది కాకపోయినా ఎదుటి వాడు మంచి చేస్తున్నా వితండవాదంతో ముందుకు వెళ్లడం వారికి వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికి తెలిసిన విషయమే... ఇప్పుడు రాజధాని భవనాల సూచనల విషయంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇచ్చిన "తెలుగు తల్లి" కాన్సెప్ట్ అందరకీ నచ్చింది... కాని, మన ప్రతి పక్ష నాయకుడు జగన్ మాత్రం వేరేది తలిచారు... ప్రజలందరకీ నచ్చింది, ఈయనకు ఎందుకు నచ్చుతుంది..

rajamouli 17122017 2

అయినా ఇదేమన్నా చంద్రబాబు సొంత వ్యవహారమా... అది అమరావతి... ప్రతి ఒక్క ఆంధ్రుడికి సంబంధించిది... రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజలది, చంద్రబాబు సొంతం కాదు, అని జగన్ ఎందుకు గ్రహించ లేక పోతున్నారో... ఇప్పుడు రాజధాని విషయంలో, రాజమౌళి అద్భుతమైన కాన్సెప్ట్ ఇవ్వటంతో, జగన్ లో ఉన్న అపరచితుడు బయటకి వచ్చాడు... రాజమౌళిని ఎలా అయినా ప్రజల్లో చులకన చెయ్యాలి అనే ఉద్దేశంతో, ప్రభుత్వం రాజమౌళి దర్శకత్వంతో ఎదో షార్ట్ ఫిలిం చేస్తుంది అనే ప్రచారం చేస్తున్నారు... ఇదే విషయం జగన్, తన పాదయాత్రలో కూడా ప్రచారం చేస్తూ, రాజమౌళి మీద విషం చిమ్ముతున్నారు...

rajamouli 17122017 3

అమరావతిలో ఓ ఇటుక కూడా వేయని చంద్రబాబు దాని పై సినిమా తీయమని ఓ దర్శకుడుని పిలిచారని జగన్ కామెంట్ చేశారు. ఆ సినిమాలో తన పాత్ర , నారాయణ పాత్ర బాగా వుండాలని కూడా చంద్రబాబు కోరినట్టు జగన్ అన్నారు. చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఈ యాక్టర్లు, దర్శకులు భలే చేస్తున్నారని మనలను నమ్మిస్తారు అని జగన్ చేసిన కామెంట్స్ తో రాజమౌళిని ప్రజల్లో చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు... రాజమౌళి ఇప్పటికే, రాజధాని డిజైన్ ల విషయంలో నా పాత్ర చాలా పరిమతం అని చెప్పారు.. రామసేతు నిర్మాణంలో ఉడత సాయం లాంటి సాయం అని చెప్పినా, జగన్ మాత్రం రాజమౌళిని ఏకంగా పాదయాత్ర మీటింగ్ లలో చెప్తూ దిగజారుతున్నారు..

యధా నేత తథా అనుచరులు అన్నట్టు, వీళ్ళకి అధికారం లేకపోతేనే వందల కోట్ల స్కాంలు, మర్డర్లు చేస్తున్నారు... పొరపాటున అధికారంలోకి వస్తే ? ఇలాంటి భారీ స్కాం ఇప్పుడు బయట పడింది... 200 కోట్ల భారీ స్కాంలో ప్రతిపక్ష నేత జగన్ అనుచరుడు ప్రకాశం జిల్లా వైకాపా నేత, సైకం రామకృష్ణ రెడ్డి దొరికాడు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు మొదలుకొని ఢిల్లీ వరకూ 28 వేల మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి పారిపోయాడు అని, బాధితులు ఢిల్లీ సైబర్‌ వింగ్‌ పోలీసులతోపాటు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఫిర్యాదు చేశారు.

saikam 17122017 2

దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు బిట్‌ కాయిన్‌ పేరుతో వసూళ్లు చేసి బిచాణా ఎత్తేసిన వ్యక్తి ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన సైకం రామకృష్ణారెడ్డి అని గుర్తించారు.
కనిగిరి సమీపంలోని బల్లవరం (వెలిగండ్ల మండలం) గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా బిట్‌ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టించారు. అందుకు కమీషన్‌ కూడా తీసుకున్న అతడు డిసెంబర్‌ మొదటి వారంలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఆపేశారు.

saikam 171220173

ఏమిటని ఆరా తీయగా మన దేశంలో బిట్‌ కాయిన్‌ ఆర్థిక విధానాలను కేంద్రం అనుమతించడం లేదని, ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోందని కొన్నాళ్లు ఆగాలని చెప్పారు. ఆ తర్వాత ఫోన్‌ నెంబర్లు ఆఫ్‌ చేశాడు. దీంతో నోయిడాకు చెందిన సుమిత్‌ అతని స్నేహితులు మోసపోయామన్న అనుమానంతో ఢిల్లీ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న అమీర్‌పేట ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరైన విషయం తెలియడంతో హైదరాబాద్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అంతలోనే అక్కడి నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి వచ్చారని తెలుసుకుని బాధితులు అక్కడికి చేరుకున్నారు. కానీ గ్రామంలోని ఆయన అనుచరులు వారిపై ఎదురుదాడికి సిద్ధపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరాది వ్యక్తులు కావడంతో వెనక్కి తగ్గి ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలంటూ వచ్చిన ఆహ్వానాన్ని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు తిరస్కరించారు. తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని తనను పిలిచారని ఏపీ సీఎం చంద్రబాబును కనీసం ఆహ్వానించలేదని, ఆంధ్రాకు చెందిన వాడిగా తాను ఆ మహాసభలకు వెళ్లడం సబబు కాదని అన్నారు. ఆయన మాటల్లో "నాకు ఆహ్వానం అందింది... 18 సాయంత్రం రమ్మన్నారు... నేను తప్పకుండా వెళ్దాము అనే అనుకున్నా.. కాని ఈ లోపు, ఒక వార్త నన్ను చాలా బాధ పెట్టింది... 5 కోట్ల ఆంధ్రలకు ప్రతినిది అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఈ సభలకు పిలవలేదు అని నాకు తెలిసింది.. "

garakipati video 16122017 2

"పిలవకపోవటం ఏంటి, ఇవి తెలంగాణా మహాసభలు కాదు, తెలుగు మహాసభలు... పక్కనే ఉన్న రాష్ట్రము, నిన్నటి వరకు కలిసి ఉన్నాం.. అన్నీ విబేధాలు సర్దుకుంటున్నాయి అనుకుంటున్నా సందర్భంలో ఇటువంటి పరిణామం జరగటం నాకు చాలా బాధ వేసింది. నేను పుట్టి పెరిగిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవకపోవటం అంటే, నేను వెళ్ళటంలో అర్ధం లేదు. ఎందుకంటే ఎవర్ని అన్న పెళ్లికి పిలిచినప్పుడు మనం, కుటుంబ పెద్దని పిలవకుండా, ఇంట్లో వాళ్ళని పెళ్ళికి పేలిస్తే ఎవరూ వెళ్లరు, యజమానిని పిలిచినాకే మిగిలిన వారిని పిలుస్తాం" అని గరికపాటి గారు అన్నారు...

garakipati video 16122017 3

తెలుగువారు ఆంధ్రప్రదేశ్ లో లేరా? తెలుగు భాష అభివృద్ధి కోసం అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్న మండలి బుద్దప్రసాద్ గారు కనిపించలేదా? ఆంధ్రప్రదేశ్ కి చెందిన అనేక మంది కళాకారులు, కవులు ఆహ్వానానికి అర్హులు కాదా? ప్రపంచపటంలో హైదరాబాదు కి ప్రఖ్యాతి తీసుకొచ్చిన చంద్రబాబు ని మీరు ఆహ్వనించకుండా అవమానించవచ్చు...బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన అన్న తారకరామారావు గారిని స్మరించకపోవచ్చు..కాని సాటి తెలుగు సోదరుల హృదయాలను గాయపర్చారు. మీఆహ్వానాన్ని తిరస్కరించిన శ్రీ గరికపాటి వారి గళం మొదలు మాత్రమే ! అవమానించిన ప్రభుత్వపెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవమానాన్ని ఆత్మగౌరవంతో ఎదుర్కున్న గరికపాటి తెలుగు సోదరుల అభిమాన ధనాన్ని పొందారు..ధన్యులు...

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంపిక విషయంలో కేంద్రం పదే పదే పెడుతున్న ఇబ్బందులతో, రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి అధ్యక్షతన అమ‌రావ‌తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గం భేటీ జరిగింది. ఈ స‌మావేశంలో పోలీస్‌యాక్ట్-2017 ముసాయిదా బిల్లు అంశం పై చర్చించారు. పోలీస్‌యాక్ట్-2017 ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు వల్ల కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్వయం నిర్ణయంతో డీజీపీని నియమించుకునే అవకాశం ఉంది.

ap cabinet 16122017 1

దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంపికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిర్ణయాధికారం కలిగి ఉండేందుకు వీలు కలుగుతుంది. ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులను ఎంపిక చేసుకొని అందులోంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్ర‌స్తుత డీజీపీ సాంబశివ‌రావు ప‌ద‌వీ కాలాన్ని పొడిగించే అంశంపై యూపీపీఎస్సీ అంగీక‌రించ‌ని నేప‌థ్యంలో ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. క‌ర్ణాట‌క త‌ర‌హాలో ఏపీ ప్ర‌భుత్వ‌మే డీజీపీని నియ‌మించేలా ఆర్డినెన్స్ తీసుకురానున్నారు...

ap cabinet 16122017 1

కాగా, 2014 పోలీస్‌యాక్ట్ ప్రకారం.. కేంద్రానికి ముగ్గురు సీనియర్ అధికారుల జాబితాను పంపించి అందులో ఒక పేరును ఎంపిక చేసుకునేవారు. తాజాగా ఏపీకి కొత్త డీజీపీ నియామకంపై ఆరుగురు సీనియర్ అధికారుల పేర్లతో కూడిన ప్రతిపాదనను కేంద్రానికి మూడుసార్లు పంపింది. అయితే ఆ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ చర్యలతో విసిగిపోయి.. 2014 చట్టానికి సవరణ తీసుకురావాలని భావించి.. 2017 పోలీస్‌యాక్ట్ ముసాయిదాను ఆమోదించింది...

Advertisements

Latest Articles

Most Read