‘పీపుల్స్ ఫస్ట్’ (ప్రజలే ముందు) మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయడంతోపాటు... పథకాల కోసం దరఖాస్తు చేసుకోవడం, వాటి పరిస్థితిని తెలుసుకోవడం, అవసరమైన ధ్రువపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడంతో సహా మరెన్నో సదుపాయాలను ఈ యాప్‌లో రూపొందించారు.
గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘పీపుల్స్ ఫస్ట్ - సిటిజన్ మొబైల్ యాప్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలి...
https://play.google.com/store/apps/details?id=com.codetree.peoplefirstcitizen&hl=en
ముందుగా ఆధార నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి...
తరువాత మన మొబైల్ కి, OTP వస్తుంది. అది ఎంటర్ చేసి, లాగిన్ అవ్వాలి...
ఇందులో... ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం నిక్షిప్తం చేసుకోవచ్చు. చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, విద్యార్హతలు, ఆదాయ వనరులు ఇతర అంశాలూ ఇందులో నమోదవుతాయి. ఇవన్నీ గోప్యంగానే ఉంటాయి.
యాప్‌లో ప్రభుత్వ పథకాలు, డిజిటల్ ధ్రువీకరణ పత్రాలు, ఎం-పాకెట్, గ్రీవెన్సెస్, విలేజ్ ప్రొఫైల్, విలేజ్ అసెట్స్ వంటి వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది.
ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలకోసం మొబైల్ యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల స్థితిగతులను (స్టేటస్) ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహశీల్దారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. పీపుల్స్‌ఫస్ట్ యాప్‌లోని ‘ఎం-పాకెట్’ నుంచి తమ ధ్రువపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ పథకాల కోసం అధికారులూ సిబ్బంది ఎవరైనా లంచం కోరినా, కార్యక్రమాల అమలులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు గుర్తించినా... యాప్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు.