అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిత్యమూ ధర్మాలు వల్లిస్తారు. ఆయనే బూతులు మాట్లాడుతూ నీతుల గురించి ప్రవచనాలు చెబుతారు. స్పీకర్ వంటి గౌరవస్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం చదువు ఫేక్ అని టిడిపి ఆధారాలతో సహా బయటపెట్టింది. డిగ్రీ చదవుకుండానే మూడేళ్ల లా కోర్సులో ఎలా జాయినయ్యారని ప్రశ్నిస్తోంది. డిగ్రీ డిస్ కంటిన్యూడ్ తమ్మినేని 3ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సులో ఎలా అడ్మిషన్ పొందారని తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న తమ్మినేని సీతారాంకి తప్పుడు డిగ్రీ పెట్టుకునే మినహాయింపులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. తమ్మినేని సీతారాం 2019 లో స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉన్నత చదువు కోసం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహాత్మాగాంధీ లా కాలేజీ లో ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్స్ చదవటానికి అడ్మిషన్ పొందారని ఆధారాలు బయటపెట్టారు. ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్స్ చదవాలంటే కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి. లేదా డిగ్రీకి సమానమైన అర్హత కలిగిన కోర్స్ పూర్తి చేసినవారు మాత్రమే ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్స్ పూర్తి చేయడానికి అర్హులన్నారు. కానీ డిగ్రీ మధ్యలోనే ఆపేసిన తమ్మినేని సీతారాం మూడేళ్ల కోర్సులో ఎలా అడ్మిషన్ పొందారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా నర్సిరెడ్డి చెప్పుకొచ్చారు. అనేక టీవీ ఇంటర్వ్యూలలోనే 'డిగ్రీ డిస్ కంటిన్యూడ్' చేసినట్లు తమ్మినేని స్వయంగా చెప్పారని తన ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హతగా "డిగ్రీ డిస్ కంటిన్యూడ్" అని రాశారన్నారు. దీనిపై అత్యున్నతస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.
news
బెజవాడ హోటల్స్ లో వైసీపీ ఎమ్మెల్యేల క్యాంప్ రాజకీయం.. జగన్ కు ఏమి ఖర్మ పట్టింది...
వైసీపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టిడిపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి వారితోనే టిడిపిపై దాడి చేయించిన వైసీపీ ఇప్పుడు తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై అనుమానపు చూపులు చూస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. హోటళల్లో క్యాంపులు, ఎమ్మెల్యేల వెంట నిఘా పోలీసులు తిరుగుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థిగా పంచుమర్తి అనూరాధని దింపడంతో వైసీపీ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. వాస్తవంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గెలవడానికి 22 మంది ఎమ్మెల్యేలు అవసరం. టిడిపి తరఫున 23 మంది గెలిచినా, అందులో నలుగురిని వైసీపీ కొనుగోలు చేసింది. గతంలో టిడిపిలో వైసీపీ ఎమ్మెల్యేలు చేరిన సందర్భంగా సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని ఆరోపించిన వైఎస్ జగన్ అలాగే టిడిపి ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎవరైనా టిడిపి ఎమ్మెల్యేలు తన పార్టీలో చేరాలనుకుంటే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటూ బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు రిజైన్ చేయకుండానే వైసీపీలో కొనసాగుతున్నారు. వైసీపీ మార్క్ పాలిటిక్స్‌కి ఝలక్ ఇవ్వడానికి టిడిపి సిద్ధం అవుతోంది.
ఎమ్మెల్యే కోటా ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైసీపీ కన్నింగ్ పాలిటిక్స్‌కి చెక్ పెట్టాలనుకుంటోందది. దీంతో అప్రమత్తమైన అధికార వైసీపీ తమ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టింది. ఇప్పటికే ఇద్దరు ఆత్మప్రభోదానుసారం పాట పాడుతున్న నేపథ్యంలో మరి ఒక్కరు ఓటేస్తే చాలు. ఆ ఒక్కరు ఎవరో తెలియక మొత్తం 150 మంది, టిడిపి నుంచి చేరిన నలుగురు, జనసేన నుంచి వచ్చిన ఒక్కరిపైనా అనుమానపు చూపులు చూస్తోంది. అంటే జగన్ రెడ్డి ఒక్కడు తప్పించి, మిగిలిన ఏ ఒక్కరినీ నమ్మడంలేదని అర్థం అవుతోంది. డౌట్ పడుతున్న కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ నేరుగా మాట్లాడారు. ఎమ్మెల్యేలతో ఓటు వేయించే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించేశారు. ఒక్కో ఎమ్మెల్యే సమన్వయానికి ఏడుగురు సీనియర్ నేతలకు బాధ్యతలు కేటాయించారు. 22 మంది ఎమ్మెల్యేలను సమన్వయం చేసేందుకు పార్టీ సీనియర్ నేతలతో పాటు కొందరు మంత్రులకు అప్పగించేశారు. వీరందరితో క్యాంప్ రాజకీయాలు, విందు భోజనాలు ఏర్పాటు చేశారు
వైసీపీకి , బీజేపీ ఇస్తున్న సహకారమే కొంప ముంచింది అంటున్న బీజేపీ సీనియర్ నేత
బీజేపీ-వైసీపీ అనైతిక పొత్తుపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న బీజేపీ నేతలు ఒక్కొక్కరూ బయటపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కోల్పోవడంతో ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఏపీలో బీజేపీ-వైసీపీ ఒకటే అని ప్రజలు భావిస్తున్నారని మొన్న విష్ణుకుమార్ రాజు కుండబద్దలు కొట్టగా, నేడు ఎమ్మెల్సీగా ఓడిపోయిన సీనియర్ బీజేపీ నేత మాధవ్ వైసీపీతో అనైతిక పొత్తు వల్ల బీజేపీ ఎంత నష్టపోతుందో వివరించారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంతో పోల్చుకుంటే భాజపాకు వచ్చిన ఓట్ల శాతం పెరిగిందని, విశాఖలో మాత్రం ఓట్ల శాతం తగ్గిందన్నారు. జనసేనతో కలిసి ఉన్నా కలిసి లేనట్టేనని భావిస్తున్నామని స్పష్టం చేశారు. జనసేనతో కలిసి భాజపా ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉందని నమ్ముతారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి రాలేదని వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ అభ్యర్థి తమకు జనసేన మద్దతు ఉందని ప్రకటించారని, దీనిని ఖండించమని జనసేనను కోరినా స్పందించలేదని వాపోయారు. మరోవైపు వైసీపీ చేసే తప్పుడు పనులన్నీ బీజేపీ మెడకు చుట్టుకుంటున్నాయనే అర్థం వచ్చేలా నర్మగర్భంగా మాధవ్ మాట్లాడారు. బీజేపీ హైకమాండుకు చెప్పే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని వైకాపా ప్రచారం చేస్తోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విషయాన్ని ప్రజలు నమ్మారని చెప్పుకొచ్చారు. వైకాపా బీజేపీపై వేస్తున్న ఈ అపవాదును తుడుచుకునే ప్రయత్నం చేస్తామన్నారు. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తామన్నారు. పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు ఉన్నాయని, అయితే ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని మాధవ్ వివరించారు.
టిడిపి లేడీ ఎమ్మెల్యే మార్ఫింగ్ ఫోటోలు వేసి అడ్డంగా దొరికిన సాక్షి
మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కడం అనే సామెత ఎప్పుడైనా విన్నారా? వినకపోతే వైసీపీ ఎమ్మెల్యేలని చూడండి చాలు. 151 సొంత ఎమ్మెల్యేలు, జంపింగ్ జాపాంగ్ మరో ఐదుగురు ఎమ్మెల్యేలున్న కలిసి 156 మంది ఎమ్మెల్యేలపై 15 మంది కూడా అసెంబ్లీలో లేని టిడిపి ఎమ్మెల్యేలు దాడి చేశారని కట్టుకథ అల్లారు. ఐప్యాక్ బీహార్ బ్యాచీలతో బ్లాక్ డే అంటూ బాగానే క్యాంపెయిన్ చేశారు. అయితే ఐప్యాక్ డ్రామా రక్తికట్టించే లోపు సాక్షి వైసీపీనే మొత్తం అడ్డంగా బుక్ చేసింది. అసెంబ్లీలో స్పీకర్ పై టీడీపీ ఎమ్మెల్యేల దాడి అంటూ పాత ఫోటోలతో మొదటి పేజీలో తప్పుడు కథనం వేసి మొత్తం వైసీపీది డ్రామా అని తేల్చేసింది సాక్షి. వాస్తవంగా టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిని కప్పిపుచ్చేందుకు, పాత ఫోటోలు తీసి స్పీకర్ పై దాడి అంటూ సాక్షి బేనర్ వేసేసింది. సాక్షి మొదటి పేజీలో ప్రచురించిన ఫోటోలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. తాను శాసనసభ సమావేశాలకే రాలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్రకటించడంతో వైసీపీ, సాక్షి చేసిన ఫేక్ డ్రామాలు అన్నీ బయటపడ్డాయి. ఎమ్మెల్యే స్వామిపై దాడి వ్యవహారంతో తీవ్ర విమర్శల పాలనై అధికారపక్షం. దీంతో పాత ఫోటోలతో స్పీకర్ పై దాడి అంటూ కట్టుకథ అల్లి మరోసారి వైసీపీని సాక్షి బుక్ చేసేసింది.