వైసీపీ దళిత మహిళా ఎమ్మెల్యేపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకి ముందు రోజు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని ఇంటికి పిలిపించుకున్న జగన్, కొద్దిగా అమర్యాదకరంగా ప్రవర్తించారని టాక్ బయటకు వచ్చింది. తన కుటుంబంతో వెళ్లి సీఎంని కలిసిన ఉండవల్లి శ్రీదేవికి కుటుంబసభ్యుల ఎదుటే జగన్ రెడ్డి అవమానించారని వైసీపీ కోర్ సర్కిళ్లలో గుసగుసలాడుకుంటున్నారు. డాక్టర్, దళిత, మహిళ అని కూడా చూడకుండా జగన్ రెడ్డి ప్రవర్తించిన తీరుకి ఉండవల్లి శ్రీదేవి బాగా హర్ట్ అయ్యారని ...అందుకే అధికార పార్టీని ధిక్కరించి మరీ టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకి ఓటేశారని తెలుస్తోంది. దళిత మహిళా ఎమ్మెల్యే పట్ల జగన్ రెడ్డి వ్యవహరించిన తీరుని వైసీపీ అనుకూల వెబ్సైటు గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్‌లో కథనంగా ప్రచురించారు. అందులో నర్మగర్భంగా తాడికొండ ఎమ్మెల్యే పట్ల జగన్ రూడ్ గా ప్రవర్తించారన్నట్టు రాసుకొచ్చారు. దీంతో జగన్ రెడ్డి దళిత మహిళ ఎమ్మెల్యేపై వ్యవహరించిన తీరు పై ర్తలు వస్తున్నాయి. తమ అధినేత ఇలా చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకుని...జగన్ కిరాయి మూకలు, పేటీఎం బ్యాచులు చెలరేగిపోతున్నాయి. వైసీపీ సోషల్మీడియాలో అత్యంత నీచమైన భాషలో ఉండవల్లి శ్రీదేవిని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు వైసీపీ కిరాయి మూకలు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్‌పై దా-డి చేశారు. ఆఫీస్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, చించివేశారు. ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల నినాదాలు చేస్తూ స్వైరవిహారం చేశారు. ఏకంగా జగన్ రెడ్డే ఇంటికి పిలిచి వార్నింగ్ ఇచ్చి దిగాక వైసీపీ శ్రేణుల నుంచి ఈ స్థాయి దాడులు జరుగుతాయని తెలిసినా కూడా వెనక్కి తగ్గకుండా టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనూరాధకి ఓటేసి, తాను వైసీపీ అధిష్టానంతో పోరాటానికి సై అంటున్నానని సంకేతాలు పంపింది.
news
జగన్ ని గట్టిగా ఇరికించిన వల్లభనేని వంశీ..
వల్లభనేని వంశీ గురించి టిడిపి వాళ్లు చెప్పేది ఒకే ఒక్క మాట. ఆయన రాజకీయ వ్యభిచారి అని. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటలు ఇదే తీరుగ ఉంది. తాను టిడిపిలో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వైసీపీలో తిరుగుతూ టిడిపిని తిడుతూనే ఉన్నాడు. ఇది నైతికత అని చెబుతుంటాడు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా టిడిపి పంచుమర్తి అనూరాధకి ఓటేయాలని విప్ జారీ చేసినా, లెక్క చేయకుండా వైసీపీ అభ్యర్థికి ఓటేశాడు. ఇది కూడా నీతివంతమైన వ్యవహారశైలి అనే అంటున్నాడు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పక్కనబెట్టి అదే నియోజకవర్గాల్లో సమన్వయకర్తల పేరుతో వేరే వాళ్లకి పెద్దరికం అప్పగించడంతో కడుపు మండిన వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థికి ఓటేయడం మాత్రం వల్లభనేని వంశీ దృష్టిలో నమ్మకద్రోహం అట. తిన్నింటి వాసాలు లెక్కపెట్టటం అట. దీనినే వల్లభనేని వంశీ చేస్తే సంసారం, వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తే వ్యభిచారం అన్న చందంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరినీ కోట్లు ఇచ్చి చంద్రబాబు కొనుగోలు చేశారట. వల్లభనేని వంశీతోపాటు టిడిపి నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం వైఎస్ జగన్ రెడ్డి తేజోవంతమైన ఫేస్ కట్ నచ్చి, రూపాయి తీసుకోకుండా నీతిబద్ధంగా వైసీపికి ఓటేశారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడ్ ద్వారా వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని గుర్తించేశారని చెప్పిన వంశీ, టిడిపి నుంచి గెలిచి వైసీపీకి ఓటేసిన తమని ఏం చేయాలో చెప్పలేదు మరి. వైసీపీ దూరం పెట్టిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకే ఓటు వేయాలట. టీడీపీ నుంచి దూరంగా ఉన్న తాము నలుగురు మాత్రం టిడిపికి ఓటు వేయాల్సిన అవసరం లేదనడం వంశీ చేస్తే సంసారం, వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తే వ్యభిచారం అన్న చందంగా ఉందని రాజకీయ సర్కిళ్లలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వైసీపీకి కోడికత్తిలా గుచ్చిన ఆ నలుగురు ఎవరు?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా ఏడో అభ్యర్థిని రంగంలోకి దింపింది వైసీపీ. టిడిపి కూడా తమ 23 మందిలో నలుగురు అమ్ముడుపోవడంతో గెలిచే అవకాశాలు లేవని కామ్ గా ఉంది. హఠాత్తుగా వైసీపీలో అసమ్మతి స్వరాలు లేస్తుండడంతో వ్యూహం మార్చి పంచుమర్తి అనూరాధని రంగంలోకి దింపింది. దీంతో వైసీపీలో వణుకు ప్రారంభమైంది. క్యాంపులు, బిల్లులు రిలీజ్, సీఎం సముదాయింపులు జరిగాయి. అయినా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనూరాధకి ఓటేశారు. మొదట ఇద్దరే అనుకున్నారు. ఒకరు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కాగా, మరొకరు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని లీకులిచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలు ఎలాగూ వైసీపీ వేయరని ఫిక్స్ అయ్యారు. టిడిపి నుంచి ఓట్లు వస్తాయనుకుంటే తమ నుంచే నలుగురి ఓట్లు లాగేయడంతో వైసీపీలో అనుమానపు చూపులు తీవ్రం అయ్యాయి. కనిగిరి బుర్రా మధుసూదన్, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పైనే వైసీపీ డౌట్ వ్యక్తం చేస్తోంది.
చంద్రబాబు చాణక్యంతో జగన్ కు వణుకు.. కేసీఆర్‌కీ రిటర్న్ గిఫ్ట్ రెడీ..
ఓడిపోయామని పారిపోలేదు..నిలిచారు..గెలుస్తున్నారు..ఇదీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వ్యూహం. ఇదీ చంద్రన్న చాణక్యం. 2019 ఎన్నికల్లో దారుణ పరాజయంపై సొంత పార్టీలోనే బాబుపై విమర్శలు గుప్పించారు. బీజేపీతో తెగదెంపులు, కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నారు. జనసేనతో పొత్తులు దూరం అయ్యాయి. ఒంటరి పోరాటం తెలుగుదేశానిది. వైసీపీ ఇటు బీజేపీ ఆశీస్సులు, అటు కేసీఆర్ అండదండలు అందిపుచ్చుకుంది. కోడికత్తి డ్రామా, బాబాయ్ పై గొడ్డలి వేటు వేసి తెలుగుదేశానికి చాలా నష్టం చేశారు. ఇన్ని ప్రతికూలత మధ్య దారుణ ఓటమి మూటగట్టుకున్నారు. గెలిచిన 23 మందిలో నలుగురిని కొనేశారు వైసీపీ వాళ్లు. మిగిలిన వాళ్లూ తమవైపే అంటూ బెదిరింపులు మొదలుపెట్టారు. ఒక ఎమ్మెల్యే అయితే ఎక్కడున్నారో తెలియనంత మౌనం దాల్చారు. అసెంబ్లీకి వెళ్లి రాక్షసులతో ప్రజాస్వామిక యుద్ధం చేయాలనుకున్నారు. కానీ అనైతిక, ముష్కర, ఫ్యాక్షన్ వైసీపీ చంద్రబాబు నైతిక స్థైర్యం దెబ్బతీసి సభకి దూరం చేయాలని ఆయన భార్యని అవమానించారు. జీవితంలో ఎన్ని అవమానాలు ఎదురైనా చెక్కుచెదరని చంద్రబాబు, భోరున ఏడ్చారు. బాబు కన్నీరు పెట్టుకున్న దృశ్యాన్ని అవహేళన చేశారు. 23 సీట్లు దేవుని స్క్రిప్ట్ అని ఎద్దేవ చేశారు. పార్టీ కీలకనేతలందరినీ అక్రమ కేసుల్లో ఇరికించి జైలులో వేసేశారు. మాజీ మంత్రులైన అచ్చెన్న,అయ్యన్న, కొల్లు రవీంద్ర, నారాయణలని తప్పుడు కేసులతో హింసించారు.
టిడిపి కేంద్ర కార్యాలయంపైనే దాడికి తెగబడ్డారు. చంద్రబాబు ఇంటిపైకి దాడికొచ్చారు. తనపైనా, తన కొడుకుపైనా కేసులు-దాడులకు లెక్కేలేదు. సైకో జగన్ రెడ్డి క్రూర కక్ష సాధింపులకు కోడెల శివప్రసాద్ ని కోల్పోయింది టిడిపి. ఇంత అరాచక అధికార మదంని వైసీపీ ప్రదర్శిస్తుంటే, తెలుగుదేశం నుంచి ఎదుర్కొనే ప్రక్రియ అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే చేశారంటే చంద్రబాబుకి ఎంత ఓర్పు, ఎంత సహనమో ఆలోచించుకోవచ్చు. రోడ్డెక్కితే కేసు, నిరసన కార్యక్రమానికి పిలుపు ఇస్తే గృహనిర్బంధాలను దాటుకుని అరాచక సర్కారుపై ఒక్కో అస్త్రాన్ని తీయడం మొదలుపెట్టారు. ప్రజల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రం అవడంతో తన వ్యూహాలకు పదును పెట్టాడు. అప్రతిహత అధికారమదమెక్కి ఉన్న వైసీపీకి పట్టభద్రుల ఎన్నికల్లో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ 23 మంది ఎమ్మెల్యేలున్న టిడిపి దక్కాల్సిన సీటుపై కన్నేశాడు జగన్ రెడ్డి. అక్కడే వైసీపీలో ఉన్న వ్యతిరేకతని వాడుకుని మాజీ మేయర్, బీసీ మహిళ అయిన పంచుమర్తి అనూరాధని రంగంలోకి దింపారు. అనూరాధ గెలుపుని తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్న చంద్రబాబు వ్యూహాలు మరింత పదునెక్కుతాయి. చంద్రబాబు చాణక్యం మొదలైంది. బాకీలు లెక్కలు తేల్చే సమయం ఆసన్నమైంది. సైకోని సాగనంపడం గ్యారెంటీ, అయితే సైకో స్నేహితులకీ రిటర్న్ గిఫ్ట్ బాకీ వడ్డీతో చెల్లించాల్సి ఉంది. ఆ ముచ్చట తీరే అవకాశాలు కనపడుతున్నాయి.