మరోసారి ప్రకృతి మన రాష్ట్రం పై విలయతాండవం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో తితలీ తుఫాను రూపంలో విరుచుకుపడింది. పెను విధ్వంసం సృష్టించింది. హూద్ హూద్ ను మించిన ఈ తుఫాన్ శ్రీకాకుళం వాసుల గుండె పై చెరగని గాయం చేసింది. లక్షలాది కొబ్బరి, జీడి , మామిడి చెట్లను నాశనం చేసింది. కరెంటు స్థంభాలు కూలిపోయాయి, మట్టి గోడలు ఉన్న ఇల్లు కూలిపోయాయి. అపార నష్టం వాటిల్లింది. మన మీడియా దీని గురించి అసలు పట్టించుకోకపోయినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం, తుఫాను రెండు రోజుల ముందు నుంచే సమీక్షలు చేస్తూ, ప్రాణ నష్టం నివారించ గలిగారు. వెంటనే శ్రీకాకుళం వెళ్ళిపోయారు. గత నాలుగు రోజులుగా, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అంతా పలాస నుంచే నడుస్తుంది.

pk 15102018 2

ఎంతటి ఉపద్రవం కాకపోతే, ఒక ముఖ్యమంత్రి, 10 మంది మంత్రులు, వందల మంది అధికారులు, వేల మంది కార్మికులు అక్కడ నుంచి పని చేస్తున్నారు. అధికార పక్షం ఇలా పని చేస్తుంటే, ప్రతిపక్షం రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి, కాని మన ఖర్మకు అలా లేదు. ప్రతిపక్ష నాయకుడు అక్కడే ఉన్నా, తన ముద్దుల యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక ఇంకో నాయకుడు అయితే, నాకు శ్రీకాకుళం అంటే ఎంతో ఇష్టం, నా జీవితం శ్రీకాకుళం వాసులకి అంకితం అంటూ కబుర్లు చెప్పాడు. చంద్రబాబు లేకపోయినా, మీకు నేను ఉన్నాను అంటూ, అవసరం లేనప్పుడు ఉత్తి మాటలు చెప్పాడు. నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రం, స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని, ఎంజాయ్ చేస్తున్నాడు. న్యు ఏజ్ పాలిటిక్స్ అంటూ చెప్తున్న పవన్ కళ్యాణ్, ఇదే నా న్యు ఏజ్ పాలిటిక్స్ అంటే ?

pk 15102018 3

ఒక పక్క, మన పక్క జిల్లా, తుఫాను వచ్చి అల్లడుతుంది. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు పూర్తిగా అందటం లేదు. ఇలాంటి టైములో పవన్ చెప్తున్న న్యు ఏజ్ పాలిటిక్స్ ప్రకారం ఏం చెయ్యాలి ? తన ఫాన్స్ అందరికీ పిలుపు ఇచ్చి, శ్రీకాకుళం పంపించి, అక్కడ సహయక చర్యలు చేయ్యమనాలి. అప్పుడు పవన్ మీద ఎవరికైనా గౌరవం పెరుగుతుంది. కాని పవన్ చెప్తున్న న్యు ఏజ్ పాలిటిక్స్ ప్రకారం, ఈ రోజు తన ఫాన్స్ అందరినీ గోదావరి రమ్మని, కవాతు చేస్తున్నాడు. హెలికాప్టర్ లలో పువ్వులు, తమన్ తో స్పెషల్ పాటలు, టీజర్లు, ట్రైలర్లతో ట్విట్టర్ లో అప్డేట్ లు ఇస్తున్నాడు పవన్. పవన్ కు ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్నా, శ్రీకాకుళం పరిస్థితి చూసి ఖచ్చితంగా ఈ రోజు ఈ సంబరాలు, వాయిదా వేసుకునేవారు. సాటిప్రజలు బాధల్లో ఉన్నప్పుడు మరోచోట ఉత్సవాలు, బలప్రదర్శనలు చేయటం పవన్ చెప్పే న్యూ ఏజ్ పాలిటిక్స్ ఏమో ?

ఈ నెల 17,18,19 తారీఖుల్లో, అమెరికాలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా, కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేశ్ రద్దు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం వరల్డ్ ఫుడ్ ప్రైజ్.
18 వ తేదీన భారతదేశ వ్యవసాయ రంగం - టెక్నాలజీ అనుసంధానంతో దేశ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల పై కీ నోట్ ప్రసంగం ఇవ్వాలి అని లోకేష్ కి ఆహ్వానం పంపింది వరల్డ్ ఫుడ్ ప్రైజ్. అయితే, ఈ పర్యటనకు వెళ్ళాల్సి ఉన్న లోకేహ్స్,
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందు వల్ల, పూర్తి స్థాయిలో గ్రామాలు కొలుకోని, సాధారణ స్థితికి వచ్చే వరకూ శ్రీకాకుళంలోనే ఉండాలి అని లోకేష్ నిర్ణయం తీసుకోవటంతో, ఈ పర్యటన రద్దు చేసుకున్నారు.

lokesh 15102018 2

మరో పక్క నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మరవారికి పట్టు వస్త్రాలు సమర్పించటానికి శ్రీకాకుళం నుంచి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంలో చంద్రబాబు కుటుంబ సమేతంగా, అమ్మవారిని దర్శించుకున్నా, ఆ సమయంలో కూడా లోకేష్ శ్రీకాకుళంలోనే ఉండిపోయారు. మందస డిఆర్డిఏ వెలుగు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రోజు నుంచి, గ్రామాల్లో ఉన్న రేషన్ షాపుల్లో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ జరగాలని, దానికి తగ్గ ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించారు. గ్రామాల్లో బియ్యం,నిత్యవసర సరుకుల పంపిణీ సులభంగా జరిగేలా ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసారు.

lokesh 15102018 3

అలాగే గ్రామాల్లో జరిగే సహాయ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అనుసంధానంతో బృందాలు ఏర్పాటు చేసారు. పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,వ్యవసాయ శాఖ,రెవెన్యూ,ఉద్యాన పంటలు,పశు సంవర్ధక శాఖ మరియు ఇతర శాఖల క్షేత్ర స్థాయి సిబ్బందితో ప్రత్యేక బృందాలను దింపారు. గ్రామాల్లో సహాయక కార్యక్రమాలు, పంట నష్టం అంచనా అన్ని ఓకే సారి జరిగేలా బృందాలకు సూచనలు చేసారు లోకేష్. మందసం మండలం లోని 38 గ్రామాలు,244 నివాస ప్రాంతాల్లో మూడు పూటలా భోజనం ఏర్పాటులో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోకేష్ ను, తుఫాను బాధితులను ఆదుకోవటానికి, మందసం మండల ఇంచార్జ్ గా చంద్రబాబు నియమించారు.

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను ప్రభావం వల్ల ఉద్దానం ప్రాంతానికి అపార నష్టం వాటిల్లింది. ఇక్కడ బాధితులకు అండగా నిలిచి సాధారణ పరిస్థితులు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజులుగా సెక్రటేరియేట్‌ను అమరావతి నుంచి పలాసకు మార్చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఓ ముఖ్యమంత్రి మున్సిపల్ కార్యాలయాన్ని తన క్యాంపు ఆఫీసుగా మార్చుకుని బస్సులోనే బస చేస్తూ24 గంటలు విధులు నిర్వహించేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం శ్రీకాకుళం జిల్లాలో ఇదే ప్రథమం. గతంలో విశాఖకు హూద్ హూద్ వచ్చినప్పుడు కూడా, ఇలాగే పని చేసారు చంద్రబాబు.

secretariat 14102018 2

తాజగా శ్రీకాకుళంలో కూడా అలాగే పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి పిలుపుతో డిప్యూటీ సి.ఎం. నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కె.నారాయణ, పితాని సత్యనారాయణ, నారా లోకేష్, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావులతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు విజయానంద్, అజయ్‌జైన్, నీరపుకుమార్‌ప్రసాద్, పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరితోపాటు 50 మంది ఐఎఎస్ అధికారులు, 100 మంది డిప్యూటీ కలెక్టర్లు, 136 మంది ఉన్నతాధికారులతో పలాసలో మినీ సెక్రటేరియేట్‌ను ముఖ్యమంత్రి నడుపుతున్నారు. 2014లో సంభవించిన హుదూద్ తుపానుకు విశాఖ జిల్లా దెబ్బతిన్నప్పుడు సీఎం చంద్రబాబు విశాఖలో ఉండి ఇదేవిధంగా రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులను, మంత్రులను రప్పించి యుద్ధ ప్రాతిపదిక సహాయక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

secretariat 14102018 3

పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాలను తుపాను విపత్తు పూర్తిగా కకావికలం చేసింది. దీంతో అక్కడ ప్రజలు మనోధైర్యం కోల్పోయి సాయం కోసం ఎదురుచూడాల్సి పరిస్థితి నెలకొంది. ఇటువంటి కుటుంబాలకు అండగా నిలిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత మూడు రోజులుగా పలాసలోనే బస చేస్తూ అమరావతి నుంచి సెక్రటేరియేట్‌ను ఇక్కడకు మార్చేయడంతో మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, సీనియర్ ఐఎఎస్ అధికారులు విశాఖపట్నం, విజయనగరం, జిల్లాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు సహాయక చర్యలు అందించేందుకు గ్రామాలను చుట్టుముడుతున్నారు. బాధిత గ్రామాల్లో తాగునీరు, ఆహారం, నిత్యావసర వస్తువులు పౌరులకు అందేలా చర్యలు వేగవంతం చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ ప్లాంటు నిర్మాణ పనులు డిసెంబర్‌లో చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్లాంటు నిర్మాణాన్ని నవయుగ సంస్థ చేపట్టింది. ప్రస్తుతం మట్టి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కొండను తొలిచే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో సివిల్ పనులు చేపట్టి పూర్తిచేయనున్నారు. ఇటీవల ఏపీ జెన్కో ఉన్నతాధికారులు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏపీ జెన్కో పోలవరం పవర్ హౌస్ సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విఎస్‌ఎస్ కొలగాని మూర్తి పనులను ఉన్నతాధికారులకు వివరించారు. ఈసందర్భంగా డిసెంబర్‌లో సివిల్ పనులు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధంచేశారు. 2013-14 ధరల ప్రకారం పోలవరం జల విద్యుత్ ప్లాంట్‌ను రూ.4205.66 కోట్ల అంచనాతో చేపడుతున్నారు.

polavaram 14102018 2

ఇందుకు సంబంధించి అఖండ గోదావరి ఎడమ గట్టు వైపు దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద పనులు జరుగుతున్నాయి. అవసరమైన భూసేకరణ కూడా పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులవుతున్న ఆదివాసీలకు ఇంకా భూమికి భూమి ఇవ్వాల్సివుంది. అనువైన భూమిని నిర్వాసితులకు అప్పగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. విశిష్టమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిమగ్నమైన మొత్తం యంత్రాంగానికి అక్కడనే జెన్కో క్వార్టర్స్ కూడా నిర్మించనుంది. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుని విద్యుత్ ఉత్పత్తిని అతి తక్కువ ధరకు చేయడానికి అవకాశం ఉండటంతో మొత్తం 960 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రూపకల్పనచేశారు. అంగుళూరు గ్రామం వద్ద మొత్తం 450 ఎకరాల్లో ఒక్కోటి 80 మెగావాట్ల సామర్ధ్యం గల 12 హైడల్ యూనిట్లు నిర్మాణం చేయనున్నారు.

polavaram 14102018 3

ప్లాంటు మట్టి తవ్వకం పనులు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగానే జరుగుతున్నాయి. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు తీసుకుని విద్యుత్ ఉత్పత్తి తర్వాత గోదావరి నదిలోకి కాటన్ బ్యారేజి వైపు నీరు విడిచిపెడుతుంది. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచే కాకుండా విద్యుత్ కేంద్రం నుంచి కూడా నిరంతరం నీరు కాటన్ బ్యారేజికి చేరుతుంది. ఈ విద్యుత్ కేంద్రాన్ని మొత్తం 58 నెలల్లో పూర్తిచేయడానికి ప్రణాళిక ఏపీ జెన్కో చేసింది. 40 నెలల్లో మూడు యూనిట్లు, మిగతా 9 యూనిట్లను 18 నెలల్లో పూర్తిచేయడానికి ప్రణాళికలు సిద్ధంచేసింది. ఏజీ జెన్కో జల విద్యుత్ కేంద్ర నిర్మాణం, నిర్వహణలో దేశంలోనే రెండవ స్థానంలో వుంది. అనుభవం కలిగిన ఇంజనీర్లు ఉండటంవల్ల నిర్ధేశిత సమయానికి 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అందుబాటులో వస్తుందని అంచనావేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read