పున్నమి ఘాట్‌లోని హరిత హోటల్‌లో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారులు సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి జవహర్ రెడ్డి, జేఎస్వీ ప్రసాద్, ప్రవీణ్ కుమార్, ప్రసన్న వెంకటేష్ హాజరయ్యారు. ఐఏఎస్‌లపై రాజకీయ పార్టీల విమర్శలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా సీఎస్ ఎల్వీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్చించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఈ భేటీలోనే ఐఏఎస్‌ల సంఘం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే, చంద్రబాబుకు వ్యతిరేకంగా అంటూ పెట్టిన సమావేశానికి రావటానికి ఐఏఎస్ లు ఇష్ట పడలేదు. జగన్ కు సన్నిహితంగా ఉండే అతి కొద్ది మంది మాత్రమే సమావేశం అయ్యారు. దీంతో ఐఏఎస్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. సంఘంలో 184 మంది సభ్యులు ఉండగా, తాజా సమావేశానికి 14 మందే హాజరయ్యారు. దాంతో సమావేశాన్ని వాయిదా వేశామని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే తమ సమావేశంలో ప్రధాన అజెండాగా భావించామని, కానీ చాలామంది అధికారులు రాకపోవటంతో సమావేశం నిర్వహించలేకపోతున్నామని వివరించారు.
కనీస స్థాయిలో సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఎలాంటి తీర్మానాలు చేయలేదని, కనీసం అజెండాపై చర్చించే వీల్లేకుండా పోయిందని అన్నారు. కోరం ఉండాలంటే 46 మంది హాజరు కావాల్సి ఉంటుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఐఏఎస్ లు సమావేశం అవుతున్నారని, చంద్రబాబు ఓడిపోతున్నాడు అని తెలిసి, ఐఏఎస్ లు ఎదురుతిరుగుతున్నారని, జగన్ బ్యాచ్ హడావిడి చేస్తుంది. తీరా చూస్తే, కేవలం 5% మంది, అది కూడా జగన్ కు అనుకూల వర్గంగా పేరు ఉన్న 14 మంది ఐఏఎస్ ల హడావిడి చూసి, జగన్ బ్యాచ్ ఎగురుతుంది. కాని చంద్రబాబు మీద ఉన్న విశ్వాసం, ఆయన పై ఉన్న గౌరం, ఆయన నాయకత్వం పై ఉన్న నమ్మకంతో, దాదపుగా 95 % మంది, చంద్రబాబుకి వ్యతిరేకంగా పెట్టిన సమావేశానికి హాజరు కాలేదు. ఇప్పటికైనా ఇలాంటి అధికారులు బుద్ధి మార్చుకుని, రాజకీయాలు చెయ్యకుండా, రాష్ట్ర అభివృద్ధిలో పోటీ పడాలని ఆశిద్దాం...