రెండు ఉదాహరణలు... కేవలం రెండే ఉదాహరణలు ... మీడియా సంస్థలు వ్యవహార శైలి...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,ఇక్కడి ప్రజలు,ఇక్కడి ముఖ్యమంత్రి,ఇక్కడి ప్రభుత్వం పట్ల మీడియా వ్యవహరిస్తున్న తీరుని కళ్లకి కట్టినట్టు వివరిస్తుంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న మీడియా ఒక్కటే కానీ రెండు రాష్ట్రాల్లో వచ్చే వార్తల్లో ఎంతో వైరుధ్యం ఉంది దీనికి ఉన్న ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. చిత్తూరు జిల్లా ఏర్పేడు లారీ ఘటన ... లారీ ఢీ కొట్టి 15 మంది చనిపోతే మీడియా లో అనేక వార్తలు వచ్చాయి...బ్రేకింగ్స్ వచ్చాయి. ప్రభుత్వ ఘోర వైఫల్యం ,చంద్రబాబు తప్పిదం,ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి ... గాఢ నిద్ర లో ప్రభుత్వం ... 15 మందిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం అని వార్తలు ప్రపంచ ఎల్లలు దాటాయి... జాతీయ మీడియాలో సైతం ఇవే వార్తలు..కొన్ని మీడియా సంస్థలు అయితే మంత్రి రాజీనామా చెయ్యాలి,ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలి అని వార్తలు రాసాయి...

సరే లారీ ఢీ కొట్టడానికి చంద్రబాబే కారణం అనుకుందాం...దానికి ఒక ముఖ్యమంత్రి గా బాధ్యత వహించి హుటాహుటిన ప్రభుత్వ యంత్రాగాన్ని,మంత్రులను పంపి క్షతగాత్రులను ఆసుపత్రులకు పంపడం,మెరుగైన వైద్య సేవలు అందించడం...చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడం చేసారు...చివరి బాధితుడికి న్యాయం జరిగే వరకూ చంద్రబాబు ని వదిలేది లేదు అని మీడియా అనుకోవడం లో నిజానికి తప్పుకూడా లేదు ... తెలంగాణ లో కొండగట్టు వ్యవహారం... కొండగట్టు బస్సు ప్రమాదం ...58 మంది భక్తులు ఘోరంగా చనిపోయారు...మరి తెలంగాణ లో మీడియా రూల్స్ ఎందుకు మారాయి...తెలంగాణ లో బస్సు ప్రమాదం జరిగి 58 చనిపోయి మిగిలిన కొంత మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే...మీడియా లో వచ్చిన వార్తలు ఏంటో తెలుసా...ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం... కోసం వెళ్లి అనంత లోకాలకు... కనీసం చనిపోయిన వాళ్ల కుటుంబాలను పరామర్శించిన వాడు లేడు.

వాళ్లకి సహాయం చేసిన వాడు లేడు...మన మీడియా కి ఇది ప్రభుత్వ వైఫల్యం గా కనపడలేదు...చివరి బాధితుడి న్యాయం జరిగే వరకూ ఇక్కడ మీడియా పోరాటం లేదు. ఇక రెండో విషయం రెండు రాష్ట్రాలను ఊపేసిన విషయం డేటా చోరీ కేసు . అసలు ఈ కేసు గురించి మీడియా ఎందుకు అంత రాద్ధాంతం చేసింది ? ఆంద్రప్రదేశ్ కి సంబందించిన డేటా పోయింది అది మేము వెతుకుతున్నాం అని తెలంగాణ పోలీసులు అనడం ఏంటి ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,ఎన్నికల సంఘం,ఆధార్ అధారిటీ డేటా పోయింది అని తెలంగాణ పోలీసులు చెప్పడం... బాబు మా డేటా మా దగ్గరే ఉంది మా డేటా పోలేదు అని చెబుతున్నా మీడియా లో వస్తున్న వార్తలు చూసి ఆశ్చర్యం వేస్తుంది...మొదట ఏపీ ప్రజలు డేటా కొట్టేసిన చంద్రబాబు,రెండు తెలంగాణ డేటా కొట్టేసిన చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఇతర రాష్ట్రాల డేటా కొట్టేసిన చంద్రబాబు అని మీడియా లో వార్తలు... అసలు ఎం పోయిందో తెలియదు?ఎం వెతుకుతున్నారో తెలియదు? 

చట్టసభలు రద్దైనా, రద్దును కేబినేట్ కోరితే గవర్నర్ ఆమోదించినప్పుడు లేదా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే (ఎన్నికలలో ఓడిన తరువాత, లేదా సాధారణంగా రాజీనామా చేసినా, బలపరీక్షలో విఫలం అయినప్పుడు కూడా) అప్పుడు కొత్తవారు వచ్చే వరకూ care taker, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆ పాతవారిని కొనసాగాలని కొన్ని పరిస్థితుల్లో గవర్నర్ కోరతారు. లేకపోతే సాంకేతికంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉంటుంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డిగారు తెలంగాణ బిల్లు ఆమోదం పొందినవెంటనే రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగనని కుండబద్దలు కొట్టి వెళ్లిపోయారు. 2004లో చంద్రబాబు గారు ఎంతో ముందుగానే, అలాగే 2018లో కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు సభ రద్దుచేసి వెళ్లి నెలల తరబడి ఆపద్ధర్మ ముఖ్యమంత్రులుగా కొనసాగారు.

cbn 23040019

ఇప్పుడు సాధారణ ఎన్నికలు ఒకో రాష్ట్రంలో 3 నెలలు ముందు జరగొచ్చు. అయితే దానికోసం శాసన సభ జీవితాన్ని ముందే చంపేయరు. నేడు ఎన్నికలు జరుతున్న రాష్ట్రాల్లో నవీన్ పట్నాయక్, చంద్రబాబు గార్లకు ఉన్న అధికారాలే కొద్ది తేడాతో ప్రధాని మోదీజీకి ఉంటాయి. ఎన్నికలు ప్రకటించి, కోడ్ వచ్చిన తరువాత అధికార దుర్వినియోగం చేయకుండా కొన్ని నిబంధనలు ప్రభుత్వం/ ఆధికారంలో ఉన్నవారు పాటించాలి. అయితే వారే పాలన సాగిస్తారు. అయితే స్టేట్ పరిపాలన మొత్తం రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీ లేదా కేంద్రం ఆదేశాలలోకి, ఎన్నికల కమిషన్ కనుసన్నల్లోనే లేదా వారి చేతుల్లోకి పోదు, అలాగే కేంద్రంలో ప్రదానికి పోయి క్యాబినెట్ సెక్రటరీ చేతుల్లో అధికారం దఖలు పడదు.

cbn 23040019

కోడ్ వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడే ఈ గాప్ రెండు మూడు నెలలు ముఖ్యమంత్రులు, ప్రధానులు మూల కూర్చుని, అధికారులే ప్రధానులు, ముఖ్యమంత్రులుగా వ్యవహరించరు, అవ్వరు. సంస్కరణలు ఉండాలి గాన, ఎన్నికలు కచ్చితంగా నిష్పక్షపాతంగా జరగాలని భావిస్తే అలాంటప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు కేంద్రంలో సుప్రీంకోర్టు రాష్ట్రాల్లో హైకోర్టుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని సంస్కరణలు తీసుకురావాలి. అవసరమైతే ఆర్మి సహాయం తీసుకోవచ్చేమో ఆలోచించాలి. ఇది ఇవ్వాళ ఒక నచ్చని, నచ్చిన ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తే రాష్ట్రాలు ఈ అంశంలో కూడా అధికారాలు ఉడిగిన ప్రభుత్వ స్తంభాలుగా మిగులుతాయి, వచ్చే ప్రభుత్వాలు కూడా కేంద్ర మ్యూజిక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.

ఎన్నికల కమిషన్‌ నిబరధనల అమలుపై వస్తున్న ఫిర్యాదులతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఏ పనిచేయాలో.. ఏది చేయకూడదో అర్ధంకాక అయోమయంలో పడుతున్నారు. దిగువస్థాయి అధికారుల నుండి కొన్ని శాఖల్లో ఉన్నతస్థాయి వరకు ఈ పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రభుత్వంలో ఉన్న నాయకుల నుండి వస్తున్న ఒత్తిడి ఒకవైపు, ప్రతిపక్ష పార్టీ నుండి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల మరోవైపు పెరగుతుండటంతో అధికార యంత్రాంగం తీవ్రస్థాయిలో ఒత్తిడికి గురవుతుంది. ' ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు' అని ఒక సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. సిఎం హోదాలో చంద్ర బాబు నిర్వహించిన సమావేశానికి హాజరైన అధికారులకు నోటీసులు జారీ కావడం ప్రారంభం కావడంతో ఈ ఆందోళన మరింత పెరుగుతోంది.

game 27032019

వైసిపి ఇస్తున్న ఫిర్యాదులపై ఇసి స్పందిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. నాలుగురోజుల క్రితం వైసిపి నేత విజయసాయిరెడ్డి చేసిన ఒక ఫిర్యాదులో వివిధ అంశాలను ప్రస్తావించారు. దీనికి సంబంధించి. ఆర్ధికశాఖ, హౌరశాఖ, ఐటి శాఖ, కృష్ణా, గురటూరు జిల్లాల కలెక్టర్ల వివరణను ఇసి కోరింది. ప్రధానంగా తమ పార్టీ అభ్యర్ధిపై పూతలపట్టులో జరిగిన దాడిదగ్గరనురచి, సత్తెనపల్లిలో తెలుగుదేశం అభ్యర్ధిపై ఆరోపణలు, ఇవిఎంలు భద్రపరిచిన ప్రారతాల్లో సిసి కెమేరాలు, భద్రతపైనా ఆయన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై తక్షణమే పరిశీలిరచి సమాధానం చెప్పాలని 16వ తేదీన సిఎస్‌కు ద్వివేదీ నురచి లేఖ వెళ్లిరది. దీనిపై 17వ తేదీనే స్పరదిరచిన సిఎస్‌ సంబంధిత శాఖలకు సర్క్యులర్లు జారీ చేయడం గమనార్హం.

game 27032019

అదే విధంగా ఓవర్‌డ్రాఫ్ట్‌, పథకాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలను ఆయన ఫిర్యాదులో పేర్కొన్పారు. దీనికి సంబంధించి గత ఆర్ధిక సంవత్సరం చివరిలో పేరుకుపోయిన భారీ బిల్లులను చెల్లిరచేరదుకు ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లినట్లు వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే ఆర్ధికశాఖ అధికారులు సిఎస్‌కు నివేదిక సమర్పిరచారు. ఇతర శాఖలు కూడా తమ శాఖలకు సంబంధిరచిన ఫిర్యాదులపై నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసిరది. సిసి కెమేరాలు, అదనపు భద్రతపై తీసుకురటున్న చర్యలపై హౌరశాఖ అధికారులు కూడా వివరాలు సమర్పిరచేరదుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్‌నుండి వస్తున్న లేఖలు. వాటికి సమాధానాల తయారుచేసే హడావిడిలో సచివాలయంలోని అనేక శాఖల అధికారులు కనపడుతున్నారు.

ఉట్టికి ఎగరలేని అమ్మ ఆకాశానికి ఎగిరింది అనే పాత సామెత గుర్తు ఉందా?తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ని చుస్తే ఈ సామెత గుర్తువస్తుంది.ఊరికే ఆరోపణ కాదు ఈ మధ్య ఎటువంటి అవగాహనా లేకుండా కేటీఆర్ మాట్లాడిన మాటలు ఒక్క సారి గుర్తు చేసుకుందాం.డేటా చోరీ కేసు...ఆంధ్రా డేటా పోయింది అని ఒక A2 తెలంగాణ లో కేసు పెట్టాడు దానితో పాటు పోలీసులు ఏం మాట్లాడాలో స్కెచ్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయారు.ఆ సందర్భాల్లో ఘనత వహించిన ఐటీ మంత్రి కేటీఆర్ గారు నోరుపారేసుకున్నారు...దొంగలు దొరికారు అబ్బా కొడుకుని జైలుకి పంపుతాం అని మాట్లాడాడు.అసలు నీ స్థాయి ఏంటి ?నువ్వు మంత్రి గా ఎం సాధించావు?నీ శాఖల్లో సాదించిన ఘనత ఏంటి?చంద్రబాబు సౌమ్యుడు నీ బాబు లా నీచుడు కాదు కాబట్టి నీకు అంత దైర్యం వచ్చింది.చంద్రబాబు తలచుకుంటే నీ లెక్కలు కాదు మీ తాతల లెక్కలు కూడా తేలుస్తాడు...కానీ ఇక్కడే మీ అమాయకత్వం బయటపడుతుంది.చంద్రబాబు ఎప్పుడూ సంక్షోభాలను ఆహ్వానించే వ్యక్తి... సంక్షోభాలను ఎదుర్కొని నిలబడే వ్యక్తి కాబట్టే చంద్రబాబు కి ప్రకృతి సహకరించింది మీ కుట్ర బయటపడింది.అసలు ఏంటి ఈ డటా కేసు ? పోయింది ఎపి డేటా అన్నావు ?తరువాత కాదు కాదు ఆధార్ డేటా అన్నావు వాళ్లు మా డేటా పోలేదు అనే సరికి ఎలెక్షన్ కమిషన్ డేటా అన్నావు వాళ్లు మా డేటా పోలేదు అనే సరికి ఇప్పుడు ఇతర రాష్ట్రాల డేటా అంటున్నావ్...ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా మా డేటా పోలేదు అని చెబితే నీ పరిస్థితి ఏంటి ?

మాకు తెలుసు నువ్వు ఏమంటావో అమెరికా డేటా టిడిపి దగ్గర ఉంది... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ... హైదరాబాద్ వచ్చినప్పుడు నేను పాదాలు మొక్కిన ఇవాంకా ట్రంప్ డేటా ఉంది అని చెప్పడానికి కూడా నువ్వు వెనకాడవు.నువ్వే ఓవర్ అనుకుంటే నీ ఆదేశాలతో నీ పోలీసులు మరీ ఓవర్ యాక్షన్ చేసారు కొండను తవ్వాము ఎలుకను పట్టాం అంటూ తెలంగాణ పోలీసులు మాట్లాడిన మాటలు ,ప్రెస్ మీట్లు అన్ని గుర్తు ఉన్నాయి...మేము మీరు చేసిన ఏ పనిని తప్పు పట్టం నీకు ఫిర్యాదు వచ్చింది నువ్వు దర్యాప్తు చేసావ్...ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం మా డేటా పోయింది ?మా పిల్లల భవిష్యత్తు ఏంటి ?23 మంది విద్యార్థులు చనిపోయారు?మా పరీక్ష పేపర్లు పోయాయి అని అడుగుతున్నారు మరి నీ వీరోచిత పోలీసులు,ప్రభుత్వం ఎందుకు విచారణ కి వెనుకాడుతున్నారు ?పక్క రాష్ట్రాల డేటా పై ఉన్న ప్రేమ నీ రాష్ట్రం డేటా పై ఎందుకు లేదు ?మీ ఇంట్లో బాగా చదివే పిల్లలు ఫెయిల్ అని ఫలితాలు ఇస్తే నువ్వు ఇలానే స్పందిస్తావా ?ఉదాహరణకి ఈ ఘటన ఏపీలోనే జరిగితే నువ్వు ఎలా స్పందిస్తావ్ ?చంద్రబాబు రాజీనామా చెయ్యాలి... ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యాలి... జగన్ ని ముఖ్యమంత్రి చెయ్యాలి అని స్టేట్ మెంట్లు ఇస్తావ్. మీడియా కూడా కనీస అవగాహన లేకుండా నీ మాటలను బ్రేకింగ్స్ ఇస్తుంది. డేటా చోరీ కేసు లో మీడియా వ్యవహరించిన తీరు అదే కదా ... డేటా అంటే తెలియని వాళ్లు ఒక A2,ఒక A1 ఛానల్ ఇచ్చిన వార్తలు,వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని మేము ఎదో పరిశోధన చేసినట్టు వార్తలు ఇచ్చారు.

మిమ్మల్ని మేము తప్పుబట్టడం లేదు మీరు ఇచ్చిన వార్తలే నిజం అనుకుందాం... మరి ఇప్పుడు మీ గొంతులు ఎందుకు మూగ బోయాయి ? 10 లక్షల మంది విద్యార్థుల డేటా పోయింది అని ప్రజలు రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తుంటే మీకు వినపడటం లేదా ? వాళ్లు తెలంగాణ వాళ్లు కాదా ? వీరోచితంగా చంద్రబాబు ని ప్రశ్నించే మీడియా గొంతులు కేసీఆర్ ,గ్లోబరినా కంపెనీ వెనుక ఉన్న కేటీఆర్ పేరు ఎత్తే దైర్యం మీడియాకి ఎందుకు రావడం లేదు...కేటీఆర్ ఇతర రాష్ట్రాల డేటా వెతికే ముందు నువ్వు డేటా అంటే ఏంటో తెలుసు కో,ఇంటర్ ఫలితాలు ,టెన్త్ ఫలితాలు ఎలా ఇవ్వాలో నేర్చుకో పెద్ద పెద్ద విషయాలు మనకు ఎందుకు బుజ్జి ఐటీ మంత్రి ని అని ఫోజులు డాబు మాటలు కాదు ముందు నువ్వు కనీస అవగాహన పెంచుకో.మీడియా కూడా ఇంకో ఐదేళ్లు వాళ్లకి డప్పు కొట్టడం మానదు అందుకే ప్రకృతి సమాధానం చెప్పడం మొదలు పెట్టింది...మీడియా ప్రశ్నించక పోతే ఏంటి మేమే ప్రశ్నిస్తాం అని తెలంగాణ సమాజం రోడ్డు ఎక్కింది... నువ్వు మీడియా ని మ్యానేజ్ చెయ్యగలవేమో కానీ ప్రకృతి ని కాదు ,ప్రజలని కాదు...విషయం అర్ధం అయ్యింది కదా ఇప్పుడు నువ్వు నీ పోలీసులు ముందు ఇంటర్ డేటా వెతకండి,గ్లోబరినా సంస్థ లో డేటా ఎక్కడికి పోయిందో వెతకండి. ఆ తరువాత తిరిగ్గా ఏపీ డేటా వెతుకుదువుగాని..

Advertisements

Latest Articles

Most Read