సరిగ్గా సంవత్సరం క్రితం జనవరి 4, 2017న, జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా బుక్కపట్నం గ్రామంలో పాల్గున్నారు... రాయలసీమలో రెండో అతి పెద్ద చెరువైన బుక్కపట్నం చెరువులో చుక్కు నీరు లేదు అని, రైతన్నలు ఆవేదనతో చంద్రబాబుకి వారి బాధ మోర పెట్టుకున్నారు.. వారి బాధలు విని చేలించిపోయిన చంద్రబాబు, సంవత్సరంలోపు ఇక్కడ నీళ్ళు పారిస్తాను అని అక్కడ వారికి వాగ్ధానం చేసారు... నీటి నీటి కష్టాలు తీరుస్తాను అని హామీ ఇచ్చారు... కట్ చేస్తే సంవత్సరం తిరిగే లోపు, అక్కడ నీరు వచ్చి చేరింది... బుక్కపట్నం ఇప్పుడు నీళ్ళతో కళకళలాడుతుంది... సమర్ధ ప్రణాళికతో హింద్రీనీవా ద్వారా కృష్ణమ్మను తీసుకువచ్చారు చంద్రబాబు...
దీంతో రైతుల ఆనందానికి అవధులు లేవు... మా జీవితకాలంలో నీరు చూస్తాం అనుకోలేదు అని ఉద్విగ్నంగా చెప్తున్నారు... ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషితో బుక్కపట్నం చెరువుకు మునుపెన్నడూ లేనంతగా ఒక టీఎంసీ నీరు వచ్చి చేరింది. కృష్ణా జలా లతో చెరువు సుజల శోభను సంతరించుకుంది. ఈ జల వైభవాన్ని తనివి తీరా చూసేందుకు బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాల ప్రజలు పోటెత్తారు. రైతన్న మోమున వెలుగు నింపుతూ, తమ జీవితాలకు భరోసా ఇచ్చిన కృష్ణమ్మకు మనసారా ప్రణమిల్లి. చంద్రన్నకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
కరవు నేలకు కృష్ణమ్మను తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. గత నెలరోజుల నుంచి హంద్రీనీవా ద్వారా బుక్కపట్నం చెరువుకు నీరు వస్తుండగా శనివారం చెరువు నిండి మరువ పారడంతో ఇక్కడి ప్రజల ఆనందానికి అవధుల్లేవు. ఎమ్మెల్యే పల్లె, కలెక్టర్ వీరపాండియన్ బుక్కపట్నం మరువ వద్ద గంగమ్మకు పూజలు చేశారు. చీరసారెలను వదిలి నమస్కరించారు. పదేళ్ల కల నెరవేరిందని రైతులు, గ్రామసులు ఆనందోత్సాహాల మధ్య ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఈ నెల 11న అనంతపురం రానున్నారు... బుక్కపట్నం చెరువుకు జల హారతి ఇవ్వనున్నారు...