వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన నైజాన్ని మరోసారి బయటపెట్టింది... మొన్న ఒక ఎమ్మల్యే అధికారంలోకి రావటం కోసం చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు... చంపేయమని అక్కడ మీటింగ్ కు వచ్చిన వారికి చెప్పాడు... జగన్ కను సైగ చేస్తే చంద్రబాబుని కూడా వదిలిపెట్టం అన్నాడు... ఇలా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేకపోయినా చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు.. అయితే, ఈ సారి ఏకంగా పోలీసు స్టేషన్ కు వెళ్లి మరీ మారణాయుధాలతో దాడి చేసారు... ఇది చేసింది సాక్ష్యాత్తు ఒక ఎమ్మల్యే అనుచరులు... పోలీసులు కూడా వీరి చర్యలతో ఒకానొక సమయంలో హడలి పోయారు..

ycp 08012018 2

నెల్లూరు జిల్లాలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌతం రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు... మారణాయుధాలతో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి కలకలం సృష్టించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా చేజెర్ల పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది... పోలీసులు చేసిన పాపం ఏంటి అంటే, అక్రమంగా తెల్లరాయిని తరలిస్తోన్న కేసులో వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయటం. అంతే రెచ్చిపోయారు... మా వారినే అరెస్ట్ చేస్తారా అంటూ, ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేసారు... వారిని విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే గౌతం రెడ్డి అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ycp 08012018 3

ఈ ఘటనలో, వారికి అడ్డువచ్చిన ఓ కానిస్టేబుల్‌ పై దాడి చేసారు. పోలీసులు మాత్రం అరెస్ట్ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వదలలేదు... అయితే రాత్రి సమయంలో పై స్థాయి అధికారులు లేకపోవటంతో, వారిని అరెస్ట్ చేసే సాహసం చెయ్యలేదు అక్కడ ఉన్న కానిస్టేబుల్‌స్... దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు... వీరంతా మద్యం మత్తులో మారణాయుధాలతో వచ్చారని పోలీసులు చెప్తున్నారు.... అయితే వారిని పట్టుకోకుండా వదిలిపెట్టినందుకు, పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు... వెంటనే వారిని పట్టుకోవాలని ఆదేశించారు... వారు పరారీలో ఉన్నట్టు సమాచారం...

‘‘ప్రభుత్వ పథకాల లబ్ది కోసం కుటుంబాలు వేరుపడటం మంచిదికాదు. ఒకే ఇంట్లో ఉంటూ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల కోసం విడిపోవడం బాధాకరం. తల్లిదండ్రులను బాగా చూసుకునేవారికే సింగపూర్ లో ఇళ్లు, ప్రభుత్వ లబ్ది. అదేవిధంగా మనవద్ద కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండేవారికే ప్రభుత్వ పథకాల ద్వారా అధిక లబ్ది కలిగించే అంశం పరిశీలించాలని’’ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కలిసివుంటే ప్రభుత్వం నుంచి మరిన్ని వీలైన మేళ్లు కలిగిస్తామనే భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. కుటుంబాల పరంగా కాకుండా కుటుంబ సభ్యుల పరంగా ఇకపై పండుగ కానుకలు ఇచ్చే అంశం పరిశీలించాలన్నారు. భారతదేశ కుటుంబ వ్యవస్థ ఎంతో విశిష్టమైనదంటూ, మన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మానవీయ విలువలను కోల్పోరాదని,మనిషి మనిషిగా జీవించాలని ఆకాంక్షించారు. టెక్నాలజి మనిషికి బానిసగా ఉండాలేగాని, మనిషి టెక్నాలజీకి బానిస కాకూడదని హితవు చెప్పారు.

joint family 08012018 2

‘‘సాధికారమిత్రల పనితీరు సంతృప్తి కరంగా ఉంది.పట్టణాలలో సాధికార మిత్ర వ్యవస్థ మరింత పటిష్టం చేయాలి. మహిళల్లో నాయకత్వం పెంచేందుకే సాధికారమిత్ర వ్యవస్థ’’ను ఏర్పాటు చేశామన్నారు. గ్రామసభల్లో ప్రసంగిస్తున్న విద్యార్ధుల్లో ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తోందని,భవిష్యత్ పట్ల అచంచల నమ్మకం కనిపిస్తోందని, వారిలో ఆ స్ఫూర్తిని మరింత పెంచాలన్నారు. ప్రతిరోజూ జన్మభూమి వైద్యశిబిరాలలో లక్షా 20వేల మంది చికిత్స పొందుతున్నారంటూ, వైద్య శిబిరాలను మరింత సమర్ధంగా నిర్వహించాలని కోరారు. ప్రతి పేదవాడికి అత్యున్నత వైద్యం అందించాలని ఆకాంక్షించారు. పశువైద్య శిబిరాలలో 10లక్షల పశువులకు చికిత్స అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ప్రతి గ్రామ సభ ఫొటో,వీడియో తీసి పంపాలని,వాటిని భద్రపరచాలని సూచించారు.

joint family 08012018 3

ఇప్పటివరకు 6,15,124 ఫిర్యాదులు అందాయని పేర్కొంటూ వాటిలో 3,22,912ఫిర్యాదులు(52%) అప్ లోడ్ చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు వీటిలో 70,380 ఫిర్యాదులను పరిష్కరించినట్లు చెప్పారు. ఫిర్యాదులు అప్ లోడ్ చేయడం 30%నుంచి 52%కు పెరగడం పట్ల సంతృప్తి ప్రకటించారు. కర్నూలు, చిత్తూరు,విజయనగరం,ప్రకాశం జిల్లాలలో ఫిర్యాదుల అప్ లోడింగ్ మరింత వేగం పుంజుకోవాలన్నారు. రియల్ టైం ప్రాతిపదికన ఫిర్యాదుల అప్ లోడింగ్, పరిష్కారం చేయాలన్నారు. 14వేలమంది డిజిటల్ అసిస్టెంట్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తన పని ఏమైందని ఎవరైనా ఆధార్ నెంబర్ చెబితే ఆ అర్జీ ఏ దశలో ఉందో చెప్పే స్థాయిలో ఉండాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో నేడు మరో కీలక అడుగు పడింది. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం కోసం జెట్‌ గ్రౌటింగ్‌ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పోలవరంలో ప్రారంభించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీసమావేశంలో కాఫర్‌ డ్యాంను గత డిజైన్ల మేరకే నిర్మించుకోవచ్చని ఆమోదం లభించింది. టెండర్లను ఆమోదించిన సమయంలో చేసుకున్న ఒప్పందాల మేరకు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టాలని సూచించింది. దీంతో అనుమతి వచ్చిన రెండు రోజుల్లోనే జెట్‌ గ్రౌటింగ్‌ పనులు చేపట్టాలని రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. 

polavaram 08012018

ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గునటానికి వచ్చిన సీఎం చంద్రబాబు జెట్‌గ్రౌటింగ్‌ పనులను ప్రారంభించారు. అలాగే స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనుల్లో కొంత భాగాన్ని కొత్త సంస్థకు అప్పగించేందుకు జల వనరుల శాఖ పిలిచిన టెండర్లను ఈ నెల నాలుగో తేదీనే తెరవచ్చని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ సూచించారు. అయితే ఈ టెండర్లను తెరవాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశం జరగాలి. ఈ సమావేశంలో టెండర్లపై అధికారికంగా నిర్ణయం వస్తుంది.

polavaram 08012018

ఆ ఆదేశాలతో ఒకవైపు ఎగువ కాఫర్‌ డ్యాం, మరో వైపు స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులూ సమాంతరంగా జరిగితే.. లక్ష్యం మేరకు పూర్తికి వీలుంటుందని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు గంటకు 600 టన్నుల మేర కాంక్రీట్‌ తయారు చేసేందుకు రూ.25 కోట్ల విలువైన అగ్రిటెక్‌ కూలింగ్‌ ప్లాంట్‌ను ట్రాన్‌స్ర్టాయ్‌ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసింది. స్పిల్‌వే గేట్లకు నమూనా గేటును 2-1.6 మీటర్లతో తయారు చేశారు. ఈ గేటును కూడా సీఎం ప్రారంభించారు. జూన్‌ నాటికి కీలక పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా తీసుకున్న జన్మభూమి కార్యక్రమం... రోజుకి ఒక జిల్లాలో తిర్గుతున్న ముఖ్యమంత్రి... మరో పక్క రోజు వారీ సమీక్షలు... ఇంత బిజీలో కూడా ఒక చిన్న సంఘటనలో గాయాలు పాలైన వారిని, చనిపోయిన మృతులు బంధువులని పరామర్శించి ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి... అది ఒక చిన్న ప్రైవేటు కంపెనీలో జరిగిన దురదృష్టకరపు సంఘటన... అయినా సరే కుటుంబ పెద్దగా, ఈ రాష్ట్ర పెద్దగా వెళ్లి వారికి ధైర్యం చెప్పారు.... వింత ఏమిటి అంటే, ముఖ్యమంత్రి వెళ్ళే దాకా కనీసం ఒక్క ప్రతి పక్ష నేత అక్కడకు వెళ్ళలేదు... ఇంకా వింత ఏమిటి అంటే, కనీసం అధికార పార్టీ వాళ్ళు కూడా వెళ్ళలేదు.... ఇది ముఖ్యమంత్రికి తన ప్రజల పట్ల ఉన్న బాధ్యత... ఈయన కాకా ఇంకెవరు ఆ కుటుంబానికి పెద్ద ?

cbn 08012018 2

గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో జరిగిన బాయిలర్ పేలిన ఘటన పై పూర్తి స్తాయి విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. ఆదివారం ఉదయం భవానివాపురంలోని ఆంధ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగ్రాతులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన జరగడం బాధకరమ న్నారు. చనిపోయిన కుటుంబాలకు ప్రగాధ సానుభూతిని వ్యక్తం చేశారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని, కంపెనీ తరుపున 6 లక్షలు, ప్రభుత్వం తరపున 5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

cbn 08012018 3

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, గాయాలైన వారికి రూ.2లక్షలు ఎక్ గ్రేషియాను అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సంఘటన జరిగిన వివరాలను ముఖ్యమంత్రి వివరిస్తు సూరంపల్లి వద్ద బాయిలర్ పేలిన ఘటనలో నలుగురు చనిపోవడం జరిగిందని, ఐదుగురు ఆంధ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఘటనలో శివశంకర్ కుమార్, ముజాహిద్ హమ్మద్, సత్యనారాయణ, అబ్దుల్ ముబారక్ ఆలీ చనిపోయారని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read