ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆ పార్టీ ముఖ్య నేతలు కొందరితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశం, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ఎన్నికల అనంతర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 4 గంటలపాటు సాగిన ఈ భేటీలో పార్టీ కార్యకర్తలపై దాడులు, కొత్త ప్రభుత్వ పనితీరు, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకోవడం లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే స్పందించరాదని, క్యాబినెట్ ఏర్పాటుచేసి పూర్తి స్థాయిలో పాలన గాడిలోపడి వారి తీరు ఎలా ఉంటుందో చూసి అప్పుడు మాట్లాడాలని సమావేశంలో నిర్ణయించారు. నిరంతరం జనం వెంట ఉంటూ వారికి అండగా నిలవాలని, ప్రజా సమస్యలకు సంబంధించి అంశాలపై అసెంబ్లీ, బయటా గళం వినిపించాలని చంద్రబాబు సూచించారు.

cbn 05051019

టీడీపీ హయాంలో అవినీతి జరిగిపోయిందని పదే పదే చెప్పి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కొత్త ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అంశంపై కూడా చర్చ జరిగింది. అలాగే, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయం సరికాదన్న చర్చ జరిగింది 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, ఆస్తుల విభజన పూర్తిగా కాకుండా, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా భవనాలను అప్పగించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత అందులో చర్చించి అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

cbn 05051019

ఇదే సమావేశంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని ఇచ్చిన హామీల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని వేడుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదని అనడంతోనే సీఎం జగన్‌ పోరాటాన్ని మళ్లీ మొదటికి తెచ్చారని పేర్కొన్నారు. ‘ఫలితాలు వెలువడ్డాక పలుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం. గత 37 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అనేక ఎన్నికలను చూసింది. ఒకసారి మేం గెలిస్తే మరోసారి మరో పార్టీ గెలిచింది. కానీ ఎప్పుడూ ఎన్నికలు కాగానే ఇలా దాడులు, దౌర్జన్యాలు జరగలేదు. గత పది రోజుల్లోనే అనేక చోట్ల ఇవి జరగడం బాధాకరం. శిలా ఫలకాలు ధ్వంసం చేయడం, జెండా దిమ్మలు, స్వాగత ద్వారాలు పగలగొట్టడం సరైంది కాదు. తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని టీడీపీ ప్రకటన విడుదల చేసింది.

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) విజయానికి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కృషి చేయబోతున్నారు. టీఎంసీతో గురువారం ఈ మేరకు ఒప్పందం కుదిరింది. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ గురువారం ప్రశాంత్ కిశోర్‌తో దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తూ ఒప్పందంపై సంతకాలు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రశాంత్ కిశోర్ బృందం వచ్చే నెల నుంచి కార్యరంగంలోకి దూకుతుందని తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు వ్యూహాలు రచించారు. అదేవిధంగా 2015లో బిహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు వ్యూహకర్తగా విజయం సాధించారు. 2017లో ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేశారు. కానీ కాంగ్రెస్‌కు విజయం దక్కలేదు.

pk 06062019

తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపాకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించారు. వైకాపా ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ బృందం సభ్యుడు ఒకరు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ గెలుపుతో తమను చాలా పార్టీలు సంప్రదిస్తున్నాయని తెలిపారు. 2021లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీకి పనికిచేసినట్లుగానే.. బెంగాల్‌లోనూ మమత బెనర్జీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. టీఎంసీకి వ్యూహకర్తగా పనిచేసేందుకు ఆయన సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ తమ పార్టీకి సేవలందిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని నిలువరించవచ్చని మమత భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనతో సమావేశమై టీఎంసీకి వ్యూహకర్తగా పనిచేసే అంశంపై మంతనాలు జరిపారు.

 

pk 06062019

లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో టీఎంసీకి బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది. 42 లోక్‌స్థానాలకు గాను టీఎంసీ 22 సీట్లు గెలిచింది. ఇక 2014 ఎన్నికల్లో 2 సీట్లే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 34 సీట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్..ఈసారి 22 స్థానాలక పడిపోవడంతో మమత బెనర్జీలో ఆందోళన మొదలైనట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని గ్రహించిన బెంగాల్ సీఎం..2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది.

నూతన శాసనసభలో ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయనకు సీఎం కార్యాలయం నుంచి బుధవారం సమాచారం వచ్చింది. శంబంగి సానుకూలంగా స్పందించడంతో దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. నూతన శాసనసభ్యులతో ప్రమాణం చేయించడంతో పాటు శాసనసభ స్పీకర్‌ ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ నిర్వహిస్తారు. నూతన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించాక ప్రొటెం స్పీకర్‌ పదవీ కాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుపై విజయం సాధించిన శంబంగి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిందని శంబంగి మీడియాకు చెప్పారు.

గుంటూరు జిల్లా అమరావతి మండలం పరిధిలో కృష్ణా నదిపై 2,169 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ పనులకు బ్రేక్‌ పడింది. నీటిపారుదల శాఖ పనులపై జగన్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం జారీచేసిన తాజా సర్క్యులర్‌ ప్రభావం ఈ పనులపై పడింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నీటి అవసరాల కోసం 10 టీఎంసీల సామర్థ్యంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువన 30 కిలోమీటర్ల దూరంలో చేపట్టతలపెట్టిన ఈ బ్యారేజీ పనులకు ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పనులను నవయుగ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. అయితే ఏప్రిల్‌ ముందు టెండర్‌ అయిన పనులను పునఃసమీక్షించాలని కొత్త ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేయడంతో సంస్థ పనులను నిలిపివేసింది. కార్మికులకు సెలవులిచ్చి పంపేసింది. యంత్రాలను కూడా బ్యారేజీ ప్రాంతం నుంచి తరలించింది.

vaikhuntapuram 06062019 1

ఈ ఏడాది ఏప్రిల్‌ 1కి ముందు టెండర్లు జరిగి.. ఒప్పందాలు చేసుకోని పనులన్నిటినీ రద్దు చే యాలని.. పనులు అప్పగించాక 25% వరకే జరిగితే ప్రభుత్వ అనుమతితోనే వాటిని కొనసాగించాలని ఇంజనీరింగ్‌ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నుంచి నోట్‌ చేరింది. దీంతో జల వనరుల శాఖ చేపట్టేందుకు సిద్ధమైన పలు సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడే ఆగిపోనున్నాయి. గోదావరి-పెన్నా అనుసంధానం పనులకు రూ.6,020 కోట్లకు పాలనామోదం ఇచ్చారు. వీటికి భూసేకరణ కోసం రూ.94 కోట్ల వర కూ వ్యయం చేశారు. నిర్మాణ పనులకు ఇంకా ఖర్చు చేయలేదు. గోదావరి-పెన్నా అనుసంధానం జరిగితే రాష్ట్ర జీవన విధానమే మారిపోతుందని.. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రకాశం జి ల్లాకు గోదావరి జలాలు తరలివెళ్తాయని.. క్రమంగా రాయలసీమకు కూడా గోదావరి జలాలను తరలించవచ్చన్న నిపుణుల సూచన మేరకు చంద్రబాబు దీనిని చేపట్టింది.

vaikhuntapuram 06062019 1

రూ.273 కోట్ల విలువ చేసే గుంటూరు చానల్‌ విస్తరణ పనులు, రూ.2,100 కోట్ల వైకుంఠపురం బ్యారేజీ పనులు, రూ.480 కోట్ల ముక్త్యాల పనులు కూడా నిలిచిపోనున్నాయి. నిర్మాణంలో ఉన్న పథకాలివీ.. వీటి పై కూడా సందిఘ్ధత నెలకొంది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలిదశ పనులు, గాలేరు-నగరి రెండో దశ, బాలాజీ జలాశయం, వేణుగోపాల సాగర్‌ జలాశయం, ఎగువ పెన్నా ఎత్తిపోతల, భైరవానితిప్ప ఎత్తిపోతల పథకం, కమ్యూనిటీ ఎత్తిపోతల డ్రిప్‌ పథక, దమ్ములపల్లితోపాటు చెరువులకు నీటి సరఫరా, సోమశిల స్వర్ణముఖి లింకు కాలువ నుంచి మల్లెమడుగు జలాశయం, వేదవతి ఎత్తిపోతల పథకం, రాజోలిబండ మళ్లింపు పథకం, విస్సన్నపేట ఎత్తిపోతల పథకం, వరికపూడిశెల ఎత్తిపోతల పథకం, తోటపల్లి కాలువ ఆధునికీకరణ, చోడవరం వద్ద కొత్తగా బ్యారేజీ 

Advertisements

Latest Articles

Most Read